Wednesday, 05 Aug, 2026

డ్రై క్లీనింగ్ బెస్ట్

కొంచెం ఖరీదే అయినా విలువైన చీరెలన్ని డ్రై క్లీనింగ్ కే ఇవ్వడం బెస్ట్. పెళ్ళిళ్ళకి, పేరంటాలకు ముఖ్యమైన ఫంక్షన్లకు కట్టుకుని విలువైన చీరెలకు నీటిలో తడిపితే ఆ షైనింగ్‌ పోతుంది. డ్రై క్లీనింగ్ లో దుస్తులను నీటికి బదులుగా ద్రవకాలతో శుభ్రం చేస్తారు. ఇందులో వాడే ద్రావణాలన్ని క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసినవే. పెట్రోల్, బెంజిన్ ఉపయోగిస్తారు. దుస్తులను పెట్రోల్ లో శుభ్రం చేసి డ్రై క్లీనింగ్‌ మిషన్ లో వేస్తారు. అందులో కార్భన్ టెట్రాక్లోరైడ్, […]

పోటిలో నల్లజాతి మహిళ

యూఎస్ లో స్టేట్ గవర్నర్‌ గా ఒక్క నల్లజాతి మహిళ కూడా ఎంపిక కాలేదు. ఆ లోటు తీర్చనుంది  స్టేసీ అబ్రహం. ఈ ఏడాది జార్జియా మద్యంతర ఎన్నికల్లో ఈమె నిలబడుతున్నారు. ఈమె గనుక గెలిస్తే యూఎస్ లో నల్లజాతి మహిళా గవర్నర్ గా అయిపోతారు. స్టేసీ మజీ న్యాయవాది. డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు ఈమెకు హిల్లరి క్లింటన్, కమలా హ్యారీస్ వంటి మహిళలు మద్దతిస్తున్నారు.

నాలుగు వేల రకాలున్నాయ్

ఆలుగడ్డలో చేరే ఆహార పదార్ధాల చిట్టా పెద్దదే. వంద గ్రాముల బంగాళ దుంపలో 77 కిలోల క్యాలరీలు, కార్బో హైడ్రేట్స్ 17.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రామ్, ప్రోటీన్లు, విటమిన్ సీ, విటమిన్ కే, నియాసిన్ ,క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం,పోటాషియం వంటి పోషకాలుంటాయి. మనకు దోరికేవి మట్టి రంగులో గుండ్రంగా కొడుగుడ్డు లా ఉండేవి. కాని ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల రకాల ఆలుగడ్డలున్నాయి. రోజ్‌ రెడ్, పర్పుల్, పెరూవియన్, ఆల్ రెడ్ పొటాటో, కింగ్ […]

మేకప్ వదలదు

సబ్బుతో మొహం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అనుకుంటాం కాని మేకప్ వదలటం చాలా కష్టం. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే దాన్ని తప్పనిసరిగా నూనె ఆధారిత మేకప్ రిమూవర్ ను వాడి తుడిచేయాలి. అటు తర్వాత నీళ్ళలో కడుక్కుంటే పోతుంది. అలాగే సబ్బులు నేరుగా శరీరం పై రుద్దకూడదు. ముందు చేతుల పై రుద్దుకుని ఆ నురగనే మొహం పై రాసి సున్నితంగా రుద్దితే మృతకణాలు పోతాయి. అలాగే మొహానికి వేసుకునే పీల్ ఆఫ్ మాస్క్ లు వేసుకున్న […]

మా అమ్మ కాస్త ఎక్కువ

అందరి అమ్మలు ప్రేమిస్తారు. మా అమ్మ రజనీ భాటియా ఇంకాస్తా ఎక్కువ అంటుంది అందమైన తమన్నా భాటియా. నేను మా అమ్మలాగే అంటాను అంటారు. టీనేజ్‌ నుంచే యాడ్స్ చేయడం మొదలు పెట్టాను. వెంటనే సినిమాలు ఇక స్నేహితులు ఎక్కువ.చదువు డిస్టెన్స్ ఎడ్యూకేషనే. ఎప్పుడు ఇక మా అమ్మే అసలే చిన్న పిల్ల ఒక్కటే ఎలావుంటుందో అన్న భయంతో మా అమ్మ అన్ని త్యాగం చేసింది. నా కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తనకంటు ఒక ఆలోచన […]

