Chinna Maata
మరీ క్రమశిక్షణ వద్దు
తోడబుట్టిన వాళ్ళ మధ్యన చిన్న తగువులు రావటం సహజం ఇప్పుడు పూర్తి సమయం ఇంట్లోనే ఉండటం వల్ల ఇవి మరికాస్త ఎక్కువ కావచ్చు.ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు చదువుకునేవాళ్ళు ఇంకొకళ్ళు మరీ చిన్న వాళ్ళు ఉండవచ్చు. ఒకళ్ళు ఆడుతూ ఉంటే పెద్ద పిల్లలకు చదువు కు అంతరాయం కలగవచ్చు. ఈ విషయాన్ని పెద్ద వాళ్ళు గ్రహించి త్వరగా పనులు ముగించుకుని చిన్నపిల్లలను చదువుకునే పిల్లలకు దూరంగా తీసుకుపోవాలి. ఆన్ లైన్ క్లాసులు అసలే కొత్త అందుకే […]
ఈ మూడింటి మిశ్రమం తో ఫలితం
కొబ్బరి నూనె కండీషనర్ గాను పనిచేస్తుంది అంటారు ఎక్సపర్ట్స్.ఇందులో విటమిన్-ఇ ఇనుము ఉంటాయి.అలాగే ఆముదంలో ప్రొటీన్లు ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు ఉంటాయి.ఈ రెండింటిని కలిపి రాస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.రాత్రి పడుకునే ముందుర ఈ రెంటినీ కలిపిన మిశ్రమాన్ని ఒక చుక్క కనుబొమ్మలకు రాసి చక్కగా మర్దన చేయాలి.ప్రతి రోజు ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. కొబ్బరి నూనె ఆముదం లో అలోవెరా గుజ్జు కూడా కలిపి రాస్తే ఇందులో […]
తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అర్మాన్
అంతర్జాతీయ మూడో గైనకాలజిస్ట్ గా పేరు పొందిన అపర్ణ హెగ్డే ఆర్మాన్ సంస్థ ఏర్పాటు చేశారు. 16 రాష్ట్రాల్లో లక్ష మంది ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేస్తుందీ సంస్థ ముంబైలోని కామా ఆస్పత్రి లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తారామె వైద్య సేవలు అందని మారుమూల ప్రాంతాలకు మొబైల్ లో వైద్యాన్ని చేరువ చేయాలనుకున్నారు అపర్ణ.మొబైల్ మిత్ర అనే ఉచిత ఫోన్ కాల్ సర్వీస్ ఏర్పాటు చేశారు. 2018లో ఆర్మాన్ సంస్థ పుట్టింది 43 స్వచ్ఛంద […]
ఎక్కువ కడిగినా నష్టమే
మొఖం చల్ల నీళ్ళతో కడిగితే చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. కానీ అదే పనిగా నీళ్లతో కడిగితే మాత్రంచర్మం లోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం పోతుంది.ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తే చర్మం పొడిబారి పోతుంది. చర్మం తేమగా తాజాగా కనిపించాలి అంటే స్నానం చేసే ముందు బాదం నూనె ముఖానికి పట్టించాలి అలా పట్టించి ఓ గంట పాటు వదిలేస్తే తేమను చర్మ గ్రంథులు పీల్చుకుంటాయి.ఆ తర్వాత గిన్నెలో నీళ్ళు మరిగించి వేడి నీటి ఆవిరిపట్టాలి. […]
తృణ ధాన్యాల సాగు చేస్తా
మా సొంత ఊరు ఎం కె పురం అక్కడే మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను రైతులు కళాకారులు విద్యార్థులు ఎన్జీవోలు వ్యవసాయ నిపుణులు అందరినీ ఇన్ వాల్వ్ చేశాను.నిపుణులు సాయంతో రసాయనాలు వాడని ఆర్గానిక్ మెన్యూర్ తయారీ ఇక్కడ నేర్చుకోవచ్చు.మిల్లెట్స్ పండిస్తే పోషకాహారలోపం తీరు తోందని నిపుణులు చెపుతూనే ఉన్నారు.రైతులకు తృణధాన్యాల సాగు దిశగా మలిస్తే బావుంటుందని మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను అంటోంది చిత్తూరు జిల్లా ఎం కె పురానికి చెందిన విశాలా […]
