ప్లాస్టిక్ వ్యర్థాలతో చేనేత
అసోమ్ కు చెందిన రూప్ జ్యోతి సైకియా గోగోయ్ 2004లో విలేజ్ వీల్స్ పేరుతో స్థాపించిన సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి చేనేత ఉత్పత్తులకు, వాటికి శిక్షణ ఇచ్చేందుకు పనిచేస్తుంది. పనికిరాని ప్లాస్టిక్ ని సేకరించి సాంప్రదాయ పద్ధతి లో చేనేత గా మలుస్తున్నారు .హ్యాండ్ బ్యాగ్స్ డోర్ మాట్స్, టేబుల్ మాట్స్, టోపీలు ఇతర ఇంటి అలంకరణ వంటి ఎన్నో వెరైటీలు ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. తయారీ విధానాన్ని వేలమంది మహిళలు విలేజ్ వీల్స్ ద్వారా నేర్చుకున్నారు. […]
వయసు కేవలం సంఖ్య
నా దృష్టిలో వయస్సు ఒక సంఖ్య మాత్రమే అంటుంది 69 ఏళ్ల గృహిణి రజినీ చాంది. దక్షణ భారతదేశంలో సాంప్రదాయ కేరళ లో పుట్టి పెరిగిన రజినీ చాంది తో ఫోటో షూట్ చేశారు. 29 సంవత్సరాల ఫోటోగ్రాఫర్ అతి రాజాయ్ ఆ ఫోటోల్ని తన సోషల్ మీడియా పేజీల్లో అప్ లోడ్ చేశారు. మోడ్రన్ డ్రెస్ లతో బోల్డ్ గా కనిపిస్తున్న రజినీ చాందీ తన డ్రెస్సింగ్ తో సోషల్ మీడియా ప్రశంశలు పొందారు. వృద్ధుల […]
ఇదో శుభ పరిణామం
కరోనా కష్టకాలంలో ప్రజలు ఒకళ్ళకొకళ్ళు అండగా ఉంటున్నారు. కులం, ప్రాంతం, పేద, ధనిక తేడాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పోరాడుతున్నారు. మనల్ని వేరు చేసే సమస్యలే ఇప్పుడు మనల్ని కలిపి ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి.కరోనా సంక్షోభం లో ఇదో శుభపరిణామం అంటోంది కృతిసనన్. కరోనా పరిస్థితులపై చేసిన ఒక వీడియో లో మాట్లాడుతూ ప్రతి ఇబ్బందులోనూ మంచినే చూస్తాను కారు చీకట్లో కాంతి కోసం వెలుగు తాను అంటోంది కృతిసనన్.కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తోంది […]
ఇప్పుడివి కరోనా కేర్ సెంటర్ లు
రూబుల్ నేగీ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా అనగారిన వర్గాల పిల్లల జీవితాల్లో కళ ద్వారా వెలుగులు నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. రూబుల్ నేగీ ప్రముఖ కళాకారిణి సామాజిక కార్యకర్త శిల్పా చిత్రకళలో నిష్ణాతులు మీసాల్ ముంబై క్యాంపెయిన్ ల ద్వారా ఇప్పటివరకు మురికివాడల్లో 20 వేల పైగా ఇళ్లకు పెయింటింగ్ తో హంగులు అద్దారు. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ రోజుల్లో తన డే కేర్ సెంటర్ లను పిల్లలకు కోవిడ్ కవచాలుగా మార్చారు. […]
కవిత రమణన్
నేనెంతో ఇష్టపడిన గణిత బోధనారంగంలో నిలదొక్కుకోవడ ఒక అదృష్టం అయితే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ లో సభ్యత్వం లభించటం అద్భుతమైన బోనస్. అకాడెమీ సభ్యురాలిగా వివిధ విభాగాలకు చెందిన వ్యక్తులతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అంటున్నారు కవితా రమణన్ (ICERM) కు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు గత సంవత్సరం అమెరికా రక్షణ శాఖ కవితను న్యూటన్ పురస్కారానికి ఎంపిక చేసింది. గణితానికి తాను ప్రాచుర్యం లభించాలనే […]
గాయత్రీ స్పివక్
సాహితీ రంగంలో అత్యంత ప్రభావంతులైన మేధావుల్లో గాయత్రీ స్పివక్ ఒకరు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పద్మవిభూషణ్ గ్రహీత కూడా .ఇన్‌స్టిట్యూట్ ఫర్ కంపారిటివ్ లిటరేచర్ అండ్ సొసైటీ వ్యవస్థాపకురాలైన గాయత్రి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మైసెల్ఫ్ ఐ మస్ట్ రీమేక్ అనే పుస్తకం రాశారు. మహాశ్వేతాదేవి రచనలు కొన్ని అనువాదం చేశారు.గాయత్రి స్వస్థలం కోల్‌కతా.ఆమె సేవలకు గుర్తింపుగానే లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ స్టడీస్ విభాగంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కి సభ్యురాలిగా ఎంపికయ్యారు.
