Thursday, 08 Oct, 2026

కేరళా లో కమ్యూనిటీ కిచెన్లు 

కేరళ రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో మొదలైన కుటుంబ శ్రీ లో సభ్యులుగా ఉన్నా  కమ్యూనిటీ కిచెన్ల పేరుతొ కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ఆహారం అందిస్తున్నాం. కర్ప్యూ కారణంగా గృహ నిర్బంధంలో ఉన్న వృద్ధులు,నిరుపేదలు ఆకలి తీర్చేందుకు కమ్యూనిటీ కిచెన్ లలో ఆహారం తయారు చేస్తున్నారు. ఉట్లారు తిరువనంత పురం కేరళలో 85 సెంటర్ల ద్వారా ఎంతో మందికి ఆకలి తీరుస్తోంది. ఈ కుటుంబం శ్రీ గ్రూప్ ఒక్క సెంటర్లో 500 పైగా పాకెట్లు తయారు చేస్తున్నారు. […]

ఈ ఐదూ అవసరం 

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవలసిన సమయం ఇది. ఏదో ఒకటి చాలదు. విటమిన్-ఎ ,సెలీనియం,జింక్,విటమిన్-సి,విటమిన్-డి,పదార్ధాలు తినాలి నారింజలు,తాజాపండ్లు,ముదురాకు పచ్చరంగు కాయగూరలు,బొప్పాయి,బ్రకోలి,చిలకడదుంప,గుమ్మడిలో విటమిన్-ఎ సంవృద్ధిగా ఉంటుంది నట్స్, గుడ్లు,ఉల్లిపాయలో సెలీనియం,చేపలు,గుమ్మడి గింజలు,పొద్దుతిరుగుడు గింజలు మొదలైన వాటిలో జింక్,నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి గుడ్లు, వెన్న, చేపల్లో పుష్కలంగా విటమిన్-డి ఉంటాయి. ఇవన్నీ ఆహారంలో భాగంగా ఉంటే ఎలాటి వ్యాధులు దగ్గరకు రావు.

ఎన్నో నేర్పవచ్చు   

లాక్ డౌన్ తో అందరూ ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. ఇరవై నాలుగు గంటలు నాలుగు గోడల మధ్యన కదల కుండా కూర్చోవటం  పిల్లలకు కష్టమే.  ఈ సమయంలో పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పండి. అంటున్నారు ఎక్స్పర్ట్స్.  వైరస్ వ్యాప్తి దాని వల్ల జరిగే అనర్థాలు మరీ భయ పెట్టకుండా వివరించి వాళ్లకు ఒక  జీవన విధానానికి తయారు చేసే సమయం ఇలా దొరికిందను కోవాలి. వాళ్ళని వంటింట్లో సాయం చేయనివ్వాలి. ఇళ్లల్లో శానిటైజర్లు ఆడుకునే ఆటలు వైకుంఠపాళి , […]

“మంగళాకారుని ప్రసాదం”

అతి బలవంతా…శ్రీ ఆంజనేయ…. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజేహం భజేహం. సర్వ మంగళాకారుడైన,అతి బలవంతుడైన,శ్రీరాముని పరమ భక్తుడైన,అంజనీ పుత్రుడిని నిత్యం సర్వ వేళల యందు మనస్ఫూర్తిగా నమ్ముకుని పూజించి అనుగ్రహం పొందండి.శ్రీ రామ నవమి ఉత్సవాలు ఆర్భాటంగా ప్రారంభం అవుతున్నయి భద్రాచలంలో.ఈ నవరాత్రులలో ఆంజనేయులవారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈనాడు ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్న మహమ్మారిని అంతమొందించటానికి రోజుకి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం మనకు తప్పకుండా సత్ఫలితాలిస్తుంది. నిత్య ప్రసాదం:కొబ్బరి,అప్పాలు,చిట్టి గారెలు […]

చేతులు శుభ్రంగా ఉంచుకోండి

నిజానికి మన సంప్రదాయంలో బయటినుంచి ఇంటికి వచ్చినపుడు, కాళ్ళు ,చేతులు కడుక్కునే సంప్రదాయం ఉండేది. ఈ ఆధునిక కాలంలో బయట బూట్లు చెప్పులు వదిలేసి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. ప్రస్తుత పరిస్థితిలో వ్యక్తగత శుభ్రత పాటించటం ఒక్కటే కరోనా నుంచి తప్పించుకునేందుకు దొరికిన ఏకైక మార్గం. బయట నుంచి లోపలకి వచ్చిన, లేదా రోజంతా ఇంట్లో ఉన్నా,చేతులతో ఎన్నో వస్తువులు తాకుతాము. కాబట్టి లిక్విడ్ సబ్బుతో  గంటకోసారి చేతులు కడుక్కోవాలి. ఇలా చేతులు కడుక్కోవడం వల్ల కడుపులో […]

