Tuesday, 04 Aug, 2026

కాంట్రాస్ట్ గా ఎంచుకోవచ్చు

ఎన్ని రకాల దుస్తులున్న అమ్మాయిలకు ఇవ్వాళేం వేసుకొవాలి అన్న సందేహమే. ఏ వయసు వారైన వార్ట్ రొబ్ లో రెండు చక్కని చేనేత చీరెలు, తాజా ట్రెండ్ లో ఒకటైన కలంకారీ ,మరోకటి బెనారస్ తప్పని సరిగా ఉండాలి.ఏ సీజన్ లో కట్టుకొన్న ఈ రకం కాటన్ చీరెలు ఎప్పుడు ఫ్యాషనే . ఇక లెహాంగా అయినా చీరెకైన చక్కని మ్యాచింగ్ కావాలంటే బ్లౌజ్ ల్లో ఫ్లెయిన్ గోల్డ్ ఎరుపు నలుపు ఆకుపచ్చ రంగుల్లో క్రాప్ టాప్ […]

దాన్ని తుడి చేయండి

కార్పోరేట్ బోర్డ్ మీటింగ్ లలో అమ్మాయిలపై అనధికారంగా కొన్ని దురభిప్రాయాలు చర్చల్లోకోస్తాయి. నెలసరులప్పుడు అమ్మాయిలు కీలక నిర్ణయాలు తీసుకోలేరు అని. దీన్ని పీరియడ్ బ్రెయిన్ అని వెక్కిరింతగా వాడతారు. గ్రీక్ లోని అరిస్టాటిల్ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకురాలు బ్రిగెటీ లీనర్స్ వంద మంది మహిళలపై ఒక అధ్యయనం చేసి నెలసరికి కారణం అయిన హార్మోన్స్ కి మేధోపరమైన ఆలోచన శక్తి సంబంధం లేదని తేల్చారు. అలాంటి అపనమ్మకాలు మీ బుర్రలో ఉంటే వాటిని వెంటనే క్లీన్ చేసకొమ్మని […]

ఆహార ప్రణాళిక ముఖ్యం

వర్కవుట్స్ చేస్తున్నప్పుడు మంచి ఆహర ప్రణాళిక ఉండాలి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. వర్కవుట్స్ చేసే ముందర ఐదారు బాధం గింజలు మూడు నుంచి ఆరు వరకు ఖర్జూరాలు తీసుకొంటే ఆక్సిజన్ అందించే కెపాసిటీ పెరుగుతుంది. వర్కవుట్స్ పూర్తైన తర్వాత ఒక గుడ్డు ,ఒక పండు తింటే బలహీనమైన కండరాలు తిరిగి శక్తిని ఉంచుకొంటాయి. మధ్య మధ్యలో ఉప్పు కలిపిన నిమ్మరసం తీసుకొంటే మంచిది. 22 సంవత్సరాలు దాటాక వర్కవుట్స్ కోసం వెళుతుంటే డాక్టర్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు […]

కేలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ

ఈ సీజన్ లో ముంజలోస్తాయి. వీటిలో శరీరం చల్లబడటమే కాదు ఎండ నుంచి ఉపశమనం అలాగే సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, ఇనుము, జింక్, ఫాస్పరస్ , పోటాషియం ,కాల్షియం వంటి పోషకాలున్నాయి. నీటిశాతం ఎక్కువ. ఇవి తింటే శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కేలరీలు తక్కువే కాని అవసరమైన శక్తి లభిస్తుంది. తక్షణ శక్తి ఇస్తాయి ముంజలు .గర్భణీలు కూడా వీటిని తినచ్చు. గర్భవతులుగా ఉన్నప్పుడు తలెత్తే జీర్ణాశయం సమస్యలకు ఇవి పరిష్కారం.

