Saturday, 10 Oct, 2026

  “కనుమ ప్రసాదం”

 సఖులూ!! రంగవల్లులతో,కన్నుల పండుగగా తీర్చి దిద్దిన బొమ్మల కొలువుతో,పిల్లల గాలిపటాలతో సంక్రాంతి పండుగను ఆనందోత్సాలతో కనుమ పండుగలోకి వచ్చేశాము. ఈ కనుమ పండుగకి ప్రత్యేకత ఉంది.ఇంటికి కొత్త పంట రావటం,కూతుళ్లు-అల్లుళ్ళు రావటం.ఈ రోజు మరి అందరు కలసి గోమాతకి పూజలు చేసి పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు.కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు,అనురాగాలు చల్లగా కొనసాగాలని రథం ముగ్గుతో ప్రార్థన చేస్తారు. నిత్య ప్రసాదం: గారెలు,తీపి పదార్థాలు               -తోలేటి వెంకట శిరీష

చిక్కని పాలతో నష్టం లేదు  

పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు చిక్కని పాలకు మించింది మరొకటి లేదని ఇంకోసారి రుజువు చేశారు కెనడా పరిశోధికులు. ఈ మధ్య కాలంలో వెన్న కొవ్వు తీసిన పాలు అమ్ముతూ అదే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం లో ఏమాత్రం నిజం లేదంటారు పరిశోధికులు. కెనడ పరిశోధికులు  విశ్లేషించిన 28 అధ్యయనాల్లో వెన్న తీసేసిన పాలు తగినంత మాత్రం ఊబకాయం,అధిక బరువు ప్రమాదం ఉండదాని ఎలాటి ఎలాటి రుజువులు లేవన్నారు కొవ్వు తీసేసిన పాలు తాగిన పిల్లల్లో కంటే హాల్ […]

నిజాయితీ ముఖ్యం

వివాహ బంధంలో నిజాయితీ లేకపోతే ఆ బంధం నిలబడనట్లు డైట్ విషయంలో కూడా అంతే డైటింగ్ లో చీటింగ్ లు  పనికి రావు వర్కవుట్స్ చేయాలి . భోజనం విషయంలో ఖచ్చితంగా డైట్ చార్ట్ ఫాలో అవుతూ నిజాయితీగా ఉండాలి . అప్పుడే బరువు తగ్గుతాం అంటోంది శిల్పా శెట్టి . కరీనా కపూర్ నిర్వహించిన ఓ రేడియో షోలో మాట్లాడుతూ ,జిమ్ లో సభ్యత్వం తీసుకొన్నంత మాత్రాన బరువు తగ్గిపోము . క్రమం తప్పకుండా వ్యాయామానికి […]

సైంటిస్ట్ బార్బీ

చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేవిధంగా శాస్త్రవేత్త బార్బీ మార్కెట్లోకి విడుదల అయింది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఎంతో ఇష్టపడే ఈ బార్బీ బొమ్మను డిజైన్ చేసిన నళిని చెపుతున్నారు ఉతాహ్ విశ్వా విద్యాలయంలో అటవీ పర్యావరణ వేత్తగా పని చేస్తున్న నళిని తన కూతురు బార్బీ బొమ్మను కావాలని కోరటంతో ఏదైనా కొత్తగా ఉండాలనే ఉదేశ్యంతో శాస్త్రవేత్త బార్బీని తయారు చేసి దానికి ట్రిటావ్ బార్బీ గా నామకరణం చేసింది. విద్యార్థులకు ప్రకృతి పై అవగాహన,పర్యావరణం […]

ఎంతో దైర్యం కావాలి

పర్వతారోహులను ఆకర్షించేందుకు ఎన్నో వింతలు సృష్టిస్తూ ఉంటారు . టూరిస్ట్ లకు థ్రిలింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చేందుకు గాను చైనా హుబి ప్రావిన్స్ లోని టి పార్క్ ఒక ఎయిర్ కారిడార్ ,వాక్ వే ను పూర్తిగా తాళ్లతో కట్టారు మధ్యలో అడుగులు వేసేందుకు చెక్కలు టైర్లు అమర్చారు . 1000 మీటర్ల పొడవున్నా ఈ వాక్ వే పైన నడవాలంటే నిజంగానే ఎంతో దైర్యం కావాలి . కానీ ఉత్సాహవంతులు ఎంతోమంది గుండెలు చేత్తో […]

