Sunday, 09 Aug, 2026
సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు నుంచి అన్నే గ్రాముల సి విటమిన్ అందుతుంది. ఇవి ఎన్ని తింటే మేలు ఆనంది క్వశ్చను . మహిళలకు ప్రతిరోజు 75 గ్రాముల సి విటమిన్ అవసరం అయితేతొమ్మిది నుంచి 13 సంవత్సరాల పిల్లలు 45 గ్రాముల వరకు తీసుకోవాలి . ఇక రోజు ఏ పోషకాల కోసం కాప్సికం బొప్పాయి స్ట్రా బెర్రీ కాలీఫ్లవర్ అనాస కమలా ఫలం వంటివి తప్పనిసరిగా లెక్కలేసుకుని మరీ తినాలి. శరీరానికి ఆరోగ్యం ఇచ్చే కీలకమైన విటమిన్ కాబట్టి వయసుని బట్టి ఎంత తినాలో తేల్చుకుని తినాలి.

ఆహరమే ఔషధం

జీవితంలో ఎన్నో ఒత్తిడులు డిప్రెషన్ కలిగిస్తాయి. ఆ కుంగుబాటుకు మంచి వైద్యం ఆరోగ్యకరమైన ఆహారం అంటున్నాయి అద్యయనాలు. శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రెషన్ వస్తుంది. కనుక సెలీనియం ఉండే ముడి ధాన్యాలు ,సీ ఫుడ్ ,మేక,కోడి కాలేయ భాగాలు తినాలి.విటమిన్ డి తక్కువైనా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.చేపలు,పుట్టగొడుగులు తింటే మంచిది. అలాగే అవిసె,పిస్తా,బాదం,వాల్ నట్స్ ,పండ్లు ,కూరగాయలు మొదలైనవన్ని ఒత్తిడి పరమైన సమస్యలను తగ్గిస్తాయి.బీన్స్,పప్పు దినుసులు పాలు,గుడ్లు చేపలు కూడా శరీరానికి ప్రోటీన్ అందించి ఒత్తిడిని తగ్గేలా చేస్తాయి.

Leave a Reply