గులాబీ వన్నే కోసం

గులాబి రేకులు చర్మ సంరక్షణ చేస్తాయి. గులాభీ రేకుల్నీచల్లని నీళ్ళలో కాసేపు ఉంచి ,వాటిని మెత్తగా చేసి ఫేస్ పాక్ వేసుకొంటే ముఖం ఎంతో తాజాగా ఉంటుంది. పొడి చర్మం గల వాళ్ళకి గులాబి రేకుల్లోని సహజమైన నూనెలు కావాల్సిన తేమను ఇస్తాయి. గులాబీ రేకుల్ని మొత్తగా చేసి కాసిన పాలు తేనె కలిపి ప్యాక్ వేసుకొని ఓ అరగంట అయ్యాక కడిగేస్తే మృత కణాలు పోవటంతో పాటు ముఖచర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. గులాబీ రేకుల్లో […]

ముఖాకృతిని బట్టే లోలకులు

ఎన్నో రకాల ఇయర్ రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి.అయితే ముఖాకృతికి తగ్గవే తీసుకొమ్మంటారు స్టైలలిస్టులు. ఓవెల్ షేప్ ముఖాకృతి ఉంటే ఆ ముఖానికి ఏ మోడల్ ఇయర్ రింగ్స్ అయినా నప్పుతాయి. చెవులకు అంటినట్లు ఉండే దిద్దులు ,మెటల్ బీడ్స్ ,స్టోన్ హాంగింగ్స్ ఏ వయినా బావుంటాయి. స్క్వేర్ షేప్ మొహం అయితే మొహం ఆకారానికి పూర్తిగా విరుద్దంగా ఉంటే ఆభరణాలు ,పొందికగా ఉండేవి బావుంటాయి.రౌండ్ షేప్ అయితే సైజ్ ,పొడవు పైన దృష్టిపెట్టి మెడ పొడవును కూడా […]

టీ బ్యాగ్స్ తో తాజాదనం

పని ఒత్తిడి వల్ల కళ్ళ కింద వలయాలు వస్తాయి. అలాంటప్పుడు స్వచ్చమైన ఆల్మండ్ ఆయిల్ ని కళ్ళచుట్టు రాసి కాసేపు మసాజ్ చేస్తే పోతాయి. అలాగే కీరా బంగాళా దుంప రసం కలిపి కంటి కింద రాసి ఇరవై నిమిషాల ఆగి కడిగేస్తే చాలు. అలాగే బయటకు వెళ్ళే ముందర కళ్ళకింద ఒక్క చుక్క నీళ్ళు అద్ది సన్ స్క్రీన్ అప్లైయ్ చేస్తే నలుపు రంగు వలయాలు రాకుండా ఉంటాయి.నిద్ర తక్కువై కళ్ళు ఉబ్బితే వాడేసిన టీ […]

ఇలా చేయవచ్చు

ఇంట్లోనే పన్నీరు తయారు చేసుకోవాలంటే రెండు కప్పుల గులాబి రెక్కలు ఒక లీటర్ నీటిలో వేసి మరిగించి చల్లార్చితే సరి. పన్నీరు తయారీకి వర్షపు నీరు మంచిది, కూరల్లో రుచి పెరగాలంటే చివరలో ఒక స్పూన్ కొబ్బరి తరుము అర స్పూన్ జీలకర్ర పొడి కలపాలి. టోమాటో పేస్ట్ ఇంట్లో తయారు చేసుకొని కూరల్లో వాడాక మిగిలిపోతే పారేస్తూ ఉంటారు. దీన్ని ఐస్ ట్రేలో కొంచెం ఉప్పు కలిపి నాలుగైదు రోజుల వరకు పాడై పోకుండా ఉంటుంది. […]

కథాకళి

సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రించింది తెలుగు కథానిక .వందేళ్ళ పైబడి సుదీర్ఘ ప్రయాణం చేసిన సాహిత్య రూపాల్లో నాలుగు తరాల రచయితలు తమ అనుభావాలు ఆశయాలు పాఠకులకు పంచారు. వాస్తవిక జీవితాన్ని పునాదిగా తీసుకొని క్లుప్తంగా ,ఒక జీవభాషలో కథాసాహిత్యం అత్యంత ప్రభావ వంతంగా పాఠకుల మనసు దోచుకొంది. తెలంగాణ జన జీవితాన్ని వేదికగా తీసుకొని బెల్లంకొండ చంద్ర మేళా శాస్త్రి గారు 1946-61 మధ్యకాలంలో అలనాటి స్వాతంత్ర్యోద్యమాన్ని మధ్య తరగతి జీవితాలను వాళ్ళలోని భేషజాలను ,అహంకారాలను,భిన్న […]

