Saturday, 10 Oct, 2026
వంద కేజీల బరువు మోస్తూ హీరోయిన్ సమంత చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం. హీరోయిన్స్ అత్యంత ఫిట్ స్టార్ సమంత అంటున్నారు. ఆమె ఫేవరేట్ ఫిట్ నెస్ ట్రైనర్ రాజేష్ రామ స్వామి. ఏళ్ల తరబడి ఒకే రకమైన ఫీజిక్ మెయిన్ టైన్ చేయడంలో సమంత చాలా ఖచ్చితంగా వుంటుందీ అంటున్నాడీయన. వర్కవుట్ టైం కు రావటం జాగింగ్ ,స్ట్రెచింగ్ ఫ్యాట్ కంట్రోల్ కి సంబంధించిన వ్యాయామాలు చేయటం ఉపవాసాలు చేయకుండా లైట్ గా తినటం సమంత ఆరోగ్య రహస్యం. సమంత వర్కవుట్ వీడియోలు చుస్తే ఉదయన్న్నే లేవటం బద్ధకం బాబు అని మంచం దిగకుండా పెరిగిపోతున్న బరువు గురించి వస్తే గా నిట్టురుపులు విడిచి కాస్త శరీరం పట్ల శ్రద్ధ చూపిస్తారేమోనని ఈ న్యూస్. సమంత శుభ్రంగా భోంచేస్తుందట. అలాగే షూటింగ్ లు ఉంటే తెల్లారేలోపే తన వ్యాయమ శిక్షణ పూర్తి చేస్తుందట.

దృడత్వం ప్రధానం 

ఫిట్ గ వుండేందుకు సెలబ్రెటీలు అందరు ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం వారి దినచర్యలో భాగంగా ఉంటుంది. అయితే అందంగా కనబడటం కంటే దృడంగా ఉండటం చాలా ముఖ్యం అంటోంది సమంత. షూటింగ్ ఉన్న సమయాల్లో కూడా తెల్లవారు జామున లేచి ఐదు గంటలకే జిమ్ కు వెళతాను  కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ లేదా షూటింగ్ లో మరీ బిజీ అయితే జాగింగ్ చేస్తాను. ఈ జిమ్ వర్క్ వుట్స్ జాగింగ్ వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్ళిపోయి చర్మం కాంతిగా అయిపోతుంది భారతీయ యుద్ధ విద్యల్లో ఒకటైన సిలంబం ను ప్రాక్టీస్ చేస్తాను. సిలంబం వల్ల శరీర దృఢత్వం వస్తుంది ఇది ఆత్మరక్షణకు ఉపయోగ పడుతోంది కూడా . ప్రోటిన్ ఆదారిత పదార్ధాలు తిని కొబ్బరి నీళ్ళు తాగుతాను స్వయంగా అమ్మాయిలు అందరు ఈ ఫిట్ నెస్ కోసం శ్రమ పడాలి అనుకొంటాను అంటోంది సమంత .

Leave a Reply