Saturday, 01 Aug, 2026

అచ్చంగా సంజీవని !

కలోంజి దీన్నే నల్లజీలకర్ర అంటారు . ఈ కలొంజి ని భూమి పైన దొరికే సంజీవని అంటారు. రుచికి సువాసన కోసం దీన్ని వంటకాల్లో ఎక్కువ వాడతారు . విటమిన్లు ,కాల్షియం ,ఐరన్ ,జంక్ ,మాంగనీస్ ,కాపర్ వంటి పోషకాలు ఈ  కలోంచి లో ఎక్కువగా ఉన్నాయ్ . జుట్టు పొడిబారటం ,వెంట్రుకలు రాలిపోవడం ,రంగుమారిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ కలోంజి నూనె తలకి మర్ధనా చేసుకొంటే వెంట్రుకలు బలంగా పెరిగి,ఆకర్షణీయంగా కనిపిస్తాయి . అధిక […]

ప్రోటీన్లు నిండిన సొయా 

సోయాను మాంసానికి ప్రత్యామ్నాయం అంటారు. దీనిద్వారా నాణ్యమైన ప్రోటీన్లు అందుతాయి ఎమైనో ఆమ్లాలు లభిస్తాయి. శాఖాహారాలకు అవసరం అయేలా  ప్రోటిన్లు లభించేది సోయా ద్వారానే-పోషక పదార్ధాలు లోపం వున్నవారికి సోయ మేలు చేస్తోంది.సోయ ఐసొలేట్స్,ఎడమేరు,సోయనట్స్ సోయాబీన్స్ టోపు,సోయామిల్క్, సొయా యోగర్ట్  మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఎడమేరు ఉడికించి ఉప్పు కలిపి తినవచ్చు. సోయను సుప్ లలో సలాడ్స్ లో వాడుకోవచ్చు. ఆవుపాల బదులు సోయపాలు తాగవచ్చు. పాలు నేరుగా తాగలేకపోతే అల్పాహార వంటకాల్లో ఉపయోగించవచ్చు. శాండ్ విచె,కాన్ […]

“నరసింహస్వామి ప్రసాదం”

నెల్లూరు జిల్లాలోని పెంచలకోన రాపూరు మండలంలోని నరసింహస్వామి దర్శించి తరలించాల్సిందే. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని భక్తికి దాసుడై హిరణ్యకశిపుని అంతమొదించి ఆ దట్టమైన అడవిలో హుంకరిస్తూ సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమర్తే చెంచులక్ష్మి చెలి కత్తెలతో అడవిలోకి వస్తుండగా నరసింహుడిని చూచి సఖులు భయపడిన చెంచులక్ష్మి మాత్రం ధైర్యంగా నిలబడింది.అది చూచిన స్వామి మెచ్చి ఆమెని వివాహం చేసుకున్నారు.స్వామి వారు స్వయంభూ అవతారం.సర్పాకార కొండల నడుమ ఈ ఆలయం ఉంది.దీనిని పెనశీల కొండ అని కూడా అంటారు. మహిమలు […]

వెనక బడిపోతున్నారు 

టెక్నాలజీ మనుషులకు మేలు,కీడు సమాన నిష్పత్తి లో చేస్తుంది అంటున్నాయి అధ్యయనాలు. పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అదో వ్యసనం గా మారింది. ఆ ఫలితంగా,చదువు ఆరోగ్యం రెండు దెబ్బతింటున్నాయి. ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరి తనం ఉద్రేకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశోధనలు. వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి తగ్గుతోందని పరీక్షలంటే కంగారు పడుతారని చెపుతున్నారు. మూడు వందల మంది కాలేజీ విద్యార్థులు పైన చేసిన ఒక తాజా […]

మార్చేస్తుంటేనే అందం 

ఇల్లు అందంగా అనిపించాల అంటే రంగుల అమరికలో శ్రద్ధ పెట్టండి, ఇంటికి చక్కని లుక్ వస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ ఇంట్లో అన్ని గదులకు ఒకే రంగు బావుండదు. పడకగదికి లేదా హాల్లో ఒక గోడకు కాస్త ముదురు రంగు వేస్తే ఆ రూమ్ కి ప్రత్యేకత వచ్చేస్తుంది. సోఫాలు,కుర్చీల్లో వేసే పిల్లో కవర్స్ ఒకే మాదిరివి కాకుండా,ఒక్క పిల్లో కి ఒక రంగు కవర్ వేస్తే ఇంట్లో ఆ రంగుల ప్రత్యేకత తెలుస్తు ఉంటుంది. అలాగే కర్టెన్స్ […]

