Wednesday, 30 Sep, 2026

ఈ నూనెతో సరి

ఇ-విటమిన్ నూనె ఎన్నో సౌందర్య సమస్యలకు పరిష్కారం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదయం రాసుకొనే మాయిశ్చరైజర్ క్రీమ్ కు కొన్ని చుక్కల ఇ-విటమిన్ నూనె కలిపి రాసుకుంటే ఎంతో ఉపయోగం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావలసిన తేమ అందుతుంది. ఎండకు చర్మం కమిలిన చర్మం నిర్జీవంగా అనిపించిన ఈ నూనె వాటిని దూరం చేసి మెరుపునిస్తుంది. అలాగే శిరోజాల సమస్యలకు కూడా నూనెలో రెండు క్యాప్సూల్ ఇ-విటమిన్ కలిపి తలకు రాసి, ఓ అరగంట ఆగి […]

పది లక్షల మందికి శిక్షణ

భారతదేశంలో అత్యంత పురాతన యోగ ఉపాధ్యాయురాలు నానమ్మల్ ఆమె తన జీవిత కాలంలో 10 లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజూ వంద మంది విద్యార్థులకు బోధన ఇచ్చేవారు. ఆమె శిక్షణ ఇచ్చిన వారిలో 600 మంది ప్రపంచ వ్యాప్తంగా యోగా శిక్షకులు గా ఉన్నారు.1920 ఫిబ్రవరి 24న తమిళనాడులోని కోయంబత్తూరు లోని జమీన్ కలియపురం లో పుట్టిన నానమ్మల్ తండ్రి తాత ఇద్దరు రిజిస్టర్ ఇండియన్ మెడిసిన్ ప్రాక్టీషనర్లు. వివాహం తర్వాత ప్రకృతి […]

మొదటి ఘనత ఆమెదే

దుర్గా ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా పిలుస్తారు ఓయినం బెమ్ బెమ్ దేవిని. ఐ ఎ ఎఫ్ ఎఫ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా రెండు సార్లు 2017 లో అర్జున్, 2020 లో పద్మశ్రీ అవార్డ్ లు ఆమెను వరించాయి. ఫుట్ బాల్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె ఇంఫాల్ లో జన్మించిన బెమ్ బెమ్ దేవి పదేళ్ళ వయసులో ఇంఫాల్ యునైటెడ్ పయోనీర్స్ క్లబ్ లో […]

మతాలకు అతీతం

దక్షిణ అమెరికాలో అతి గొప్ప నిర్మాణం గా బహాయి ఆలయం పేరు తెచ్చుకుంది బిలి లోని శాంటియాగో లో ఉన్న ఈ ఆలయం ఒక ప్రార్థన మందిరం. ఇందులో అన్ని మతాల వారికి ప్రవేశం ఉంటుంది. 2016 లో ప్రారంభించిన ఈ ఆలయం పాలరాయి గాజుతో తయారయింది. ఈ ఆలయాన్ని కెనడియన్ ఆర్కిటెక్ట్ Siamak Hariri రూపొందించారు. ఈ ఆలయం పొడవు 30 మీటర్లు వెడల్పు కూడా 30 మీటర్లే. తొమ్మిది రేకుల పుష్పం లాగా ఉండే […]

ధ్యానంతో స్వాంతన

గంటల కొద్దీ విశ్రాంతి లేని పని, టార్గెట్స్, నిరంతరం ఆఫీస్ ప్రయాణాలు అంతులేని ఒత్తిడి ఇచ్చే ఉద్యోగాలు, విపరీతమైన సంపాదన ఎన్ని ఉన్న ఈ పరుగులో విశ్రాంతి నిద్ర దూరమైతే అప్పుడే అవసరం అవుతాయి ధ్యాన, విశ్రాంతి కేంద్రాలు. మైండ్ ఫుల్ నెస్ టీచర్ లాస్ ఏంజెల్స్ కు చెందిన జరిమే హంటర్ స్ఫూర్తి తో జపాన్ రాజధాని టోక్యో లో మెడిటేషన్ కేంద్రాన్ని రూపొందించారు ఈ ధ్యాన మందిరం అంత తెలుపే. మెరిసే తెల్లని వర్ణం […]

