Chinna Maata
తప్పక చూడదగ్గ పంచాయత్ (వెబ్ సిరీస్ )
అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ ని ఈ కాలపు మాల్గుడి డేస్ గా వర్ణిస్తున్నారు విమర్శకులు ఢిల్లీలో బీటెక్ చేసిన అభిషేక్ త్రిపాఠి కి పంచాయత్ ఆఫీస్ ఉద్యోగిగా ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలో పూలేరా అన్న చిన్న ఊర్లో అవకాశం వచ్చింది.ఆ మారు మూల పల్లెలో అభిషేక్ చూసిన జీవితం పంచాయత్ .అత్యంత సహజమైన నిజమైన పల్లె సౌందర్యం చూడవచ్చు. నటుడు రఘువీర్ యాదవ్ సర్పంచ్ గా నీనా గుప్తా […]
పిల్లలకే ఈ సమస్య ఎక్కువ
వేసవిలో వచ్చే చెమటకాయలతో పసి పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. వారిలో స్వేద గ్రంధులు అభివృద్ధి చెందక పోవటం వల్ల ఇవి పుట్టిన వారం లోపు పిల్లలకు వెంటనే వస్తాయి. వాతావరణం లో వేడి వల్ల ఈ సమస్య వస్తుంది. పిల్లలకు వదులుగా,లేత రంగులో తక్కువ బరువున్న కాటన్ దుస్తులు తొడగాల కలబంద గుజ్జు వేపాకులు మెత్తగా నూరి రాసినా ఇవి తగ్గుతాయి గాలి బాగా వచ్చే చోటున,పిల్లలను పాడుకోబెట్టాలి. మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా […]
కళ్ళ నీళ్ళు రావు
ఉల్లి పాయలు కొస్తే కళ్ళ నీళ్లు వస్తాయి ఈ చిన్న చిట్కా తో కళ్ల నీళ్లు రాకుండా చేయచ్చు పొట్టు తీసిన ఉల్లిపాయను పదినిముషాలు నీళ్లలో వేసి పడితే చాలు. తర్వాత కొస్తుంటే అవి మాములు కూర ముక్కల్లాగే ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కోయటం సులభం కాదు. అయినా వాటిని చిన్న ముక్కలుగా చేయాలంటే వాటిని ఓ గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత కత్తిని వేడి నీళ్లలో ముంచుతూ […]
పిల్లలకే ఈ సమస్య ఎక్కువ
వేసవిలో వచ్చే చెమటకాయలతో పసి పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. వారిలో స్వేద గ్రంధులు అభివృద్ధి చెందక పోవటం వల్ల ఇవి పుట్టిన వారం లోపు పిల్లలకు వెంటనే వస్తాయి. వాతావరణం లో వేడి వల్ల ఈ సమస్య వస్తుంది. పిల్లలకు వదులుగా,లేత రంగులో తక్కువ బరువున్న కాటన్ దుస్తులు తొడగాల కలబంద గుజ్జు వేపాకులు మెత్తగా నూరి రాసినా ఇవి తగ్గుతాయి గాలి బాగా వచ్చే చోటున,పిల్లలను పడుకోబెట్టాలి. మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా […]
చల్లదనం ఇచ్చే సబ్జా
వేసవి లో చల్లని పానీయం తాగాలనుకుంటే సబ్జా గింజలు వేసిన ఫలుదా తాగవచ్చు. నీళ్లలో సబ్జా గింజలు వేసి తాగితే ఎండ వేడి నుంచి రక్షణ ఉంటుంది.ఎక్కువగా పీచు ఉంటుంది కనుక కడుపు నిండిన భావన కలుగుతుంది.నిమ్మకాయ నీళ్లు షర్బత్ లతో,మిల్క్ షేక్ ల్లో చల్లదనం కోసం సబ్జా గింజలు నీళ్లు తాగవచ్చు.ఫ్రూట్ సలాడ్ లో కూడా నానిన సబ్జా గింజలు కలుపుకోవచ్చు.శరీరంలో వ్యర్థాలు బయటకి పోయేలా చేస్తాయి సబ్జా గింజలు.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి పిండిపదార్థాలు […]
పిహు( Thriller Movie )
