సరైన దిండు వాడాలి
మంచి నిద్రకు మంచి తలదిండు చాలా అవసరం.సరైన దిండు వాడకపోతే విశ్రాంతి దొరక్కపోగా లేని పోని తల నొప్పులు వస్తాయి. దిండు ఎత్తు ,మెత్తదనంలోని తేడా వల్ల మెడనొప్పి ,భుజం నొప్పి వచ్చేస్తాయి.చేతులు తిమ్మిర్లు వస్తాయి. మంచి దిండు వాడినా ,దాన్ని సరైన పద్దతిలో పెట్టుకోకపోతే సమస్యే. తల మరీ ఎత్తుకు పెట్టుకో కూడదు. దిండు ఇక అంచున కిందగానూ వద్దు. దిండు కవర్ నాలుగు రోజులకు ఒక సారి మార్చాలి.మురిగ్గా ఉంటే శ్వాస సమస్యలు వస్తాయి. […]
ఈ పోషకాలు ముఖ్యం
పప్పు ధాన్యాలు పోషకాహార పవర్ హౌజ్ వంటివి. చాలా పప్పుల్లో ఐరన్ ,జింక్,పోలేట్,ప్రోటీన్లు ,పీచు ఇతర పోషకాలుంటాయి. వీటిలో అనారోగ్యకర సాచులెట్ ఫ్యాట్ ఉండవు. సహాజ రూపంలో వీటిలో గ్లైకమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. పెద్ద ఖరీదు కూడా ఉండవు. శనగలు ,బఠానీలు,బీన్స్ వేరు శనగలు ఇవన్ని పప్పులే. వీటిని నానబెట్టి ఉడికించటం వల్ల ప్రయోజనాలు ఎక్కువ. వీటితో తాజా కూరగాయలకు కలిపి కూర చేయవచ్చు.పిండితో సూప్ లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. మాంసాహారానికి దూరంగా ఉండే […]
మలావత్ పూర్ణ
14వ సంవత్సరం కూడా రాకుండానే ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది మలావత్ పూర్ణ.ఆ తరువాత సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా లోని కిలీమంజారో రష్యాలోని ఎల్ బ్రుస్ , దక్షిణా అమెరికా లో అర్జెంటీనా లోని అకోంకాగ్య పర్వత శ్రేణిని ఎక్కేసింది. ఈ యువ సాహాసి తెలంగాణ గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుకొంటూ ట్రెక్కింగ్ సాధన చేసింది. ఆమె పుట్టిన ఊరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం ,తల్లిదండ్రులు రోజు కూలీలు . ఎలాంటి […]
ఫరీహా తఫీమ్
మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి ఫరిహా తఫిమ్ స్వస్థలం హైదరాబాద్ .పాఠశాలలో ఆత్మ రక్షణ విత్య మార్షల్ ఆర్ట్స్ లొ శిక్షణ పొందింది. జాతీయ క్రీడా కారిణిగా పేరు తెచ్చుకొంది. లండన్ కు చెందిన ఫిల్మ్ మేకర్ జయేషా పటేల్ ఫరీహ పైన ఇండియన్ వుషూ వారియర్ గార్ల పేరుతో డాక్యుమెంటరీ తీశారు. అసోంలో జరిగిన చాంపియన్ లో పతకాలు గెల్చుకొంది పరీహా. ఈ యువ క్రీడాకారిణి ఐపిఎస్ అవ్వాలనుకొంటుంది.