రాత్రి వేళల్లో నష్టం

ప్రపంచంలో అత్యధికంగా తినే పండు అరటి పండు అయితే ఈ పండు సరైన సమయంలో తింటేనే ప్రయోజనం అంటున్నారు  ఎక్సపర్ట్స్. ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల మధ్య తింటే ఉత్తమం అంటున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా తినచ్చు అయితే సాయంత్రం వేళలో రాత్రి పూట తింటే మటుకు శ్వాసకోశ సమస్యలు తప్పవు అంటున్నారు. రాత్రివేళ తినకపోవటం బెస్ట్ అంటారు కానీ సరైన వేళల్లో తింటే ఫలితాలు అమోఘం ఇందులో విటమిన్-బి సమృద్ధిగా […]

వరల్డ్ రికార్డ్ ఇది

100 కేజీల కూల్ కేక్ ముక్కలతో  మిలన్ బార్బీ క్యాథడ్రెల్‌ నమూనా నిర్మించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తెచ్చుకుంది పూణే కు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్ బ్రిటన్ కు చెందిన ఒక పురాతన చర్చి క్యాథడ్రెల్‌ చర్చ్‌. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేక్ ముక్కలు డిజైన్ చేసి చర్చ్‌ రూపం తెచ్చేందుకు ప్రాచీ కి నెల రోజులు పట్టింది. 6 అడుగుల 4 అంగుళాల పొడవైన నిర్మాణం. ఈ రాయల్ ఐసింగ్ […]

ఎవరికైనా రావచ్చు

ప్రతిరోజు వ్యాయామం చేస్తూనే ఉన్నాను ఖరీదైన పోషకాహారం తీసుకుంటాను. ఫిట్ నెస్ అంటే ప్రాణం పెడతాను హాయిగా నిద్ర పోతాను ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో అన్నీ చేశాను. నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదనుకున్నాను కానీ అది అపోహే అని తేలిపోయింది. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది అంటున్నారు జీరోధా సంస్థ కో పౌడర్ సీమా పటేల్, గత నవంబర్ నుంచి ట్రీట్ మెంట్  మొదలు కుటుంబం సభ్యుల మద్దతు, బీమా రక్షణ ఉంటే ఈ […]

యూనియన్ ఏర్పాటు లక్ష్యం

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ ప్రాంతం లోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షి చాలా తొందరలో సిమ్లా లో ఫస్ట్ ఉమెన్ టాక్సీ డ్రైవర్ యూనియన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. అందుకోసం ఆమె పేద మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పుతోంది. సిమ్లా లో డ్రైవింగ్ అంత సులభం కాదు ఆ హిల్ స్టేషన్ కు చెందిన డ్రైవర్ మీనాక్షి నేగి డ్రైవింగ్ వృత్తిగా చేసుకుంది. టాక్సీ కొనుక్కొని  నడవడం మొదలు పెట్టాక కోవిడ్ వచ్చింది. […]

ఆమె సంకల్పబలం

గుజరాత్ కు చెందిన 42 ఏళ్ల నీతా పటేల్ ను వాటర్ ఛాంపియన్ గా పిలుస్తారు.గుజరాత్‌లోని మోగ్రవాడి కి చెందిన నీతా పటేల్ జీవితంలో నిలబడేందుకు విద్యే మార్గమని నమ్మారు.బారుక్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ‘అగాఖాన్‌’ గ్రామీణ కార్యక్రమంలో భాయగమయ్యాక నీటి కోసం మహిళలు పడే ఇక్కట్లు తెలిసాయి. ఆదివాసి గ్రామీణ మహిళలను చైతన్యం చేసి నీటి సంరక్షణ పై అవగాహన కల్పించారు. వరద నీటిని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యామ్ లు,ఎత్తిపోతల పథకాలు ఎన్నో నిర్వహించి […]