మాస్కుల తయారీలో మహిళా ఖైదీలు 

చెంచల్ గూడ జైల్లో,వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మహిళా ఖైదీలు కరోనా వ్యాప్తిని అరికట్టే దశలో వాడుకొనేందుకు వీలుగా ఉండే మాస్క్ ల తయారీలో లీనమయ్యారు. అందరు కలసి ఒక్కరోజులో ఏడెనిమిది వేల మాస్క్ లు తయారు చేయగలుగుతున్నారు.  వీటిని  వైద్యులు పోలీస్ సిబ్బంది వాడకం కోసం నిత్యం పంపిణి చేస్తున్నారు. ఇవి ఒకసారి వాడుకొన్నాక,మళ్ళి ఉతికి శుభ్రం చేసి వాడుకొనేందుకు వీలుగా మెత్తని గుడ్డ లతో తయారు చేస్తున్నారు. తమ వంతు సాయంగా ఈ పని చేస్తున్నందుకు […]

ఆపదలో సాయం

మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించింది బెంగళూరుకు చెందిన మహిమ నాగరాజ్. కోవిడ్-19 కలవర పెడుతున్న వేళలో వృద్దులను ఇంటి నుంచి బయటకు రావద్దనీ  ఆ వయసులో వైరస్ సోకితే కోలుకోవడం కష్టం అంటున్నారు వైద్యులు. ఆలా బయటికి రాలేని వృద్దుల కోసం కేర్ మాంగర్స్ ఇండియా పేరుతొ ఫేస్ బుక్ పేజీ తెరిచింది మహిమ. 24 గంటల్లో  ఆ గ్రూప్ లో 200 మంది వాలంటీర్లుగా చేరారు. ఇప్పుడు మూడు వేల వరకు వాలంటీర్లు వస్తువులను […]

 ఓ వారం నిల్వ చేసుకోవచ్చు 

ఈ కర్ఫూ సమయంలో బయటకి ఎక్కువ సార్లు తిరిగే అవకాశం లేదు. కూరలు వారానికి సరిపోయేన్ని ఒక్కసారే తెచ్చుకోవలసి వస్తోంది. ఇవి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టామోటా,వెల్లుల్లి,ఉల్లిపాయ,బంగాళా దుంపలు ఫ్రిజ్ లో పెట్టనక్కర లేదు. సూర్యకాంతి పడకుండా గది ఉష్ణోగ్రత లోనే నిల్వ వుంటాయి. పాలు డిప్ ఫ్రిజ్ లో భద్ర పరుచుకోవచ్చు. మాంసం వంటివి ముందుగా ఉడికించి చల్లార్చి డిప్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. బఠాణీలు,పాలకూర,తోటకూర చిక్కుడు వంటివి […]

ప్రశాంతంగా ఉండండి 

కరోనా వైరస్ భయం,లాక్ డౌన్ టెన్షన్ వంటివి మనసులోకి రానివ్వకండి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోండి అంటున్నారు. సైకియార్టిస్టులు ఉదయం కొద్దిసేపు మెడిటేషన్ చేయటం ద్వారా ఆలోచనలు కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు. పుస్తకాలు చదవటం,చిన్నప్పటి ఫొటోలు చూడటం మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు,హాస్యపు సన్నివేశాలు వంటివి మనుసుకి శాంతి ఇస్తాయంటున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇళ్ళలోనే శుభ్రంగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి అరికట్ట వచ్చని,సోషల్ మీడియా లో వచ్చే అసత్య వార్తలను నమ్మకండా ఉండటమే క్షేమం […]

ప్రొఫెసర్ అజ్రాఘని 

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మందు కనిపెట్టే వరకు జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండటం తప్ప ఇంకో గత్యంతరం లేదు. అయితే కరోనా వైరస్ నిర్ములించేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. ఈ లోగా లండన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లో మహిళా పరిశోధకులు కరోనా గురించి ప్రజలకు చెతన్యం కలిగించే పనిలో ఉన్నారు. ప్రాఫెసర్ అజ్రాఘని కరోనా వైరస్ కు సంబందించిన అత్యంత ప్రధానమైన సమాచారం ప్రభుత్వానికి అందించటంలో విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. సెంటర్ ఫర్ ఇన్ […]

