Tuesday, 04 Aug, 2026

108 డ్రైవర్ గా వీరలక్ష్మి

తమిళనాడులో 108 వాహనం నడిపే తొలి మహిళగా గుర్తింపు పొందింది వీరలక్ష్మి. చిదంబరం లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా కోర్స్ చేశారు.చెన్నైదగ్గర లోని తిరువేర్కాడులో నివాసం. భర్త కారు డ్రైవర్ అతని దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుని టాక్సీ నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా108 వాహనాల సంఖ్య పెంచింది.వాటికి డ్రైవర్ లను ఎంపిక చేస్తారనే విషయం తెలుసుకుని దరఖాస్తు చేసింది వీరలక్ష్మి.ఆమె కోరుకున్నట్లు గానే తిరువళ్లూర్‌ జిల్లా లోని ఓ అంబులెన్స్ డ్రైవర్ గా నియమిస్తూ ఆర్డర్ […]

ఇది సహజ టోనర్

కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది.ఎన్ని లేపనాలు రాసిన ప్రయోజనం ఉండదు.అలాంటప్పుడు మాయిశ్చరైజర్ కు బదులు టోనర్ వినియోగించటం మంచిది.దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.అర కప్పు గ్రీన్ టీ డికాషన్ లో రెండు స్పూన్లు బియ్యం వేసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం దీన్నివడకట్టుకోవాలి.ఈ టోనర్ ని  మొహానికి రాసుకుని ఆరిపోయాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇందులోనే బియ్యం నీళ్లు గ్రీన్ టీ లోయాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ లో రెండు చుక్కలు ఎసెన్షియల్ […]

ఇలా చేసి చూడండి

ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడిపే వారికి కళ్లు మంటగా ఉండటం, ఎర్రబడటం, మసకబారటం అనిపిస్తే కళ్ళు పొడిగా అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. అలా పొడిబారకుండా ఉండేందుకు గోరువెచ్చని నీళ్లలో ఒక మెత్తని వస్త్రాన్ని కాసేపు నాననివ్వాలి. దాన్ని పిండి కనురెప్పల పై పెట్టుకొని ఐదు నిమిషాలు అలా ఉంటే కళ్ళు పొడిబారవు.కొంచెం కలబంద గుజ్జు కనురెప్పల పైన పూయాలి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే చాలు ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే కళ్ళు పొడిబారవు. […]

సహజమైన రంగు 

సౌందర్య పోషణకు బీట్ రూట్ ఎంతో ఉపయోగ పడుతోంది అంటారు ఎక్స్ ఫర్ట్స్ .బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ప్రోటీన్ వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి,వీటిలోని సిలికాన్ ఖనిజం గోళ్ళు జుట్టు పెరగడం లో కీలకంగా పని చేస్తుంది.బీట్ రూట్ దుంప ఉడకబెట్టి మెత్తగా గుజ్జు చేయాలి దీనికి చెంచా బాదం నూనె రెండు చుక్కలు తేనె కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది.రసాయనాలు […]

కోటి మొక్కలు నాటారు 

పాలమూరు జిల్లాలో అడవులు విస్తీర్ణం పెంచేందుకు గాను కోటి విత్తన బంతులు తయారుచేసి అటవీశాఖ అధికారులు గ్రామ పంచాయతీల సహకారంతో అడవుల్లో చల్లారు.ఈ కోటి విత్తన బంతులు తయారుచేసే బాధ్యత తీసుకున్నారు పాలమూరు మహిళా సంఘాల సభ్యులు. జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 284 మహిళ సమాఖ్యల్లోని 69 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు తొమ్మిది రోజుల్లో సభ్యులందరూ కలిసి 1,0326,077 విత్తన బంతులు తయారు చేశారు. అడవుల్లో అధికారులు డ్రోన్ల సహాయంతో బంతులు […]