దుంప కాదిది

క్యాబేజీ, కాలీ ఫ్లవర్ ,బ్రకోలి కుటుంబానికి చెందిన ముల్లంగిలో తక్కువ క్యాలరీలు నాణ్యమైన పీచు దుంపల కనబడే ముల్లంగి ప్రత్యేకత. బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. ఉడికించకుండా సలాడ్ రూపంలో తీసుకుంటే విటమిన్ సీ అత్యధికంగా పొందవచ్చు. శరీర కణాల పైన ఒత్తిడి తగ్గించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ ముల్లంగిలో అధికం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి మధుమేహం రానివ్వకుండా కాపాడుతుంది ముల్లంగి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ లు […]

తీయగా అందంగా

ప్రపంచం మొత్తం మీద 15 వేల రకాల టమేటోలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన చక్కని వెలుతురు, ఎండ ఉంటే చాలు టమేటోల సాగు చాలా సులభం. వీటిలో రపుంజెల్ అనే రకం టమేటోను విదేశాల్లో ఎక్కువ సాగు చేస్తారు. కర్రల సాయంతో ఐదారు అడుగుల ఎత్తువరకు పెరిగే ఈ టమేటో మొక్కకు ఎర్రని గొలుసుల్లాంటి తీగల్లా వరసగా టమేటోలు వేలాడుతు పెద్దవవుతాయి. ఒక కొమ్మకు అటు ఇటు తీరుగా కాసిన ఎర్రటి టమేటోలు చాలా తియ్యగా ఉంటాయి. ఈ […]

అలల వర్ణాలు

హెయిర్ కలర్ తో  కొత్త లుక్ ఇవ్వలనుకొంటే బాలయేజ్ ట్రై చేయమంటున్నారు హెయిర్ స్టైలిస్టులు. ఇది ఒక కలరింగ్ టెక్నిక్ . ఒకే రంగులోని వివిధ ఛాయలతో హెయిర్ కి కలరింగ్ ఇస్తారు. ఆంబ్రే ,హైలైటెంగ్ ల కాంబినేషన్ ఇది. జుట్టు పాయలకు అలలు అలలుగా రంగులద్దుతారు. నేచురల్ హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తారు. తేలికైనవా,గాఢమైన రంగుతో చెపితే ,తలపైన ఆ రంగులద్దుతూ బ్లెండింగ్ చేస్తారు. అచ్చం సముద్రపు అలలని తలపిస్తూ పైన లేతరంగులోంచి కిందకు ముదురు షేడ్ […]

జ్ఞాపక శక్తి పెంచుతోంది

క్రమం తప్పకుండా బీట్ రూట్ రసాన్ని తీసుకొంటూ ఉంటే భవిష్యత్ లో అల్జీమర్స్  రాదంటున్నారు వైద్యులు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా కు చెందిన పరిశోధకులు. బీట్ రూట్ లోని బెటొనిన్ మెదడులో అల్జీమర్స్ కి కారణమైన రసాయనాలలు విడుదల కాకుండా చేస్తుందని తేల్చారు. బీట్ రూట్ రసం మెదడులో ఆక్సిజన్ శాతన్ని పెంచుతుంది. దీనితో మెదడు పని తీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని అంటున్నారు.

పూవుల పండగా

ప్రపంచంలో అన్నీ దేశాలు సంస్కృతి సంప్రదాయాలు నిలుపుకొంటూనే ఉంటారు. అట్లాంటిక్ సముద్రంలోని ద్వీపాల సముదాయమైన మదైరా లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పూవ్వుల పండగా జరుపుకుంటారు. అక్కడ దోరికే వింత వింత పూవ్వులతో రాజధాని ఫన్ చల్ వీధులన్నీ అలంకరిస్తారు. వాల్ ఆఫ్ హోప్ పేరుతో ఒక పూవుల గోడని అమరుస్తారు. ఎక్కడ చూసినా వసంతోత్సవ వేడుకలు నగరం మొత్తం పూవుల సువాసనతో గుబాళిస్తూ ఉంటాయి. లక్షలాది మంది సందర్శకులతో మదైరా కిటకిటలాడిపోతుంది.

