Chinna Maata
“సంగమేశ్వరుడి ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంగంజాగర్లమూడి, గుంటూరు తెనాలి రహదారిలో మనకు బాలాత్రిపురసుందరి సమేత శ్రీ సంగమేశ్వరాలయం దర్శన భాగ్యం కలుగుతుంది. కాశీ విశ్వేశ్వరుడు,పాప హరేశ్వరుడి సంగమమే ఈ సంగమేశ్వరుడు.తొలుత ధ్వజరోహ దర్శనం తరువాత గంగాభవాని మరియు పోలేరమ్మను, కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి.ఈ క్షేత్రానికి తుంగభద్ర మరియు బాలకృష్ణ నదులుగా కృష్ణమ్మ ప్రవహిస్తుంది. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాలు,పండ్ల రసంతో అభిషేకించడం. -తోలేటి వెంకట శిరీష
అన్నీ లాభాలే
ఇప్పుడు వంకాయలు అనేక రంగుల్లో వస్తున్నాయి ఊదా,పసుపు,తెలుపు,నలుపు గులాబీ రంగుల్లో,రకరకాల ఆకారాల్లో దొరుకుతున్నాయి. వంకాయలో పీచు అధికం బి-1,బి-6 విటమిన్లు చాలా ఎక్కువ 100 గ్రాముల వంకాయల్లో 15 కెలోరీలు మాత్రమే ఉంటాయి ప్రత్యేకంగా ముదురు రంగు వంకాయి తొక్కలో యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవకణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది మెదడు కణాల చుట్టు వుండే కొవ్వును కాపాడుతోంది. వాటిలో పోషక విలువలు పోకుండా ఉండాలంటే సన్నని మంట పైన […]
సూప్ స్నానం తో అందం
ఆరోగ్యం కోసం సుప్ తీసుకొంటారు. కానీ అందం కోసం ఏకంగా సూప్ లో స్నానం చేయటం గురించి ఎక్కడైనా విన్నామా? జపాన్ లో ఇ స్నానం ఇప్పుడు చాలా ప్రసిద్ధి. వేడి వేడి సూప్ టబ్ నిండా పోసి అందులో కూర్చొని స్నానం చేస్తే చర్మ సౌందర్యం మెరుగువుతోంది అంటారు జపాన్ లో స్పా నిర్వాహకులు,చైనా జపాన్ లలో నూడుల్స్ సూప్ ప్రధాన ఆహారం. వీటిలో ఇప్పుడు స్నానాలు కూడా చేస్తున్నారు. కొన్ని హోటల్స్ లో ప్రత్యేకంగా […]
క్యాప్సుల్ గదులు
హోటల్ రూమ్స్ అంటే అన్ని సదుపాయాలతో సౌకర్యంగా ఉండేవి కదా. ఇక్కడ బస చేయాలంటే ఖరీదు ఎక్కువే కొన్ని హోటల్స్ లో తక్కువ అద్దెకు లాకర్స్ , డార్శెటరీ ల సౌకర్యం ఉంటుంది. కానీ జపాన్ లో సామాన్యుల బడ్జెట్ కు అనుగుణంగా ప్రత్యేక ఆలోచన చేశారు.అక్కడ పాడుకొనేందుకు గదులు నిర్మిస్తారు. వీటిని కేప్సూల్ గదులు అంటారు. ఒక మామూలు హోటల్ గది స్థలంలో కనీసం ఇరవై ముప్పయ్ మంది పాడుకొనే గదులు ఏర్పాటు చేస్తారు. అద్దె […]
కొరియోగ్రఫీ అనీ
వెండి తెర వెనకే ఎందరో స్టార్స్ ఉంటారు . మనం తెరపైన చూసే హీరో హీరోయిన్ల నైపుణ్యాలన్నీ ఆ తెరవెనక పని చేసే వారిదేనంటే ఆశ్చర్యం లేదు. అనితా లామా పశ్చిమ బెంగాల్ నుంచి హైద్రాబాద్ వచ్చింది . చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం దక్కించుకొంది . ఇక ఆ తరువాత తెలుగు,తమిళం,బాలీవుడ్ సినిమాలలో మొత్తం 200 పైగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారామె . పూరి […]
సైజ్ మారుతాయి
