Wednesday, 30 Sep, 2026

మెహందీ గురు

పెళ్లి కూతుళ్ళకు అందమైన మెహందీ డిజైన్స్ వేయటంలో స్పెషలిస్ట్ వీణా నాగాదా బ్రైడల్,అరబిక్ సినిమాల్లో పెళ్లి సీన్లలో నటీనటులకు ఆమే మెహందీ పెడతారు తోలి సెలబ్రిటీ పూనమ్‌ ధిల్లాన్‌ కత్రినా కైఫ్‌ వరకు మంచి అందమైన డిజైన్ లతో అలంకరించారు వీణా కరిష్మా కపూర్, దీపికా పదుకొనే ,టీనా అంబానీ,నీతా అంబానీ వంటి ఎందరో సెలబ్రెటీలకు ఆమె మెహందీ వేశారు. మంబై లో ఉంటున్న వీణా ఇక్కడే ఒక ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తూ మెహందీ కోర్స్ నేర్పిస్తున్నారు. […]

ఫిష్ తో ఫినిష్

చేపలు తరచూ తింటూ ఉంటే మైగ్రేయిన్ తలనొప్పి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. మొక్కజొన్న, సోయా ఇతరత్రా నట్స్  ఎక్కువ గా తీసుకున్నప్పుడు వాటిలో ఉండే లినోలిక్ ఆమ్లం తో మరింత పెరిగే అవకాశం ఉందని ఇటీవల తాజాగా పరిశోధనలు చెబుతున్నాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేప, పీతలు వంటి సీ ఫుడ్ తో నాడుల్లో ఎలాంటి ఇన్ ఫ్లమేషన్ కనబడలేదని గుర్తించారు. చేపలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మైగ్రేయిన్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

మొహం మెరిపించే ప్యాక్

హటాత్తుగా ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాల్సివస్తే,అలసటగా ఉన్న మొహం మెరిసిపోవాలంటే పెరుగు,తేనె సమంగా కలుపుకొని మొహానికి మెడకు రాసుకొని,ఒక పావు గంట ఆగి కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. అలాగే రెండు స్ట్రా బెర్రీలు మెత్తగా చేసి రెండు టీ స్పూన్ల తేనె కలిపి అప్లయ్ చేసి పది నిముషాలు ఆగి కడిగేసినా మొహం మెరుపు లీను తుంది వంట సోడా,కొబ్బరి నూనె కలిపి మొహానికి రాసి,స్క్రబ్ చేస్తే కూడా చర్మం తేటగా కనిపిస్తుంది టీ స్పూన్ పాల […]

రెడ్ క్రాస్ కు తోలి అధ్యక్షురాలు

రెడ్ క్రాస్ సంస్థ కు అంతర్జాతీయ అధ్యక్షురాలిగా దౌత్యవేత్త మిర్జానా స్పొల్జారిక్‌ ఎగ్గర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 160 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న సంస్థ రెడ్ క్రాస్ 100 కు పైగా దేశాల్లో విస్తరించి ఉంది. 20,000 మంది శాశ్వత వాలంటీర్స్ ఉన్నారు. ఈ సంస్థ అధ్యక్ష పదవిలోకి ఒక మహిళ రావటం ఇదే ప్రథమం మిర్జానా ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (USDP) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అసిస్టెంట్  అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తుంది.

ఫోర్బ్స్ లిస్ట్ లో  అపర్ణ పూరోహిత్

అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ ఇండియన్ ఒరిజినల్స్ హెడ్ గా పని చేస్తోంది ( Aparna Purohit ) అపర్ణా పూరోహిత్ ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ, బ్రీత్, కామిక్‌స్థాన్, ఇన్‌సైడ్‌ ఎడ్జ్,మీర్జాపూర్‌ అండ్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌’…వంటి ఇండియన్‌ కంటెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ సిరీస్ నిర్మాణం లో చోటు సంపాదించారు అపర్ణ పురోహిత్ స్వస్థలం ఢిల్లీ.  సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, యూటీవీ మోషన్‌ పిక్చర్స్ నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేశారు.