ఇక ఉబకాయం రాదు 

ప్రకృతికి దగ్గరగా ఉండే మహిళల్లో ఊబకాయం కనిపించటం లేదని తాజా అధ్యయనం చెపుతోంది. 2300 మంది మహిళలపై చేసిన అధ్యయనంలో ఎత్తు బరువు తీసుకొనే ఆహారం అన్నిక్రోడీకరించి  ఈ రిపోర్ట్ తయారు చేశారు. మహిళలు పచ్చదనానికి దగ్గరగా జీవిస్తూ వుంటే వారి బరువు సాధారణ స్థాయిలో ఉంది. తోటపని చేస్తూ,పచ్చని చెట్ల మధ్య వాకింగ్ మొదలైన వన్నీ మానసిక ఆనందం ఇస్తాయి ఈ కారణం చేత మహిళలు సరైన ఆరోగ్యం తో ఉన్నారని తేలింది. సాద్యమైనంత వరకు […]

నవ్వుతో ఆరోగ్యం

మనిషి స్వచ్ఛమైన నవ్వుకి శరీరంలో జరిగే ఎన్ని రసాయనా మార్పులకీ దగ్గర సంబంధం ఉందంటున్నారు అధ్యయన కారులు . శరీరంలో ఎంజైనులు,హార్మోన్ ల విడుదల కావాటానికి మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు ఉపయోగపడుతుంది . ఈ ఎంజైమ్ లు ,హార్మోన్ లు శరీర అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయని చెపుతన్నారు . రక్తపోటును కూడా నవ్వు సాధారణ స్థితికి తెస్తుందంటున్నారు . హార్మోన్ల అసమానతల కారణంగా ఒత్తిడి ఆందోళన కు గురయ్యే వారు మనసారా నవ్వుతు ఉంటే ,శరీరంలో […]

నవరత్నాలు కలిపితే ఫ్యాషన్

ఇప్పుడైతే బంగారం వజ్రాలు,విలువైన రాళ్ళు ఆభరణాల కోసంగా ఉపయోగిస్తున్నారు కానీ ఒకపుడు అవన్నీ కరెన్సీ వాణిజ్య వ్యాపార మార్పిడి కోసం ఉపయోగించారు. 17 వ శతాబ్దం నుంచి అందమైన వజ్రాలను వెండిలో పొదిగి చక్కని నగలు తయారు చేశాక నెమ్మదిగా వాటిని ధరించటంపైనే మోజు పెరిగింది. వజ్రాల ధగధగలు కలకాలం నిలిచి ఉంటాయి. నగల మార్పిడి సమయంలో కూడా నష్టపోవటం ఉండదు. ఇవ్వాల్టి రోజుల్లో పాతకాలపు సాంప్రదాయ డిజైన్లనే ఇష్టపడుతున్నారు నవరత్నాల స్టోన్స్. డైమండ్స్ కలిపిన గాజులు […]

తలుపులు ఉండవు

ఇల్లన్నాక చుట్టూ గోడలు తలుపులు ,కిటికీలు భద్రత కోసం తాళాలు అన్ని ఉంటాయి కదా . కానీ ఒడిసా రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా స్వాలియా అన్న గ్రామంలో దొంగతనాలు జరగవు . గ్రామస్థుల ఊరి చివర మర్రిచెట్టు క్రింద ఉండే భారకియా ఠాకు రాణి అమ్మవారిని పూజిస్తారు . ఆ దేవతే తమ ఊరి ని కాపలా కాస్తుందని గ్రామస్థుల నమ్మకం . పూర్వకాలం నుంచి ఇలా తలుపులు లేని ఇళ్ళే […]

వ్యాయామానికి ప్రత్యమ్నాయం

వ్యాయామం చేయలేని వాళ్ళలో  ప్రత్యమ్నాయం వేడి నీటి స్నానం ఉపయోగించ వచ్చని ఒక తాజా అధ్యయనం చెపుతోంది వేడి నీరు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చెక్కరలను శరీరమంతా తీసుకువెళుతోంది. వేడి నీటి స్నానం ప్రయోగంలో పాల్గొన్న వాడి శరీరంలో వచ్చే మార్పులను గమనించారు. రక్త నమూనాలను సేకరించారు. రెండు వారాలపాటు క్రమపద్ధతిలో వేడి నీటి స్నానం చేయిస్తే శరీరంలో ఇంఫ్లలమేషన్ తగ్గింది రక్త ప్రసరణ మెరుగైంది చెక్కర […]