పరిసరాల శుభ్రత ముఖ్యం 

కరోనా వైరస్ భయ పెట్టినా  కొన్ని ఉద్యాగాలకు బయటకు వెళ్ళటం తప్పదు. లేదా అవసరమైన పనిలో ఇతరులతో కలసి పనిచేయటం కూడా తప్పదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెపుతోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కనీసం ఒక మీటర్ దూరం పాటించాలి. అనుకోకుండా దగ్గు,తుమ్మ వస్తే మోచేతి మడమతొ మొహం ఆనించాలి. తుంపరలు ఎదుటి వాళ్ళపైకి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. కరోనా,ఫ్లూ,వలే వ్యాపించే వ్యాధి. వర్క్ ప్లేస్ లో టేబుల్స్,కుర్చీలు,ఫోన్స్,అన్ని డెట్టాల్ తో తుడిచి శుభ్రంగా ఉంచుకోవాలి. […]

“నికుంభిల దేవి అవతారం”

పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి జరిగిన యద్థంలో ఒక రాక్షసుడు పుట్టాడు.వాడిని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సంధించాడు కాని అది వెనుదిరిగి వచ్చినది. శివుడు తన త్రిశూలానితో ప్రయత్నం చేసాడు కానీ అదీ స్వామి వద్దకు తిరిగి చేరింది.రక్కసుడు వికటాట్టహాసంతో శ్రీమహావిష్ణువు, శివుని వెంటబడ్డాడు.వారిరువురు తమని ఆదిశక్తే కపాడాలని శరణు వేడుకున్నారు. ఆదిశక్తి లక్ష తలకాయలతో అవతారమెత్తి ఆ రాక్షసుడిని వాడి సైన్యాన్ని హతమార్చింది.ఊపిరాడకుండా చేసింది.ప్రత్యంగిరా దేవీ అని భక్తులు ఆ అవతారం చూసి భయపడి […]

క్రికెటర్ రాధా యాదవ్

కూరగాయలు అమీ ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన రాధా  యాదవ్ ప్రపంచ కప్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు విజయాలు అందించే స్థాయి కి చేరుకొన్నది . మహిళల టీ 20 ప్రపంచ కప్ లో శ్రీలంక తో మ్యాచ్ లో లెఫ్టర్మ్ ఆఫ్ స్పిన్ తో నాలుగు వికెట్లు కూల్చి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది రాధా . కోచ్ ప్రఫుల్ నాయక్ తీసుకొన్న శ్రద్ధతో క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టిన […]

 ఉదయగిరి హస్తకళలు 

నెల్లూరు జిల్లా ఉదయగిరి రాజుల కాలం నుంచే చేతి కళలకు పెట్టింది పేరు. నవాబ్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ హస్త కళా నైపుణ్యం గురించి చరిత్రకారులు రాశారు. ఇప్పుడా చరిత్ర పునరావృతమైంది ఈ ప్రాంతానికి చెందిన గౌసియా బేగం,తన తండ్రి బషీర్ సాయంతో చెక్క నగిషీలు తయారు చేయటం నేర్చుకొంది ఆమెతో పాటు మరో 15 మంది మహిళలు ఈ కళలో ప్రావీణ్యం సంపాదించారు. వీరు తయారు చేసిన చెంచాలు,ఫోర్కులు,కత్తులు, కంచాలు, పండ్ల […]

“ధన్వంతరి ప్రసాదం”

ఓం ధాన్వంతరాయ నమః సంపూర్ణంగా ఆయురారోగ్యాయలతో భక్తులందరు వుండాలని ధన్వంతరీ మంత్రాన్ని నిశ్చలంగా జపిస్తే దుష్టశక్తులు మన దరిచేరవు. క్షీరసాగర మధన సమయంలో ధన్వంతరీ వారిది ఎంతో ప్రముఖ పాత్ర.అనారోగ్యాలకు,దుష్టశక్తుల బారి నుండి విముక్తి కోసం ధన్వంతరిని తప్పకుండా పూజించాలి.మనందరికి ఆది వైద్యుడు మరి ఆయనే.ఈ ధన్వంతరీ యాగాన్ని చూసిన వారి జన్మ ధన్యం.ముక్కోటిదేవతలను ఆహ్వానించి వారికి ఆర్ఘ్యం సమర్పిస్తారు.శ్రీ మహావిష్ణువుకి ధన్వంతరీ చాలా సన్నిహితుహుడు. ఈ రోజు నుండి మనం కూడా ధన్వవంతరీని పూజించి సకల […]

డైట్ లో ఐరన్ వుందా ?