పద్మశ్రీ శారదా శ్రీనివాసన్
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థలో సభ్యత్వం సంపాదించారు శారద శ్రీనివాసన్.భారతీయ పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత.దక్షిణ భారతదేశం చరిత్రలో మెటల్ అండ్ మెటీరియల్స్ పై పరిశోధన సాగిస్తున్నారు వివిధ శిల్పాలపై ఉన్న వేల ముద్రలతో మెటలర్జీ రంగంలో చేసిన కృషికి 2019 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.80 వ దశకం లో శారద ఐ ఐ టి బాంబే లో ఇంజినీరింగ్ చేశారు లండన్ విశ్వ విద్యాలయం లో […]
మాస్క్ నెక్ లెస్
స్టయిల్ జువెలరీ లాగా కనిపించే మాస్క్ నెక్ పీస్ లు తయారు చేశారు సృజనకారులు. ముత్యాలతో చేసిన గొలుసులు మెటల్ చైన్ లను రెండు వైపుల మాస్కు కు తగిలించి మెడలో వేసుకునే విధంగా డిజైన్ చేశారు. చూసేందుకు అందంగా స్టయిల్ గా కనిపించే ఈ మాస్క్ నెక్ ఫీస్ లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి.
కరోనా శాంతి స్తోంది
కరోనా వ్యాప్తికి ఈ నెల మధ్యలో తగ్గటం మొదలుపెట్టి నెల ఆఖరుకు క్షీణదశ చేరుకుంటుంది అంటున్నారు ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్. శాస్త్రవేత్తలుగా మా దగ్గర సమస్య పరిష్కార మార్గాలు ఉంటాయి.కానీ మీరు మాత్రం కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించండి భయం వద్దు అంత ధైర్యమూ వద్దు.శ్రద్ధగా ఉండండి అంటున్నారు గగన్ దీప్.ఆమె వైరాలజిస్ట్ వైరస్ ల పైన పరిశోధనలు చేస్తూ ఉంటారు.నెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైన్సెస్ విభాగం […]
ఒత్తిడే కారణం
లాక్ డౌన్ లో అందరూ ఇంట్లోనే ఉండటం వర్క్ ఫ్రమ్ హోమ్ లు ఇంట్లో పని ఒత్తిడి పెరిగి చాలా మంది ఆడవాళ్ళలో మతిమరుపు మాట వినిపిస్తోంది. ఇది కొంచెం శ్రద్ధ తీసుకోవలసిన అంశం అంటున్నారు ఎక్సపర్ట్స్. సరిగ్గా నిద్ర లేకపోవటం అంతులేని చాకిరి తో మెదడు పై ఒత్తిడి వల్ల తాత్కాలిక మతిమరపు రావచ్చు అంటున్నారు.అందుకే ముందుగా కొన్ని చిట్కాలు పాటించాలి ప్రతి చిన్న విషయం రాసి పెట్టుకోవాలి. నిద్రపోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.ఇది […]
అతిగా వద్దు
శానిటైజర్ అతిగా వాడితే చేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది చెడు బ్యాక్టీరియా శానిటైజర్ కు అలవాటుపడి వృద్ధి చెందుతుంది. అందుకే సబ్బు నీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్ వాడకండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . సబ్బుతో ఇరవై సెకండ్లు రుద్దితే క్రిముల్ని తరిమికొట్టొచ్చు అంటున్నారు వైద్యులు. అట్లాగే చేతులకు దుమ్ము ఉన్నప్పుడు శానిటైజర్ రాసుకున్నా ఫలితం ఉండదు అది క్రిముల్ని చంపలేదు పైగా అపరి శుభ్రత సృష్టిస్తుంది. నీళ్లు దొరకనప్పుడు రద్దీ ప్రదేశాల్లో ప్రయాణాల్లో మాత్రమే ఉపయోగించాలి.
