పింక్ మీనాకారీ చాలా స్పెషల్
పింక్ మీనాకారీ ఆభరణాలు చేతితో శ్రద్ధగా తయారుచేస్తారు. తెలుపు పింక్ ఎనామిల్ పెయింట్ వేయడం వల్ల ఈ ఆభరణాలు మెరిసిపోతూ వుంటాయి వీటితోనే గులాబీ మీనాకారి ఏక్ రంగ్ ఖులా మీనా పంచ రంగీ మీనా వంటి వివిధ పద్ధతుల్లో ఆభరణాలు తయారుచేస్తారు ఒక ఆభరణం చేసేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పడుతుంది బంగారు ఎనామిల్ తో చేసే ఈ ఆభరణాలు ఎంతో అందంగా ఉంటాయి. చోకర్ లు కర్ణాభరణాలు లు గాజులు చాలా అందంగా […]
కుంగ్ ఫూ నన్స్
ఇతరులకు సాయం చేయడమే మా మతం అంటారు కుంగ్ ఫూ నన్స్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో కోవిడ్ వచ్చాక ఈ బౌద్ధ మహిళ భిక్షువులు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలకు ఎంతగానో సేవ చేశారు దాదాపు 2000 కుటుంబాలకు రేషన్ అందించారు హిమాలయాల పొడవునా ఆహారం లేక అలమటించిన పశువులకు కుంగ్ ఫూ నన్స్ మేత ఏర్పాటు చేశారు. కోవిడ్ గురించి కొండ ప్రాంత ప్రజలకు చైతన్యం కలిగించారు. అయితే ఈ కొండ ప్రాంతాలు దిగాక అక్కడ […]
పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారా ?
పిల్లలు చిన్న తనం లో నేర్చుకునే అలవాట్లే జీవితకాలం కొనసాగుతాయి.వాళ్ల ప్రవర్తన కు సంబంధించి చాలా అంశాలు పెద్దవాళ్ళను అనుసరించి అలవాట్లు చేసుకొనేవే. ముఖ్యంగా మాట తీరుపైన పెద్దల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.పెద్దవాళ్లు కోపంగా అసహనం గా ఉంటే పిల్లలకి అదే అలవాటు అవుతుంది.తల్లి తండ్రి కలివిడిగా ఉండే మనస్తత్వం తో ఉంటే స్నేహ పూరితంగా వ్యవహరిస్తే పిల్లల తత్వము అలాగే ఉంటుంది. కనుక పిల్లల వ్యక్తిత్వానికి అమ్మానాన్నలే ఆదర్శం పిల్లలకు మర్యాద మన్నన నేర్పాలి మర్యాదగా […]
కప్పెల (2020) (మలయాళం)
ఒక సెల్ ఫోన్ జెస్సీ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసింది అనేదే ఈ సినిమా కథ కుటుంబ పోషణ కోసం తల్లి మిషన్ కొడుతూ ఉంటుంది.ఇంటర్ తప్పి ఇంట్లోనే ఉంటూ తల్లికి కుట్టు మిషన్ పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది జెస్సీ. ఒకరోజు ఈ పనిలో భాగంగా ఒక కస్టమర్ కి ఫోన్ చేస్తే అది కాస్తా పొరపాటున విష్ణు అనే ఆటో నడిపే వ్యక్తి కి వెళ్తుంది. అలా పరిచయమైన ఇద్దరు ఆ ఫోన్ లో […]
ఇది నా బాధ్యత
ఢిల్లీకి చెందిన 63 సంవత్సరాల రేణు గుప్త గత 15 సంవత్సరాలుగా పరిసరాలను శుభ్రం చేస్తూనే ఉంది. డంప్ యార్డులు గా మారిన ప్రభుత్వ ఖాళీ స్థలాలు పిల్లల ఆటస్థలాలు గా పచ్చిక మైదానాలు గా మార్చేసింది. తనతో పాటు పలుగు పార మొక్కలు తీసుకుపోతుంది. అలాగే ఉత్తర ఢిల్లీలోని నానక్ పియావో సాహిబ్ గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రం చేసింది. కనపడిన ప్రతి గోడని పెయింటింగ్స్ తో నింపేస్తుంది రేణు గుప్తా. మనం ఓ అడుగువేస్తే […]
నదీన్ అష్రాఫ్
