Chinna Maata
ఎప్పటికీ తిరిగి పొందలేనివి
ఒకసారి పెదవి దాటి బయటకు జారిన మాటా, చేజారిన అవకాశము,గతించి పోయిన కాలం విల్లు నుంచి వెలువడ్డ బాణం ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేనివి అందుకే గడుస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాటలు చాలా విలువైనవి.ఆచి తూచి మాట్లాడాలి అప్పుడే ఇలాంటి అనర్ధాలు రాకుండా ఉంటాయి.అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి అలా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి.దాన్నే అదృష్టం తలుపు తట్టడం వంటిది అంటారు విజ్ఞలు వీటన్నింటినీ వృధా చేసుకుంటే అది ఎక్కుపెట్టిన విల్లు నుంచి దూసుకుపోయిన బాణం లాగే […]
కాటుక వల్ల నష్టమే
కళ్ళకు కాటుక పెట్టుకుంటే చూసేందుకు అందంగా ఉంటాదేమో కానీ బయట కొనే కాటుకలో ఉండే రసాయనాలతో కళ్ళకు ప్రమాదమే అంటారు కాస్మెటాలజిస్ట్ లు. ఆముదం, నెయ్యి, కూరగాయలు, నూనె ఉపయోగించి ఇంట్లో చేసే కాటుకలో ఉండే విటమిన్-ఇ కంటికి మేలుచేస్తుంది. నెయ్యితో చేసే కాటుక కంటి చుట్టూ వలయాలు రాకుండా కాపాడుతుంది.కానీ బయట దొరికే కాటుకలో లెడ్, పి బి ఎస్,ఎఫ్ ఈ త్రీసంఖ్య జెడ్ ఎస్ ఓ వంటి భారీ లోహాలు ఎక్కువ ఉంటాయి. ఇవి […]
స్నాక్ మేకప్
ఇండియన్ స్నాక్స్ సిరీస్ పేరుతో స్నాక్ మేకప్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది దుబాయ్ కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ దివ్య ప్రేమ్ చంద్.ఈ బ్యూటీ బ్లాగర్ పోస్ట్ చేసిన ఫోటో లకు ఎంతో ఆదరణ ఉంది. తల్లిదండ్రులు దుబాయిలో స్థిరపడినా దివ్య కు భారత్ అంటే ఎంతో ప్రేమ.ఈ ఇండియాలో దొరికే కురుకురే, మ్యాగి వంటివి మా బంధువులు దుబాయ్ వచ్చినప్పుడల్లా తెచ్చేవాళ్ళు ఈ స్నాక్స్ మేకప్ తో నాబాల్యపు రోజులను గుర్తు […]
కురులకు దృఢత్వం
ఉల్లిపాయ రసంతో జుట్టుకు పోషణ దృఢత్వం వస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు చేసి మిక్సీ లో వేసి పేస్ట్ గా తయారు చేయాలి అప్పుడా పేస్ట్ లోనిరసాన్ని ఒక పాత్రలోకి వడపోయాలి ఈ రసాన్ని మాడుకు బ్రష్ సాయంతో చక్కగా రాసుకోవాలి కొద్దిసేపు మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి కండీషనర్ అప్లై చేయాలి వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గి పోతుంది అంతేకాదు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఉల్లిపాయలో […]
వ్యాయామం ఒక్కటే మార్గం
షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి మధుమేహం ఉన్న వాళ్లు క్రమం తప్పకుండా వాకింగ్ చేయటం మంచి వ్యాయామం ఇన్స్ లిన్ రెసిస్టెన్స్ రాకుండా చూడటం లో యోగా చేయటం చాలా ఉపయోగపడుతుంది యోగాతో ఒత్తిడి ఉండదు కొవ్వు కరిగేందుకు మంచి వ్యాయామం చేసిన ఫలితం పొందేందుకు ఈత చాలా ఉపయోగం. అలాగే కాసేపు డాన్స్ తో కూడా ఒత్తిడి పోయి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. సైకిల్ తొక్కటం ఇంకో మంచి వ్యాయామం […]