బ్రా సైజు ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోకండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . బరువులో వచ్చే మార్పులను బట్టి బ్రా సైజ్ మారుతుంది . సైజు ను సరిగ్గా కొలుచుకోవాలి . టేప్ తో వీపు నుంచి వక్షోజాల మీదిగా ముందుకు తెచ్చి నంబర్ చూసుకోవాలి . బ్రాలను మడత పెట్టకూడదు . చిన్న హేంగర్ లకు తగిలించాలి . ట్రయిల్ రూమ్ లో సరిచూసుకొన్నాకే కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ లో ఉతికేప్పుడు హుక్ పెట్టి వాషర్ […]
వెండి పాత్రాలు ఆరోగ్యం
మిలమిల మెరిసి పోయే వెండిలో బాక్టీరియా ,వైరస్ లను దగ్గరకు రానివ్వని లక్షణం ఉంది . ఆక్సిజన్ తాకిడి రంగు మారుతుంది కానీ తుప్పు పట్టదు . అందువల్ల ఇందులో ఆహార పదార్దాలు నిల్వ ఉంచినా ఆరోగ్యానికి ఎలాటి హానీ ఉండదు . పరిశోధకులు కూడా వెండికి రోగాలను నయం చేసే శక్తి ఉందంటున్నారు . పాత రోజుల్లో మంచి నీళ్ళు ,వైన్ ,వినిగర్ వంటివి పాడవకుండా సిల్వర్ తో చేసిన బాటిల్స్ వాడేవాళ్ళు,పాలు తాజాగా ఉండేందుకు […]
డబ్బే సమస్య కు కారణం
భార్య భర్తలగొడవలకు సగం కారణం డబ్బే అంటున్నారు ఎక్సపర్ట్స్. విడాకుల వ్యవహారాల్లో సగం కేసులు ఆర్ధిక వ్యవహారాలతో ముడిపడినవే. ఇక్కడ సమస్య డబ్బు లో లేదు ఒక అధ్యయనం ప్రకారం,30 శాతం మంది దంపతుల్లో డబ్బు విషయం నిజాయతీగా వ్యవహరించటం వల్ల గొడవలు వచ్చాయని రుజువైంది. జీవిత భాగస్వామి కి తెలియకుండా అప్పులు చేయటం ఆ వ్యవహారం పూర్తిగా దాచి పెట్టటం,ఇక ఆ అబద్దం సంపాదన విషయం లోకి వెళ్ళటం మొత్తంగా గొడవలకు కారణం అవుతున్నాయి. దుబారా […]
రీఛార్జ్ చేసే హాబీలు
ఖాళీ సమయంలో ఎదో ఇష్టమైన హాబీతో గడపండి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు . శారీరక సామర్థ్యం ఉపయోగించే క్రీడలు హాబీగా ఉన్నవాళ్ళు లో మల్టీ టాస్కింగ్ సామర్థ్యం 15 శాతం ,ఉత్పత్తి సామర్థ్యం 23 శాతం పెరుగుతుందట . వంటపని మెదడు సామర్ధ్యాన్ని పెంచుతుంది . కంప్యూటర్ నైపుణ్యం మెదడుని చురుగ్గా మార్చుతుంది . వేగంగా వీడియో గేమ్స్ ఆడపిల్లల్లో నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుంది . కుట్లు అల్లికలు ఇష్టం అయిన వాళ్ళలో జ్ఞాపక శక్తి […]
డిప్రషన్ తగ్గిస్తుంది
డిప్రషన్ సమస్యను ఆరోగ్యకరమైన ఆహారంతో తగ్గించుకోవచ్చని చెపుతున్నారు అధ్యయన కారులు . మ్యుఖంగా ప్రోటీన్ పదార్దాలు స్వీట్లు మానేసి ,పోషకాహారం తీసుకొంటే 32 శాతం మందికి డిప్రషన్ తగ్గిందట . శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రషన్ లక్షణాలు కల్పిస్తాయి . ముడిపదార్దాలు సీ ఫుడ్ తినమంటున్నారు . విటమిన్ డి లోపంవల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది . గనుక ఉదయపు ఎండలో తిరగాలి. చేపలు,పుట్ట గొడుగులు తినాలి . ఒమేగా లోని ఫ్యాటీ ఆమ్లాల […]
కొనటం లో మజా