ఓన్లీ జ్యూస్

వేసవిలో బజ్జీలు , గారెలు ఎప్పుడు నోరూరిస్తాయి. కాని ఈ వేసవి వెళ్లే వరకు వాటి ఊసు ఎత్తకండి అంటున్నారు డైటిషియన్లు. చివరకు డ్రై ఫ్రూట్స్ కూడా తగ్గించి చల్లని పానీయాలు వదిలేసి తాజా పండ్ల రసాలు ఫుల్ గా తీసుకొండి అంటున్నారు. సబ్జా గింజలు నానేసి ప్రతి ఫ్రూట్ జ్యూస్ లో కలుపుకోమంటున్నారు. ఈ వేసవిలో ఎన్నో రకాల పండ్లు వస్తాయి. అన్ని జ్యూస్ లకు పనికి వచ్చేవి నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, పూదినా రసం […]

ఎలా తిన్నా ఓకే

చారులో వేసిన ,పచ్చడి చేసినా, ఆకు కూరల్లోనూ కలిపి వండినా టోమోటో రుచే రుచి. కానీ టోమోటోను పచ్చిగా తింటే అదనపు పోషకాలు అందుతాయి అంటారు కొందరు. కానీ ఎలా తిన్న మంచిదే అంటున్నారు డాక్టర్లు. టోమోటోల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ మోతాదు ఉడికించటం వల్ల పెరుగుతుంది. అలాగే తేలిగ్గా గ్రహిస్తుంది. అలాగే ఉడికిస్తే ఇంకొన్ని పోషకాలు పోతాయి. అలా టోమోటో వల్ల అన్నీ ప్రయోజనాలు పోందాలంటే రోజుకో టోమోటో పచ్చిగానే తినమని, ఇక కూరలు […]

ఇవి తినేవి

కెనడాలోని డోరిటో అనే చిప్స్ కంపెనీ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి వినియోగదారుల మనసు దోచేసింది. ప్లాస్టిక్ ,గులాబీ కొమ్మలకు తినేందుకు వీలయ్యే గులాబీ పువ్వుల రేకులు లాగా తయారు చేసిన చిప్స్ అంటించి ఆ అందమైన పూల బొక్కేలు సోషల్ మీడియాలో పెడితే వీటికి లెక్కలేనన్ని ఆర్డర్లు వచ్చి పడుతున్నాయట, పూల చిప్స్ తినేందుకు ప్రజలు క్యూలు కట్టారు.

ఎంత అందంగానో

ఎండల్లో పల్లెటూర్లలో లాగా కుండల్లో చల్లని నీళ్ళు తాగితే లేదా చల్లని మజ్జిగ తాగితే అనుకుంటే అది పెద్ద కష్టం కాదు. చక్కని అందమైన డిజైనర్ కుండలు ఆన్ లైన్ లో అమ్ముతున్నారు, ఆర్డరిస్తే ఇంటికొచ్చేస్తాయి, ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే మిట్టీ కూల్ ఏకో ఫ్రెండ్లీ కుండల కోసం చూడోచ్చు.

పెంచడం తేలికే

ఇంట్లోనే కొన్ని మొలకలు పెంచుకోవచ్చు. చిలగడదుంప చాలా అందమైన తీగలా ఎదుగుతుంది. అలాగే అల్లం,ఉల్లి పాయలు కూడా పెంచుకోవటం సులభమే. చిలకడదుంపలు, బంగాళా దుంపలు కాస్తా పాడైతే దాన్ని పారేయకుందా సగానికి కోసి తరిగిన వైపు నిళ్ళలో ఉండేలా ఒక గ్లాసులో పడేస్తే చాలు, రెండు రోజులకొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే మొలకలు వస్తాయి. అప్పుడు కాస్తా మట్టిపోసి పెడితే ఇంట్లో అందమైన తీగల్ని చూడోచ్చు. వెల్లుల్లిని నేరుగా ఒక రెబ్బ తీసీ మట్టిలో పాతెస్తే మొలకలు […]