నిరంతరం పని వల్లే ఆ సమస్య
నిరంతరం ఏదో పని చేస్తూ సబ్బు వాడుతూ రసాయనాలతో సింక్ లు శుభ్రం చేస్తూ ఉంటే చేతులు చాలా గరుగ్గా ఉంటాయి.చల్లని రుతువుల్లో మీ చేతులను మరింత పొడిబారి పగుళ్లు కూడా వస్తాయి. రెండు స్పూన్ల ఆలీవ్ నూనె లో పంచదార కలిపి అర చేతులకు రాసుకుని బాగా రుద్దాలి .తర్వాత కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి అలాగే ఓట్స్ ని కొద్దిగా మెత్తగా పిండిలా అయ్యేలా చేసి ఆ పిండిలో ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని […]
ఒక ప్రత్యేకత కావాలి
ఎవరికి వాళ్లకు తాము ప్రత్యేకంగా కనిపించాలని ఒక కోరిక ఉంటుంది అలాంటప్పుడు కనిపించిన ప్రతి ఫ్యాషన్ ను అనుసరించటం వల్ల లాభం ఏమి ఉండదు. అలా ప్రత్యేకంగా కనిపించాలి అంటే మీ కోసం ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కేశాలంకరణ లోనూ బొట్టు లోనూ వస్త్రధారణలోనూ ఒక ప్రత్యేకత ఉండాలి దాన్ని మార్చకుండా ఒక స్టైల్ స్టేట్ మెంట్ గా చేసుకోవాలి.ఉదాహరణకు విద్యాబాలన్ ఎప్పుడూ అంచున చీరలతో,వాణిశ్రీ పెద్ద కొప్పు తో ఒక రాజకీయ నాయకురాలు […]
పాటలతో సాయం
కోవిడ్ సమయం ఇది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి విరాళాలు ఇస్తానంటే వ్యక్తిగతంగా పాటల్ని అంకితం చేస్తా, మీ స్నేహితులకు బంధుమిత్రులకు పుట్టినరోజు విషెస్ చెబుతానని చెప్పాను. కొన్ని నెలలుగా ఇప్పటికీ మూడు వేల పాటలు వీడియోలు చేశాను. 85 లక్షల విరాళాలు అవసరం ఉన్నవారికి నేరుగా వారి ఖాతాలోకి వెళ్లే లాగా చేశాను. ఒక ఎన్నారై లక్షన్నర రూపాయలు విరాళం ఇచ్చాను అంటూ చెప్పింది గాయని చిన్మయి.మనుషుల్లో మానవత్వం మిగిలి ఉందని చెప్పేందుకు ఇంతకంటే ఇంకే ఉదాహరణ […]
పెద్ద వాళ్ళకి టెక్ పాఠాలు
ఈజీ హోమ్ అనే కొత్త స్టార్టప్ ప్రారంభించింది వృద్ధులకు డిజిటల్ స్కూల్ నేర్పిస్తున్నారు బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్ళు శ్రీయ బజాజ్ సురభి.కరోనాతో అందరూ ఇంటికే పరిమితమైన సందర్భంలో స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయటం పెద్ద వాళ్లకు సరిగ్గా తెలియక ఇబ్బందులు పడుతున్నారు.ఎం.బి.ఏ పూర్తి చేసిన ఈ యువ వ్యాపారవేత్తలు పెద్ద వాళ్ల కోసం జూమ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ వాడకం ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేయటం […]
స్నాక్స్ బదులు బాదం బెస్ట్
అమెరికా జనరల్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించిన కథనం ప్రకారం గుండె సంబంధిత అనారోగ్యాలు మానసిక ఒత్తిడే కారణం. ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకునే లయ మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారం స్నాక్స్ బదులు బాదం గింజలు తింటే ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె కొట్టుకునే తీరు ఎప్పటి లాగే ఉంటుందని గుండె చక్కగా పనిచేస్తుంది అని చెబుతోంది.గుండె సంబంధమైన జబ్బులకు దారితీసే మానసిక సమస్యల్లో మొదటిది ఒత్తిడే అంటున్నారు శారీరక వ్యాయామం, పోషకాలున్న ఆహారం, ఆరోగ్యవంతమైన జీవన శైలి […]