షాపింగ్ విషయంలో వినియోగదారులు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకొనేందుకు ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే లో 89 శాతం మంది వినియోగదారులు పెద్ద ప్రణాళిక లేకుండానే షాపింగ్ కు బయలుదేరుతారు. సగం మంది సరసమైన ధరలు ఉంటే కొందాము అనుకొంటారు. 28 శాతం మంది రాయితీలు ఆఫర్ల కోసం అడుగుముందుకు వేస్తారు. ఎక్కడ దొరకని ప్రత్యేకమైన వస్తువుల కోసం 22 శాతం,మంది,ఎవళ్ళో బావుందని చెప్పారు కదా అవి ఆరోవంతు మంది షాపింగ్ చేస్తారట తమ ఎంపికలు […]
నల్ల మచ్చలకు క్యారెట్ జ్యుస్
పుష్కలంగా ఎ ,సి విటమిన్లు ఉంటే క్యారెట్లు ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు సౌందర్య నిపుణులు . మొటిమలు తగ్గించటంలో క్యారెట్లు ఖరీదైన క్రీముల కంటే బాగా పనిచేస్తాయి . రెండు క్యారెట్లు మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి అందులో తేనె ,రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ మాస్క్ వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి . మొటిమలు చితికి అందులో సీఓమ్ బయటికి రాకుండా […]
ఎర్రని పెదవులు
శరీరంలో మెలినిన్ శాతం తక్కువ ఉంటే కొందరికి పెదవులు మంచి రంగులో ఉంటాయి. ఎక్కువ సేపు ఎండలో ఉన్నా అసమానతలు,వాడే మందులు వల్ల కొందరి పెదవులు నల్లబడుతూ ఉంటాయి. ఇంట్లో లభించే వస్తువులతో పెదవులు నల్లబడ కుండా కాపాడుకోవచ్చు. తేనె,గులాబి నీరు,కీరదోస,కలబంద రసం కలిపి రోజు పెదవులపై రాసుకోవాలి. కీరదోస ముక్కలు పెదవులు రుద్దుకోవాలి. అలాగే ఐదారు గులాబీ రేకులు పచ్చిపాలతో రెండు గంటలపాటు నానబెట్టి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించాలి. ఇలా […]
“మత్స్యగిరి నరసింహస్వామి ప్రసాదం”
నల్గొండ జిల్లాకి సుమారు 12కి.మీ. దూరంలో ఉన్న వలిగొండ గ్రామంలో స్వయంభూగా వెలసిన మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని వద్దాం పదండి. తపస్సు చేసుకోవటానికి మునులు మంచి ప్రదేశం కొరకు వెదకుతున్న తరుణంలో ఈ ప్రదేశం ప్రశాంతంగా వున్నదని తపస్సు చేస్తున్న సమయంలో ఆటంకాలు ఏర్పడిన సమయంలో నరసింహస్వామి ఆ కొండని మూడు భాగాలుగా విభజించాడు.ఆ కొండల నడుమ ఉన్నయి మూడు గుండాలు.స్వచ్ఛమైన నీటితో చేపలు మూడు నామాలతో 365 రోజులు భక్తులకు దర్శనం ఇస్తాయి.కోరిన […]
ఇరవై తరాలు తెలుసు
మనలో ఎవరైనా తాతముత్తాతల పేర్లు ఏమిటి అని అడిగితే చెపుతారు కానీ అంతకంటే వెనక్కపోయి ముత్తాత తాత ఎవరంటే చెప్పలేకపోతారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన గాలో తెగ ప్రజలు మాత్రం సునాయాసంగా 20 తరాల పేర్లు చెప్పేస్తారు. పేర్లు గుర్తు పెట్టుకోవటంలో వీళ్ళు ఒక పద్ధతి కని పెట్టారు. తండ్రి పేరు లోని చివరి అక్షరాన్ని అతని కొడుకు పేరులో మొదటి అక్షరంగా పెడతారు. ఉదాహరణకు ఒకతని పేరు తని అయితే కొడుకు పేరు […]
క్యాలరీలు కరిగించే చేప
