Wednesday, 30 Sep, 2026

యంగ్ సి.ఈ.ఓ అవానీసింగ్

స్పైస్‌జెట్‌ అధినేత అజయ్‌ సింగ్‌ కుమార్తె అవనీసింగ్‌. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ పాలసీలో ఎమ్‌ఎస్‌ పూర్తిచేసి గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ‘మెకిన్సీ’లో అనలిస్ట్‌గా చేరింది.  కరోనా కాలంలో కేసులు పెరగటం చూసి కోవిడ్-19 టెస్టింగ్‌ రంగంలోకి దిగింది అవని.  తండ్రి అజయ్‌సింగ్‌తో కలిసి 2020 నవంబర్‌లో ‘స్పైస్‌హెల్త్‌’ అనే ఇండిపెండెంట్‌ కంపెనీని స్టార్ట్ చేసింది. ల్యాబొరేటరీల ద్వారా ఆర్టీ–పీసీఆర్‌ టెస్ట్‌ను కేవలం 499 రూపాయలకే  అందించి సంచలనం సృష్టించింది. తర్వాతం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ టెస్టులవైపు మొగ్గుచూపింది.దేశవ్యాప్తంగా […]

క్యాన్సర్ బాధితులకు కొండంత అండ

క్యాన్సర్ బాధితుల కోసం ఎన్నో ఇండో బయోటిక్ పై జెనిక ను ప్రారంభించారు డాక్టర్ నుస్రత్ సంఘమిత్ర ఒడిశా లోని బాలేశ్వర జిల్లా సోరో లోని  కజిమొహల్లా లో పుట్టారు. కెమిస్ట్రీ లో పిజీ, ఐఐఎస్ సీ నుంచి పి హెచ్ డి చేశారు. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గేలా సాంకేతికతపై దృష్టి సాధించి. బయో మాలిక్యులర్ నానో యంత్రాలు తయారుచేసింది. ఇవి క్యాన్సర్ ఔషధాలను ప్రభావిత కణాలను అత్యంత ఖచ్చితంగా చేరవేస్తాయి. ఇందుకుగాను మాలిక్యులర్ […]

నీటి ఎటిఎంలు

హైడ్రోటెక్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేసింది రీతూపర్ణ. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన రితుపర్ణ అపరిశుభ్రమైన తాగునీటి సమస్యకు పరిష్కారంగా ఐ ఓ టీ టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫై కేషన్ సిస్టమ్ రూపొందించింది. వీటికి ఏరోసియా వాటర్ ఎటిఎం అని పేరు పెట్టారు. లీటర్ నీరు ఒక రూపాయికే అందిస్తున్నారు. విద్యుత్ సదుపాయం లేని చోట సోలార్ తో అనుసంధానించారు. ప్రభుత్వ సాయంతో ఉత్తరాఖాండ్ కోల్ కత్తా అగర్తల లో 250 కి పైగా […]

అపురూప చిత్రకారిణి

1907-1954 మధ్య జీవించిన చిత్రకారిణి ఫ్రిడా కాయ్లో. ఆమె పేరుతో ఫ్రిడా అనే సినిమా వచ్చింది. 1925 లో 18 ఏళ్ళ ఫ్రిడా ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. శరీరం మొత్తం గాయాలే. గాయాల నుంచి కోలుకున్న జీవితాంతం విపరీతమైన నొప్పులతో బాధ పడింది ఫ్రిడా. ప్రమాదం తరువాత ఆమెకు 35 ఆపరేషన్లు చేశారు. తక్కువ కాలమే జీవించిన ఫ్రిడా గొప్ప చిత్రకారిణిగా పేరు తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సెల్ఫ్ పోర్ట్రెయిట్ పెయింటర్ ఆమె నేనెప్పుడూ ఊహల్ని […]

చిన్నారుల భోజనం

సంవత్సరం దాటిన పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేందుకు కొన్ని రకాల ఆహారాలు ఇవ్వమంటున్నారు నిపుణులు. పదినెలలు దాటినా పిల్లలకు  అన్నంతో పాటు ఉడికించిన కూరలు కలిపి తినిపించాలి. ఆకు కూరలతో పాటు,బ్రొకోలి,కాలిఫ్లవర్,క్యాబేజి వంటివి మెత్తగా ఉడికించి అన్నంతో కలిపి పెట్టాలి. కంది పెసరపప్పు అన్నంతో కలిపి ఉడికించాలి. స్పూన్ నెయ్యి కలిపి తినిపిస్తే పోషకాలు అందుతాయి. యాపిల్ మెత్తగా ఉడికించి తినిపించవచ్చు. సీజనల్ పండ్ల రసాలను రెండు మూడు స్పూన్ లు ఇవ్వాలి. వాటిలోని పీచు జీర్ణ శక్తిని […]

