Monday, 28 Sep, 2026

ఆత్మవిశ్వాసమే అసలైన అందం

లండన్ మోడలింగ్ ప్రపంచం నుంచి ముంబై సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి అగ్ర హీరోయిన్ గా ప్రేక్షకుల మనసులో ఒక ఉన్నత స్థానం సంపాదించిన కత్రినా కైఫ్ స్థాపించిన కే బ్యూటీ బ్రాండ్ ఈరోజు భారతీయ కాస్మటిక్ రంగంలో విజయం సాధిస్తోంది.2019లో భారతదేశంలో మొదటి సెలబ్రిటీ బ్యూటీ బ్రాండ్ గా ఇది ప్రారంభమైంది ఈ ఉత్పత్తులన్నీ కేవలం అందాన్ని ఇచ్చేవే కాకుండా చర్మానికి పోషణ ఇచ్చే పదార్థాలతో తయారు అవుతాయి. బ్యూటీ కే బ్రాండ్ కేవలం బ్యూటీ లిప్‌స్టిక్‌లు ప్రైమర్లు ఫౌండేషన్ లు మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో స్కిన్ కేర్ రంగంలో కూడా అడుగు పెట్టింది. భారతదేశంలో కాకుండా యూకే , ఇతర విదేశీ మార్కెట్లో కూడా తన సేవలు విస్తరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ బ్రాండ్ దాదాపు 350 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. అందం ఫిట్నెస్ తో కెరీర్  ప్రారంభించిన కత్రినా ఇప్పుడు ఒక వ్యాపారవేత్తగా సగర్వంగా నిలబడింది. అందం అంటే కేవలం శరీర బరువు కాదు. రంగు అసలే కాదు. ఒక మహిళ సాధించిన విజయం .ఆమె ఆత్మవిశ్వాసమే అసలైన సౌందర్యం అంటుంది కత్రినా కైఫ్.

Leave a Reply