మెడలో గుడి అందాలు
దేవతా మూర్తులతో రూపొందించే టెంపుల్ జూలరీ త్రీ డైమన్షన్స్ తో తయారు చేస్తున్నారు కళాకారులు. క్రీ.శ 9వ శతాబ్దం లో టెంపుల్ జ్యువలరీ తయారు మొదలైంది.హంసలు, నెమళ్లు, లక్ష్మీ రూపాలను, వజ్రాలు, కెంపు లతో పొదిగిన నగలు దేవత దేవతలను అలంకరించే వాళ్లు.ఆ తర్వాత ఆ డిజైన్ల సాంప్రదాయ నృత్యాలు చేసే వాళ్ళు ధరించే వాళ్ళు.తర్వాత ఈ టెంపుల్ నగలను త్రీడి రూపంలో మందిరం తో సహా డిజైన్ చేయటం తాజా ట్రెండ్. దేవత మూర్తులను గుడి […]
లైక్ నాస్ట్యా ఛానల్
వీడియో తో కూడా కోట్ల సంపాదన ఉంటోంది.లైక్ నాస్ట్యా ఛానల్. 5.9 కోట్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.రష్యాకు చెందిన ఆరేళ్ల ‘అనస్టాసియా’కు సెరెబ్రల్ పాల్సీ వ్యాధి ఉందని పసితనంలోనే తెలిసింది వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బలహీనపడి ఆమె నడవలేక పోతుందని ఆమె తల్లిదండ్రులు వ్యాపారాలు అమ్మేసుకోని ,ఆ వచ్చిన డబ్బుతో నాస్ట్యా ను వేర్వేరు దేశాల్లోని అమ్యూజ్మెంట్ పార్క్ లు చూపిస్తూ ఆ వీడియోలు అప్ లోడ్ చేసే వాళ్లు వాటికి ఎంతో పేరు వచ్చింది.ఇప్పుడు […]
ఆకుపచ్చని తీరం
ప్రపంచంలో బీచ్ లు అన్ని ఒకేలా ఉండవు అంటారు పరిశోధకలు.సముద్రతీరంలో ఎగిసిపడే అలలు మెత్తని స్వచ్ఛమైన ఇసుక కనిపిస్తాయి.కొన్ని ప్రాంతాల భూగోళిక పరిస్థితులు బట్టి సముద్రాల దగ్గర ఇసుక రకరకాల రంగుల్లో ఉంటుంది. ఎర్రగా నల్లగా గులాబీ రంగు ఇసుక ఉన్న బీచ్ లు ఉన్నాయి.అలా ఉండేందుకు కారణాలు వివరిస్తున్నారు పరిశోధకులు .అలాటి ప్రాంతం బీచ్ లలో హవాయి ద్వీపం లోని కాలాయ్ కు దక్షిణాదిన ఉన్న పాపా కోలియా ని మహానా బీచ్ అంటారు.ఈ తీరంలో […]
ఔషధాల డ్రింక్
వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు లు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ఔషధగుణాలున్న డ్రింక్స్ తయారు చేసుకోమంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇందుకు కావలసిన పదార్థాలు అల్లం నల్ల యాలుకలు ఒక పచ్చ యాలుకలు 2, నల్లమిరియాలు 8, దాల్చిన చెక్క ముక్క ఒకటి లవంగాలు 5, తులసి ఆకులు 8 బిర్యాని ఆకు 1 టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు నిమ్మరసం తీసుకోవాలి.అల్లం యాలుకలు మిరియాలు లవంగాలు దాల్చినచెక్క మొత్తం మెత్తగా నూరి మరుగుతున్న నీళ్లలో వేయాలి.బాగా మరిగాక […]
అంచులే అందం
డ్రెస్ కు చీరెలకే కాదు జీన్స్ ప్యాంట్ అంచుల్లో కూడా ఎంబ్రాయిడరీ మెరుపులు కనిపించేలా డిజైన్ చేయటం ఇవ్వాల్టి ట్రెండ్.జీన్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి వీటికి పట్టు టాజిల్స్ ఎంబ్రాయిడరీ రకరకాల డిజైన్లు అందంగా అంచులు కొట్టేస్తున్నారు. ట్రెండీ లుక్ కోసం టాజిల్స్ పామ్ పామ్ లు అమరుస్తున్నారు. నీలం, నలుపు తెలుపు జీన్స్ కు పట్టు అంచులు చక్కగా అమరి పోతున్నాయి. ప్యాంటుకి డబల్ బార్డర్ లుక్ కోసం పట్టు బార్డర్ తో పాటు […]
ఇప్పుడన్నీ టాబ్లెట్లే