   “భోగి”- ప్రసాదం

 భోగుల్లో…భోగుల్లో…భోగ భాగ్యాలా   భోగుల్లో…భోగి మంటల్ల భోగుల్లో …. తెల్లవారు ఝామునే లేచి భోగి మంటలు వేసుకుని తలారా స్నానం చేసి సంక్రాంతి పండుగని ఆహ్వానం పలుకుదాం. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటం పిలుస్తారు.రేగు పళ్ళు,అక్షతలు, నాణాలు కలిపి దిష్టి తీసి పక్కన పడేస్తారు.బొమ్మల కొలువు పెట్టడం సరదా. భోగి మంటల్లో నీళ్ళు కాచి భోగి పీడ అని ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేసుకుని ఊరంతా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు. నిత్య […]

పంచాయతీ ప్రెసిడెంట్ సరస్వతి

శవిల్ల పుత్తూర్ ,విరుద్ నగర్ డిస్ట్రిక్స్ లోని కన్సాపురం పంచాయతీ ఎన్నికల్లో పారిశద్ద్య కార్మికురాలు సరస్వతి  ప్రెసిడెంట్గా ఎన్నికయింది . ఇప్పుడు తాను గెలిచినా పంచాయతీ ఆఫీస్ లోనే  పారిశద్ద్య కార్మికురాలు పర్మినెంట్ ఉద్యోగం చేసే సరస్వతి  ఉద్యోగం మానేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది . గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలకి ,మంచినీటి వసతి ప్రాధాన్యం ఇస్తా నని చెపుతోంది ప్రెసిడెంట్ సరస్వతి . శుభ్రపరిచే ఉద్యోగం లోంచి గ్రామాన్ని తీర్చిదిద్దే ప్రజాసేవలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా […]

2020 ఫ్యాషన్ కలర్

ఈ ఏడాది కలర్ గా క్లాసిక్ బ్లూ ,లేదా రాయల్ బ్లూ ని ఎంపిక చేశారు నిపుణులు . ఊదా కలిసిన నీలంరంగు నిజానికి యూనివర్సల్ పేవరెట్ . నీలిరంగు కెమెరా కాచింగ్ కలర్ ఎన్నో కంపెనీల లోగోలు ఆరంగులోనే మెరుస్తాయి . కార్పొరేట్ సంస్కృతి లో నీలం షూట్ ప్రొఫెషనలిజానికి ప్రతీక నీలం రంగుకు జోడిగా పసుపు నారింజ గులాబీ కాంట్రాస్ట్ కలర్స్ లో ఏ రంగయినా నప్పుతుంది .రిచ్ లుక్ కోసం మెటాలిక్ సిల్వర్ […]

ఇంకెంతో గొప్ప అవకాశం 

నేను పింక్ సినిమా చూశాను . నాకెంతో నచ్చింది కానీ ఆ సినిమా తెలుగు వర్షన్ లో నాకు అవకాశం రాగలదని నేను ఊహించనే లేదు. అంత గొప్ప ప్రాజెక్టు లో భాగం కావటం నాకు గొప్ప అవకాశం అంటోంది,మల్లేశం లో నటించిన తార అనన్య నాగళ్ళ. పవన్ కళ్యాణ్ గారితో పనిచేయటం అంటేనే ఎగ్జయిటింగ్ గా ఉంది. అయన నా ఫేవరేట్ యాక్టర్. నటిగా నేను ఎంజాయ్ చేయటం ఇప్పుడు మొదలైంది. మొదట్లో ఎదురుక్కున్నా ఎన్నో […]

అతి చిన్న వయసు ప్రెసిడెంట్

తమిళనాడు షాలాగిరి లోని కొట్టి నాయకన్ దొడ్డి పంచాయతీ  ప్రెసిడెంట్  గా 21 సంవత్సరాల సంధ్యారాణి ఎన్నికయింది . ఈమె ఆలంచారిలో క్రైస్ట్ కళాశాలలో బిబిసి చదువుతుంది ఆమె తండ్రి గతంలో ఆ గ్రామ  ప్రెసిడెంట్ గా పని చేశారు . చిన్నతనం నుంచి తండ్రి తో కలసి స్వచ్చంద సంస్థలలో పనిచేసేది సంధ్య . సమస్యలతో ఇంటికి వచ్చిన వారిలో మా నాన్న వ్యవహరించే తీరు ,వాళ్ళకి సాయపడే విధానం నాకెంతో నచేది . నేను […]