ఇది చక్కని క్లెన్సర్

చర్మం చలికి పొడిబారుతుంది. రసాయనాలు నిండిన మాయిశ్చరైజర్, కోల్డ్ క్రీమ్ లు కాకుండా సహజ పదార్థాలు వాడితే మంచిది. పాలు చక్కని క్లెన్సర్ లాగా పనిచేస్తాయి. నిర్జీవంగా ఉన్న చర్మాన్ని లోపలనుంచి శుభ్రం చేసి అందంగా మృదువుగా యవ్వన వంతంగా  చేస్తాయి. పాలు మాయిశ్చరైజర్ గా వాడుకోవచ్చు. అరకప్పు పాలలో అయిదారు చుక్కల చొప్పున నువ్వుల నూనె ఆలివ్ నూనె కలిపి సీసాలో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు దూది ఉండా మంచి దీన్ని ముఖానికి […]

భయపెట్టే అడవి

అడవులు అద్భుతంగా ఉంటాయి చెట్లు, పక్షులు, జంతువులు, చెరువులు, జలపాతాలు, పువ్వులతో ఆహ్లాదం కలిగిస్తాయి కానీ భయపెట్టే అడవులు కూడా ఉన్నాయి. మర్రి చెట్ల ను గుర్తు చేసే విశాలంగా ఉండే జాక్ వృక్షాలతో నాచు పరచుకొన్నట్లుగా కనిపించే విస్ట్‌మాన్స్ ఉడ్  అడవి ఇంగ్లాండ్ లోని వెస్ట్ డార్ట్ నది సమీపంలో టూ బ్రిడ్జెస్ దగ్గర ఉంటుంది బ్రిటన్ లో అత్యధికమైన జాక్ చెట్లు ఉండే ప్రాంతం ఇదే. ఊడలు విస్తరించి ఆకాశం కనిపించకుండా సందు లేకుండా […]

ధమాకా (హిందీ) 

ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన కొరియన్ సినిమా ది టెర్రర్ లైవ్ కు ధమాకా సినిమా రీమేక్. సినిమా మొత్తం ఒక న్యూస్ రూమ్ లో జరుగుతుంది అర్జున్ పాథక్ ఒక ఛానల్ లో టాప్ యాంకర్ వృత్తి పరంగా చేసిన చిన్న పొరపాటు తో అతన్ని ఛానల్ యాజమాన్యం అతన్ని ప్రాధాన్యం లేని రేడియో జాకీ గా డిమోట్ చేస్తుంది. ఒకరోజు ఒక షో లో ఒక వ్యక్తి తనను రఘువీర్ గా పరిచయం చేసుకుని సీ […]

స్పూర్తి ఇచ్చే కిరీటం

ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ 2021 టైటిల్ ను గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కేరళకు చెందిన శృతి సితార. ప్రపంచంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లో స్పూర్తిని విశ్వాసాన్ని నింపేందుకు గాను లండన్ వేదికగా ప్రతిఏటా మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ పోటీలు జరుపుతారు. ఆన్ లైన్ వేదిక ఈ సంవత్సరం నిర్వహించిన పోటీల్లో ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొన్న ట్రాన్స్ ఉమెన్స్ లో సితార మొదటి ప్లేస్ లో నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది.

వాడని పువ్వులు

రేకలు మొగ్గలు,ఆకుల ఆకారంలో 100 రకాల పువ్వులను ముడతలు ఉండే ఇటాలియన్ క్రేప్ కాగితంతో సృష్టించింది లిజో కార్టర్. అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో ఉండే లిజీ కార్టర్ పూల దుకాణంలో పదేళ్ల పాటు పనిచేసింది. సీజనల్ గా విరబూయని పువ్వులతో బొకే ల వ్యాపారం చేయాలనుకొంది 2019 లో కాయితం పూలతో ఆన్ లైన్ వ్యాపారం మొదలుపెట్టిన కార్టర్ కార్టర్ పూలగుచ్చాలకు ఇప్పుడు అమెరికా లోనే కాకుండా ప్రపంచం అంత కష్టమర్లు ఉన్నారు.