18 రకాల వెజిటేబుల్స్ టాబ్లెట్స్. అల్లం,వెల్లుల్లి పుట్టగొడుగు పిండి, క్యాబేజి పొడి, లోటస్ రూట్ పౌడర్ మొదలైనవి మార్కెట్ లో దొరుకుతున్నాయి. పాలు,టీ, కాఫీ సూప్ లు కూడా మాత్రలు క్యూబ్ ల రూపంలో దొరుకుతున్నాయి.ఎన్నో రకాల ఫ్లేవర్ లలో దొరికే సూప్ క్యూబ్ వేడిగా ఉన్న నీళ్ళలో వేస్తే చాలు కరిగి సూప్ గా అయిపోతుంది.పాలు కాఫీ గ్రీన్ టీ లు కూడా ఇంతే ఆ టాబ్లెట్ ను వేడి నీళ్ళలో వేస్తే చాలు ఘుమఘుమ […]
అమ్మాయిలకు ఎంతో అవసరం
కలరిపయట్టు రెండువేల ఏళ్లనాటి యుద్ధ విద్య జూడో, కరాటే వంటి వాటికి మూలం ఇదే. ఏ ఆయుధం లేకుండా ప్రత్యర్థిని ఎదుర్కోవటం ప్రధానమైన అంశం మహిళలకు భద్రత నానాటికి ప్రశ్నార్ధకంగా మారుతున్న ఈ కాలంలో ప్రతి అమ్మాయి ఆత్మ రక్షణ కోసం కలరిపయట్టు నేర్చుకోవాలి అంటోంది మీనాక్షి అమ్మ.దేశంలోనే అత్యంత వయోధికురాలైన యుద్ధకళ గురువు గా పేరుపొందిన మీనాక్షి అమ్మ కు 2017 లో పద్మశ్రీ లభించింది. యుద్ధ కళలను ప్రభుత్వాలు పాఠ్యాంశాలుగా ప్రవేశ పెట్టి పిల్లలకు […]
తగ్గించటం సులభమే
మధ్య వయసు దాటిన మహిళల్లో ముఖంపైన ముక్కుకి ఇరువైపులా నోటి చుట్టూ నల్లని మచ్చలు వస్తూ ఉంటాయి. హార్మోన్ల మార్పుల వల్ల మోనోపాజ్ సమయంలో కనిపిస్తాయని చెపుతున్నారు డాక్టర్లు. వీటిని తగ్గించుకొనేందుకు నిత్యం నీళ్లు ఎక్కువ తాగటం మొదలు పెట్టారు. టమోటో,బీట్ రూట్ క్యారెట్ వంటి కూరగాయలు రసాలు తాగాలి. మసాలా కారం వంటివి తగ్గించుకోవాలి. కప్పు పాలలో స్పూన్ చొప్పున సుగంధ పాలు పటిక బెల్లం చూర్ణం నిత్యం రెండు పూటలా తీసుకోమంటున్నారు ఆయుర్వేద వైద్యులు […]
అమావాస్య కూడా మంచిదే
ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అంటే తిథి వార నక్షత్రాలు సరి చూసుకుంటారు.అలా ఒక మంచి ముహూర్తం లో మొదలు పెట్టిన ప్రతి పని విజయవంతం అవుతోంది. చాలామంది అమావాస్య నాడు ఏ పని మొదలు పెట్టారు ఆ రోజు మంచిది కాదని అనుకుంటారు.అని మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్యనాడు ప్రారంభించారు విజయాన్ని సాధించారు అధర్మాన్ని జోడించి ధర్మాన్ని గెలిపించిన మంచి ముహూర్తం అది.ఇప్పుడో కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజే. ఆ రోజు కోసం ఎదురు […]
పచ్చి కూరల రసం బెస్ట్
ఎన్నో పోషకాలుండే కూరగాయలను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.పచ్చి కూరల్లో విటమిన్-సి ఎంతో ఎక్కువగా ఉంటుంది.రసాలు, జ్యూస్ ల రూపంలో పచ్చి కూరగాయలు తీసుకొన్నా మంచిదే.కూరగాయలతో తయారు చేసే జ్యూస్ లు రుచిగా ఉండేందుకు చక్కెర, బెల్లం, తేనె కలుపుకోవచ్చు.ఎక్కువగా కలిపితే కేలరీలు అధికం అవుతాయి జ్యూస్ వడ కడితే పీచు పోతోంది కాబట్టి వీలున్నంత వరకు వాటిని సలాడ్స్ రూపంలో తీసుకోవటం బెటర్.ఇష్టంగా తినలేని కూరగాయలు పచ్చివే.ఎలా అభిరుచి గా ఉండాలో అలా జ్యూస్ గా […]
ఈ ఆహారమే ఔషధం