సాహస రూపం

ఇంజనీరింగ్ చదువుకొంటున్న 21 సంవత్సరాల అనామిక శర్మ స్కై డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది. ఈ సంవత్సరం దుబాయ్ డ్రాప్ జోన్ నుంచి ఏ కాటగిరి ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి లైసెన్స్ పొందింది. ఇప్పటి వరకు దేశంలో నలుగురు మహిళలే ఈ లైసెన్స్ పొందారు.మొదటి సారి పదివేల అడుగుల ఎత్తు నుంచి దూకినప్పుడు అనామిక వయసు పదకొండేళ్లు ఆ తర్వాత 42 జంప్ లు సాధించిన ఘనత […]

మరీ కష్టం

చైనా లోని పుల్లింగ్ పర్వత శ్రేణిలో ఉన్న షిజింగ్ షాన్ షాన్ పర్వతం ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం సాహసం చేసే తెగువ ఉండాలి. సముద్రమట్టానికి 2578 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం రెండుగా చీలి ఉంటుంది. శిఖరం పైన రెండువైపులా బుద్ధుడి ఆలయాలు ఉంటాయి. వీటిని క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో టాంగ్ వంశస్థులు నిర్మించారు కింద నుంచి పర్వతం వరకు వచ్చి అక్కడి నుంచి 8 వేల మెట్లు ఎక్కాలి చూస్తుంటేనే కళ్లు […]

లావెండర్ నూనెతో పోషణ

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. పొడి జుట్టు ను మెత్తగా, జిడ్డు జుట్టును పొడిగా  మారుస్తుంది. వెంట్రుకలు పొడవుగా ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడుతుంది. 10 చుక్కలు లావెండర్ నూనె ను 5 చుక్కల సెడర్ వుడ్ నూనె, ఐదు చుక్కలు కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ ఆముదం కలిపి మునివేళ్ళతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. రాత్రి అలా వదిలేసి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో […]

శానిటరీ బెల్ట్ ఆవిష్కర్త బీట్రైస్

శానిటరీ బెల్ట్ కనిపెట్టిన మేరీ బీట్రైస్ డేవిడ్ సన్ కెన్నర్ ఆఫ్రికన్-అమెరికన్. ఈమెది ఆవిష్కర్తల కుటుంబం చెబుతారు. నాన్న అక్క కూడా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. 1912 లో జన్మించిన బీట్రైస్ బాల్యం నుంచే గ్యాడ్జెట్లు, గృహ సంబంధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టారు. 1920 ల్లోనే శానిటరీ బెల్ట్ ఎక్కడ కనిపెట్టారు. పేటెంట్ తీసుకుని డబ్బు లేక అది వెలుగులోకి వచ్చేందుకు కొన్ని దశాబ్దాలు పట్టింది. పేటెంట్ తర్వాత దాన్ని లీకేజ్ సమస్య రాకుండా మాయిశ్చర్ ప్రూఫ్ […]

లేటెస్ట్ స్టయిల్స్  

దుస్తులకు తగ్గట్లు ఇయర్ రింగ్స్ మార్చుకోవాలి అంటారు ఫ్యాషన్ నిపుణులు నలుపురంగు షోల్డర్ డ్రెస్ వేసుకుంటే గోల్డెన్ షోల్డర్ డస్టర్స్  బావుంటాయి. ఆధునిక దుస్తుల పైకి జె -హోప్స్ ఇయర్ రింగ్స్ నప్పుతాయి లేటెస్ట్ స్టైల్ గా వాటిని చెప్పుకోవచ్చు. అలాగే షార్ట్ డ్రెస్ అయినా లాంగ్ అయినా, పగలైనా రాత్రయినా హోప్స్ ఎనామిల్ డైమండ్ ఇయర్ రింగ్స్ ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ప్రత్యేక సందర్భాలకు పార్టీ లకు డాంగ్లర్స్ వేసుకోవచ్చు. ప్రింట్ డ్రెస్ కు ప్లెయిన్ […]