2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వంద మంది శక్తిమంతమైన మహిళల బి బి సి జాబితాలో నదీన్ ఒకరు. ఈజిప్ట్ రాజధాని కైరో లో ఉంటుంది నదీన్ అష్రాఫ్. ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది. తల్లి పౌష్టికాహార వైద్యురాలు తండ్రి సాఫ్ట్ వేర్. పదకొండు సంవత్సరాల వయసులో ఆమెను వెనక నుంచి తాకి కొట్టి మాయమైపోయిన అతనెవరో ఆమెకు తెలియదు కానీ అలాంటి స్పర్ష ఆమెను వెంటాడి వేధించింది. 2017 అమెరికాలో రగిలిన మీ టూ ఉద్యమ […]
అరుదైన ఓపల్
గోపాల రాయి… దీన్నే ఓపల్ అంటారు. ఈ ఓపల్ రత్నాలలో డజను రకాలున్నాయి. ఎర్రని ఫైర్ ఓపల్, వివిధ రంగుల్లో కామన్ ఓపల్ ,ఇంద్రధనస్సు రంగులతో హార్లీ క్వీన్ ఓపల్ గాఢమైన నలుపు అయినా రంగురంగుల మచ్చలతో మెరిసే ఖరీదైన బ్లాక్ ఓపల్ వంటివి ఉన్నాయి. ఈ రత్నాలు సిలికా ఖనిజం నుంచి ఏర్పడతాయి. ఈ రత్నం వెదజల్లే కాంతులను బట్టి దీన్ని లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. సమస్త రత్నాల వర్ణాలను నింపుకున్న […]
శిరోజాలకు ఆరోగ్యం
ఐరన్ లోపం జుట్టు రాలడానికి ఒక కారణం. ఇనుము సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. పాలకూరతో పాటు తోటకూర,రాగులు వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. చిలకడదుంప లో విటమిన్ ఎ అధికం ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.అలాగే అవాకాడల్లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా పాలకూరలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నీ ఉన్నాయి ఫోలెట్ ఐరన్ విటమిన్ ఎ, […]
ముగ్గురూ చీఫ్ సెక్రెటరీలే
కేష్నీ అరోరా 1983 బ్యాచ్ ఐ ఏ ఎస్ హరియానా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమిషనర్ గా ఆమె పేరు రికార్డుల్లో కెక్కింది హరియానా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన 25 సంవత్సరాలకు ఒక మహిళ డిప్యూటీ కమిషనర్ అయ్యారు తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు ఇంకో విశేషం ఏమిటంటే కేష్నీ కుటుంబంలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు చీఫ్ సెక్రెటరీలు అయ్యారు ముగ్గురిలో ఈమె చిన్న ఆమె అక్కలు మీనాక్షి ఆనంద్ చౌదరి […]
లక్ష్యం దిశగా సాగటం విజయ రహస్యం
హెలెన్ కెల్లర్ రాసిన ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ చదివితే పరిస్థితులు అనుకూలించక పోయినా శారీరకంగా ఎన్నో పరిమితులు ఉన్నా మనిషి ఎంత ఎత్తుకు ఎదగలరో అర్థమవుతుంది. 1880 లో అలబామా లో పుట్టిన హెలెన్ కెల్లర్ 13 నెలల పసి బిడ్డ గా ఉన్నప్పుడే స్కార్లెట్ జ్వరము తో చూపు వినికిడి శక్తి దెబ్బతిన్నాయి. అన్ మాన్స్ ఫీల్డ్ సలీవాన్ అనే టీచర్ ఆమెకు శిక్షణ ఇచ్చింది స్పర్శతో నేర్చుకో గలిగే బ్రెయిలీ లిపి […]
ఇద్దరికీ మంచిదే
శిశువుకు తల్లిపాలు పట్టించటం తల్లికి శిశువుకి ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతారు తల్లిపాలతో శిశువులను ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ వస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు రావు. రెండేళ్ళు అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పోషకాల పరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుంది తల్లికి రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. .
లాలి పాట తో తల్లికి ఆరోగ్యం
జోల పాటలు లాలి పాటలు పిల్లలకే కాదు తల్లికి కూడా స్వాంతన కలిగిస్తాయి అంటున్నయి అధ్యయనాలు సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటు గురవుతారు. ఆందోళన పడతారు. అయితే పాటలు పాడితే చాలా తొందరగా కోలుకుంటారని ఒక అధ్యయనం చెబుతోంది.పిల్లలకు పాడే పాటల్లో వారు వ్యక్తం చేయగలిగిన ప్రేమ ఇవ్వవలసిన భద్రత విషయం తల్లి మనసుకు తెలుస్తుంది తమ పైన ఆధారపడిన బిడ్డ ఉన్నాడనే జ్ఞానంతో, తల్లి చాలా త్వరగా […]
ఐదు సలహాలు
ఈటింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ డైటింగ్ లో రచయిత్రి సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ డైటింగ్ లో ఉన్నవాళ్ళు ఆహారం తినే విషయంలో పాటించవలసిన ఐదు ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. ఆహారాన్ని ఒక వరం లాగా చూడాలి. రైతులతో సహా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని ,ఆహారాన్ని వృధా చేయకుండా చూడాలి.తినేది కొద్దిగా అయినా మనసుపెట్టి రుచి ఆస్వాదిస్తూ తినాలి.మనకు ఆకలి వేయటం వలన నిద్ర ఆలోచన విధానం వ్యాయామ సమయం పైన ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేడ్లు, […]
శామ్లీ హల్దార్
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఏ ట్రాఫిక్ కంట్రోలర్ జనరల్ గా నియమితులయ్యారు శామ్లీ హల్దార్ ఇప్పటివరకు ఆమె ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా విమానపు కదలికలు పర్యవేక్షించేవారు.ఇప్పుడు కోల్కతా లోని మూడు వందల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బృందాన్ని పర్యవేక్షించే బాధ్యత చేపట్టారు.ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు చిత్తశుద్ధి తో పాటు శ్రద్ధ ఎప్పుడూ ది బెస్ట్ గా ఇవ్వాలనే సదాశయం ఉంటే చాలు. ఉద్యోగం ఒక క్రీడా మైదానం ఎంత పోటీ పడితే అంత ముందు ఉంటాం […]
కోపంతోనే ముప్పు
కోపం వల్ల కలిగే అనర్ధాలు ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. వృద్ధాప్యంలో విచారంగా ఉండటం కంటే కోపమే ఎక్కువ హాని కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు. విచారంగా దుఃఖంగా గడిపే వృద్ధుల్లో ఆలోచనాశక్తి మాత్రమే తగ్గుతుందని అదే కోపంగా గడిపే వాళ్ళలో గుండెజబ్బులు, ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. కోపంగా ఉండేవారిలో కడుపు మంట ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
సైకిల్ (మరాఠీ) (2018)