వినోద్ కప్రి తీసిన పిహు సినిమాలో రెండేళ్ల పాప మైరా విశ్వకర్మ ఒక్కతే యాక్టర్.గౌరవ భార్య పూజ భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంటుంది.రెండేళ్ల పాప పిహు ఒంటరిగా ఆ ఇంట్లో తండ్రి వచ్చే వరకు ఎన్ని రకాల ప్రమాదాలకు దగ్గరగా వెళుతుంది ఈ సినిమా కథ. సినిమా చూస్తుంటే మన ఇళ్ళల్లో ఇన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అనిపిస్తుంది. తాత్కాలికమైన ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకునే ఎంతో మంది తల్లిదండ్రులు ఒక్క నిమిషం తమ సంతానాన్నిఎంత ఒంటరిగా […]
ఎక్కడికి వెళ్ళద్దు
లాక్ డౌన్ సడలించారు. రాకపోకలు మొదలయ్యాయి కానీ అప్పుడే బంధువులు,స్నేహితులు ఇంటికి ప్రయాణాలు మొదలు పెట్టవద్దనే అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . మరీ అవసరమైతే తప్ప ఇల్లే కదల వద్దు అంటున్నారు. తప్పదనుకుంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఎవరి ఇంటికి వెళ్ళిన ఇంటి బయటే కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్లాలి పసిబిడ్డలను ముద్దు చేయడం తాకటం వద్దు ఎవరితోనూ అతి సన్నిహితంగా కూర్చొని మాట్లాడకూడదు అమ్మమ్మలు ,నానమ్మలు చూడాలన్నా ఓ రెండు నెలలు ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిందే. […]
కోకోనట్ మిల్క్ షేక్
ఈ ఎండలో శక్తి నిచ్చే పానీయాలు ఇంట్లోనే చేసుకోవచ్చు.కోకోనట్ మిల్క్ షేక్ చాలా రుచిగా అలిసిపోయిన శరీరానికి తక్షణ శక్తి నిచ్చేదిగా ఉంటుంది. లేత కొబ్బరి మీగడ ఒక కప్పు పావు లీటర్ పాలు, పంచదార రెండు స్పూన్లు ఐస్ క్రీమ్ అర కప్పు కొబ్బరి పాలు పావు కప్పు తో ఎముకల ఆరోగ్యాన్నిచ్చే మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. అన్ని పదార్థాలు మెత్తగా గ్రైండ్ చేసుకుని కప్పు కొబ్బరి పాలు, కొబ్బరి తురుము తో గార్నిష్ […]
మా ఊరికి రండి
వైద్య సేవలు గుర్తు చేసుకొంటే ముందుగా గుర్తు వచ్చేది కేరళనే . కరోనా సమయంలో కేరళ నుంచి వచ్చిన నర్సులు దేశం నలుమూలలా తమ సేవలు అందించి ఎంతో మంది రోగుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టారు . తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 50 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు 100 మంది నర్సులు పంపమని కేరళ కు విజ్ఞప్తి చేసింది . డాక్టర్ కు నెలకు 80 వేలు స్పెషలిస్ట్ లకు రెండు లక్షలు నర్సులకు 30 వేలు […]
మేలు చేసే మెంతులు
శరీర ఉష్ణోగ్రత ను తగ్గించేందుకు మెంతులు ఎంతో ఉపయోగ పడతాయి .నేరుగా మెంతులు నోట్లో వేసుకొని నీళ్లు తాగవచ్చు . రాత్రి పూట అరచెంచా మెంతులు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తాగవచ్చు .జలుబు,వళ్ళు నెప్పులకు గోరువెచ్చని నీళ్ళలో మెంతులు వేసి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది .మధుమేహం తగ్గిస్తాయి .కండరాల నెప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది .కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి .పొట్టలో కాస్త తేడాచేసి ఇబ్బంది పెడుతూ ఉంటే మజ్జిగ తో ఒక స్పూన్ మెంతులు తీసుకొంటే వెంటనే […]
ఆ రోజుల్లో కాస్త జాగ్రత్త