ఉమర్ ఖయ్యాం రుబాయీలు

పారశీ భాషలో ఉమర్ ఖయం రాసిన రుబాయీలను శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు తెలుగులోకి అనువాదం చేశారు.ఖయం ఈ రుబాయీల్లో సూరఫీ సిద్దాంతాన్ని మార్శిక భాషలో రాశారు. భక్తుడు పరవశంతో భగవంతున్ని కీర్తించిన విధానం ఇది. ఖయ్యం గొప్ప అభ్యుదాయ వాది కూడా .ముల్లాల నిరంకుశత్వాన్ని దౌర్జన్యాన్ని ఖండించాడు,అలాగే సూఫీ మత తత్వాన్ని అర్థం చేసుకొని ఒక ఆధ్యాత్మిక లోకాన్ని రుబాయీల ద్వారానే లోకానికి చూపించాడు. ఒక నాటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కీర్తీ శేషులు […]

లేడీ డాన్ గా రాధిక

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎలాంటి కష్టమైన పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేస్తున్నారు. తాజాగా మార్కెట్ రాజా ఎంబీబీఎస్ సినిమాలో లేడీ డాన్ గా నటిస్తున్న రాధిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రాధిక తండ్రి ప్రముఖ సినీ నటుడు ఎం ఆర్ రాధ హావభావాలను , డైలాగ్ డెలివరీని ఈ చిత్రంలో చూపిస్తారట.

సమ్మర్ ఫ్రెండ్లీ చీరెలు

వేసవికి చల్లదనాన్ని ఇచ్చే లినెన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ అందమైన చీరెల రూపంలో ముందుకు వచ్చింది. ప్లెయిన్ చెక్స్ ,షేడెడ్ కలర్స్ సెల్ఫీ బార్డర్ లతో లినెన్ చీరెలు ఎంతో అందంగా ఉన్నాయి. ఈ చీరెలపైకి డిజైనర్ పెల్ఫీ బ్లౌజులు చాలా అందంగా ఉంటాయి. ఇవి సమ్మర్ ఫ్రెండ్లీ శారీలు.

జగన్నాథుడికి 64 నైవేద్యాలు

భారత దేశంలో పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఆ ఆలయం నీడ నేలపైన పడదు.పక్షులు,విమానాలు జగన్నాథస్వామి ఆలయం మీదుగా వెళ్ళవు. ఆలయం పైన ఉండే సుదర్శన చక్రం ఎటువైపు నుంచి చూసిన మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి నైవేద్యమే ప్రత్యేకం మొత్తం 64 రకాల పిండివంటలతో స్వామికి నైవేద్యం పెడతారు.ఆలయ ప్రసాదాన్ని 20 లక్షల మందికి పెట్టవచ్చట. ఇక్కడ ఏడుమట్టి పాత్రలను ఒక దానిపైన ఒకటి ఉంచి వంట చేస్తారు. వంట చేసి […]

ఫ్యాషన్ ఫరెవర్

కాటన్ తో అల్లిన ఆక్సిడైజ్డ్ సిల్వర్ ప్లేటెడ్ జ్యువెలరీ ఎప్పటికీ ఫ్యాషనే. కాటన్ తో అల్లిన రంగుల బ్రీడ్స్ నెక్లెస్ లో అందమైన పెండెంట్ ప్రత్యేక ఆకర్షణ .మల్టీ కలర్ థ్రిడ్ నెక్లెస్ అయితే కాటన్ చీరెపైకి ఒక ఆధునికమైన లుక్ తెచ్చిపెడుతోంది సిల్వర్ పెండెంట్లు కాలిసిన కాటన్ థ్రెడ్ స్టేట్ మెంట్ జ్యువెలరీ అమ్మాయిలకు ఇప్పుడు ,ఎప్పుడు నచ్చే ఫ్యాషన్.

ఇవి కూల్,కంఫర్ట్

బెంగాల్ కాటన్ ,కోటా,కలంకారీ ఏ రకం కాటన్ చీరె అయిన, తెలుపు ,కోరా కాలర్ లో ఉండే ఈ సమ్మర్ లో కూల్ గా కనిపిస్తాయి. కాటన్ జరీ కూడా అందమైన లుక్ ఇస్తాయి. బంగారు జరీ బార్డర్ ఉన్న కాటన్ చీరెలు లేదా సాదా అంచులున్న డిజైన్ చీరెలు, ప్రింటెండ్ కాటన్ ఈ వేసవికి సరైన సెలక్షన్.

