ఉచితంగా పెళ్ళి దుస్తులు
కన్నూర్ లో రెయిన్ బో పేరుతో బోటిక్ నడుపుతోంది సబిత.డిజైనర్ దుస్తులు పెళ్లి దుస్తులు తయారు చేస్తుంది సబితా. ఎంతోమంది పేద ఆడపిల్లలు తన షోరూమ్ లో డ్రెస్సులు చూసి సంతోషించడం చూసింది సబితా.ఎంతో మంది పెళ్లి దుస్తులు కొనుక్కుంటారు అవి ప్రత్యేకమైనది కనుక ఇంకొకసారి వాడేందుకు వీలుగా ఉండవు వృధాగా పడి ఉండే ఆ దుస్తులు ఇంకో పేద పిల్లల పెళ్లికి పనికి వస్తాయి.వాటిని ఇవ్వండి అని ఇన్ స్టాగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్ లో […]
ఇది నాకెంతో గర్వకారణం
ఐదేళ్ల క్రితం బీహార్ లో తొలి ట్రాన్స్జెండర్ మహిళా బ్యాంకు ఉద్యోగి గా గుర్తింపు పొందిన మౌనిక దాస్ ఈ సారి దేశంలోనే తొలిసారిగా పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించున్నారు. పాట్నా యూనివర్సిటీ లో లా చేశారు మౌనిక దాస్. బీహార్ లో అక్టోబర్ 28 నవంబర్ 3, 7 తేదీల్లో మూడవ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.మౌనిక దాస్ రెండవ విడత పోలింగ్ లో పాట్నాలోని ఏదైనా బూత్ కు పర్యవేక్షణ […]
తగ్గించటం సులభమే
మధ్య వయసు దాటిన మహిళల్లో ముఖంపైన ముక్కుకి ఇరువైపులా నోటి చుట్టూ నల్లని మచ్చలు వస్తూ ఉంటాయి. హార్మోన్ల మార్పుల వల్ల మోనోపాజ్ సమయంలో కనిపిస్తాయని చెపుతున్నారు డాక్టర్లు. వీటిని తగ్గించుకొనేందుకు నిత్యం నీళ్లు ఎక్కువ తాగటం మొదలు పెట్టారు. టమోటో,బీట్ రూట్ క్యారెట్ వంటి కూరగాయలు రసాలు తాగాలి. మసాలా కారం వంటివి తగ్గించుకోవాలి. కప్పు పాలలో స్పూన్ చొప్పున సుగంధ పాలు పటిక బెల్లం చూర్ణం నిత్యం రెండు పూటలా తీసుకోమంటున్నారు ఆయుర్వేద వైద్యులు […]
అమావాస్య కూడా మంచిదే
ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అంటే తిథి వార నక్షత్రాలు సరి చూసుకుంటారు.అలా ఒక మంచి ముహూర్తం లో మొదలు పెట్టిన ప్రతి పని విజయవంతం అవుతోంది. చాలామంది అమావాస్య నాడు ఏ పని మొదలు పెట్టారు ఆ రోజు మంచిది కాదని అనుకుంటారు.అని మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్యనాడు ప్రారంభించారు విజయాన్ని సాధించారు అధర్మాన్ని జోడించి ధర్మాన్ని గెలిపించిన మంచి ముహూర్తం అది.ఇప్పుడో కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజే. ఆ రోజు కోసం ఎదురు […]
అభిమాన వారసత్వం
సచిన్ టెండూల్కర్ ప్రపంచం మెచ్చిన క్రీడాకారుడు.ప్రతి ఇంటా ఆయన అభిమానులు ఉన్నారు.ఆయన అభిమానుల ఆపేక్షను వారసత్వంగా తెచ్చుకుంటుంది సారా. సచిన్ కూతురుగా ఈ అమ్మాయి అటు క్రీడల్లోని,ఇటు సినిమాల్లోకి రాలేదు. చదువు పైన దృష్టి పెట్టింది. నాయనమ్మ అనాబెల్ సేవాభావాన్ని అందిపుచ్చుకుంది అప్నాలయ సంస్థ కోసం విరాళాలు సేకరించటం సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవటం సారా కు ఇష్టమైన పనులు. 1972 లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబాయి లో ఉంది మురికివాడల్లోని పేదలు […]
ప్రజాక్త కోలీ