జీవితాన్ని మార్చిన ఫోటో

కిస్బూ, కేరళలో మోడల్.ఈమె రాజస్థాన్ కు చెందిన సంచార తెగకు చెందిన అమ్మాయి. కేరళలోని కన్నూరు జిల్లా సమీపంలో అండలూరు లో అండలూరు కావు అనే ప్రాచీన రాముడి దేవాలయం ఉంది. రాముణ్ణి రామాయణాన్ని తలుచుకుంటూ ఫిబ్రవరి రెండవ వారంలో జరిగే తిరుణాలలో ఫోటో తీసేందుకు వచ్చిన అర్జున్ కృష్ణన్ అనే ఫోటోగ్రాఫర్ బెలూన్లు అమ్ముతున్న పదహారేళ్ల కిస్బూ అనే అమ్మాయి ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒక్కరోజులో లక్షన్నర మంది ఈ ఫోటోలకు […]

ఆమె నృత్యానికి ఫిదా

పాకిస్తానీ మహిళా స్వేచ్ఛ హక్కుల కోసం పోరాడుతుంది షిమా కిర్మానీ.1979 లో తెహ్రీక్-ఇ -నిస్సాన్ అనే స్త్రీ వాదా గ్రూప్ ప్రారంభించి మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్నారామె ఆమె అద్భుతమైన డాన్సర్ కూడా. గత 40 ఏళ్లుగా సాంప్రదాయ చీరకట్టు తోనే నృత్యం  చేస్తున్నారామె పాకిస్థాన్ లో ఈ సాంప్రదాయ చీరకట్టు నిషేధం కూడా. ఎంతో మంది అధికారుల ఆగ్రహానికి గురైన తన పోరాటాన్ని నృత్యాన్ని కూడా ఆపలేదు షిమా కిర్మానీ. ఇటీవల ఆమె నృత్యం […]

స్వప్నోపురోన్ స్కూల్

శతరూప మజుందార్‌ కోల్‌కతాలో టీచర్‌ కొన్ని వందల మంది పిల్లల జీవితాల్లో మార్పు కు కారణమైన స్వప్నోపురోన్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించింది.అదే పేరుతో సుందర్ బన్ లో తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసింది. 2012లో బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారు. ఇది ఒక దీవి భారత్ బంగ్లాదేశ్ ల సరిహద్దులో ఉంది. ఏడాది పొడవునా వర్షాలు వరదలతో సతమతమయ్యే ఈ ప్రాంతం వారికి వ్యవసాయ కూలి పనులే ఆధారం పిల్లలకు చదువు […]

నగలు శుభ్రం

బంగారు,ప్లాటినం,వెండి ఆభరణాలు కాంతి తగ్గకుండా కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు. నగల్ని శుభ్రం చేసే బ్రష్ లు మార్కెట్ లో దొరుకుతాయి. ప్లాటినం ఆభరణాలు కొద్దిసేపు సబ్బు నురగ ఉండే నీటిలో ఉంచి మెత్తని బట్టతో తుడిస్తే చాలు. ముత్యాల నగల్ని తడి బట్టతో మెల్లిగా తుడవాలి దూదిలో స్పిరిట్ వేసి మెల్లగా శుభ్రం చేయాలి. టూత్ పేస్ట్ తో రుద్ధి మెత్తని బట్టతో తుడవాలి. బంగాళదుంపల నీటిలో కూడా వెండి నగలను కాసేపు ఉంచి […]

స్త్రీలకు మాత్రమే

డబ్ల్యు స్క్వేర్ యాప్ ను చెన్నైలోని అడయార్ లో ప్రారంభించారు వందనా రామనాథన్ జినాల్ పటేల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం కేవలం స్త్రీలకు మాత్రమే దీనిలో పరిస్థితులన్నీ అద్దెకు తీసుకుని వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు స్టార్టప్స్ కు ఎప్పుడు ఆఫీస్ సమస్య, డబ్ల్యు స్క్వేర్ లో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఒక ప్లేస్ అద్దెకు తీసుకుని వెంటనే వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు. ఉచిత వైఫై, విశ్రాంతి గది, మీటింగ్ రూమ్ మొదలైనవన్నీ ఇక్కడ […]