Wednesday, 30 Sep, 2026

భావినా పటేల్

12 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన భావినా హస్ముఖ్ భాయ్ పటేల్ గుజరాత్‌లోని సుంధియా అనే చిన్న గ్రామం లో జన్మించింది. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినా పటేల్‌. 2020 టోక్యోలో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది.జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక పతకాలు సాధించి వార్తల్లో నిలిచింది. ప్రపంచ క్రీడలలో భారతదేశపు ఖ్యాతిని చాటిన భావినా గొప్ప రోల్ మోడల్.

ఏక్తాభ్యాన్‌

నేనెప్పుడూ క్రీడల గురించి ఆలోచించలేదు మేధావులతో మాట్లాడేందుకు ఇష్టపడేదాన్ని నా అనారోగ్యం నన్ను రోజు వారీ పనులు కూడా చేసుకోనివ్వటంలేదు. ఫిట్ నెస్ కోసం క్రీడలు ఎంచుకొన్న. అవి నా జీవితంలో భాగం అయ్యాయి అంటుంది ఏక్తా భ్యాన్‌ (Ektha Bhyan ) కారు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చక్రాల కుర్చీకే పరిమితమైన ఏక్తాభ్యాన్‌ క్లబ్‌ త్రో అథ్లెట్‌గా టోక్యో 2020 పారాలింపిక్స్‌ లో పాల్గొన్నది. 2016,2017,2018 లో నేషనల్ పారా అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ […]

అవని లేఖర్

2021 పారాలింపిక్‌లో భారత స్వర్ణ పథకాన్ని సాధించిన విజేతగా నిలిచింది అవని లేఖర్.ఈ యేడాది ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డును కూడా ఆమెనే వరించింది. మహిళల పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో 149.6 స్కోర్‌తో స్వర్ణం సాధించిన అవని పారాలింపిక్‌ రికార్డ్‌ను తిరగరాసింది. రాజస్థాన్‌లో లా చదువుతోంది అవని .పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదంలో నడుము కింద భాగం పక్షవాతానికి గురయ్యింది అవని ని ఆమె తండ్రి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు .

పరిమితి దాటద్దు

కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితం అవుతుంది. కానీ మోతాదు మించితే పలు సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. తాజాగా వచ్చిన ఆప్తమాలజీ పరిశోధన లో కెఫిన్ అధికంగా తీసుకునే వాళ్ళలో గ్లూకోమా సమస్య వస్తుంది అంటున్నారు. దీని వల్ల కంటి చూపు త్వరగా పోగొట్టుకోవాల్సి వస్తుంది రోజుకు 3 కప్పుల కంటె కాఫీ టీ లేదా ఎనర్జీ ఫ్రెండ్స్ తాగే వాళ్ళు గ్లూకోమా బారినపడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని కెఫిన్ వల్ల కంటిలోని నరాల్లో […]

శీతాకాలపు ఆహారం

పోషకాహారం అందించడం ద్వారా పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఈ చలి రోజుల్లో ఇన్ ఫెక్షన్లు, అలర్జీల రిస్క్ లేకుండా ఉండాలంటే మంచి ఆహారమే ముఖ్యం ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే కోడిగుడ్డు ప్రతిరోజు ఇవ్వాలి. పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటివి వారంలో ఒక రోజు కచ్చితంగా ఇవ్వాలి. ఆరెంజ్, ఆపిల్ వంటి పండ్లు తినిపించాలి. నట్స్, డ్రైఫ్రూట్స్ ,స్నాక్స్ ఇవ్వాలి.  ఈ సీజన్ లో సజ్జలతో చేసిన రొట్టెలు ఇవ్వటం ద్వారా తగినంత ఫైబర్ దొరుకుతుంది. […]

అనన్య బన్సాల్‌

బహ్రెయిన్‌లోని మనామాలో ఆసియా యూత్‌ పారాలింపిక్‌ గేమ్స్‌లో ఎఫ్‌–20 విభాగం షాట్‌పుట్‌లో భారత్‌ నుంచి తొలి రజత పతకాన్ని సాధించింది అనన్య.మేధోపరమైన లోపం ఉన్న అథ్లెట్‌ అనన్య బన్సాల్‌.పారాలింపిక్‌లో 30 దేశాల నుంచి 23 ఏళ్ల వయసు లోపు వారు పాల్గొన్నారు.వీరిందరితో పోటీపడి రాజితం సాధించిన అనన్య పారాలింపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ దీపామాలిక  ప్రశంసించారు. భారతదేశ ఖ్యాతిని నిలుపుతూ తొలి రాజితం సాధించింది అనన్య.విజయాన్ని జరుపుకోనేందుకు ఇది సరైన రోజు అన్నారు దీపా మాలిక్.