ఒక్క పాటతో పాపులర్

తెలంగాణ ఉద్యమ గీతాలు జానపద గీతాలు యూట్యూబ్ కోసం పాడేదాన్ని కానీ ఊహించని అవకాశం నా తలుపు తట్టింది. జానపద గాయని గా ఉన్నా నన్ను సామి సామి పాట తో ప్రపంచానికి పరిచయం చేశారు దేవి శ్రీ ప్రసాద్. సినిమా పాట పాడటం అంత ఈజీ కాదు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. పదేళ్ల కష్టానికి ఫలితం పుష్పా సినిమా కోసం నేను పాడిన పాట అంటుంది మౌనిక యాదవ్ పుష్ప సినిమాలో పాడిన  సామి సామి […]

ఆమె ముద్దుపేరు హరికేన్

ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన లూసియానా సీనియర్ గేమ్స్ లో నమోదైన ఒక రికార్డు బద్దలు కొట్టింది 100-104 ఏళ్ళ వయసు వారికి జరిగిన 100 మీటర్ల మిషిగాన్ సీనియర్ ఒలంపిక్స్ రేస్ లో జూలియా హాకిన్స్ కేవలం 62 సెకండ్లలో ముగించింది. రన్నింగ్ ట్రాక్ పైన ఈమె పరుగు చూసి జనాలు ఆమెను ‘హరికేన్‌’ అని పిలుస్తున్నారు. జూలియా హాకిన్స్ 2019 లో 50 మీటర్ల రేస్ ను 46.07 సెకండ్లలో పూర్తి చేసిన మొదటి […]

ఖరీదైన హోటల్

ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్  అలస్కాలోని డాన్ షెల్టన్ యాంపీ థియేటర్ శిఖరం పైన ఉన్న షెల్టన్ పాలెట్ ఒక జంట మూడు రోజులు బస చేయాలంటే 26 లక్షల ఖర్చు చేయాలి.ఇక్కడికి చేరుకోవాలంటే వాయు మార్గమే దారి హోటల్ యాజమాన్యం కొన్ని ప్రైవేట్ హెలికాప్టర్స్ ఏర్పాటు చేసింది. రుచికరమైన ఆహారం అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపల వేట వంటి వినోద కార్యక్రమాలు ఉన్నాయి సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన […]

సరైన పద్ధతి ఇది

ఈ చలిరోజుల్లో చర్మం పొడిబారిపోతుంది చల్లని నీటితో ముఖం తరచూ కడుక్కోవటం మంచిదే కానీ తరచూ సబ్బుతో కలిగితేనే చర్మం పొడిబారుతుంది కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి క్లెన్సర్లను ఎక్కువగా ఉపయోగించకూడదు వాటిలో ఉండే బెంజైల్‌ పెరాక్సైడ్‌ చర్మానికి ఇబ్బంది కలిగిస్తుంది.  క్లెన్సర్ బదులు రోజ్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవచ్చు అలాగే కొందరు శిరోజాలకు నూనె ఎక్కువగా రాస్తారు కొందరు అస్సలు రాయరు కానీ సరిగ్గా తల స్నానానికి గంట ముందు నూనె […]

నిద్ర తగ్గితే ముప్పు

నిద్ర తగ్గిపోతే కళ్ళకింద చారలు వస్తాయని నీరసం వస్తుందని అనుకుంటారు కానీ అసలు నిద్రపోయే వేళల్లోనే ఆరోగ్యం దాక్కొని ఉందంటున్నారు పరిశోధకులు. రోజూ ఒకే సమయానికి పది, పదకొండు గంటల మధ్య నిద్రపోయే వారిలో ఆరోగ్య సమస్యలు తక్కువ అంటున్నారు. అందుకుగాను పగలు పని చేసి దాదాపు సమయానికి నిద్ర పోయే వాళ్ళ నిద్రవేళల్ని ఆహారపు అలవాట్లని క్షుణ్నంగా పరిశీలించారు. అయితే అర్ధరాత్రి వరకూ మేలుకొనే వాళ్లలోనే 25 శాతం మందికి గుండె జబ్బు ప్రమాదం గుర్తించారట. […]