క్రీమ్స్ లో పాదరసం
యాంటీ పజంగ్ క్రీమ్స్ ముఖంపై ముడతలు రానివ్వవు,వయసు తెలియనివ్వవు అని చెపుతూ ఉంటాయి. ఈ ప్రచారం నమ్మి ఈ క్రీమ్స్ చాలా మంది ఉపయోగస్తారు. కానీ వాటిలో పాదరసం ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా. ఆ ఉత్పత్తుల లేబుల్ పైన మెర్క్యూరస్ క్లోరైడ్ , కాలోమెల్ మెర్క్యూలో అనేటువంటివి ఉంటే అసలు వాడద్దు అంటున్నారు ఎక్సుఫర్ట్స్. అందులో ఉండే పాదరసం చాలా ప్రమాతం .ఆ పాదరసం శరీరంలోకి చేరితే […]
సిల్క్ కవర్లు వాడండి
జుట్టు సిల్క్ లాగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఖరీదైన హెయిర్ షాంపులు, మాస్క్ లు కంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే చాలు అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. విటమిన్ ఎ, ఇ,లు ఉండే పదార్ధాలు తినాలి. అలాగే జుట్టులో మృదుత్వం ,సిల్క్ నెస్ ఉండాలంటే సిల్క్ లేదా శాటిన్ కవర్ వేసిన దిండు వాడుకోమంటున్నారు. నిద్రించే సమయంలో తల దిండు పైన పదే పదే కదులుతూ ఉంటే కాటన్ కవర్ కు రుద్దుకొని రాలిపోవటం తెగిపోవటం జరుగుతుంది. అలాగే కాటన్ […]
సంకల్పబలం చాలు
సవాళ్ళు ఎదురవ్వడం సహజం. జీవితం ఎన్నో అనుభవాలు ఇస్తుంది. నిత్యం ఎదురయ్యే సవాళ్ళు ఎదుర్కునేందుకు గట్టి సంకల్పం కావాలి అంటుంది కాజల్. సంకల్పం గనుక గట్టిగా ఉంటే సమస్యలు తునాతునకలు అయిపోతాయంటుంది.కోందరు సమస్యలు ఏదుర్కోలేక ఎన్నో సాకులు చెబుతారు. నాకు సాకులు నచ్చవు ఆత్మస్థైర్యం కూడదీసుకునేందుకు నిరంతరం నేను ప్రయత్నిస్తాను అంటుంది కాజల్. ఎన్నో సందర్భాల్లో నాకు విజయం ఎదురవవుతుంది. సవాళ్ళు ఎదుర్కొనే కోద్ది నిరాశ బెదిరిపోతుంది అంటుంది కాజల్. సీత,ప్యారిస్,ప్యారిస్ ,కోమలి ,ఇండియన్ 2 సినిమాల్లో […]
హెయిర్ వాష్ తో శక్తి
నిరంతరం పనితో షిఫ్ట్ లో శరీరం అలసిపోయినట్లే జుట్టు కూడా అలసిపోతుంది. జుట్టు రఫ్ గా డల్ గా అయిపోతుంది.అలాంటప్పుడు జుట్టు తీరును బట్టి మంచి ఉత్పత్తులు ఎంచుకుని పోషణ చేయాలి. జుట్టును వారంలో రెండు సార్లయిన వాషీంగ్ చేయాలి. పొడవాటి జుట్టు ఉంటే తల స్నానం కొంచెం కష్టం కూడా. జుట్టును మృదువుగా చిక్కులు లేకుండా దువ్వేసి గోరు వెచ్చని నూనెతో మర్ధనా చేయాలి.చివర్లు ట్రిమ్ చేస్తూ ఉండాలి. హెయిర్ వాష్ తో జుట్టుకు కొత్త […]
ఆరోగ్యాన్ని చెప్పే గోళ్ళు
పళ్ళు,గోళ్ళు నాలుక అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటాయి.గోళ్ళలో మార్పులు జాగ్రత్తగా గమనిస్తే గోళ్ళలో తేడా గమనించవచ్చు.పాలిపోయిన గోళ్ళు రక్తలేమి కాలేయ సమస్యలు సూచిస్తాయి.పోషక పదార్ధాల లోపం,గుండె సమస్యలున్నట్లు అనుకోవచ్చు. తెల్లని గోళ్ళు కామెర్లకు సూచన. పచ్చని గోళ్ళు ఫంగస్ చేరినట్లు చెబుతాయినీలం గోళ్ళు శరీరానికి ఆక్సిజన్ అందడంలేదని చెబుతాయి.థైరాయిడ్ జబ్బు ఉంటే గోళ్ళు ఎండినట్లు కనిపిస్తాయి. గోళ్ళ పై భాగం గతుకులు పల్లాలుగా ఉంటే అది కీళ్ళ జబ్బు సూచిస్తుంది.