చాలామంది స్త్రీలలో రక్తహీనత సమస్య ఉంటుంది.పోషకాహార లోపం వల్ల కూడా రక్తహీనత రావచ్చు.దీనివల్ల విపరీతమైన నీరసం పనులు చురుగ్గా చేసుకోలేకపోవడం ఉంటుంది.ఎండు ఖర్జూరాలు నీళ్లలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం ఒక నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడవచ్చు.రోజుకో దానిమ్మ పండు వారానికి రెండు సార్లు బీట్ రూట్ కూర,అరటిపండు,మెంతి కూర, గోంగూర,పాలకూర,తేనె, పాలు,పెరుగు కిస్ మిస్ లు ఆహారంలో భాగంగా ఉంటే చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
అతినిద్ర అనారోగ్యమే
నిద్రలేమితో ఎన్నో ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయన్నది తెలిసిందే.కానీ సరికొత్త అధ్యయనం అతిగా నిద్ర పోయిన వారిలో గుండె జబ్బులు,డిప్రెషన్ వంటి జబ్బులు త్వరగా వస్తాయి అంటోంది…మనిషికి రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర చాలా అవసరం అంతకన్నా తక్కువ నిద్ర పోతే గుండెజబ్బులు వచ్చే అవకాశం 34 శాతం ఉన్నట్లు అధ్యయనకారులు తేల్చారు.అలాగే 8 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారిలో 35 శాతం గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు అతినిద్ర మూలంగా డి ఎన్ […]
కమలం వంటి అందం
అందమైన కమలం సౌందర్య పోషణలో ఎంత గానో ఉపయోగపడుతుంది తామరపువ్వుల పొడి మార్కెట్ లో దొరుకుతోంది.రెండు స్పూన్ల తామరపూల పొడి లో టేబుల్ స్పూన్ పాలు కలపాలి.దీన్ని మొహం మెడకు పట్టించి పావుగంట పాటు ఆరపోవ్వాలి తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ తామరపూల ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది అలాగే జుట్టు పొడిబారకుండా కాపాడుతోంది తామరపూల పొడి, ఉసిరి పొడి, గుంటగలగర పొడి రెండేసి టేబుల్ స్పూన్ ల చొప్పున తీసుకోవాలి నీళ్లలో కలిపి […]
కొన్ని జాగ్రత్తలు తప్పవు
మెనోపాజ్ మహిళలందరికీ ఎదురయ్యేదే కానీ ఒకళ్ళకి ఒక రకమైన సమస్యలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల తయారీ తగ్గిపోవటంతో వచ్చే దశ ఇది.కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో ఉపశమనం పొందవచ్చు. ఉదయం తప్పకుండా నడవాలి కండరాల దృఢత్వం కోసం వ్యాయామం చేయాలి వదులుగా ఉండే నూలు దుస్తులు వేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడానికి అలవాటు పడాలి తరచూ నీళ్లు తాగాలి.వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పోషకాహారం తప్పనిసరి మధుమేహం అదుపులో ఉంచుకోవాలి […]
ఎడారి పూలు
ఎటువైపు చూసినా ఇసుక గుట్టలు, ఎండమావులు, ఒంటెలు ఇవే ఎడారి దృశ్యాలు కానీ చిలీ లోని అటకామా ఎడారి కి వెళ్తే మాత్రం భూమి మొత్తం విచ్చుకొన్న పూలతో ఎంతో రమణీయంగా కనిపిస్తుంది.ప్రపంచంలో అత్యధిక పొడి వాతావరణం నమోదయ్యే ఈ ఎడారిలో వర్షపాతం చాలా తక్కువ. అలాంటిది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రం నీటి అవసరం అంతగా ఉండని ఎడారి మొక్కలు మొలిచి వికసిస్తాయి.కొన్నాళ్లకు ఈ పూలు విడిపోయి ఆ నేలలో విత్తనాలు పడిపోతాయి.మళ్లీ వర్షాలు […]