న్యాయం కోసం పోరాటం 

మద్రాస్ హైకోర్టు లో దృష్టి లోపం ఉన్న తొలి మహిళ లాయర్ కర్బగం మాయవన్‌ డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో గోల్డ్మెడల్ అందుకున్న తన వంటి ఇబ్బందులున్న వ్యక్తులకు వీలైనంత సాయం చేయాలన్న తపనతో ఏర్పాటు చేశారు.వైకల్యాలున్నవారికి న్యాయ పరంగా సామాజిక పరంగా సహాయం అందిస్తూనే  మరోవైపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా వ్యవస్థలను కర్బగం నిలదీస్తున్నారు.కరోనా సమయంలో ఎలాంటి సహాయానికి నోచుకోని ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నారు […]

ఇవి శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం 

కిచెన్ పరిశుభ్రంగా ఉంచుకుంటేనేపూర్ణారోగ్యం వంటగది కబోర్డ్ లను వంట చేస్తూ ముట్టుకొంటూ ఉంటే తలుపుల పైన చేతుల కంటిన, నూనె మరకలు పడతాయి.ఎప్పటికప్పుడు వంట పూర్తయిన తర్వాత శుభ్రంగా తుడిచేయాలి గిన్నెలు తోమే స్క్రబ్బర్ వేడినీళ్లలో ఏరోజుకారోజు శుభ్రంగా కడిగి పొడిగా ఉంచాలి లేకపోతే అందులో బ్యాక్టీరియా చేరుతుంది.తోమిన గిన్నెలు కడిగిన వెంటనే గుడ్డతో తుడిచి పెడితే గిన్నెల పై మరకలు ఉండవు.సింక్ దగ్గర వంట గది గుమ్మం దగ్గర జారిపో కుండా నేలకు అతుక్కునేలా ఉండే […]

చేదు తగ్గించటం తేలికే

కాకరకాయ లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న దీనికి ఉండే చేదు రుచి వల్ల ఎక్కువమంది తినేందుకు ఇష్టపడరు.చేదుని తగ్గించేందుకు కొన్ని చిట్కాలను పాటించవచ్చు. కాకరకాయలు శుభ్రంగా కడిగి పై పొట్టు తీసి, ముక్కలుగా తరిగి ఆ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ ముక్కలను గట్టిగా పిండితే చేదు ఉండదు.చెక్కు తీసిన కాకరకాయ ముక్కలను పెరుగులో నాననిస్తే చేదు తగ్గుతుంది.బెల్లం చక్కెర వేసి కూడా ఉండి […]

ఓ ఆర్ ఎస్ తాగితే మంచిది 

గర్భిణీలు ఉదయం వేళ వికారం,వాంతి,డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడతారు.అలాంటప్పుడు వారికి ఓ ఆర్ ఎస్ ద్రావణం తాగిస్తే డీహైడ్రేషన్ నుంచి కొంతవరకు కాపాడవచ్చు అంటున్నారు డాక్టర్లు.నోరు తడారి పోవటం తలనొప్పి దాహం మూత్రం ఎక్కువగా పోవటం ఉంటే ఈ ఓ ఆర్ ఎస్ ద్రావణం స్వాంతన కల్పిస్తుంది.ఈ ద్రావణం లో ఉండే పొటాషియం సోడియం చక్కెర ఇతర ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్, శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తాయి.

పిల్లలకు అవసరమే 

పిల్లలకైనా మాస్క్ ఉండవలసిందే అయితే ఐదేళ్లు అంతకంటే పెద్ద పిల్లలకు మూడు పొరల మాస్క్ వాడాలి.రెడీమేడ్ మెడికల్ మాస్క్ ల కు బదులు ఇంట్లో తయారుచేసిన మాస్క్ లు ఫేస్ కవర్లు వాడాలి లేదా పిల్లలు అసౌకర్యానికి గురవుతారు అనుకుంటే ముక్కు నోరు కప్పేలా చేతిరుమాలు వాడాలి పిల్లలు దాన్ని లాగేసి కోకుండా అలవాటు చేయాలి మాస్క్ వదులుగా లాగితే వచ్చేలా ముక్కు నోరు మూసేది గా ఉండాలి.సాధ్యమైనంతవరకు వాళ్లని బయటకు తీసుకు రాకుండా ఉంటేనే మంచిది.