బాలీవుడ్ నటుల్లా గా ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్న నేషనల్ యూట్యూబర్ ప్రజాక్త కోలీ ‘Mostly same’పేరుతో ఈమె షేర్ చేసే వీడియోలకు 50 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు మాస్ మీడియా లో డిగ్రీ పూర్తి చేసి ముంబై లో ఫీవర్ 104 ఎఫ్.ఎం ఆర్జీ గా కెరియర్ మొదలుపెట్టిన ప్రజాక్త కోలీ సామాజిక సమస్యలపై కూడా వీడియోలు చేసింది.యూట్యూబ్ ప్రారంభించిన క్రియేటర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి భారతదేశం తరఫున రెండుసార్లు ఎంపికైన ఏకైక […]
పచ్చి కూరల రసం బెస్ట్
ఎన్నో పోషకాలుండే కూరగాయలను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.పచ్చి కూరల్లో విటమిన్-సి ఎంతో ఎక్కువగా ఉంటుంది.రసాలు, జ్యూస్ ల రూపంలో పచ్చి కూరగాయలు తీసుకొన్నా మంచిదే.కూరగాయలతో తయారు చేసే జ్యూస్ లు రుచిగా ఉండేందుకు చక్కెర, బెల్లం, తేనె కలుపుకోవచ్చు.ఎక్కువగా కలిపితే కేలరీలు అధికం అవుతాయి జ్యూస్ వడ కడితే పీచు పోతోంది కాబట్టి వీలున్నంత వరకు వాటిని సలాడ్స్ రూపంలో తీసుకోవటం బెటర్.ఇష్టంగా తినలేని కూరగాయలు పచ్చివే.ఎలా అభిరుచి గా ఉండాలో అలా జ్యూస్ గా […]
ఈ ఆహారమే ఔషధం
చాలామంది స్త్రీలలో రక్తహీనత సమస్య ఉంటుంది.పోషకాహార లోపం వల్ల కూడా రక్తహీనత రావచ్చు.దీనివల్ల విపరీతమైన నీరసం పనులు చురుగ్గా చేసుకోలేకపోవడం ఉంటుంది.ఎండు ఖర్జూరాలు నీళ్లలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం ఒక నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడవచ్చు.రోజుకో దానిమ్మ పండు వారానికి రెండు సార్లు బీట్ రూట్ కూర,అరటిపండు,మెంతి కూర, గోంగూర,పాలకూర,తేనె, పాలు,పెరుగు కిస్ మిస్ లు ఆహారంలో భాగంగా ఉంటే చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
అతినిద్ర అనారోగ్యమే
నిద్రలేమితో ఎన్నో ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయన్నది తెలిసిందే.కానీ సరికొత్త అధ్యయనం అతిగా నిద్ర పోయిన వారిలో గుండె జబ్బులు,డిప్రెషన్ వంటి జబ్బులు త్వరగా వస్తాయి అంటోంది…మనిషికి రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర చాలా అవసరం అంతకన్నా తక్కువ నిద్ర పోతే గుండెజబ్బులు వచ్చే అవకాశం 34 శాతం ఉన్నట్లు అధ్యయనకారులు తేల్చారు.అలాగే 8 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారిలో 35 శాతం గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు అతినిద్ర మూలంగా డి ఎన్ […]
స్వయంగా చదువుకొన్న
నాలో వంటరితనం జయించేందుకు చదువు ఒక్కటే మార్గం అనిపించింది. ఇంటర్ పూర్తి చేసుకుని బయట ప్రపంచంలో అడుగు పెట్టేసరికి నా కంటూ ఎవ్వళ్ళు లేరు.వీరప్పన్ కూతుర్ని.నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్నెప్పుడూ ప్రేమగానే చూసేవాళ్ళు మా నాన్న నేను డాక్టర్ అవ్వాలి అనుకొన్నాడు.కానీ నేను లాయర్ ని అయ్యి పేదలకు ఉచిత న్యాయ సహాయం చేయాలనుకున్నాను.కష్టపడి ఏడెనిమిది బడుల్లో పాఠాలు చెప్పుకుని అలా వచ్చిన డబ్బుతో చదువుకున్నాను అంటోంది వీరప్పన్ కూతురు విద్యా రాణి.మా నాన్నను చిన్నప్పుడు […]