తీసుకొనే ఆహారంలో ఐరన్ పుష్కలంగా ఉంటే శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు డైటీషియన్లు . డైట్ లో ఐరన్ నిండిన పదర్దాలు చేర్చుకోమంటున్నారు . బీట్ రూట్ పెద్దగా రుచి గా లేకపోయినా ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఎర్ర కణాల నిర్మాణం లో సాయపడుతుంది అలాగే పాలకూర ఐరన్ కు నుంచి పోషక పదార్ధం . ఇందులో కాల్షియం సోడియం ఉంటాయి . ఇది తింటే హిమోగ్లోబిన్ లోపం కూడా […]

నిద్ర నొప్పి నివారణ ఔషధం 

నిద్ర వల్ల వచ్చే ప్రయోజనాల జాబితా ఎప్పటికప్పుడు పెరిగి పోతోంది . హాయిగా నిద్రపోతే సగం అనారోగ్యాలు రావు . ఇప్పుడే కొత్త పరిశోధన నిద్ర ఓ నొప్పి నివారణ అంటోంది . నిద్ర సరిపోయినంత పోతే నొప్పిని తగ్గించే కోపంగా విడుదలై మత్తు మందు మాదిరిగా పని చేస్తుందని పరిశోదకులు వెల్లడించారు . నిద్ర సరిగా పోకపోతే ఈ హార్మోన్ విడుదల కేంద్రాలు మూసుకుపోయి నొప్పి మరింత పెరుగుతుందని నిపుణులు చెపుతున్నారు . అంతే నిద్ర సహజమైన మత్తుమందు లా పనిచేస్తుందన్న మాట . అందుకే నిద్రకు భంగం కలిగించే పనులేమీ చేయద్దు . ప్రశాంతంగా నిద్ర పోయేందుకు ప్రయత్నం చేయండి అంటున్నారు పరిశోధకులు .

కల నిజమాయగా ! 

శ్రీ దేవి లాగా ఎప్పటికైనా పెద్ద హీరోయిన్ అవ్వాలని ,నాకు ఐశ్వర్యా రాయ్ లాగా క్రేజ్ ఉండాలని ఎన్ని కలలు కనే దాన్నో చెప్పలేను అంటోంది సారా అలీఖాన్ . ఆమె కలలు నిజమైనట్లే ఉంది . స్పోర్ట్స్ ఇండియా సెలబ్రీలు జాబితాలో అరవై ఆరో స్థానంలో నిలబడివుంది సారా అలీఖాన్ . చిన్నతనం నుంచి కరణ్ సినిమాలు ఎంతో ఇష్టంగా చూసేదాన్ని . సినిమాలే నా ఊహల్లో . కానీ 85 కిలోలు బరువున్నాను . ఈ బరువు తగ్గితే సినిమా ఇస్తానన్నాడు డైరెక్టర్ . ఇంకేముందీ జీవితం పూర్తిగా మారిపోయింది . అంత బరువు తగ్గించుకునేందుకు ఎన్ని వ్యాయామాలు చేశానో ,ఎంత నోరు కట్టేసుకొన్నానో అస్సలు ఎవ్వరు ఉహించాలేదు . ఇప్పుడు నేను నటిస్తానని ఎంతో అందంగా ఉన్నవని మార్కులు పడుతున్నాయో అవన్నీ నా కష్టానికి ఫలితం అంటోంది సారా అలీఖాన్ .

ఆరేళ్ళుగా పోరాడుతున్నా

ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ విషయం నేను దాచి పెట్టాలి అనుకోవటం లేదు నేనెలా బయట పడ్డానో చెప్పాలిగా . ఎంతోమంది కి ఉపయోగ  పడుతుందేమో  ననుకొంటాను . నా అనుభవంతో నేను వాటికీ మందులు వాడకం కంటే మనసు నియంత్రించుకొంటే చాలనుకొన్నాను . ఒక రకంగా నేను బయట పడ్డాను ఇవ్వాళ  . నా షెడ్యూల్స్ నేను ఎలాటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోగలుగుతున్నాను . నన్ను బలంగా ఉండు  అని నామనసుకి చెప్పుకోవటమే నేను చేసే పని అంటోంది శ్రద్దా కపూర్

ఆభరణాల్లాంటి స్టాండ్స్

అచ్చం బంగారు నగాల్లాగే ఉన్నాయి . వినాయకుడు,లక్ష్మీదేవి మయూరాలతో మెరిసిపోయే ఎరుపు ,పచ్చ రాళ్ళతో ఎంతో అందంగా ఉన్నాయి . అగర్బత్తి స్టాండ్ లు ,మాములు వెండి ,బంగారు కుందులు  అగర్ బత్తీ స్టాండ్ లు తెలుసు కానీ ఆధునిక డిజైనర్లు వీటి రూపంలో మార్చేశారు . ముత్యాలు రాళ్ళు పొదిగి అందమైన డిజైన్ల అగర్ బత్తీ స్టాండ్ లు తయారు చేశారు . మాట్ ఫినిషింగ్ వల్ల వీటికి ఓ యాంటిక్ లుక్ కూడా ఉంది […]