 ఆవిరిపడితే మంచిదే ! 

సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటివి ప్రబలే కాలం ఇది ఈ వ్యాధుల కోసం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఇంటి వైద్యాన్ని  సూచిస్తోంది.వేడిపాలలో చిటికెడు పసుపు కలిపితే ఇది పరమౌషధం గా పనిచేస్తోంది.ఇందులో యాంటీ బయోటిక్స్ యాంటీ సెప్టిక్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ముఖానికి ఆవిరి పెట్టడం వల్ల జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది వేడినీటిలో టెట్రీ ఆయిల్ ఆయిల్ లేదా అమృతాంజనం, పుదీనా ఆకులు లేదా […]

షి టాయిలెట్ బస్ 

కర్ణాటక రాష్ట్రం స్త్రీ టాయిలెట్ ప్రవేశపెట్టింది.పాడైపోయిన ఆర్టీసీ బస్ లు వాష్ రూమ్ లు గా మార్చింది.ఒక్క బస్సు లో మూడు వెస్ట్రన్,మూడు ఇండియన్ టాయిలెట్ లు ఉంటాయి. నాప్కిన్ వెండింగ్ మిషన్,నాప్కిన్ ఇన్ సివేటర్ కూడా ఉన్నాయి బస్ నిర్వహణకు అవసరం అయినా కరెంట్ ఉత్పత్తి కోసం బస్ పై బాగానే సోలార్ ప్యానల్ ఉంది. ఈ బస్సు కు మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది.

అత్యంత శక్తిమంతం 

ఆహారంలో రుచి, సువాసన కోసం,ఇంకా జలుబు, ఆర్థరైటిస్, మైగ్రేన్, రక్తపోటు వంటి అనేక వ్యాధుల చికిత్స కోసం వేలాది సంవత్సరాలుగా అల్లం వినియోగిస్తున్నారు.అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన అధికంగా ఉంటుంది.గర్భిణీ స్త్రీలలో వేవిళ్ళు వికారం తగ్గించేందుకు ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ళనొప్పులను తగ్గించేందుకు స్త్రీల నెలసరి కడుపు నొప్పి నియంత్రణకు అల్లం,లేదా ఎండిన అల్లం శొంఠి పనిచేస్తుంది .శ్వాస రోగ సంబంధిత వ్యాధులు కలిగించే వైరస్ లతో పోరాడి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.

మానేయాలి తప్పదు

స్వీట్లు తగ్గించాలి ఆరోగ్యం కోసం ఒక రకంగా మానేయాలి అంటున్నారు డాక్టర్లు.ఒక ఐదు కిలోమీటర్లు నడిస్తే 200 కేలరీలు ఖర్చవుతాయి.అయితే చిన్న గులాబ్  జామ్ తిన్న ఆ రెండు వందలు వచ్చి చేరుతాయి.ఇలా లెక్క వేసుకొని స్వీట్లు మానేయాలని మానసికంగా సిద్ధం కమ్మంటున్నారు  డాక్టర్లు.కోవా, కలాకండ్, రసగుల్లా, సేమియా పాయసం, బియ్యం పాయసం వంటి నూనె తగలని స్వీట్లు చాలా తక్కువగా నోట్లో వేసుకుంటూ వీటిలో క్యాలరీలు ఉంటాయని గుర్తు చేసుకుంటూ పుచ్చకాయ, బత్తాయి, మామిడి, పైనాపిల్ […]

 ఓట్స్ రుచిగా 

బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తినమని చెబుతూ ఉంటారు న్యూట్రిషనిస్ట్ లు.ఆరోగ్యంతో పాటు బరువు తగ్గించ గల ఓట్స్ పెద్ద రుచి గా ఉండవు. వాటికి పండ్లు లేదా ఉప్పు సుగంధ ద్రవ్యాలు జోడించి ఎంతో రుచిగా ఉంటాయి.రాత్రంతా నానబెట్టిన ఓట్స్ తినటం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నానటం తో ఓట్స్ లోని పిండిపదార్థం ముక్కలై పోయి వాటిలో ఆమ్లా శాతం తగ్గుతుంది. మెత్తగా ఉండే ఆ […]