ఇక పూవులు తినేద్దాం

సమ్మర్లో అద్భుతమైన సలాడ్ తినాలను కొంటే ఇదిగో ఈ ఏడు రకాల పూలను కూడా కలిపి చూడండి అంటున్నారు షెప్స్.  సహాజమైన రంగులతో రుచితో సువాసనతో ఈ పూలతో చేసే వంటకాలు సలాడ్ ,డిజార్ట్ లు మతి పోగోట్టేస్తాయట. ఏ దేశం వెళ్ళిన భోజన ప్రియలు ఉంటూనే ఉంటారు.  పాశ్చత్యదేశాల్లో లావెండర్ , మందార , గులాబీలతో చేసే కాఫీలు, టీలు కాక్ టెల్స్, స్నాక్స్ చాలా పాపులర్.  మనకి మందార పూలు ,చామంతిపూల టీలు తెలుసు.  […]

ఇప్పటికి 25

52 సంవత్సరాల ఊర్మిళ సురానా స్పెయిన్ లో జరిగే మాస్టర్ అథ్లెటిక్ మీట్ మారథాన్ లో పాల్గొనబోతుంది. ఆమె 24 నెలల్లో 25 మారథాన్లలో పాల్గొంది. ఆమె కోయంబత్తురులో ఉంటారు. వివిధ రాష్ట్రాలలో జరిగే మారథాన్లలో పాల్గొంటుంది. వ్యయమాలు చేస్తూ ఈత, బ్యాడ్మీంటన్ లో శిక్షణ తీసుకుని కోవై, ముంబై మారథాన్ లలో పరిగెత్తిన ఆమె ప్రతిచోట పథకాలు గెలుచుకుంది. తాజగా సెప్టెంబర్ లో స్పెయిన్ లో జరగనున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో […]

అల్టిమేట్ ఫ్యాషన్ క్వీన్

మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్న ప్రియాంక చోప్రా ,ఐశ్వర్య రాయ్ తో పోలిక తీసుకుంటే మానుషీ చిల్లర్ నిస్సందేహంగా ప్రత్యేకమైనదే అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆమె షేర్ చేస్తున్న అందమైన డ్రెస్స్ లు , ఆమె ఎంచుకొన్న రంగుల ఎంపిక ఆమెను దేవతలాగా చూ పెడుతున్నాయి. ఆమె ధరించిన పీచ్ కలర్ ఫెదరెడ్ గౌన్ , బాడ్స్, సీక్వెన్స్ తో చేసిన ఎంబ్రాయిడరీ పనితనం ,ఆమెను ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని క్వీన్ […]

అద్దం ముందు కూర్చొండి

ఇంట్లో అందరూ ఎవారిదారిన వాళ్ళు బిజీగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతే, అందరికీ అన్ని అమర్చి పెట్టే అమ్మ ఇంట్లో ఒక్కతే అయిపోయి భోజనం కూడా ఏం తింటాలే ఒక్కదాన్ని అనుకుంటుంది. జపాన్ పరిశోధనలు ఏం చెపుతున్నయంటే ఇలా ఇంట్లో ఉండి పోయె వృద్ధులు, ఇంట్లో ఉండే ఇల్లాలు అద్దం ముందు కూర్చొని భోజనం చేయాలట. అలా అలవాటై పోతే ఒంటరిగా ఉన్నమన్న ఫీలింగ్ పోయి చక్కగా భోజనం చేస్తారట. పైగా అంతసేపు అద్దంలో ప్రతి బింబాన్ని […]

ప్రోటీన్లు పుష్కలం

మాంసాహారం లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయనుకొంటారు. కానీ శాఖహారంలోనూ ,మాంసంతో సమానంగా ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఏ శాఖహారంలో ఏ ఏ ప్రోటీన్లు ఎంత నిష్పత్తిలో ఉంటాయో చార్టు వేసుకుంటే ప్రతి రోజు ప్రోటీన్ల కొరత రాకుండా ఏం తినాలో తెలుస్తుంది. న్యూ ట్రీషనిస్టుల కొలతల ప్రకారం నట్, బటర్స్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఓట్ మీల్ ఒక కప్పులో ఆరు గ్రాములు, బ్రోకాలీ ఒక సర్పింగ్ లో ఐదు గ్రాములు, కాలీఫ్లవర్ ఒక […]