అది జీవన విధానం

ఆయుర్వేదం ఒక చికిత్స పద్ధతి కాదు. ఒక జీవన విధానం దాని ద్వారా మన పూర్వికులు ఆరోగ్యంగా జీవించారు ఆయుర్వేద మూలికలు ఆహారం వండుకునే పద్ధతిలోనే ఆరోగ్యం ఉంది అంటున్నారు గీత రమేష్. కేరళలోని పాలక్కాడ్ లో స్థాపించిన కై రాలీ సెంటర్ ఉద్దేశం ఆయుర్వేద ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావటం అంటారు గీత. ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేసిన వంటకాలు, మసాజ్ లు ఇక్కడ ప్రధాన వైద్య విధానం. అన్ని ఆరోగ్య సమస్యలకు […]

సూపర్ స్టయిల్

జీన్స్, షార్ట్, స్కర్ట్, లాంగ్ స్కర్ట్ వేటి తో నైనా షర్టు కలిపి వేసుకుంటేనే ట్రెండీ లుక్ కనిపిస్తుంది. వదులుగా ఉండే ఓవర్ సైజ్ షర్ట్ లు  ధరించటం ఒక ఫ్యాషన్. వదులుగా ఉండే షర్ట్ తో పాటు పెన్సిల్ డ్రెస్ వేసుకోవాలంటున్నారు ఫ్యాషన్ ఎక్సపర్ట్స్. ఈ షర్ట్ లు క్రాప్స్ లో జీన్స్ తో కూడా బావుంటాయి. అలాగే ఓవర్ సైజ్ షర్ట్, రిప్పేడ్ డెనిమ్స్ కి సరైన జోడీ. షర్ట్ తో పాటు యాక్సెసరీలు […]

వాళ్లకే మరింత అవసరం

అకాడమీ ఆఫ్ ఐకిడో ఇండియా ద్వారా కలకత్తాలోని మురికివాడల్లో పిల్లలకు యుద్ధ కళల్లో తర్ఫీదు ఇస్తోంది సంయుక్తా రాయ్. అట్టడుగు వర్గాల వారికి మార్షల్ ఆర్ట్స్ అవసరం ఎక్కువ. అందుకే నా విద్యను వారి దగ్గరకు తీసుకు వెళ్తున్నాను అంటారు సంయుక్త. ఆమె పుట్టింది పెరిగింది ఢిల్లీలో హస్త కళల పై ఉన్న మక్కువతో టెక్స్ టైల్స్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. 19 సంవత్సరాలు గా టెక్స్ టైల్స్ డిజైనింగ్ వ్యాపారం లో ఉన్నాను. యుద్ధ […]

వాళ్ల వస్తువులే ప్రత్యామ్నయం

ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ సమస్య పరిష్కారం లో గిరిజన సమాజాలు ప్రత్యామ్నాయాన్ని చూపించగలదు అంటారు అర్చన సోరంగ్  ఆమె ఏర్పాటు చేసిన ‘ఆదివాసీ దృశ్యం’ అనే సంస్థ ద్వారా అడవుల్లో నివసించే గిరిజన సమూహాలను సంఘాలుగా ఏర్పరిచి వారు తయారుచేసే ఆకుల ప్లేట్ల దగ్గర నుంచి దంతాలు శుభ్రం చేసుకునే పుల్లల వరకు బయోడిగ్రేడబుల్ అవన్నీ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం అని ప్రచారం చేస్తున్నారు  అర్చన. ఒడిశా లోని టి.ఐ.ఎస్.ఎస్ అటవీ హక్కుల ‘ఆదివాసీ దృశ్యం’ అనే […]

