Wednesday, 12 Aug, 2026
నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి రోజుకు పది గ్రాములు అంటే ఐదు వాల్ నట్లు తినాలి. వేరు సెనగ పది పన్నెండు పప్పులు, బాదం తొమ్మిది, జీడి పప్పులు గుప్పెట నిండుగా అన్నమాట. ఇలా రోజుతీసుకుంటే దాదాపు 23 అనారోగ్యాలకు శాశ్వతంగా దూరంగా వుండ వచ్చు. అతి గా తింటే బరువు పెరగడం ఖాయం.

ఈ కొంచెం తినాలి

ఉదయం నిద్ర లేవగానే కప్పు కాఫీ తో మొదలు పెట్టి ఇక పనుల్లోకి దిగిపోతారు గృహిణులు. కానీ ఆ కప్పు కాఫీ మాత్రమే సరిపోదు . ఇంటి పనులు చేసే శక్తి రావాలంటే నాలుగైదు బాదం గింజలు,రెండు ఆక్రోట్ గింజలు నోట్లో వేసుకొని అప్పుడే కాఫీ తాగండి అంటున్నారు వైద్యులు . ఉదయం లేవగానే ఉండే ఉత్సహం సాయంత్రం వరకు కొనసాగాలి అంటే శరీరానికి అన్ని వేళలా శక్తి ఇచ్చే ఆహారం ఇస్తూ ఉండాలి . ఉదయం వేళ పని వత్తిడిలో ఎంతో సమయం దొరక్కపోతే ఉడికించిన గుడ్డు ,పాలు లేదా పెరుగు పండ్ల ముక్కలు ఎదో ఒకటి తింటే చాలు తొమ్మిది గంటలకు అల్పాహారం తీసుకొనే వరకు శక్తి సరిపోతుంది అంటున్నారు .

Leave a Reply