సువాసనల మయం

ఇల్లంతా పరిమళ భరితంగా ఉంటే ఒత్తిడి మాయం అవుతుంది . కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన సెంటెడ్ వాక్స్ బ్యాగ్లు ఇలా సువాసనలు వెదజల్లేవే . పువ్వుల పరిమళం ,అత్తరు సువాసన కలిపిన ఈ బ్యాగ్లు ఎయిర్ ఫ్రెషనర్లు ,ఆరోమా ఉత్పత్తులకు కొత్త రూపం . ఆరోమా నూనెలు పూలు ,పండ్లు సుగంధ ద్రవ్యాల నుంచి తీసిన ఎక్సట్రాక్ట్స్ తో నేరుగా వాటిని కలిపిఈ బాగ్స్ తయారు చేస్తున్నారు . పువ్వులతో నిండిన రకరకాల సువాసనలు దొరికే […]

శబ్దానికి శక్తి

వ్యాయామాలు చేస్తుంటే సాదారణంగా అలసట వస్తూ  ఉంటుంది . జిమ్ లో వర్క అవుట్స్ ,ట్రెడ్ మిల్ లేదా ఆరుబయట పరుగులు నడక ఏంచేస్తున్న అలసట వస్తుంది అలాటప్పుడు ఫాస్ట్ బీట్ తో సంగీతం ఎంచే గుండె వేగం పెరిగి అలసట కాస్త తక్కువగా ఉంటుందంటున్నారు అధ్యయనకారులు . సంగీతానికి భాష అక్కర్లేదు లయ ముఖ్యం . లయతో కూడిన శబ్దం జీవక్రియని ప్రభావితం చేస్తుంది అంటున్నారు . నిముషానికి 90 తరువాత 130 ,ఆ తరువాత […]

ఉల్లిపాయ ముట్టరు

ఊరు ఊరు ఉల్లిపాయలు ,వెలుల్లి ముట్టరు . మాంసాహారం ,మద్యపానం అనే మాటే లేదు బీహార్ లోని జహానాబాద్ జిల్లాలో త్రీలోకి బిగహ గ్రామస్థులు కొన్ని తరాలుగా ఉల్లిపాయ ఊసెత్తిలేరు . ఆ ఊరిలో ప్రాచీనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది . స్వామిని నియమ నిష్ఠలతో ఆరాధించాలని అలా నియమాలు పాటిస్తేనే గ్రామం సురక్షితంగా ఉంటుందని గ్రామస్థుల నమ్ముతారు . వందల ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగుతుంది . ఈ ఊరికి కోడలు గా వచ్చిన వారుకూడా […]

అత్యంత విలాసవంతం ఈ నగలు

ముత్యాల ఆభరణాలు అత్యంత విలాసవంతమైనవి అందమైనవి కూడా . రాజ కుటుంబీకులు వీటిని  ధరించేందుకు ఇష్టపడేవారికి ముత్యపు చిప్పల నుంచి సహజంగా తయారై వచ్చిన ముత్యాలు చాలా తేలికైనవి వీటితో ఎంతో ఫ్యాషనబుల్ కనబడే నగలు తయారు చేస్తారు . ముత్యాలు ,బంగారం కలిపి చేసిన ఆభరణాలు ఎప్పటికి ఫ్యాషనే . విలువైన  ముత్యాల ఆభరణాలు సెలబ్రెటీల ఎంపిక .మంచి ముత్యపు స్టంట్స్ ,ముత్యాలు,పచ్చలు కూర్చిన గాజులు ముత్యాల వరసలో ముచ్చటగా వదిగిపోయే వజ్రాల లాకెట్ ట్రెండీగా […]

పాలు మంచివి

పాలు పాల ఉత్పత్తులైన పెరుగు,పన్నీర్ ,చీజ్ నుంచి కాల్షియం ,ప్రోటీన్లు అలాగే వెన్న తీయని పాల నుంచి అధిక మొత్తంలో  కొవ్వు శక్తి లభిస్థాయి . ఎదిగే వయసులో పిల్లల కు ఈ పోషకాలు అత్యవసరం.  పాలలోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తప్పనిసరి . సంవత్సరం లోపు పిల్లలకు తల్లిపాలు లేదా వైద్యుడు సూచించిన ఫార్ములా  పాలు ఇవ్వాలి . రెండేళ్ళు దాటినా పిల్లలకు రోజుకు రెండు ,మూడు గ్లాసుల పాలు ఇవ్వవచ్చు . పాలలోని పోషకాలు […]