లక్ష్యం గురి తప్పదు

రిచా కార్ జీవమే కంపెనీ డైరెక్టర్. ఈ బ్రాండ్ లో దుస్తులంటే అమ్మాయిలకు క్రేజ్ . 2011 లో రిచా ఆమె భర్త కపిల్ కారేకర్ లు జీవామే 5000 స్టయిల్స్ 50 బ్రాండ్స్ 100 రకాల లో దుస్తుల సైజులతో అన్ని వయసుల స్త్రీలను ఆకర్షిస్తోంది. ఆమె ఆన్ లైన్ స్టోర్ ను నెలకు ఐదు మిలియన్ల మంది విజిటర్స్ చూస్తారు. దేన్నయినా సాదించాలి అన్న ఆశయం వుంటే ఆ పని ఇష్టంగా చేస్తే అనుకున్నది […]

సాహసానికి పురస్కారం

ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఐ.ఎం.ఎఫ్ (IMF)కి తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు డాక్టర్ హర్షవంతి బిష్త్.1958లో ఏర్పాటైన పర్వతారోహణ కు చెందిన అత్యున్నత సంస్థ ఐ.ఎం.ఎఫ్ కు అర్జున్ పురస్కారం పొందిన హర్షవంతి బిష్త్.1981లో  నందాదేవి పర్వత శిఖరాన్ని,1984 లో ఎవరెస్ట్‌ శిఖరాన్నిఅధిరోహించి ఎన్నో సహస యాత్రల్లో భాగస్వామిగా ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలోని సుకాయ్ ఆమె సొంత ఊరు నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో పర్వతారోహణలో కోర్స్ పూర్తిచేశారు హర్షవంతి బిష్త్.

తెలంగాణ క్వీన్

మిస్ ఇండియా టైటిల్ గెలవటం లక్ష్యం గూగుల్, యూట్యూబ్ ల్లో చూసి అందాల పోటీ లకు కావలసిన అర్హతలను సొంతంగా సాధించుకున్న. ఆత్మవిశ్వాసంతో కిరీటం సాధించుకున్న అంటుంది దీప్తి శ్రీరంగం ఎలాంటి శిక్షణ లేకుండా మిస్ సౌత్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా మార్కాపురం లో పుట్టి దీప్తి హైదరాబాద్ టెక్ మహీంద్రా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. మోడల్, గాయిని, రేడియో జాకీ, […]

ఇల్లంతా ఫ్రెష్

ఈ చలి రోజుల్లో ఎండ తక్కువై ఇంట్లో దుర్వాసన లు వస్తాయి. చిన్న చిట్కాలతో వీటిని తరిమేయవచ్చు. ఐస్ ట్రే లో నిమ్మ చెక్కలు వేసి, వెనిగర్ తో నింపి ఫ్రీజర్ లో గడ్డి కట్టించాలి .ఐస్ ముక్కలు చెత్త డబ్బాలో వేస్తే దుర్వాసన రాదు. అలాగే వెనిగర్ వేసిన వేడి నీళ్లలో టవల్స్ కాసేపు నానబెట్టి ఉతికితే ఫ్రెష్ గా ఉంటాయి. వాష్ రూమ్ లో గోడలకు ఫంగస్ పడితే కప్పు వెనిగర్ తో కొన్ని […]

నల్లని వలయాలు

కళ్ళ కింద నల్లని వలయాలు చిన్న జాగ్రత్తలతో పోతాయి. కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో కళ్ళకింద నెమ్మదిగా మునివేళ్ళతో మసాజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి తురుము లో కొద్దిగా నిమ్మరసం కీర దోస గుజ్జు తీసుకుని టీ స్పూన్ క్రీమూ  కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి మాస్క్ లాగా వలయాల పై అప్లయ్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత పాలతో కడిగేయాలి. అలాగే టమాటో […]