ది బెంచ్
మేఘన మార్కెల్ రాసిన ది బెంచ్ పుస్తకం వచ్చే నెల విడుదల అవుతోంది.కొడుకు ఆర్టీ, భర్త ప్రిన్స్ హారీ ల మధ్య ఉండే విడదీయరాని బంధం పైన మార్కెల్ రాసిన పుస్తకం ఇది.తండ్రి కొడుకుల ముచ్చట లను నలభై పేజీల పుస్తకంగా తెచ్చరామె అమెరికన్ చిత్రకారుడు క్రిస్టియన్ రాబిన్ సన్ ఆ పుస్తకంలో బొమ్మలు గీశారు. ReplyReply allForward
మారని ఫ్యాషన్
కాటన్ చీరెల పైన వేసే కలంకారీ డిజైన్ లు ఎప్పుడూ ప్రసిద్దే. ఏ కాలంలో నైనా కాటన్ శరీరానికి హాయి నిచ్చేదే. అలాగే కలంకారీ ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించే కళ. మిడ్డీస్ క్రాప్ టాప్స్ షర్ట్ స్టయిల్ లాంగ్ బ్లౌవుజులకు కలంకారి స్టయిల్ ఎంచుకుంటే ఫ్యాషన్. ఈ కలంకారీ ఇండో వెస్ట్రన్ స్టయిల్ కాబట్టి బంగారు ఆభరణాలు లేదా ఫంకీ ఆభరణాలు మ్యాచింగ్ గా వేసుకోవచ్చు. టెర్రీ కోట జర్మన్ సిల్వర్ ఫ్యాబ్రిక్ వంటి హ్యాండ్ […]
వరల్డ్ రికార్డ్
పదేళ్ల సారా ఛిపా వరల్డ్ రికార్డ్ పోటీల్లో పాల్గొని 196 దేశాలు రాజధానులు వారు వాడే కరెన్సీ పేర్లను చెప్పి రికార్డ్ సొంతం చేసుకుంది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ ఎమ్ జి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్ లో పాల్గొన్న సారా అన్ని పేర్లు కరెక్ట్ గా చెప్పి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకుంది రాజస్థాన్ లోని బిల్వారా స్వస్థలం. తల్లిదండ్రులు వృత్తిరీత్యా తొమ్మిదేళ్లుగా యు […]
ఉత్తమ నటి కంగనా
సాహసోపేతమైన పాత్రలకు చిరునామాగా, వెండితెర క్వీన్ గా మెరుపులు మెరిపిస్తుంది కంగనా రనౌత్. జాతీయ అవారెడ్ గెలుచుకుంది. మణికర్ణిక, పంగా చిత్రాల్లోని నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కంగనా. ఫ్యాషన్ చిత్రంలో ఆమె ప్రతిభకు తొలిసారి జాతీయ అవార్డు గెలుచుకుంది కంగనా. పంగా లో మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూ తన కలలను సాకారం చేసుకొనే కబడ్డీ క్రీడాకారిణిగా ఆమె కనిపించిన తీరు నటనలో చూపించిన పరిణితి ప్రేక్షకుల మెప్పు పొందింది. మణికర్ణిక లో ఝాన్సీ […]
షీరోస్ తో కోటి మందికి సాయం
సైరీ చహాల్ షీరోస్ ఫ్లెక్సీ మామ్ వ్యవస్థాపకురాలు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రష్యన్ భాషా శాస్త్రంలో మాస్టర్స్ అంతర్జాతీయ దౌత్స పై సంబంధాల పై ఎంఫిల్ పూర్తి చేసింది సైరీ. 2011లో ఫ్లెక్సీ మామ్ సంస్థ ప్రారంభించింది. పెళ్లి తరువాత లేదా పిల్లలు పుట్టాక ఉద్యోగాలు చెయ్యాలనుకునే మహిళలకు అవకాశం కల్పించే వేదిక అది.మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి హక్కులను కాపాడేందుకు 2014లో షీరోస్ అనే సంస్థ కు ప్రాణం పోసిందామె. ఈ […]