అందాన్నిస్తుంది 

వంటల తయారీలో బెల్లం వాడతారు కానీ బెల్లం చర్మ సంబంధమైన సమస్యలను దూరం చేసే కలగా కనిపించేలా చేస్తుందని  అంటున్నారు ఎక్సపర్ట్స్.బెల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.జుట్టు కాంతిహీనంగా అనిపిస్తే రెండు స్పూన్ల ముల్తానీ మట్టి రెండు స్పూన్ల బెల్లం పొడి అరకప్పు పెరుగు కొద్దిగా నిమ్మరసం చేర్చి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.బెల్లం పొడిలో నిమ్మరసం నీళ్లు కలిపి మొహానికి ఫేస్ […]

బియ్యం గంజిలో పోషకాలు 

అన్నం వార్చిన గంజి తాగితే ఇన్ స్టెంట్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.ఎలక్ట్రిక్ కుక్కర్ లో కాకుండా నీళ్లు ఎక్కువ పోసి బియ్యం ఉడికిస్తూ ఉంటే వచ్చిన గంజిలో బి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగు పరచి,మలబద్దకాన్ని  వదిలిస్తుంది.పిల్లల్లో వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఉంటే గంజిని మించిన దివ్యౌషధం లేదు పూర్తిగా పాలిష్ చేయకుండా ఉండే బియ్యాన్ని వండి వార్చిన గంజి లో ఉప్పు వేసి తాగితే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు ఎక్స్పర్ట్స్.

వర్షాలతో సమస్య

ఈ వర్షాల్లో పాదాలకు ఇన్ఫెక్షన్లు వస్తాయి.నిర్లక్ష్యం చేస్తే దుర్వాసనతో పాటు అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి.ఇన్ఫెక్షన్ ఉన్నచోట గోక కూడదు యాంటీ ఫంగల్ క్రీమ్ రాయాలి.పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి.గోళ్లు కత్తరించి శుభ్రంగా మట్టి లేకుండా ఉండేలా చూడాలి. క్రీముల కంటే లోషన్ ల రూపంలో ఉండే మాయిశ్చరైజర్లు వాడాలి.కొబ్బరి నూనె దురద ను కొంత వరకు తగ్గిస్తుంది.

దివా యోగా 

మలైకా అరోరా ‘ దివా యోగా ‘పేరుతో ఫిట్నెస్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. దేశంలోని మహిళలను ఆరోగ్య పరంగా శక్తి మంతంగా మారిస్తేనే అన్ని రంగాల్లోను ముందుకు వెళ్లగలమని నా నమ్మకం అందుకే ఈ వ్యాపారం లోకి దిగాను అంటోంది మలైకా. మిలియన్ ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు నా యోగా వీడియోలు చూస్తారు. కానీ వారిని ఆరోగ్య పరంగా సరైన దిశగా నడిపించ వలసిన బాధ్యత ఉంది. దివా యోగా ద్వారా నడిపించ […]

స్టిక్కర్ అర్థం ఇదే 

పండ్లు కొనేప్పుడు వాటికి స్టిక్కర్  అంటించి ఉంటుంది.అది పండు సహజంగా పండించినదా లేదా రసాయనాలు వాడారా అన్నవి చెప్పే వివరాలు రాసిన స్టిక్కర్లు.  స్టిక్కర్  పైన 3 లేదా 4  అంకెల మొదలైన నాలుగు అంకెల నెంబర్ ఉంటే ఆ పండును కొన్ని రసాయనాలు ఎరువుల సాయంతో పండించిందని అర్థం అదే 9 అంకె తో మొదలైన స్టిక్కర్ ఉంటే అది పూర్తిగా సహజసిద్ధంగా సేంద్రియ ఎరువుల తో పండించిందని అర్థం.అలాగే 8 అంకె గనుక ఉంటే […]