చర్మకాంతి కి మసాజ్
ఒత్తిడి అలసట తగ్గాలన్న. అందాన్ని కాపాడుకోవాలి అనుకున్న ఒంటికి తలకు నూనె మసాజ్ చేసుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మసాజ్ తో చర్మానికి తేమ అంది నిగారింపుగా ఉంటుంది. ఎండకు కమిలిన దేహం రంగు మారిన చర్మం సాధారణ స్థితికి వస్తాయి.కండరాల నొప్పులు తగ్గుతాయి.ఆలీవ్ నూనె తలకు పట్టించి మర్దనా చేస్తే తలభారం తగ్గుతుంది.అలాగే కొబ్బరి నూనెలో విటమిన్-ఇ గుణాలు ఎక్కువ.దాన్ని వేడి చేసి ఒంటికి రాసి మృదువుగా కాసేపు మర్దన చేస్తే పొడిబారిన చర్మం సాధారణ స్థితికి వస్తుంది.ఈ […]
ఇక నీరసం రాదు
ఎక్కువ సమయం వ్యాయామం చేసిన డిహైడ్రేషన్ సమస్య వస్తుంది.పోషకాహార నిపుణులు మై 22 బి.ఎం.ఐ వ్యవస్థాపకురాలు ప్రీతి త్యాగి ఏమంటారంటే క్రీడాకారులు, జిమ్ కు వెళ్ళే వాళ్ళు ఎదుగుతున్న పిల్లలు వాటర్ బాటిల్ లో ఉప్పు నిమ్మరసం కలిపిన నీళ్ళు వెంట తీసుకుపోవాలి.ఈ నీళ్లు తాగితే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. నీళ్ళతో పాటు తాజా పండ్లు కూరగాయలు ఎక్కువ శాతం నీళ్లు ఉండే కీరదోస, చిలకడదుంప, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మజాతి పండ్లు తినాలి.గ్లాస్ వేడి […]
అయితే పోషకాల లోపమే
పోషకాహార లోపం గురించి శరీరం తప్పకుండా కొన్ని సంకేతాలస్తూ ఉంటుంది.కాలిన గాయాలు తగ్గకపోవడం జలుబు దగ్గు ఫ్లూ వంటివి తరచు రావటం శరీరంలో విటమిన్ సి లోపం కావచ్చు.ఆకుకూరలు సిట్రస్ పండ్లు క్యాప్సికం వంటివి రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.జుట్టు రాలి పోతున్న, నీరసం ఆయాసం వంటివి ఉన్నా ఇనుము తగ్గినట్లు అనుకోవచ్చు.కాళ్లు చేతుల నొప్పి ఉన్న కీళ్ల దగ్గర భరించలేనంత బాధ ఉంటే విటమిన్ డి క్యాల్షియం తగ్గినట్లు గుర్తించవచ్చు.ఈ రెండు […]
ఈ ప్యాక్ లతో శిరోజాలకు మెరుపు
జుట్టు పొడిబారి చివర్లు చిట్లి పోతు,వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు వస్తే ఈ సహజమైన పదార్థాల మందుల కంటే బాగా పనిచేస్తాయి అంటున్నారు వైద్యులు.రెండు కప్పుల మునగాకు రుబ్బుకుని దానికి టేబుల్ స్పూన్ ఆముదం చెంచా పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి.20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యం గా మారి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే కలబంద గుజ్జు రాసి ఆరేవరకు జుట్టును అలా వదిలేసి తలస్నానం చేస్తే శిరోజాలు మెరిసిపోతాయి.మెత్తగా కుచ్చులా […]
ఇది సహజమైన పద్ధతి
కళ్ల దగ్గర చర్మం పలచగా ఉండటంతో సూర్యరష్మిలోని హానికారక కిరణాలు కళ్ల దగ్గర చర్మాన్ని తొందరగా ముడతలు పడేలా చేస్తాయి.నల్లని వలయాలు ఏర్పడతాయి సహజ పద్ధతిలో ఈ వలయాలు పోగొట్టాలంటే ఎండలో బయటకి వెళ్లేప్పుడు క్రీమ్ రాసుకోవాలి.బంగాళదుంప లోని ఎంజైమ్స్ ఇన్ ఫ్లమేషన్ తగ్గించి కళ్ళకింద చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.బంగాళదుంప పల్చగా ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో ఉంచాలి.వాటిని కళ్ళ పైన పెట్టుకొని ఆ చల్లదనం పోయేవరకు విశ్రాంతిగా ఉండాలి.అలాగే కీరదోస లో కూడా చర్మాన్ని మృదువుగా […]