రామ్ పరివార్ నగలు

పెళ్ళిళ్ళలో ఇతర సంప్రదాయ వేడుకలలో రామ్ పరివార్ నగలు ఇప్పుడు లే టెస్ట్ ట్రెండ్. సీతా రామ లక్ష్మణ మూర్తులతో తయారయ్యే ఈ నగులు పూర్తిగా మేలు జాతి రాళ్ళతో తయారు చేస్తారు. ఎమరాల్ట్ ,రుచీలు, ముత్యాలు, గుట్టపూసలు బంగారు పూసల వరసలతో విభిన్న డిజైన్ లతో దొరికే ఈ నగలు అన్ని వయసుల వారిగా బావుంటాయి.

సరికొత్త లుక్

పట్టు పరికిణిలు ఇష్టమైతే కొన్ని కాంబినేషన్స్ ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. ఎంచుకొనే ఓణీ,లెహాంగా కలర్ కు కాంట్రాస్ట్ గా ఉండాలి. అలాగే లెహంగా బోర్డర్ ఎక్కువ వెడల్పు ఉంటేనే చక్కగా ఉంటుంది. మెరిసే లంగా పైకి ఇంకా తణుక్కుమనే అద్దాలు కుట్టిన బ్లౌజ్ లు బావుంటాయి. ఇక ప్రింటెండ్ లెహంగాల వేసుకోంటే చక్కని టెంపుల్ జ్యువెలరీ పెట్టుకొంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక జరీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కు లెహంగా అయితే ప్రత్యేకమైన లుక్ తో మెరిసిపోవచ్చు.

చర్మాన్ని మెరిపించే తాటి బెల్లం

నల్లని రంగులో మూతకగా ఉంటుంది కానీ ప్రకృతి సహజంగా తయారయ్యే తాటి బెల్లం ఆరోగ్యాన్నిస్తుంది. ఇందులో ఆ స్కారిక్ట్ ఆమ్లం, ఐరన్, కాల్షియలం,మెగ్నిషియం ,ఫాస్పారస్ ,పోటాషియం ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ తో నిండిన ఈ తాటి బెల్లం తింటే ఎముకలకు గుండెకు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి శరీరంలోని హానికరమైన ప్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. గర్భిణిలకు ఎంతో మేలు చేస్తుంది.చర్మానికి వెలుగునిస్తుంది. ముడతలుపడదు మొటిమలు మచ్చల సమస్య పోతుంది.

గాలిని శుద్ది చేసే మొక్కలు

అరుదుగా పూసే పూలలో అందమైన ఆకులున్న చక్కని మొక్కలను ఇంట్లో పెంచుకోనేవి ఎంచుకోంటే ఈ వేసవిలో చల్లదనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఫిలడెండ్రియా, స్వాతి ఫైలమ్, ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కలను నాసా గాలిని శుధ్ధి చేసే మొక్కలుగా గుర్తించింది. పడక గది కిటికీల పక్కగా ఎండతగిలే గోడల దగ్గర మొక్కల్ని పెట్టుకొని వీటికి తోడుగా వట్టి వేళ్ళ తడికలను కార్టిన్ లుగా వాడితే ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు.

భార్య సంపాదిస్తే కష్టమే

భార్య సంపాదనతో కొంత కాలం బతికినా సరే ఆ చర్యలకు బోలెడన్ని జబ్బులు వస్తున్నాయని ఒక అధ్యాయనం చెబుతుంది. అమెరికాలోని రెట్గర్సే విశ్వవిద్యాలయం పరిశోధనలో పురుషుల ఆలోచన విధానంలో ఏ మాత్రం మార్పు రాలేదని పురుషులే కుటుంబానికి ఆధారంగా నిలవాలని ఇప్పటికి ఆలోచిస్తారని భార్య సంపాదన పై జీవిస్తే ఆందోళన కారణంగా హుద్రోగాలు,పక్షవాతం,మధుమేహం కాలేయ సమస్యలు వంటివి వ్యాధులకు గురయ్యారని తేలింది. 30 ఏళ్ళుగా రెండువేల జంటల పై జరిగిన సుదీర్ఘమైన అద్యాయనంలో ఈ విషయం వెల్లడైంది.