Monday, 10 Aug, 2026
బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన సలహాలే నమ్ముతుందిట. ఆయనకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశ్యంతో బాంద్రా ఫ్లాట్ ఆయన నచ్చేసింది కంగనా. ఆ ఫ్లాట్ చాలా విశాలంగా వుండి యోగా తరగతులకు అనుకూలంగా వుందిట. యోగా శిక్షణ కోసం అనుకూలంగా ఉండేలా అన్ని వసతులు కల్పించే పనిలో ఉందిట . ఈమె ఇంతకుముందు తన సోదరికి కూడా రెండు పడకల గదిని కానుకగా ఇచ్చిందిట. కంగనా. మానవ సంబంధాలు పదిలంగా వుండాలనుకునేవాళ్ళు కంగనా ముందుంటుందని అందరు ఏకగ్రీవంగా ఆమోదించారట. దటీజ్ కంగనా రనౌత్.

అది నా బాధ్యత

మనసుకు తోచినట్లు ముక్కుసూటిగా మాట్లాడటం కంగనా రనౌత్ కే చెల్లుతుంది. దేశ సమస్యలపైన మీరు ఎందుకు స్పందిచరు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఒకళ్ళని వేలేత్తి చూపించకుండా సమస్యపై గళం విప్పటం ఒక పౌరుడిగా అది అందరి బాధ్యత . విజయాలతో దూసుకు పోయే మమ్మల్ని కెమెరాల్లో బంధించేందుకు క్లిక్కుల వర్షం కురుస్తుంది. అలాంటి తారలు దేశంలోని సామాజిక సమస్యలపై నోరు విప్పకపోతే వారు సాధిస్తున్నా విజయాలకు అర్ధం లేదు. స్టార్ డమ్ అనేది ప్రేక్షకులు ఇచ్చిందే. అలాంటి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటం ఎంతైన అవసరం అన్నది కంగనా . ఈ దేశంలో పుట్టి ,ఈ దేశ ప్రజల వల్ల వచ్చిన స్టార్ డమ్ ను అనుభవిస్తూ సమస్యలు పట్టనట్లు ఉండటం ఏ స్టార్ కీ మంచిది కాదు అంటోంది కంగనా రనౌత్.

Leave a Reply