నెలసరి శుభ్రత విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అలర్జీలు మొదలుకొని క్యాన్సర్ వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు .తిరిగి వాడుకో గలిగే ప్యాడ్ లు సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తాయి. ప్యాడ్ టాంపూన్లు పీరియడ్ ప్యాంటీలు బయోడిగ్రేడబుల్ రకాలు ఎంచుకోవాలి. ఇవి భూమి పై వ్యర్ధాలు మిగల్చకుండా పర్యావరణ హితంగా ఉంటాయి. శానిటరీ నాప్కిన్లు రెండు మూడు గంటలకోసారి మార్చుకోవాలి. పీరియడ్స్ సమయంలో గోరువెచ్చని నీరు గాఢత తక్కువగా ఉండే సబ్బులు […]
“శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రసాదం”
కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం. 15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి కృష్ణ దేవరాయల వరకు ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశారని చెప్తారు. చీకట్లో కూడా స్వామి వారిని చక్కగా నఖశిఖ పర్యతం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.అన్నమాచార్యులవారికి నందలూరితో అవినాభావ సంబంధము ఉన్నట్లు ఆయన రచించిన కీర్తనలలో నందలూరు గురించి ప్రస్తావన చేశారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి […]
ఎథ్నిక్ డిజైన్స్ బెస్ట్
కరోనా నేపథ్యంలో ఎన్నో కళాత్మకమైన ఫ్యాషన్ మాస్క్ లు రూపు దిద్దుకుంటున్నాయి. ఆర్గానిక్ ఇక్కత్ కాటన్, జామ్ దాని, కలనేత కలంకారి లైటింగ్ డే, రీసైకిల్డ్ మెటీరియల్స్ పోచంపల్లి వంటి ఫ్యాబ్రిక్స్ తో అందమైన మాస్క్ లకు ఫ్యాషన్ బ్రాండ్స్ శ్రీకారం చుట్టాయి అధిక పొరలతో కుట్టే కొన్ని మాస్క్ లకు ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేస్తే బ్యాక్టీరియా పోతుంది .వేప ను ఉపయోగించి చేసే నీమ్ మాస్క్ ల్లో యాంటీ ఎలర్జిటిక్ గుణాలున్నాయి. […]
టెక్నాలజీ వాడి తీరాలి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తులో మహిళ వ్యాపారవేత్తలు టెక్నాలజీ వాడకం ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువ చేయటం చాలా ముఖ్యం దీనికి సంబంధించి శిక్షణా తరగతులు ప్రారంభించబోతున్న అంటున్నాడు ఉషారాణి మన్నె. ప్రతిష్టాత్మక ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో)హైదరాబాద్ చాప్టర్ కు ఆమె నూతన చైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. తెనాలి పుట్టిపెరిగాను సోల్ మన్ ఇన్ స్ట్రమెంట్స్ పేరుతో సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. మా కంపెనీ ఇప్పుడు 350 మందికి ఉపాధి కల్పిస్తోంది. పదకొండేళ్ల క్రితం […]
నీళ్లతో కడిగితే చాలు
ఈ కరోనా సమయంలో బయటి నుంచి తెచ్చిన పండ్లు,కూరలు మొదలైనవి సబ్బుతో డిటర్జెంట్, లేదా బ్లీచింగ్ వంటి వాటితో శుభ్రం చేస్తూ ఉంటారు. వీటికంటే శుభ్రమైన నీటిని వాడటం శ్రేయస్కరం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు ఆపిల్ పియర్స్ వంటివి శుభ్రమైన నీటిలో కాడ దగ్గర నుంచి పండు మొత్తం కడిగి పెట్టుకోవాలి. నారింజ కమలాలు వంటివి తెచ్చిన రోజే నీళ్లతో శుభ్రం చేసి పెట్టుకుంటే వైరస్ భయం ఉండదు. పాలకూర, కొత్తిమీర, లెట్యూస్ వంటివి ధారగా పై […]