ఆమె సేవకు గుర్తింపు
నాసా లో ఉద్యోగినిగా అడుగుపెట్టిన మొదటి మహిళా ఇంజనీర్ కు మేరీ జాక్సన్.నల్లజాతీయులు రాలిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే తన కెరియర్ లో ఎన్నో విజయాలను సాధించారామె.హ్యాంస్టన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన మేరీ జాక్సన్ నాసాలో నేషనల్ అడ్వైజర్ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్ విభాగంలో ఉద్యోగినిగా తన కెరీర్ మొదలు పెట్టారు.పదవి విరమణ పొందేవరకు అదే విభాగంలో పని చేసిన మేరీ అనేకమంది వ్యోమ గాములును అంతరిక్షంలోకి పంపడం కీలకపాత్ర పోషించారు […]
డ్రై బ్రషింగ్ చాలా అవసరం
చర్మానికి రక్త ప్రసరణ కోసం డ్రై బ్రషింగ్ చాలా అవసరం అంటూరు ఎక్సపర్ట్స్. బాడీ బ్రషింగ్ కోసం ప్రత్యేకంగా డ్రై బ్రష్ లు ఉంటాయి. కుదుళ్లు కాస్త బిరుసుగా, పొడవాటి హ్యాండిల్ ఉన్న బ్రష్ ఎంచుకోవాలి. బ్రషింగ్ పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టి మరి భరిపిడి గా లేదా మరీ సున్నితంగా కాకుండా తగినంత వత్తిడి తో మొదలు పెట్టాలి. పాదాలు, కాళ్లు, చేతులు దగ్గర పొడవాటి స్ట్రోక్స్ తో పొట్ట, ఛాతీ దగ్గర వృత్తాకారంలో […]
కృతికి వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్
వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్ గెలుచుకున్నారు డాక్టర్ కృతిక కారంత్. 75 లక్షల రూపాయల బహుమతి గెలుచుకున్నారు.బెంగళూరు లో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ లో కృతి చీఫ్ కాన్స్ ర్వేషన్ సైంటిస్ట్ .వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి పరిశోధించి వాటి సంరక్షణకు విన్నూత విధానాలు కనిపెట్టే శాస్త్రవేత్త కరోలినా లో డ్యూర్ యూనివర్సిటీలో పర్యావరణంపై పి. హెచ్ డి చేశారు కృతి. ఆమె తాత గారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత. జ్ఞానపీట్ అవార్డ్ […]
గాలి శుద్ధి చేసే మొక్కలు
కరోనా కాలంలో ఇంటి లోపల ఆక్సిజన్ ను శుద్ధి చేసే మొక్కలను పెంచమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎరికా ఫామ్ సాన్సేవిరియా బోస్టన్ ఫెర్న్ రబ్బర్ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి. సాన్సేవిరియా రాత్రివేళల్లో కార్బన్ డయాక్సైడ్ ను తొలగించి ఆక్సిజన్ గా మారుతుంది ఎరికా ఫామ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు హరిస్తుంది. బోస్టన్ ఫెర్న్ ఇంటిలోపల గాలిలో పొగ పర్ఫ్యూమ్ ఇతర సౌందర్య ఉత్పత్తుల నుంచి విడుదల అయ్యే ఫార్మాలిటీ హైడ్ ను గ్రహిస్తుంది. రబ్బరు మొక్క […]