“ఐరావతేశ్వరుని ప్రసాదం”

తమిళనాడులో తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంకు షుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరావతేశ్వరుడ్ని చూసి తరిద్దా రండి. ఈ ఆలయం చోళుల రాజ్యంలో నిర్మించారు.దుర్వాస మహాముని కోపానికి ఇంద్రుని వాహనమైన ఐరావతం తన తెల్లని రంగు శాపం వలన మారిపోయింది. శాపవిమోచనకు ఐరావతం ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థించగా పూర్వ రూపాన్ని రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరుడు ప్రసాదిస్తాడు.ఈ దేవాలయంలోని మెట్లు ధ్వనించే విధంగా ఉంటాయి.ఇక్కడ యమతీర్ధం అనే కోనేరులో స్నానం చేసిన సర్వ పాపాలు తొలగించి […]

ఎన్నెన్నో వర్ణాలు

పూవుల గుత్తిలో అందమైన రంగురంగుల పూలు ఆకులూ కలిపి ఆకర్షణీయం తయారు చేయటం చూశారు . కానీ ఒక చిన్ని మొక్కల్లో హరివిల్లు రంగులో అనేక మైన పూలు పూయిస్తున్నారు . పండ్లు ,కూరగాయల్ని అభివృధి చేసే గ్రాఫ్టింగ్ పద్దతిలో ఈ పూల మొక్కలు సృష్టి చేస్తున్నారు . పొడవాటి కాండం వచ్చేలా ఒక మొక్క పెంచి దాని పై భాగంలో వేరువేరు పూలు వచ్చేలా వేర్వేరు మొక్కలతో గ్రాఫ్టింగ్ చేస్తున్నారు . అప్పుడు ఒక కుండీలో […]

రిలాక్స్ అవ్వండి

మనుష్యులు చక్కగా పనులు చేసుకోవాలి . నైపుణ్యాన్ని ప్రదర్శించి తీరాలి కానీ ఆ పని చేయటంలో కాస్త రిలాక్సేషన్ మాత్రం అవసరం అంటారు నిపుణులు. పని వత్తిడి నుంచి బయట పడేందుకు పనిచేస్తున్న చోటే క్రమ పద్దతిలో రిలాక్స్ అవటం నేర్చుకోవాలి. పని మధ్యలో ఒక రెండు నిముషాలు బ్రేక్ తీసుకోని శరీరాన్ని గట్టిగా ఒకసారి కదిలించటం ,చేతులు చాచటం,మోచేయి భుజ భాగాల విదిలించటం చేయాలి . లేచి నిలబడి అటూ,ఇటూ ఓసారి నడిచి శరీరాన్ని రిలాక్స్ […]

ప్రింటెడ్ కాటన్స్ బెస్ట్ 

ఎండ వేడి మొదలైన కొద్దీ వంటికి మెత్తగా తేలికగా అనిపించే కాటన్ దుస్తులు ధరిస్తే హాయిగా ఉంటుంది. అమ్మాయిలకు ప్రింటెడ్ కాటన్ చుడిదార్ మంచి ఎంపిక. ప్రింటెడ్స్ కాటన్స్ తో కాంట్రాస్ట్ రంగులు ఎంచుకొంటే మరింత బావుంటుంది. టాప్ ఉన్నా డిజైన్ ను పోలిన రంగుతో బాటమ్ ఎంచుకోవాలి రెండింటికీ మ్యాచ్ అయ్యే కలర్ ఫుల్ చున్నీ వేసుకోవాలి. బెల్ హాండ్స్ లాంగ్ హాండ్స్ స్లీవ్ హాండ్స్ ఎలాటి డిజైన్ లో కుట్టించుకొన్న కాటన్ చుడీదార్ లో […]

అందుకే అల్జిమర్స్ 

ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవాళ్ళలో జ్ఞాపకశక్తి చాలా తొందరలో తగ్గి పోతుంది అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఎక్కువ సమయం కూర్చుంటే మధుమేహం,గుండె జబ్బులు బారిన పడే అవకాశం చాలా ఎక్కువ అంటున్నారు. గంటల కొద్దీ కూర్చుంటే మెదడులోని జ్ఞాపకశక్తి కి సంబంధించిన మడియల్ టెంపోరల్ లోబ్ పొర పల్చబడుతోందని ఈ పరిశోధనలో నిర్ధారణ అయింది. దానితో జ్ఞాపకశక్తి తగ్గి డెమన్షియా కు దారి తీస్తుంది. ఒక సారి పొర దెబ్బ తింటే ఎంత వ్యాయామం చేసిన […]

