Wednesday, 30 Sep, 2026
ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు ఇంగ్లిష్ తెలుగు తో పాటు ఎన్నో భాషల్లోకి అనువాదం చేశారు. ఎన్నో అవార్డులు ఆమెను కోరి వరించాయి.

ఈ సేవ అపూర్వం

ఎవరికైనా డబ్బు దానం చేయటం తేలిక కానీ శారీరక శ్రమ దానం దానంత తేలిక కాదు. మనం మనిషికీ మనిషికీ మధ్య తేడాలు చూస్తారు. కానీ దేవుని దృష్టిలో మనమంతా సమానం అంటారు రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్  చైర్ పర్సన్ సుధా మూర్తి. ఆమె సంపద విలువ 2480 కోట్లు. సంవత్సరంలో మూడు రోజులు బెంగళూరు లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో సేవ చేస్తారామె. వంటగదిలో సహాయం. కూరగాయలు కోయడం. ఆవరణ ఊడ్చటం చెత్త బుట్టలు ఖాళీ చేయటం వంటి పనులు చేస్తారు. ఫోటోలో కనిపించే కూరలమ్మే దృశ్యం కూడా సుధామూర్తి చేసే సేవలో భాగమే.

Leave a Reply