ఈ సీజన్ లో పల్లీలు బెస్ట్

శీతాకాలం స్నాక్స్ గా పల్లీలు తినమంటున్నారు శాస్త్రవేత్తలు. వాల్ నట్స్ వంటికి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయని వింటూ ఉంటాం కానీ వాటి కంటే పల్లి లే గుండె కు ఎక్కువ మేలు చేస్తాయి. పల్లీల్లో కొవ్వు కేలరీలు ఎక్కువే కానీ ఇది తింటే స్థూలకాయం రాదు. పల్లీ లలో  ఐసోఫ్లోవాన్స్  రిజర్వ్ ట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వీటితోపాటు కాపర్, నియాసిన్, ఫోలేట్, మ్యాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా ఉంటాయి. తాజాగా జరిగిన అధ్యయనాల్లో […]

గౌను సందేశం

పర్యావరణ పరిరక్షణలో రీ సైక్లింగ్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ మహిళ దుస్తులు డిజైనర్ హెర్పెన్ వృధా ప్లాస్టిక్ సీసాలతో ఒక గౌను రూపొందించింది. బ్రిటిష్ ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో టెన్నిస్ క్రీడా దిగ్గజం  మరియా షరపోవా రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. 70 శాతం ప్లాస్టిక్ సీసాలు, 20 శాతం సిల్క్ ఫ్యాబ్రిక్ ను ఉపయోగించి వృధా సీసాలను పూరేకులు గా చేసి వాటిని గౌన్ కుట్టి దాన్ని త్రీడీ ప్రింట్ గా మార్చారు. ఈ గౌనుకు ‘మిమిసిస్‌’ అని […]

పగడాలే నయా ట్రెండ్

బంగారు హారాలు లో పగడాలు కూర్చిన నగలు ఇవ్వాల్టి ట్రెండ్. నవరత్నాల్లో ఒకటైన పగడాన్ని బంగారు గుళ్ళతో కలిపి హారంగా వేసుకుంటారు. కానీ ఎర్రని పగడాలను గుత్తులుగా మలచి బంగారు నగల్లోకి తెచ్చేశారు ఫ్యాషన్ ఎక్సపర్ట్స్. హారాలు, నెక్లెస్ లు, గాజులు చెవి దిద్దులోకి పగడాలు వచ్చి ఒక కొత్త లుక్ తీసుకొచ్చాయి. టెంపుల్ జ్యువెలరీ దగ్గరనుంచి సన్నటి గొలుసు ల వరకు అన్నింటిలోనూ పగడాల ఆభరణాలు స్పెషల్ గా కనిపిస్తున్నాయి. పగడాల గుత్తి పూల హారం […]

ప్రీ ప్లీటెడ్ శారీ ఫోల్టింగ్ బాక్స్

ఈ తరం అమ్మాయిలకు మోడ్రన్ డ్రెస్ లు అలవాటై ఎప్పుడైనా చక్కని చీరె కట్టుకోవాలంటే కంగారు పడిపోతారు. వేడుకల్లో అయితే మేకప్ ఆర్టిస్ట్ లతో పాటు శారీ డ్రేపర్లు వచ్చి చక్కగా అందంగా చీరె కట్టేస్తారు మరి ఏ సాయంకాలమో సరదాగా చీరె కట్టుకోవాలంటే ఎలా అన్న ప్రశ్నకు సమాధానం గా వచ్చింది.  ప్లీటెడ్ సారీ ఫోల్టింగ్ బాక్స్.ఈ బాక్స్ గనుక ఉంటే చీరె కట్టుకోవటం కాస్త నచ్చింది వచ్చినా చాలు హాయిగా అందంగా ఉండేలా చీరకట్టుకోవచ్చు […]

గోడలకు తీగల అందం

ఇంటి అందాన్ని పెంచేందుకు తీగ మొక్కలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. గోడా ,మెట్లు ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా పరచుకునే ఈ తీగ మొక్కల వల్ల పూల కర్టెన్ లా వేసినంత అందం వస్తుంది.బోగన్ విలిమా,డెవిల్స్ ఐవీ, కర్టెన్ క్రీపర్ ఆల్మండ్ వంటి తీగ మొక్కల్ని పెంచడం కూడా సులువే మనీ ప్లాంట్ గా పిలిచే హృదయాకారంలో ఉండే ఆకులు పసుపు తెల్ల ఈనెలతో చూసేందుకు అందంగా ఉంటుంది. రోజు మార్చి రోజు నీరుపోసిన […]