కమలం వంటి అందం
అందమైన కమలం సౌందర్య పోషణలో ఎంత గానో ఉపయోగపడుతుంది తామరపువ్వుల పొడి మార్కెట్ లో దొరుకుతోంది.రెండు స్పూన్ల తామరపూల పొడి లో టేబుల్ స్పూన్ పాలు కలపాలి.దీన్ని మొహం మెడకు పట్టించి పావుగంట పాటు ఆరపోవ్వాలి తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ తామరపూల ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది అలాగే జుట్టు పొడిబారకుండా కాపాడుతోంది తామరపూల పొడి, ఉసిరి పొడి, గుంటగలగర పొడి రెండేసి టేబుల్ స్పూన్ ల చొప్పున తీసుకోవాలి నీళ్లలో కలిపి […]
కొన్ని జాగ్రత్తలు తప్పవు
మెనోపాజ్ మహిళలందరికీ ఎదురయ్యేదే కానీ ఒకళ్ళకి ఒక రకమైన సమస్యలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల తయారీ తగ్గిపోవటంతో వచ్చే దశ ఇది.కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో ఉపశమనం పొందవచ్చు. ఉదయం తప్పకుండా నడవాలి కండరాల దృఢత్వం కోసం వ్యాయామం చేయాలి వదులుగా ఉండే నూలు దుస్తులు వేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడానికి అలవాటు పడాలి తరచూ నీళ్లు తాగాలి.వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పోషకాహారం తప్పనిసరి మధుమేహం అదుపులో ఉంచుకోవాలి […]
ఎడారి పూలు
ఎటువైపు చూసినా ఇసుక గుట్టలు, ఎండమావులు, ఒంటెలు ఇవే ఎడారి దృశ్యాలు కానీ చిలీ లోని అటకామా ఎడారి కి వెళ్తే మాత్రం భూమి మొత్తం విచ్చుకొన్న పూలతో ఎంతో రమణీయంగా కనిపిస్తుంది.ప్రపంచంలో అత్యధిక పొడి వాతావరణం నమోదయ్యే ఈ ఎడారిలో వర్షపాతం చాలా తక్కువ. అలాంటిది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రం నీటి అవసరం అంతగా ఉండని ఎడారి మొక్కలు మొలిచి వికసిస్తాయి.కొన్నాళ్లకు ఈ పూలు విడిపోయి ఆ నేలలో విత్తనాలు పడిపోతాయి.మళ్లీ వర్షాలు […]
సౌందర్యాన్నిచ్చే చార్ కోల్
చార్ కోల్ పౌడర్ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.చర్మం పైన జుట్టు పేరుకు పోయి ఉంటే చార్ కోల్ పౌడర్ నీళ్లలో కలిపి మొహంపై ప్యాక్ వేయాలి 20 నిమిషాల తరువాత నీళ్లతో కడిగితే చాలు చర్మం పైన జిడ్డు మురికి పోతాయి. మొహం పైన కాలిన మచ్చలు తేగిన గాయాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు చార్ కోల్ పౌడర్, తేనె కాసిని నీళ్లు కలిపి ఆ పేస్ట్ మచ్చల పై రాయాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే […]
90 రోజుల్లో 350 కోర్స్ లు
కేరళకు చెందిన ఆర్తి రఘునాథ్ 90 రోజుల్లో 350 ఆన్ లైన్ కోర్స్ లు పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది.ఆర్తి ఎం.ఇ.ఎన్ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండవ సంవత్సరం చదువుతోంది.ఆర్తి కొచ్చిలోని పలంకార్ లో ఉంటుంది. కరోనా సమయంలో మూడు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది.లెక్చరర్స్ సలహా పైన ఒక్క విశ్వవిద్యాలయానికి అప్లికేషన్ పెట్టింది అలా ఆన్ లైన్ లో 350 కోర్స్ లు పూర్తి చేసింది ఇప్పటివరకు అన్ని కోర్సులు చేసిన వారు ఎవ్వరూ […]
ఇది సహజమైన ప్యాక్