అలసటకు బాదం పప్పు
గంటల కొద్ది విశ్రాంతి లేని పనివేళలోనీరసం తెప్పిస్తూ ఉంటాయి. ఆకలిగా ఉన్నా ఎక్కువ తినలేకపోవడం కూడా జరుగుతుంటుంది. భోజనానికి కాస్త సమయం కేటాయించకుండా అశ్రద్ద కూడా దీనికి ఒక కారణం. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నారు.ఉదయం లేవగానే నానబెట్టిన బాదం గింజలు ఒక అరటి పండు తినడం వల్ల కూడా శక్తి సమకూరుతుంది. ఎన్ని పనులున్నా కనీసం బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేయకుండా ఉండాలి,బ్రేక్ పాస్ట్ లో తప్పనిసరిగా గుడ్డు ఉండాలి. ఈ ఎండలకు మజ్జిగ తప్పనిసరిగా […]
వేసవికి సౌకర్యం
ఈ వేసవికి చెమట సులువుగా పీల్చుకునే దుస్తులకు ప్రాధన్యత ఇవ్వాలి. రేయాన్,లెనిన్,నూలు వంటివి ఈ సీజన్ కు అనువైనది. కాటన్ లో మల్ ఆర్గానిక్ ఖాదీ,హ్యాండ్ లూమ్ రకాలున్నాయి. ఇవి ఇండో వెస్ట్రన్ డ్రెస్ లు. చీరెలు కుర్తిలుగా వాడుకోవచ్చు. కాటన్ లో ట్యానిక్ ఎలైన్ కుర్తీలు ధోతీ,పలాజో సల్వార్ లు కుట్టించుకుంటే బావుంటాయి. లెనిన్ చీరెలను జతగా కలంకారి ఇకత్ బ్లాక్ ప్రింట్ వంటివి డిజైనర్బ్లవుజ్ గా జతగా చేసుకుంటే ఫ్యాషన్ గా ఉంటాయి. కాటన్ […]
బ్రౌన్ రైస్ లో అధిక ఫైబర్
కనీసం రోజుకు 38 గ్రాముల ఫైబర్ తినాలంటున్నారు పోషకాహర నిపుణులు.ఫైబర్ రక్తంలో చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. ఈ ఫైబర్ కోసం ముఖ్యంగా బ్రౌన్ రైస్ తినాలని సూచిస్తున్నారు.కప్పు బ్రౌన్ రైస్ లో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలంటే బ్రౌన్ రైస్ మంచి డైట్. అలాగే కొబ్బరి పాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొబ్బరి రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది కూడా. ఇక కాబూలి శనగల్లో పోషకాల్తోపాటు మాంగనీస్ ఐరన్ పీచు కూడ అధికమే.
శ్రీమతి ప్రతిభా భారతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా అసెంబ్లీ స్పికర్ గా మంత్రిగా ప్రశంసలు అందుకున్నారు కే.ప్రతిభాభారతి.శ్రీకాకుళం జిల్లా కావలిలో 1956లో జన్మించారు. నాగర్జున యూనివర్సీటి నుంచి ఎంఏ పట్టా తీసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర శాసనసభ కి ఎంపికయ్యారు. రాష్ట్రా సాంఘీక సంక్షేమ శాఖ,ఎస్టీ,బీసీ వికలంగా సంక్షేమ మహిళా సంక్షేమ గృహ నిర్మాణ శాఖల మంత్రిగా పనిచేశారు. వివిధ శాసనసభ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. శాసనసభ స్పీకర్ గా పని చేశారు. కామన్ వెల్త్ పార్లమెంటరీ […]
సేవా మార్గం ఎంచుకున్న మల్లాది సుబ్బమ్మ
1924 ఆగష్టు 2న గుంటూరు జిల్లా రేపల్లే తాలుక పోతర్లంకలో జన్మించాఅరు మల్లాది సుబ్బమ్మ.ఎవరో ఒకళ్ళ అదుపులో జీవించడమేనా కర్తవ్యం అని ప్రశ్నించిన స్త్రీవాది కుల నిర్మూలన,చాందస వ్యతిరేక పోరాటం మూడ విశ్వాసాల నిర్మూలన కుటుంబ నియంత్రణ ,స్త్రీ విద్య కోసం కృషి చేశారు.స్త్రీ జనోద్దరణ కోసం పనిచేసిన సంస్కర్తల్లో సమకాలీన స్త్రీల చైతన్యం కోసం కృషి చేశారు సుబ్బమ్మగారు.సమాన అవకాశాలు లేని ఈ సమాజంలో అనేక అడ్డంకులు ఎదుర్కుని పైకి రావాలంటే ఎంత కృషి పట్టుదల […]
జిలానీ బానో
జిలానీబానో సుప్రసిద్ద ఉర్దు రచయిత. తన సాహిత్యసేవకు గుర్తింపుగా 2001సంవత్సరంలో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. 2004లో ప్రముఖ మహిళా పురస్కారం అలామీ ఫురోగ్-ఇ-అవార్డ్ ,ఆలిండియా కవామిహలి అవార్డ్ ,మహరాష్ట్ర ఉర్ధు అకాడమీ అవార్డ్ ,పశ్చిమ బెంగాల్ ఉర్ధు అకాడమీ అవార్డులు లభించాయి.అంతర్ జాతీయ మానవహక్కుల సంఘంలో బాలల,మహిళల హక్కుల పై ప్రధాన సలహాదారుగా భారత ప్రభుత్వం ఇర్ధు అభివృద్దికి ఏర్పాటు చేసిన జాతీయ మండలి నిర్వాహణ సంఘంలో సభ్యురాలిగా పనిచేశారు.