జాగ్రత్తగా ఉండండి చాలు
కొన్నాళ్లుగా వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్న వాళ్ళు ఇక నెమ్మదిగా ఆఫీసులకు వెళ్లక తప్పదు. ఆఫీస్ కు వెళుతూ ఏదో వస్తువులు ముట్టు కుంటూ ఇంటికి వస్తూ ఉంటే తాము వైరస్కు క్యారియర్ లు అవుతామేమోనని చాలామందికి భయం. కానీ జీవితం ముందుకు కదలాలి, ఇలాటి భయాందోళనలకు తావు ఇవ్వద్దు అంటున్నారు ఎక్స్పర్ట్స్.ఎలాంటి ఆవేశానికీ లోను కాకుండా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి వైరస్ సోకుతుందనీ ఆందోళన, మనకు రాదనే అతి విశ్వాసం వద్దు. ప్రభుత్వం సూచించిన […]
The Autumn Princess ( Adam Bird Photography )
బ్రిటిష్ ఫోటోగ్రాఫిక్ ఆడమ్ బర్డ్ ఆలోచనాత్మకమైన ఛాయా చిత్రకారుడు. ఒక ఫోటో తీసేందుకు అతను ఒక కల్పనిక మైన ప్రపంచాన్ని సృష్టించేవాడు. అనువైన ప్రదేశం,మోడల్స్ కథ సినిమా తీసినట్లు ఉంటాయి అతను తీసిన ఫోటోలు కొన్ని జానపద కథలు గుర్తొచ్చేలా ఉంటాయి.ఈ ఫోటోలో ఉంది (The Autumn Princess ) అతను దీనికి ఇచ్చిన టాగ్ లైన్ SomeTimes We Stand Strongest after all కొత్తగా వస్తున్న ఫోటోగ్రాఫర్లు. ఇతని చిత్రాలను ఒక సబ్జెక్ట్ లాగా […]
శక్తి నిచ్చే పానీయాలు
వేసవి ఎండలు,ఇటు కరోనా మహమ్మారి, మారుతున్న వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు వేసవి పానీయాలు ఇంట్లోనే తయారు చేసి తీసుకోమంటున్నారు ఎక్స్ ్ర్ . పసుపు సహజమైన నేచురల్ యాంటీబయోటిక్,పాలు పసుపు కలిపి తాగితే సీజనల్ ఫ్లూ వంటి అనారోగ్యాలు దగ్గరకు రావు నిమ్మరసం, పంచదార కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే, లెమన్ మెంట్ కలిపిన ఈ పుదీనా షర్బత్ వేసవిలో సేదతీర్చే రిఫ్రెషింగ్ డ్రింక్ పచ్చి మామిడికాయ రసం జీలకర్ర , పుదినా కలిపి తీసుకున్నా శరీరానికి అదనపు […]
ఇటీవలి తమిళ కథానికలు
సుప్రసిద్ధ రచయిత మధురాంతకం రాజారాం గారు అనువాదం చేసిన కథలు ఇవి. సంకలన కర్త అశోక మిత్రన్ తమిళ పాఠకులకు సుపరిచితులు.ఈ సంకలనం లో కథలన్నీ తమిళ సాహిత్యం లో ఎంతో ఆదరణ పొందాయి. ఈ కథారచయితలు 1960 ప్రాంతాల్లో సాహిత్య ప్రపంచంలో గుర్తింపు పొందిన వారు తమిళ సాహిత్యం సాధించిన పరిణితిని నిరూపించే కథలివి. అనువాదకులు,సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మధురాంతకం రాజారాం ప్రముఖ కథకులు. 400 పైగా కథలు రెండు నవలలు రాశారు. ఆయన రచనలు ఎన్నో […]
రెడ్ డాట్ చాలెంజ్
మహిళా నెలసరి శుభ్రత విషయంలో అవగాహన తీసుకువచ్చేందుకు యూనిసెఫ్ రెడ్ డాట్ చాలెంజ్ ను తీసుకొని వచ్చింది.యూనిసెఫ్ గుణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది అమ్మాయిలు సాధారణ పరిశుభ్రతకు కూడా నోచుకోక బాధపడుతున్నారు. ఇంట్లోనూ పాఠశాలల్లో కూడా సరైన శానిటేషన్ గానీ కనీసం నీరు కానీలభించదు.ఎంతోమంది అమ్మాయిలు స్కూలు మానేయడానికి ఇదే కారణం. నెలసరి విషయంలో అమ్మాయిల్లో మహిళల్లో అవగాహన పెంపొందించి ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రోత్సహించేందుకు యూనిసెఫ్ రూపొందించిన రెడ్ డాట్ చాలెంజ్ లో […]