ఈ ఆకే ఔషధం
తమలపాకులు చర్మసౌందర్యానికి ఉపయోగపడతాయి మొహం పై మొటిమలు,వాటి తాలూకు మచ్చలను ఈ తమలపాకు తగ్గిస్తుంది.రెండు మూడు తమలపాకులు మెత్తగా చేసి అందులో పసుపు తేనె కలిపి మొహానికి రాసుకుని బాగా ఆరిపోయాక కడిగేయాలి.తమలపాకు లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గిస్తాయి.అలాగే నీళ్లలో తమలపాకులను బాగా మరిగించి వడకట్టి అందులో తేనె,నిమ్మరసం కలిపి మొహానికి రాసుకుంటే చర్మానికి తేమ అంది తాజాగా అయిపోతుంది.నీళ్లలో కొన్ని చుక్కల తమలపాకు నూనె వేయాలి.అలాగే ఈ నూనె వేడి […]
ఆహారం ద్వారానే పోషకాలు
కరోనా సమయంలో శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు తీసుకోమంటారు.ఈ సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు నీరు ఆహారం ద్వారా అందుకోవటం. సగటు వ్యక్తి కి ప్రతిరోజు 2000 ల క్యాలరీలు ఆహారం కావాలి మగవారికి ఆడవారికి కంటే ఎక్కువ కేలరీలు అవసరం వ్యాయామం చేసే వారికి గర్భిణీలకు, బాలింతలకు ఆటలాడే వాడికి కార్బోహైడ్రేట్లు ఎక్కువ కావాలి శ్రమ తక్కువగా ఉండి ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి కేలరీలు కార్బోహైడ్రేట్లు […]
కేవలం అవన్నీ అపోహలు
కరోనా విషయంలో అపోహలు ఎప్పటికప్పుడు చదరగొడితేనే అసలైన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటున్నారు ఎక్స్పోర్ట్స్.వ్యాయామం చేసే సమయంలో నిరంతరం మాస్క్ ధరించాలి అనుకోవడం అపోహ. స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడం కోసం మాస్క్ ధరించనేకూడదు. వ్యాయామం సమయంలో సామాజిక దూరం పాటిస్తే చాలు అలాగే బూట్లు, చెప్పులు ద్వారా కరోనా వ్యాపించదు పాదరక్షల మీద అంటుకొని ఉండే దుమ్ము, ధూళి ఉండే సూక్ష్మజీవులు ఇంట్లోకి రాకుండా వీటిని బయట వదిలి పెడతారు కానీ వాటి పైన వైరస్ ఎంతోసేపు […]
కాస్త తేనె చాలు
వాతావరణంలో వచ్చే మార్పులకు వచ్చే దగ్గు జలుబు లకు యాంటీ బయోటిక్స్ అవసరం లేదని, ఒక స్పూన్ తేనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది.పిల్లలకు దగ్గు జలుబు వస్తే యాంటీ బయాటిక్స్ ఇవ్వకుండా తేనె తాగించమని పరిశోధకులు చెబుతున్నారు.మామూలు తేనె కంటే సంక్లిష్ట చెక్కెర లతో భిన్న రకాల పుప్పొడులతో కూడిన తేనే మరింత ప్రభావ వంతంగా పని చేస్తుందని పేర్కొంటున్నారు.
కునుకు తీస్తేనే బెటర్
రాత్రివేళ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ దాని ప్రభావం తరువాత నిద్ర మీద ఉంటుందనీ అందువల్ల నిద్ర వస్తుంది అనిపిస్తే ఓ పది ఇరవై నిమిషాలు కునుకు తీసి ఆ తర్వాత కాఫీ తాగితే బుర్ర చురుగ్గా పని చేస్తుందట. నిద్ర మత్తు వదిలేందుకు కాఫీలోని కెఫిన్ బాగా పనిచేసి బుర్ర పాదరసం లాగా పరుగులు తీస్తుంది అంటున్నారు. అంచేత కునుకు తీశాక కాఫీ తాగితే ఈ తీరే వేరంటున్నారు.