విశ్వ సుందరి హర్నాజ్ సంధు

మీరు మీకే ప్రత్యేకం అని నమ్మండి ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి మీ గురించి మీరే మాట్లాడండి, మీ జీవితానికి మీరే లీడర్. నన్ను నేను నమ్మాను అందుకే ఈరోజు ఈ వేదిక మీద నిల్చో గలిగాను అంటుంది విశ్వసుందరి హర్నాజ్ సంధు.ఇజ్రాయిల్‌లోని ఇలాట్  నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 21 సంవత్సరాల తర్వాత సుస్మితాసేన్,లారాదత్తా తర్వాత మిస్ యూనివర్స్ గా నిలిచిన మూడో భారతీయ యువతి 17 ఏళ్లకే […]

మంచి టోనర్

రోజ్ వాటర్ తో చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. పొడి చర్మానికి రోజ్ వాటర్ మంచి టోనర్ దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై గీతలు, ముడతలు తగ్గించి వృద్ధాప్య ఛాయ‌లు త్వరగా రానివ్వవు. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు మొటిమలు, మచ్చలు తగ్గిస్తాయి. గులాబీ నీటిని సహజ మేకప్ రిమూవర్ గా వాడుకోవచ్చు. రసాయనాలు తొలగించడమే కాదు చర్మానికి కావాల్సిన తేమను ఇస్తుంది. పి. హెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గ్లిజరిన్ రోజ్ వాటర్ సమాన పరిమాణాల్లో […]

అతి పెద్ద రాజ గోపురం

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో ఉంది శ్రీ రంగనాథ స్వామి ఆలయం తొండ మాన రాజు ప్రారంభించిన ఈ దేవాలయాన్ని చోళులు పూర్తిచేశారు. 156 ఎకరాల్లో 4,116 కిలోమీటర్ల చుట్టుకొలత తో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం ఈ ఆలయం. 11 అంతస్తులతో, 237 అడుగుల ఎత్తులో ఇక్కడి రాజ గోపురం ఆసియాలోనే పెద్దది. ఆలయ ప్రాంగణం లో 81 దేవతామూర్తుల గదులను విశ్రాంతి గదులను వాణిజ్య సముదాయాలు కలిగిన దేవాలయం. టెంపుల్ టౌన్ […]

నెలసరి నొప్పులు

నెలసరి లో శరీరం బరువుగా ఉండటం పొత్తికడుపులో నొప్పి వంటివి బాధపడుతూ ఉంటే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండమంటున్నారు ఎక్సపర్ట్స్.శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు మాంసాహారం, పాల ఉత్పత్తుల ద్వారా అందే ఈ కొవ్వులు ఈస్ట్రోజన్ హార్మోన్ పై నేరుగా ప్రభావం చూపెడతాయి. వీటిలో ఉండే ఒక రకమైన ఆమ్లం గర్భాశయ, సంకోచ వ్యాకోచాలను ప్రేరేపించే  ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల స్తనాల్లో సలపరం శరీరం బరువు వంటి సమస్యలు వస్తాయి. శీతలపానీయాలు […]

నిద్రకు అలారం

ఉదయం వేళ నిద్ర లేచేందుకు అలారం ఎంత అవసరమో నిద్రకు ఉపక్రమించేందుకు కూడా అలాగే అలారం అవసరం అంటున్నారు నిపుణులు. నిద్రించాలి అనుకొన్న సమయానికి గంట అరగంట ముందుగా అలారం సెట్ చేసుకోవాలి లేదా మొబైల్ నోటిఫికేషన్ పెట్టుకోవాలి. ఈ వ్యవధిలో గాడ్జెట్ల కాలక్షేపము ముగించాలి. నిద్రపోయే ముందర స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పగలు వ్యాయామం చేసే అలవాటు చేసుకుంటేనే రాత్రి వేళ నిద్ర వస్తుంది. ఎడతెగని ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ […]