Wednesday, 05 Aug, 2026

అన్షు జమ్సేన్పా

41 సంవత్సరాల అన్షు జమ్సేన్పా ఒక సీజన్ లో రెండుసార్లు పర్వతారోహణ చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు.ఈ సాహస చేసేందుకుగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని దిరాంగ్ ఆమె స్వస్థలం . ఇద్దరు పిల్లలు తల్లి అయినా అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది.ఆమె తండ్రి ఇండో టిబెట్ సరిహద్దుల్లో ఒక పోలీస్ అధికారి తల్లి నర్స్. ఎవరెస్ట్ ను జయించేందుకు అన్షు రన్నింగ్, జిమ్, యోగా ఎంచుకుంది ఏరోబిక్స్ నేర్చుకుంది మొదటి చిన్నచిన్న […]

నీళ్లు తక్కువ అవసరం

ఇప్పుడు అపార్ట్ మెంట్స్ లో కూడా కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. కుండీలలో పెంచే మొక్కలకు నీళ్లు తక్కువ అయితే ఎండిపోతాయి ఎక్కువ అయితే కుళ్లి పోతాయి. వేడి అధికంగా ఉండే మొక్కకు పోసే నీళ్ళు ఎక్కువగా ఉండాలి. బాల్కనీలో ఉండే మొక్కలకు నీళ్ళు రెండు రోజులకొకసారి పోయలి కుండీలో ని మట్టిలో పెంకులు ఇసుక మట్టి కలిపి పోస్తే నీళ్ళు ఎక్కువగా పిలుచుకొని తేమగా ఉంటాయి. మొక్కలకు తెగుళ్ళు పురుగు పట్టకుండా ఆవాలను నీళ్లతో కలిపి బాగా […]

అస్సలు ఊహించలేదు

యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే కానీ ఇప్పుడు సైకాలజీ చదువుకుంటున్నాను కదా ఇప్పుడే ఎందుకీ సినిమాలు అనుకున్నాను కానీ కథ విన్నాక ఈ సినిమా చేయాలనుకున్నాను .ఇంతకు ముందు కొన్ని యాడ్స్ చేసిన అనుభవం మాత్రం ఉంది .నాకు వచ్చిన దాన్ని సహజంగా చేశాను తీరా చూస్తే నా కోసం సోషల్ మీడియా లో ఫ్యాన్స్ క్లబ్ లు కూడా ఉన్నాయని నాకు ఫాన్స్ ఉన్నారని తెలిసి ఎంతో ఆశ్చర్యంగా ఉందొ అంటుంది కృతి శెట్టి. వైష్ణవ్ […]

తులసి బెస్ట్ మెడిసిన్

ఎన్నో ప్రయత్నాలు చేసినా చుండ్రు సమస్య వదలకుండా ఉంటుంది. ఈ చిట్కా వైద్యంతో జుట్టు కుదుళ్లు బలంగా అవ్వటం తో పాటు చుండ్రు పోతుంది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తులసి చుండ్రును పోగొడుతుంది. కొన్ని తులసి ఆకులు తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల ఉసిరి కాయ పొడి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ ను తలకు పట్టించి మర్దనా చేయాలి అరగంట తర్వాత నీళ్లతో […]

ఆష్లే బైడెన్

జిల్,జో బైడెన్ ల కుమార్తె ఆష్లే బైడెన్ సామాజిక కార్యకర్త గా ఫ్యాషన్ డిజైనర్ గా ఆమె వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. స్కూల్లో చదువుతూ ఉండగానే ఒక కాస్మెటిక్ కంపెనీ తమ ఉత్పత్తులను జంతువుల చర్మాలతో తయారు చేస్తుందని  తెలుసుకుని దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాలు మొదలుపెట్టింది. డాల్ఫిన్ లా పరిరక్షణ కోసం కాంగ్రెస్ సెనేటర్ బార్బరా బాక్సర్ తో కలిసి పని చేసేలా తండ్రిని ప్రభావితం చేశారు దాని ఫలితంగా 1990 లో […]

పాపాయి స్నానం చేస్తున్నారా ?

చిన్న పిల్లలకు స్నానం చేయించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాపాయి పుట్టిన తొలి రోజుల్లో చర్మాన్ని సున్నితంగా ఒత్తిడి లేకుండా చేయండి మర్ధన నింపాదిగా ప్రశాంతంగా చేయాలి. చిన్నారులకు శరీరం మర్దన చేసేప్పుడు ముందు రెండు చేతులు బాగా రుద్దుకుంటే అరిచేతులు వెచ్చగా ఉండి ఆ స్పర్శ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ముందుగా చేతుల గోళ్ళు తీసుకోవాలి లేకపోతే పసిపిల్లల చర్మాన్ని గాయపరుస్తాయి. కొబ్బరి నీటితో ముఖం శరీర భాగాలు మర్దన చేస్తే […]

నేత్ర సౌందర్యం 

దేహంలో ఉండే అవయవాల్లో అతి ముఖ్యమైన కళ్లు నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. కళ్ళకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. పడుకునే ముందర రోజ్ వాటర్ లో కాటన్ ముంచి కళ్ళ చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము ధూళి పోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి కనుబొమ్మలకు కనురెప్పలకు రాత్రివేళ ఆముదం రాసి తెల్లవారి కడిగేస్తే ఒత్తుగా అయిపోతాయి. కళ్ళ చుట్టూ తేనెతో మసాజ్ చేస్తే కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోతాయి. పచ్చిపాలలో  కాటన్ ముంచి […]

భవ్య లాల్

అమెరికా ఉన్నత పదవికి ఎంపికైన ప్రవాస భారతీయురాలు భవ్యలాల్ ఒకరు. నాసా యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా జో బైడెన్ ప్రభుత్వం ఆమెను నియమించింది. నాసాకు సంబందించిన బడ్జెట్ ఆర్ధిక అంశాలపై కూడా సీనియర్ సలహా దారుగా భవ్య లాల్ పని చేస్తారు. నాసా భవితవ్యం పై బైడెన్ ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీం లో భవ్య సభ్యురాలిగా పనిచేశారు. భవ్య న్యూక్లీయార్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీలు చేశారు.

గుగులోతు సౌమ్య

నిజామాబాద్ జిల్లా రెంజల్‌ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు సౌమ్య భారత్ ఫుట్ బాల్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళా క్రీడాకారిణిగా ప్రాతినిథ్యం వహించనుంది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీకి ఆమె ఎంపికయింది సౌమ్య తండ్రి గోపి ఉపాధ్యాయుడు తల్లి ధనలక్ష్మి గృహిణి చైనా లో జరిగిన అండర్ సెక్షన్ పోటీల్లో ఆమె అత్యధిక గోల్స్ తో టాపర్ గా నిలిచింది తెలంగాణ ఉమెన్స్ లీగ్  లోనూ ఆమే టాపర్.

మొటిమలు పోతాయి

మొటిమలు దద్దుర్లు పోవాలంటే ఈ చిట్కా వాడుకోవచ్చు స్పూన్ సెనగపిండిలో చిటికెడు వంటసోడా పాలు కలిపి మొటిమలపై పది నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. మొటిమల మచ్చలు పడకుండా తగ్గిపోతాయి.అలాగే స్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు స్పూన్ల తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాలు ఆరిపోనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.అలాగే రోజు గ్లాసు టమోటా రసం లేదా క్యారెట్ రసం తాగితే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది రసాయనాలు ఉన్న క్రీమును వాడకుండా ముఖాన్ని […]

హోప్ ఫర్ లైఫ్

హోప్ ఫర్ లైఫ్ ఎన్జీవో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ని నాలుగు వేల మందికి పైగా పిల్లలకు చదువు చెబుతున్నారు హైదరాబాద్ కు చెందిన హిమజారెడ్డి. నేను అనాధాశ్రమంలో అనాధగా పెరిగాను అణగారిన వర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో అనాధ పిల్లలకు విద్య ఎలాంటి అవసరం ప్రత్యక్ష అనుభవం వారు. అందుకే ఈ ఎన్జీవో అంటున్నారు హిమజా రెడ్డి హోప్ ఫర్ లైఫ్ వివిధ రాష్ట్రాల్లో అనేక సమస్యలపై పనిచేస్తోంది. విద్యతోపాటు ఆరోగ్యం పై అవగాహన […]

మహిళల కోసం & Me

షితా మిట్టల్ అండ్ మి పరిశ్రమ కో ఫౌండర్ ఈ పరిశ్రమ ద్వారా పి సి ఓ ఎస్ అదుపు  చేసే పానీయం తో పాటు పీరియడ్స్ సమయంలో నొప్పి నివారించే చాకోలెట్స్ టీ తయారు చేస్తోంది. మహిళలను వేధించే యూరిన్ ట్రాక్ ఇబ్బందుల కోసం మూలికా పానీయం, జుట్టు రాలటం, చర్మం పేలవంగా మారటం వంటి సమస్యలకు పోషకాలతో కూడిన ప్రత్యామ్నాయాలను రూపొందించింది. ఐ.ఐ.టీ నుంచి బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన షితా మిట్టల్ యుఎస్ […]

పోషకాల అవిసెలు

ఈ కరోనా సమయంలో రోగనిరోధక శక్తి కోసం అవిసె గింజల లడ్డూలు తినండి అంటున్నారు డైటీషియన్స్. అవిసె గింజల్లో ఉండే పోషకాలు హార్మోన్లను సమన్వయం చేయడంతో నెలసరి క్రమానికి  క్యాన్సర్ కారకాలతో పోరాటం చేసేందుకు కీలకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వీటిలోని లిగ్ నాన్స్ మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి హార్మోన్ రీప్లేస్ మెంట్ తెరఫీ కి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వులు పీచుపదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. తక్కువ […]

ఇంటి పని సులభం

కొన్ని చిన్న టిప్స్ దృష్టిలో ఉంచుకుంటే ఇంటి పని సులువు అవుతోంది.ఇల్లు తుడిచే క్లీనింగ్ లిక్విడ్ తో పాటు కొంచెం ఉప్పు కలిపి నట్లయితే ఇంట్లోకి ఈగలు రావు. పన్నీర్ ని బ్లాటింగ్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. నేరుగా ఫ్రిజ్ లోంచి తీసి ఫ్రై చేయకుండా గోరువెచ్చని నీళ్ళలో వేసి తీసి ఫ్రై చేస్తే మెత్తగా తాజాగా ఉంటుంది. బాగా పండిపోయిన టమోటా లోని ఉప్పు వేసిన […]

కొన్ని రంగాల్లో ఇప్పటికీ వివక్షే

మహిళలు కొన్ని రంగాల్లో ఇప్పటికీ వివక్ష ఎదురుక్కోంటూనే ఉన్నారు అంటుంది యునెస్కో నివేదిక. ముఖ్యంగా పరిశోధన రంగంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతోంది. ఇందులో మహిళలు తక్కువే కాదు, మహిళా పరిశోధకులకు అందే వేతనం ,పదోన్నతుల శాతం తక్కువే అని ప్రస్తావించింది నివేదిక. జాతీయ సైన్స్ విద్యాసంస్థల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు.ముఖ్యంగా సైన్స్ విభాగాల్లో 40 శాతం ఇంజినీరింగ్ రంగం లో 20 శాతం మాత్రమే మహిళలు పట్టభద్రులు గా […]

జమునా బోరో

జమునా బోరో అంతర్జాతీయ బాక్సర్ గుహవ ట లో జరిగిన రెండవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించింది. అస్సాంలోని  దేకియాజులి మా సొంతూరు మా నాన్న లేరు. మా అమ్మ మా ముగ్గురు పిల్లల కోసం కూరలు వ్యాపారం చేసేది. మా స్కూలుకు వెళ్ళే దారిలో బాక్సింగ్ వంటి ఉషూ నేర్చుకునే వాళ్లను చూసాను. ఆ ఆట నచ్చి చేరిపోయాను. ఉషూ లో చేర్చమని అడిగితే మా అమ్మ ఓ […]

ప్రయోజనాలు అధికం

మానసిక ఒత్తిడి తగ్గించటంలో ముందుంది మష్రూమ్ టీ. రుచిగా ఆరోగ్యంగా ఉండటం తో పాట వీటిలో పీచు ప్రొటీన్లు విటమిన్లు ఖనిజాలు ఎసెన్సియల్ న్యూట్రి యాంట్లు పుష్కలంగా ఉన్నాయి.ఈ టీ తాగితే తప్పనిసరిగా బరువు తగ్గుతారు అంటారు ఎక్సపర్ట్స్. వీటిలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మష్రూమ్ క్యూబ్స్ నీ పొడిగా చేసి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు ఈ టీ తయారవుతుంది. వీటిలో ఉండే పోషకాలు పీచు, విటమిన్ల […]

కల నిజమైన క్షణం

హాబీగా చేసిన మోడలింగ్ మిస్ ఇండియా పోటీల్లో నన్ను నేను సృజనాత్మకంగా ఆవిష్కశించుకునేందుకు సాయం చేసింది అనుకుంటున్నాను కళాత్మకంగా ఆవిష్కరించుకునేందుకు నేను నేర్చుకున్న భరతనాట్యం కర్ణాటక సంగీతం  తోడ్పడ్డాయి .మిస్ ఇండియా టైటిల్ గెలిచేందుకు నాకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి అంటోంది మిస్ ఇండియా విజేత మానస వారణాసి. నేను అభిమానించే వాళ్లలో నటుడు సోను సూద్ రచయిత్రి ఎలిజిబెత్ గిల్బెర్జ్ ముందుంటారు వారిద్దరూ కళాత్మకంగా తమ శక్తిని వ్యక్తీకరించుకునేందుకు తగిన మార్గాలు కనుగొన్నారు. నేను గెలిచిన క్షణం […]

తెల్ల వెంట్రుకల ?

చిన్న వయసులోనే వెంట్రుకలు నడుస్తూ ఉంటాయి .ఎండలో ఎక్కువగా తిరిగి అతినీలలోహిత కిరణాలు బారిన పడటం గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు సబ్బులు వాడటం వల్ల కూడా జుట్టు నడుస్తుంది. చాక్లెట్లు జంక్ ఫుడ్ తినే వాళ్ళకి కూడా తెల్లవెంట్రుకలు తొందరగానే వస్తాయి.100 గ్రాములు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేసి వెచ్చగా ఉన్నప్పుడే జుట్టుకు రాసుకోవాలి అరకప్పు నువ్వుల నూనెలో రెండు స్పూన్ల మెంతి పొడి పావు కప్పు క్యారెట్ రసం కలిపి […]

పసిపాపల చర్మం జాగ్రత్త 

మారుతున్న వాతావరణ పరిస్థితులు పసిబిడ్డ చర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి.పిల్లల మృదువైన చర్మం లో సమతుల్యత లోపించి కాకుండా ఉండేందుకు ఎక్సట్రా మాయిశ్చరైజింగ్ బేబీ ఉత్పత్తులు వాడాలి.చర్మంలో తేమను పరిరక్షించే మూలికలు ఆయిల్స్ తో కూడిన ఉత్పత్తులు వాడాలి .వాతావరణాన్ని బట్టి చిన్నారులకు తలస్నానం చేయించే వేడినీళ్ళ విషయం మారుస్తూ ఉండాలి.ప్రకృతి సహజమైన బాదం, ఆలివ్, అలోవెరా తో చిన్నపిల్లల చర్మాన్ని పరి రక్షిస్తాయి.స్నానం చేయించిన తర్వాతనే చర్మానికి మాయిశ్చరైజర్లు రాయాలి.చలిగాలికి రఫ్ గా అయిపోయిన […]