ఆవూరి మట్టే మసాలా

వంటల్లో రుచి కోసం మనం మసాలాలు వాడినట్లు ఇరాన్ లోని హార్ముజ్ దీవి ప్రజలు తమ వంటలకు కమ్మని రుచి రావటం కోసం ఆ దీవి లో దొరికే మట్టిని వాడతారు. హార్ముజ్ లో రంగు రంగుల రెయిన్ బో పర్వతాల నుంచి కిందకు జారే మట్టి లో ఇనుము తో పాటు 70 రకాల ఖనిజాలు ఉంటాయట. ఇది రుచిగానూ మంచి వాసనతో ఉండటంతో ఈ మట్టిని పోపుల డబ్బాలో పోసుకుని వంటల్లో వాడుకుంటారు. ఇక్కడికి […]

బ్యాక్టీరియా నే కారణం

ఎన్ని వ్యాయామాలు చేస్తున్న బరువు తగ్గక పోవటానికి కారణం వారి ఉదరంలోని బ్యాక్టీరియా అని అంటారు వాషింగ్టన్ బయాలజీ నిపుణులు. పొట్టలోని బ్యాక్టీరియా పెరుగుదలను బట్టి బరువు పెరగటం తగ్గటం ఆధారపడి ఉందంటున్నారు. తిన్న ఆహారం రక్తంలో కలవటానికి ఈ బ్యాక్టీరియాను మధ్యలో వడపోత గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే ఆహారం సులువుగా జీర్ణమై రక్తంలో కలుస్తుందని దీన్ని పెరుగుదల తక్కువగా ఉంటే జీర్ణక్రియ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.

అరణ్యాలను పెంచిన స్త్రీలు

కేరళ లోని వేనాడు ప్రాంతంలో ఉంది గురుకుల బొటానికల్ శాంక్చురీ. దాదాపు యాభై ఎకరాల వరకు విస్తరించిన ఈ అభయారణ్యం పూర్తిగా స్త్రీల నిర్వహణ రక్షణలో ఉంది 27 మంది స్త్రీలు ఇక్కడ పని చేస్తారు.  ఓల్ఫ్‌గాంగ్‌ టియర్‌కాఫ్‌ అనే జర్మన్ దేశస్తుడు ఉత్తర వేనాడు లోని అలాత్తిల్‌ అనే గ్రామంలో 1981లో ప్రారంభించిన ఈ అభయారణ్యం ఇప్పుడు 50 ఎకరాల వరకు విస్తరించింది. సుప్రభ శేషన్‌ అనే పర్యావరణ ప్రేమికురాలు దానికి డైరెక్టర్. పశ్చిమ కనుమల్లో […]

వార్ధక్య లక్షణాలా ?

చర్మం పైన ముడతలు రావడం చర్మం సాగిపోవటం అనేది సాధారణంగా పెరిగే వయస్సుకు సంకేతాలుగా భావిస్తుంటారు కానీ నిజానికి ఇది ఒత్తిడి పోషకాహార లోపాలు శరీరం లో ఇన్ ఫ్లమేషన్ లకు సూచనలు కావచ్చు .చర్మాన్ని బిగుతుగా ఉండేందుకు ఉపకరించే కొలాజెన్ సరఫరా చక్కెర వల్ల తగ్గిపోతుంది. కనుక తీపి తినటం తగ్గించాలి డీహైడ్రేషన్ వల్ల చర్మం ముడతలు పడుతుంది గనుక బాగా నీళ్లు తాగాలి ఒత్తిడి వల్ల పేరిగే కార్టిసాల్ హార్మోన్ చర్మ ఆరోగ్యానికి తోడ్పడే […]

పెద్దలకే శిక్ష

చిన్న పిల్లలు తప్పు చేస్తే వెంటనే శిక్ష తల్లిదండ్రులకే అంటుంది చైనా గవర్నమెంట్. పిల్లల చెత్త ప్రవర్తనకు మూలం కుటుంబమే అంటుంది. ఇంటిదగ్గర పిల్లలను సరిగ్గా చూసుకోకుండా వాళ్ళ ఆహారం ఆట పాటల విషయంలో శ్రద్ధ పెట్టకుండా ఇతర పనుల్లో మునిగి తేలే తల్లిదండ్రుల వల్లే పిల్లలు టీవీలు చూస్తూ ఆన్ లైన్ ఆటలు ఆడుతూ చెడిపోతున్నారు అంటుంది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం .అందువల్ల పిల్లలను చక్క దిద్దని తల్లిదండ్రులు శిక్షార్హులే అన్న చట్టం తెస్తోంది. పిల్లల […]