మిల్స్ ప్రోటీన్స్ తో ఆరోగ్యం 

నిత్యం రెండు గ్లాసుల పాలు తాగితే కాన్సర్ నుంచి కొంతలో కొంతయినా ఉపశమనం కలుగుతోంది అంటున్నారు నిపుణులు. పాలలో ఉండే మిల్క్ ప్రోటీన్ కాన్సర్ కణాలు నాశనం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్ స్వీడన్ నిపుణులు గుర్తించారు. మిల్క్ ప్రోటీన్ గల ఏ పదార్ధాలైన అవి కేన్సర్ కణాలను నాశనం చేస్తాయి ఎక్కువ మిల్క్ ప్రోటీన్ తీసుకొనే వాళ్ళలో కేన్సర్ సమస్యలు పెద్దగా కనిపించలేదని నిపుణులు తమ అధ్యయనం లో గుర్తించారు.

అదేం లాభం లేదు 

భోజనం బదులు పళ్ళు కూరగాయ రసాలు తీసుకొంటే బరువు తగ్గుతారు అనుకోవటం కేవలం భ్రమే అంటారు ఎక్సపర్ట్స్. ఒకటి రెండు రోజుల పాటు కేవలం పళ్ళు కాయగూరల రసాలు తీసుకోవటం ఒక పద్దతిగా ఉంది. దీనివల్ల ఆ ఒకటి రెండు రోజుల మేరకు కాస్త బరువు తగ్గినా ఆ తగ్గిన బరువు వెంటనే పెరిగిపోతుంది. రెండు రోజులో అత్యంత తక్కువ కేలరీలు తీసుకోవటం వల్ల శరీరంలో గైకోజెన్,నీరు మాత్రమే తగ్గు ముఖం పడతాయి. కొవ్వు తగ్గదు. తర్వాత […]

“యాదగిరి నరసింహస్వామి ప్రసాదం”

హైదరాబాదులో ఉన్న శ్రీ యాదగిరి నరసింహస్వామి ఆలయం దర్శనం చేయడం వల్ల సకల శుభాలకు నాంది పలికినట్టు.ఆ స్వామిని దర్శించి వద్దాం పదండి.  పాల్గుణ మాసం వచ్చేసింది ఇంకా వివాహాలతో సందడిగా వుంటాము.యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అయింది. కన్నుల పండుగగా వుంటుంది.ఉగ్రరూపుడైన నరసింహస్వామి మనలో వున్న అహంకారం తొలగించి ఙ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉగ్ర రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి వున్నారు.ఇక్కడ గుట్ట మీద స్వామి అంగరంగ వైభవంగా పూజలు […]

ముఖాకృతిని బట్టి ఎంపిక 

ఇయర్ రింగ్స్ లో వందల రకాల మోడల్స్ కనిపిస్తాయి. కంటికి నచ్చిన డిజైన్ ఎంపిక చేసుకొంటారు. కానీ ముఖాకృతికి నొప్పే ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోండి అంటూ ఎక్సపర్ట్స్ . గుండ్రని మొహానికి కోలగా ఉండే ఇయర్ హ్యాంగింగ్స్ చక్కగా సూటవుతాయి. టియర్ డ్రాప్స్. హాంగర్లు అందంగా ఉంటాయి. కోలా ముఖాకృతికి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా సూట్ అవుతాయి. హృదయాకారం గల ముఖం అయితే డాంగిల్స్,టియర్ డ్రాప్స్ షాండ్లియర్ ఇయర్ రింగ్స్ బావుంటాయి నల చదరపు […]

షాపింగ్ కు లక్షల్లో జీతం 

ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒక అద్భుత అవకాశం ఇస్తోంది షాప్ బ్యాక్ వెబ్ సైట్,ఈ జాబ్ కేవలం షాపింగ్ చేయాలి. అంతే. ఈ సంస్థ ఎంపిక చేసే ఆఫీసర్ వెబ్ సైట్ లోని వేరు వేరు బ్రాండ్ల వస్తువులు కొనుగోలు చేయాలి. అలా కొంటూ ప్రతి ఉత్పత్తి మీద ఆ సైట్ లు క్యాష్ బ్యాక్ ఎలా పొందవచ్చో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేయాలి. ఇలా షాపింగ్ చేస్తే నెలకు ఎనిమిది లక్షలు […]