ఈ సంవర్సరపు రంగు ఊదా
2019 అంతర్జాతీయా మహిళ దినోత్సవపు అధికారిక రంగుగా ఊదా రంగు ఎంపికైంది.స్వఛ్ఛతకు,ఆశకు ,ఆధికారానికి,ఐశ్వర్యానికి కూడా ఈ ఊదా రంగు ను చిహ్నంగా చెపుతారు. ఫ్యాషనిస్ట్ లు కూడా ఈ పర్పుల్ కలర్ ను అత్యంత అందమైన రంగుగా గుర్తించారు. ధైర్యానికి కూడ ఇది సూచన. గుచ్చి,రోజాస్,లాహేర్లా వంటి ప్రముఖ సంస్థల డిజైనర్లు ఈ ఊదా రంగునే ఎంచుకొంటారు.సృజనాత్మకతని,సంపదని వ్యక్తం చేసే ఈ అద్బతమైన రంగులో ప్రకృతిలో మనకు కనిపించే లావేండర్,లిలాక్,వైలెట్ పువ్వులు ఎంతో విలువైనవి కూడా. పవిత్రతను […]
కంచర్ల సుగుణమణి
సాంఘిక సేవా కార్యక్రమలకు మరో పేరు కంచర్ల సుగుణమణి. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కి సన్నిహితురాలు.ఆంధ్ర మహిళ సభ అధ్యక్షురాలు. మంచి రచయుత.వక్త కూడా. ఆంధ్రమహిళ పత్రికకు సంపాదకురాలు.శిశు సంక్షేమం కొసం ఆమే చేసిన సేవలను 1992 జాతీయి అవార్డ్ ఇందిరా ప్రియాదర్శిని మెరిట్ అవార్డ్,రాజీవ్ రత్న జాతీయి అవార్డ్,తెలుగు ఆత్మ గౌరవ పురస్కారం అందుకున్నారు. 1919 లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన సుగుణ మణి హైదరాబాద్ లో ఆంధ్ర మహిళ సభ ప్రారంబించి […]
ముళినీ రెడ్డి
మహిళా వాలీబాల్ లో మరుపేరుగా అనిపించే ముళినీ రెడ్డి 1973 లో అర్జున అవార్డ్ అందుకొన్న తొలి మహిళ. వరంగల్ జిల్లా కొసాని పల్లిలో 1945 లో జన్మించారు. 13 వ ఏటనే వాలీబాల్ ఆడటం మొదలు పెట్టింది. 1963 లో ప్రీ ఒలంపిక్ భారత జట్టు లో పాల్గోన్నారు.1971 లో పారిస్ టీమ్ లో ఏడు టేస్టు మ్యాచ్ లలో ,భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. 1982 లో ఏషియన్ లో జరిగిన పోటిలలో […]
పద్మ శ్రీ శోభా నాయిడు
కూచిపూడి నాట్యంలో విశిష్ట స్థానాన్ని పొందిన బహు కొద్ది మంది కళాకారులలో పద్మ శ్రీ శోభా నాయిడు ఒకరు. నృత్య చూడామణి ,కేంద్ర నాటక అకాడమి,బాంబే స్కూల్ శృంగార్,సంసద్ నృత్య విహార్,ఎన్టీఆర్, హంస సప్తగిరి సంగీత విద్వంసిణిగా శోభానాయుడు కళా వైరుడ్యానికి ప్రతికలైన సత్కరాలు. ఆమే కృషికి తెలుగు యునవర్సిటి గౌరవ డాక్టరేట్ తో సత్కరిస్తే కేంద్ర పభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ శ్రీ తో సత్కరించారు. ప్రస్తుతం హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ స్థాపించి శిశువులను తీర్చి […]
నేడే మహిళా దినోత్సవం
సమస్త స్త్రీ లోకానికి హేపీ ఉమెన్స్ డే: మాతృ దేవోభవ అంటారు. స్త్రీ లేకపోతే వ్యక్తి జననమే లేదు. స్త్రీ లేకుండా జీవన గమనమే లేదు. అలాగే ఆమె తలచుకొంటే సాధించలేని కార్యము లేదు.సామాజిక,ఆర్ధిక,రాజకీయ,సాంకేతిక శాస్త్రీయ రంగంలో సత్తా చాటుకొంటునే స్త్రీ దృడత్వం ,ధీరత్వం ముందు ఎవరు నిలబడలేరు కూడా. ఆమెకు ఆమే సాటి. దీనికి సజీవ సాక్ష్యం మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం . సమానత్వం కొసం శ్రామిక వర్గంలో మహిళ సమానమే అన్న […]