మొహం పై నల్ల మచ్చలు మరకలు పోయి ఎందుకు ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ లు ఎంతో మంచి ఫలితం ఇస్తాయి.శనగపిండి పావు కప్పు గ్రీన్ టీ పొడి రెండు స్పూన్లు పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక పావు కప్పు తీసుకోవాలి.ఇవన్నీ ఒక పాత్రలో కి తీసుకోవాలి. రోజు వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం గాలి చొరబడని సీసాలో నిలువ చేసుకోవచ్చు.ఈ పేస్ట్ ను […]
కెమికల్స్ తగ్గిస్తే మేలు
ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే కెమికల్స్ వల్ల కూడా ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి గాలి ధారాళంగా రాణి లోపల గదుల్లో ఈ కెమికల్స్ వినియోగంతో సమస్యలు వస్తాయి.అలాగే ఇంటి ఆవరణలో పెంచే కూరగాయల మొక్కల పై కూడా ఫెస్టిసైడ్స్ వాడకూడదు. బద్దంకలు చీమలు కోసం ఉపయోగించే స్ప్రే కారణంగా పిల్లల్లో ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. స్వచ్ఛమైన గాలి కోసం గది మూలల్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలి గదిలో కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు మార్కెట్లో దొరుకుతాయి.ఇప్పుడు మంచి […]
ఫిట్ నెస్ కు జుంబా
జుంబా వ్యాయామం మంచి కార్డియో వర్క్ ఫుట్ అంటారు వ్యాయామ శిక్షకులు ఇందులో నాలుగు రకాల రిథమ్స్ ఉంటాయి.సల్సా కాంబియా,మెరింగువా,రిగ్గేటోన్ ఉంటాయి.ఈ జాంబా తో ప్రతి కండరానికీ గుండెకు మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది. ఒక్క జాంబ సెషన్ తో 800 క్యాలరీలు కరిగిపోతాయి.జుంబా టోనింగ్ తో తక్కువ బరువున్న డంబెల్స్ ఎత్తటం వల్ల శరీరం మొత్తం టోన్ అవుతుంది.ముఖ్యంగా జుంబా ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ చక్కగా ఉంటుంది.బరువు తగ్గుతారు బాడీ బాలెన్సింగ్ అలవడుతుంది.ఇంటి దగ్గరే […]
కాలీ చూడేల్ అనేవాళ్ళు
ఒంటి రంగు నల్లగా ఉన్నందుకు 12 ఏళ్ల వయసు నుంచే నన్ను అందరూ కాలీ చూడేల్ ( నల్ల దయ్యం) అని వెక్కిరించేవారు ఇలాటి వెక్కిరింతలు నాకే కాదు అకారణంగా బాల్యం నుంచి ఆత్మన్యూన్యుత కలిగేలా ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రతి అమ్మాయి అబ్బాయి విషయంలో వచ్చే సమస్య ఇది.నువ్విలా నల్లగా పొట్టి గా ఉన్నావు అందంగా లేవు అనేస్తారు అంటోంది సుహానా ఖాన్.ప్రఖ్యాత నటుడు షారుక్ ఖాన్ కూతురు ఆమె వంటి […]
ఆత్మరక్షణ నేర్పే రెడ్ బ్రిగేడ్
రెడ్ బ్రిగేడ్ ట్రస్ట్ ద్వారా 75000 మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చింది ఉష విశ్వకర్మ.జీవితంలో లైంగిక వేధింపులకు గురైన ఉష విశ్వకర్మ ఈ రెడ్ బ్రిగేడ్ ద్వారా 15- 20 నిరాయుధీకరణ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ కావాచ్ మిషన్ కింద 56000 మంది మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చింది. బాలికలకు మహిళలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో ఆలోచించే దిశగా ఉషా 700 వరకు వీధి నాటకాలు నిర్వహించింది.ఉత్తర […]