చేపల్లో ఎన్నెన్నో పోషకాలుంటాయి . మెదడు పని తీరును మెరుగు పరచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి చేపల్లో సార్టైన్ (నూనె కవ్వలు) అని పిలిచే చేపల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ . ఒమేగా -3 ఫ్యాటీ అమ్లాలశాతం ఎక్కువ . ఈ చేప ప్రోటీన్లు జీవక్రియ వేగాన్ని పెంచి క్యాలరీలను కరిగిస్తాయి . అందుకే బరువు తగ్గాలను కొనేవాళ్ళు వీటిని తినచ్చు . జ్ఞాపకశక్తి కి, మెదడు పనితీరు కి మేలుచేసె ఈ చేపల్లో ఒక […]
పనస తో ప్రత్యామ్నాయం
యువతరం ఎన్నెన్నో కారణాలతో శాఖాహారానికి మొగ్గుతున్నారు . కానీ మాంసాహార రుచులు కోరుకొనే నాలుకను సంతృప్తి పరచటం కోసం ఎన్నోపదార్దాలు తయారవుతున్నయి . మొక్కల నుంచి తయారయ్యే వెజ్ మీట్. ఇప్పుడు ఎన్నో పదార్దాల తో అచ్చం మాంసం రుచితెచ్చే వంటలు తయారవుతున్నాయి . తియ్యని పనస పండు తో కూడా బిర్యానీ వంటి వంటలు తయారు చేస్తున్నారు . శాఖాహారులు ఇష్టంగా తినే ఈ బిర్యానీ లో పనస ముక్కలు అచ్చం మాంసం లాగే అనిపిస్తాయి పనస […]
మొక్కలూ పరవశిస్తాయి
శిశువులూ ,పశువులూ కూడా సంగీతం ఇష్టపడతాయి అన్నారు ప్రాచీనులు. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు ఈ వరసలో మొక్కల్ని కూడా చేర్చింది. ఎరువులు,రసాయనాల్లాగే సంగీతం కూడా మొక్కలకు బలం ఇస్తుంది అంటున్నారు. అమెరికా వంటి ఎన్నో దేశాల్లో మ్యూజిక్ థెరపీ లతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. చక్కని శ్రావ్యమైన సంగీతం వినిపిస్తారు. హడావుడిగా ఉండే ఫాస్ట్ బీట్ కంటే లలితమైన గీతాలు మొక్కలకు కూడా సంగీతాన్ని గ్రహించే శక్తి ఉంటుందంటున్నారు. పంటలకు అధికమైన రసాయనాలు జల్లితే అవి భూసారాన్ని […]
“లలితా దేవి ప్రసాదం”
||ఓం శ్రీ మాత్రే నమహః|| మనము నిశ్చలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తూ స్మరిస్తే ఏ రూపంలో నైన వచ్చి కటాక్షిస్తారు. విజయవాడ దగ్గరలో వున్న ఏలూరులో శ్రీ లలితా దేవి ఉపాసకురాలు పరమ భక్తురాలు శ్రీమతి కమలాంబ గారి పీఠానికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే.ఆమె భక్తికి మెచ్చి లలితా పరమేశ్వరి బాల రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి భక్తులు తమ కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది.బాలాంబగారి నోటి మాట అక్షరాల జరుగుతుంది.భక్తులు ఆమె […]
మెరిసే చర్మం
చర్మం రంగు మెరుస్తూ మృదువుగా కనిపించాలంటే ఇంట్లో వాడుకొనే పదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయి ముక్క మొహం పైన మృతకణాలు పోగొట్టి మరింతగా మెరిపిస్తుంది. పావు కప్పు బొప్పాయి గుజ్జు,పావు కప్పు పైనాపిల్ గుజ్జు కలిపి మాస్క్ వేసినా మంచి ఫలితం ఉంటుంది. చక్కెర వినియోగం తగ్గిస్తే మొహం పట్టులా చక్కగా మెరుస్తూ వుంటుంది. చక్కని బాదం నూనె ఎంతో పరిశుభ్రంగా ఉంచుతోంది. చక్కని పోషక పదార్ధాలున్నకాయగూరలు,తృణ ధాన్యాలతో చర్మం సహజసిద్దమైన మెరుపులు మెరుస్తుంది. గ్రీన్ టీ […]