వందేళ్ల నాటి పోస్టర్

ఇప్పుడు మనం కరోనా గురించి భయపడుతూ ఉన్నాము కానీ 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది మరణించి ఉంటారని ఒక అంచనా. ఈ ఫ్లూ స్పెయిన్ కి సంబంధం లేకపోయినా ఈ మహమ్మారి గురించిన వార్తలు స్పెయిన్ మీడియా ఎక్కువ ప్రచురించడంతో ఇది స్పెయిన్ ఫ్లూ గా పేరు తెచ్చుకుంది. అప్పటి పోస్టర్ ఇది మాస్క్ తొడుక్కో చేతులు కడుక్కో దూరం పాటించు ముఖాన్ని ముట్టుకుంటే తదుపరి నాదే మరణం […]

మూడే నిముషాలు చాలు

గంటల కొద్దీ డెస్క్ ల ముందు కూర్చుని పనిచేస్తే శారీరక జీవ క్రియలు ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రతి 30 నిమిషాలకు మూడు నిమిషాల చొప్పున అటూ ఇటూ తిరిగినా ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న చిన్న బ్రేక్స్ లో మెట్లు ఎక్కి దిగడం అటూ ఇటూ నడవడం,స్క్వాట్స్ వంటివి ఏమైనా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు అప్పుడప్పుడు మూడు నిమిషాలు బ్రేక్ తీసుకున్న పెద్ద గా […]

మార్బుల్ ఆర్ట్

మధ్యప్రదేశ్ కళలు, క్రాఫ్ట్ లు ఆ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు ఇది తరతరాల వారసత్వ సంపద జబల్ పూర్ లోని జెడా  ఘాట్ లో దౌన్ డర్ జలపాతాలు అక్కడ కనిపించే పాలరాతి చెక్కడాలు సందర్శకుల కళ్ళను కట్టిపడేస్తాయి.నర్మదా తీర ప్రాంతంలో దొరికే వాటితో అందమైన శిల్పాలు తయారు చేస్తారు శిల్పాలు. ఈ పాలరాతి శిల్పాలు ఘాట్ ల వెంట దుకాణాలు వీధుల్లో కనిపిస్తాయి తెల్లని పాలరాతితో చెక్కిన మహా శివుని లింగ రూపం చాలా […]

ప్రాణహాని తప్పదు

ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోతే, వాటి తయారీలో వాడే థాలేట్స్ మరణానికి చేరువ చేస్తుంది అంటున్నారు న్యూ యార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్ న్యూన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు. కర్టెన్లు, షూలు, పైపులు పర్ఫ్యూమ్స్, సబ్బులు, షాంపూలు వంటి అనేక వస్తువుల ఉత్పత్తిలో వీటి వాడకం పెరిగి పోయిన కారణంగా ఒక్క అమెరికాలోనే లక్షకుపైగా ముందస్తు మరణాలు చోటు చేసుకుంటున్నాయట. ఈ ప్లాస్టిక్ హార్మోన్ల వ్యవస్థ ను దారుణంగా దెబ్బ తీస్తోంది అంటున్నారు. థాలేట్స్ […]

ఆదాయాన్నిచ్చే ఆర్ట్

ఏ వేడుక కైనా చిన్నపాటి అలంకరణ తోనే అసలైన కళ కనిపిస్తుంది. బర్తడే పెళ్లి రోజులకు,ట్విసైడ్ ఆర్ట్ తో సరికొత్త థీమ్ లను సృష్టించటం ఇప్పుడు కొత్త ట్రెండ్ వస్తువులు,పక్షులు,పువ్వులు జంతువులు బిల్డింగ్ లు కార్లు ఇలా ఎన్నో వస్తువులను ఈ ట్విసైడ్ ఆర్ట్ లో తీసుకొన్నారు. ఇది 1930 ల నాటి ఆర్ట్. బెలూన్ల తో రకరకాల ఆకారాలు చేయటం . కాలక్రమేగా మారిపోయే ఇదో ఆర్ట్ గా తయారైంది. దీనిలో శిక్షణ ఇచ్చేందుకు పాశ్చాత్య […]