మనిషి మనసులో మంచితనం ఉంటే అది ప్రపంచాన్ని తెచ్చి ఇస్తుంది అంటుంది సినిమా కేశవ్ కి ఆయన తాత వైద్యం నేర్పి తన సైకిల్ ను బహుమతిగా వారసత్వంగా ఇచ్చి చనిపోతాడు.కేశవ్ ఆ చుట్టుపక్కల పల్లెలకు ఆ సైకిల్ పైన వెళ్లి వైద్యం చేస్తూ ఉంటాడు ఒకరోజు ఇద్దరు దొంగలు ఆ ఊర్లో ఒక ధనవంతుడి ఇంట్లో చోరీ చేసి ఇంటి ముందున్న సైకిల్ ను తీసుకొని పారిపోతారు.కేశవ్ కు నిరంతరం ఆ సైకిల్ ధ్యాసే ఇటు […]
అందుకే వృద్ధాప్యం
కొంతమందిలో వృద్యాప్య లక్షణాలు చాలా తొందరగా కనిపిస్తూ ఉంటాయి. అలా అకాల వృద్ధాప్యానికి కారణం కాలుష్యమే ఇంకేదో అని తేలిగ్గా తీసుకొంటాం కానీ తల్లి కడుపులో ఉండగానే బిడ్డపై పడిన తీవ్ర వత్తిడి ప్రభావమే ఇది అంటారు షూ లేస్ చివర ప్లాస్టిక్ కాప్ ఉంటుంది. అదిలేకపోతే షూ లేస్ పాడవుతుంది గమనించారా. అలాటి టెరీమల్స్ క్రోమోజమ్స్ చివర క్యాప్ లాగా ఉండి వాటిని సంరక్షిస్తాయి. గర్భిణి లో ఒత్తడి ఎక్కువగా ఉంటే గర్భిణిలకు పుట్టిన పిల్లలో […]
శరీర భాష చెప్పేస్తుంది
శరీరానికి ఓ భాష ఉంటుంది. నోరు చెప్పని ఎన్నో విషయాలు శరీరం నిస్సంకోచంగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. అసహనంగా కదలటం నిర్లక్ష్యాన్ని సూచించేలా కూర్చునే పద్ధతి,టెన్షన్ గా గోళ్ళు కొరకటం స్థిమితంగా నిలబడలేక పోవడం ఇవన్నీ ఎదుటి వాళ్ళకు పట్టించేస్తాయి.బయట ఎక్కువ మంది మధ్య ఉన్నప్పుడు చాలామంది కళ్ళు చెవులు మన పై కేంద్రీకృతమై ఉంటాయి. కాబట్టి మాట్లాడే భాషతో పాటు ఈ బాడీ లాంగ్వేజీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను నొప్పించే పరుష పదాలు వాడకూడదు […]
జ్వరానికి విరుగుడు
చలి రోజుల్లో దగ్గు జలుబు జ్వరం వంటి వస్తూ ఉంటాయి. జ్వరం వచ్చి తగ్గిన దాన్ని తాలూకా నీరసం తగ్గదు ఇటువంటి సమయంలో పొట్లకాయ దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. మామూలుగా మలేరియా బాధితులకు పొట్ల కాయ రసం మంచి మందు. ఇది యాంటీ బయోటిక్స్ మాదిరిగా పని చేస్తుంది గొంతులోని కఫాన్ని తగ్గించే శ్వాస వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది.శరీరంలోని విషతుల్యలను తొలగిస్తుంది. మూత్రాశయం పనితీరు మెరుగుపరుస్తుంది.
అసలైన కానుక జ్ఞాపకం
పిల్లలు చేసిన ప్రతి చిన్న పనినీ మెచ్చుకుంటూ ఒక చక్కని బహుమతి చేతిలో పెట్టండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . అవన్నీ ఆ క్షణానికి పరిమితం కావు ఆ బహుమతి పుచ్చుకున్న జ్ఞాపకం శాశ్వతం గా వాళ్ళ మనసులో ఉండి పోతుంది. ఎంత వయసు వచ్చినా ఒక జ్ఞాపకంగా వాళ్ళ మనసులో ఉండి పోతుంది. పెద్దయ్యాక ఇవన్ని స్నేహితులతో, భాగస్వామితో తప్పకుండా పంచుకుంటారు ప్రతిసారీ పిల్లల మనసులో తల్లిదండ్రులు తమ తో గడిపిన సమయం , తమకి అందిన […]