నాలుగు సెకన్ల కో గొంతు తో

నాలుగే నిముషాల్లో 51 మంది గొంతులను వినిపించి మిమిక్రీ లో తనకు మించిన వాళ్ళు లేదని పించింది కేరళకు చెందిన అఖిల . ప్రతి నాలుగు సెకన్ల కు ఒక గొంతు మార్చింది . ఒక టెలీ కార్యక్రమంలో చేసిన ఈ ఫీట్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది . మైకేల్ జాక్సన్ ,రజనీ కాంత్ ,కమల్ హాసన్ వంటి ప్రముఖల గొంతులకు సెకన్ల తేడాలో మార్చేస్తూ మిమిక్రి చేసింది అఖిల .

రాణీ గారి పని దినాలు 

సంవత్సరానికి ఇరవయ్యో ముప్పయ్యో సెలవులు దొరికితే అదెంతో గొప్ప అవకాశం అని ఆనంద పడతారు. కానీ రాజులు రాణిల సెలవులు,పని దినాలు ఎలావుంటాయి,వాళ్ళేం పనిచేసి సెలవులు పుచ్చుకొంటారు ? అసలు వాళ్ళేం పనిచేస్తారు అని సరదాగా తెలుసుకోవాలి అనుకుంటే బ్రిటన్ రాజ్ కుటంబం ఈ ఏడాది ఎన్ని రోజులు పని చేసిందో ఆలెక్కలు చూస్తే సరిపోతుంది. 2019 లో ఆ కుటుంబం మొత్తం పని చేసిన రోజులు సగటున 84. 5 ఎలిజిబెత్ రాణి గారు 67 […]

చీరెలకు జపాన్ ఆర్ట్ అందాలు 

ప్రతి ఆర్ట్ ఫామ్ చీరెల డిజైన్ గా వచ్చేస్తోంది. ముఖ్యంగా జపాన్ పోర్సి లెయిన్ ఆర్ట్ ఎన్నో అందమైన వర్ణాల మిశ్రమంగా ఉంటుంది. ఈ అందాల వర్ణాల తో చక్కని చీరెలు మార్కెట్ లోకి వచ్చాయి. జాపనీస్ క్రేప్ శారీస్ పైన అందమైన ప్రింట్స్ కనబడుతాయి కొన్నిఅందమైన మోటెప్ లను కళంకారీ హాండ్ ప్రింట్ల తరహాలో ముద్రించారు. చీరెలతో పాటు కుర్తీలను ఈ పోర్చ్ లెయిన్ ప్రింట్స్ చాలా అందంగా అమిరాయి. సహజమైన రంగుల్లో ఈ పూల […]

పాడవుతాయి జాగ్రత్త

ఏ హోటల్లోనో ఎదో తినగానే ఫుడ్ పాయిజన్  అయిపోతుంది . వికారం ,వాంతులు జ్వరం మొదలైన ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఒక్కోసారి ఇంట్లో కూడా ఆహారమవిషయం లో సురక్షిత మార్గం అనుసరించాలి . రా పదార్దాల తయారీకి .రెడీ టు ఈట్ పదార్దాలకు విభిన్న కటింగ్ బోర్డులు ఉపయోగించాలి . అన్నింటికీ ఒకటే వాడుతూ ఉంటే గ్రెస్ కలుషితాలు తప్పవు . రా మీట్ పౌల్ట్రీ సీ ఫుడ్ లేదా గుడ్లు వంటివి వాడిన ప్లేట్లలో రా […]

ఆటిజమ్

ఆటిజమ్ : చిన్న పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి విఘాతం కలిగిస్తుంది . ఆటిజమ్ ఉన్న పిల్లలు ఇతరులతో సరిగ్గా కలవ లేక పోవడం,మాట్లాడ లేక పోవడం ,అందరితో ఉండ లేకపోవడం , నేర్చుకోలేక పోవడం ఉంటుంది . పిల్లల్లో పెంపొందే ఆటిజమ్ గురించి తల్లి దండ్రులకు సరైన అవగాహన ఉండాలి ఆటిజమ్ అరవై (60 )మందిలో ఒకరికి ఉంటుంది . (1)ఇది “0-3” సంసంవత్సరాల వయస్సు లోపు ప్రారంభమయ్యే ఒక “న్యూరో డెవలప్ మెంట్ ” డిజార్డర్ […]