స్కార్ఫ్ ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్

చలి ఎండ లతోపాటు కాలుష్యం నుంచి కూడా కాపాడే అవసరమైన యాక్సెసరీ అయిపోయింది. కుర్తీలు లాంగ్ ఫ్రాక్ లకు జతగా రకరకాల  స్కార్ఫ్ ఫ్యాషన్ కు సింబల్ గా ఉన్నాయి. లెనిన్, సిల్క్, కాటన్, ఊలు ఇలా రకరకాల ఫ్యాబ్రిక్ లు వాటి తో చేసే వేలకొద్ది డిజైన్ లు వస్తున్నాయి. అన్ని రకాల డ్రెస్ లకు మ్యాచింగ్ స్కార్ఫ్ లు ఉంటున్నాయి. స్కార్ఫ్ కేవలం ఫ్యాషన్ యాక్సెసరీ కాదు వాతావరణ మార్పుల నుంచి శరీరాన్ని కాపాడే […]

ప్రభావం చూపించే చంద్ర భ్రమణం

చంద్ర బ్రమణం వల్ల మనిషి నిద్ర వేళలు మాత్రం ప్రభావితం అవుతాయంటున్నారు స్పెయిన్ యూనివర్సిటీ న్యూరోసైన్స్ నిపుణులు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ నెలలో సగం రోజులు వృద్ధి చెందుతూ మిగతా సగం రోజులు తగ్గు తుంటాడు . చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు పౌర్ణమి అయితే కనిపించని గీతా లా ఉంటే అమావాస్య అని తెలిసిందే. ఇవి మనిషి నిద్రపై ప్రభావం చూపెడతాయి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎక్కువ గానూ పౌర్ణమి నుంచి అమావాస్య […]

ఈ సేవ అపూర్వం

ఎవరికైనా డబ్బు దానం చేయటం తేలిక కానీ శారీరక శ్రమ దానం దానంత తేలిక కాదు. మనం మనిషికీ మనిషికీ మధ్య తేడాలు చూస్తారు. కానీ దేవుని దృష్టిలో మనమంతా సమానం అంటారు రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్  చైర్ పర్సన్ సుధా మూర్తి. ఆమె సంపద విలువ 2480 కోట్లు. సంవత్సరంలో మూడు రోజులు బెంగళూరు లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో సేవ చేస్తారామె. వంటగదిలో సహాయం. కూరగాయలు కోయడం. ఆవరణ ఊడ్చటం చెత్త బుట్టలు […]

కపాలీశ్వర గోపురం

చెన్నై లోని మైలాపూర్ లో ఉంది కపాలీశ్వర గుడి చాలా అందమైంది పార్వతీదేవి ఇక్కడ కార్పగాంబాల్ గా పూజలందుకుంటోంది. ఆదిశక్తి నెమలి రూపంలో శివుణ్ణి ఆరాధించిన ప్రదేశంగా చెపుతారు. కార్పగాంబాల్ పేరుతోనే కోర్కెలు తీర్చే కల్ప వృక్షం అన్న అర్థం ఉంది. ఈ దేవాలయానికి తూర్పు పడమర దిశలో ఒక రెండు గోపురాలున్నాయి తూర్పు గోపురం ఎత్తు 40 మీటర్లు పశ్చిమ గోపురం కాస్త తక్కువ ఎత్తు ఈ గోపురం పైన ఉండే శిల్పకళా ఒక అద్భుతం […]

సరికొత్త పెళ్లి బహుమతి

పెళ్ళంటేనే ఎన్నో మధుర స్మృతులు ఎన్నాళ్లయినా అవన్నీ గుర్తుండేలా ఫోటోల్లో బంధిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఆ వేడుకలను అప్పటికప్పుడు, అక్కడే చిత్రించి ఇచ్చే ఆర్టిస్ట్ లు పెళ్లిళ్లకు హాజరు అవుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ పేరు లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్ మెహందీ, సంగీత్, పెళ్లి,రిసెప్షన్ ఈవెంట్ ఏదైనా ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టే లాగా పెయింటింగ్ రూపంలో వేయించుకుంటున్నారు చేయితిరిగిన కళాకారుల్ని తమతోపాటు తీసుకొచ్చిన పెళ్లి వారి బంధువులు ఆ వేడుక ను పెయింటింగ్ లా […]