Chinna Maata
మిస్ ఇండియా 2020 (తెలుగు)
కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్,జగపతి బాబు నటించిన మిస్ ఇండియా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మానస సంయుక్త చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త కావాలని అనుకుంటుంది.పుట్టి పెరిగిన లంఖ సింగి గ్రామంలో తాతయ్య బాల్యంలో రుచి చూపించిన హెర్బల్ టీ ని వ్యాపారంగా మలుచుకోవాలనుకుంటుంది.అన్న ఉద్యోగం తో అమెరికా వచ్చిన మానస టీ బిజినెస్ స్థాపించి యువ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతుంది.అంతర్లీనంగా మహిళా సాధికారతకు పెద్ద పీట వేసారు దర్శకుడు నరేంద్ర […]
నిదుర రావమ్మా రావే
హాయిగా నిద్రపో కలిగితే ఆనందమే కాస్త నిద్ర తగ్గిందంటే మానసిక సమస్యలు వస్తాయి.భావోద్వేగాలు పాజిటివ్ గా ఉంటే ప్రశాంత చిత్తంతో నిద్రలోకి జారుకుంటారు అంటారు మానసిక తత్వవేత్తలు.నిద్రకు ప్రశాంత వాతావరణం, లోపల బయట కూడా అవసరం.అతిగా ఆలోచనలు విశ్లేషణలు నిద్రకు అడ్డుపడతాయి.నేను నా శరీరానికీ మనసుకీ విశ్రాంతి ఇవ్వదలుచుకొన్నాని పదే పదే అనుకుంటూ పడుకుంటే మెదడు దాన్ని తీసుకోగలుగుతుంది శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి జీవితంలో కష్టనష్టాలు అందరికీ ఎదురవుతాయి ఇబ్బందులు సవాలుగా స్వీకరించి స్థాయికి మనసు […]
జాగ్రత్తగా ఎంచుకోవాలి
చర్మానికి తేమ మెరుపు ఇస్తుంది టోనర్ .ఈ టోనర్ ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. జిడ్డు చర్మం ఉన్న వారు తేలికగా ఉండి నూనె సంబంధిత పదార్థాలు లేని టోనర్ ను తీసుకోవాలి.సున్నితమైన చర్మం ఉంటే సాలిసిలిక్ ఆమ్లం అధికంగా ఉండే టోనర్ ఉపయోగించాలి.అయితే పారా చేన్స్ ఉన్న టోనర్ వాడకూడదు. చర్మం పైన మచ్చలు ఉంటే ఆల్కహాల్ లేని, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉన్న టోనర్ వాడాలి.సహజమైన టోనర్ కావాలి అనుకుంటే అలోవెరా రోజ్ వాటర్ కలిపి […]
మనసి జోషి
మనసి ప్రోస్థటిక్ లెగ్ సాయంతో ఆడి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఆమె నవతరం నాయకత్వ లక్షణాలు ఉన్న నేటి మహిళగా ఆసియాలోన ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించిన టైమ్స్ మ్యాగజైన్ అక్టోబర్ ఆసియా ఎడిసిన్ ని ఆమె ముఖచిత్రంలో ముద్రించింది చిన్నప్పటినుంచే బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ లో గెలుస్తూ వచ్చినమనసి ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. నెలలపాటు హాస్పిటల్ బెడ్ కే పరిమితమైన నెమ్మదిగా కోలుకొని ప్రోస్థటిక్ కాలి సాయంతో ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. తాజాగా బార్బీ బొమ్మల […]
ఈ పాత్ర నాకో సవాల్
ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ గతవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై టబూ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.నటిగా నాది అద్భుతమైన ప్రయాణం. నా కెరియర్ కు సవాల్ గా భావించిన పాత్రల్లో ఎ సూటబుల్ బాయ్ సైదా బాయ్ పాత్ర ఒకటి. మీరా నాయర్ తో ది నేమ్ సేక్ సినిమాలో కలిసి నటించాను కనుక ఆమె దర్శకత్వం పైన నాకు నమ్మకం ఉంది. అందుకే సైదా బాయ్ గా నటించేందుకు సరే […]
ప్రతినిధుల సభకు పోటీలు మంగా అనంతాత్ముల.
అమెరికాలో ప్రతినిధుల సభ (హౌస్ అఫ్ రిప్రజంటేటివ్స్ )కు,వర్జీనియా నుంచి తొలిసారి తెలుగింటి మహిళ తొలిసారి తెలుగింటి మహిళ మంగా అనంతాత్ముల రిపబ్లికన్ల తరుఫున బరిలో దిగుతున్నారు.ఆసియన్ హక్కుల ఉద్యమకారిణిగా సుపరిచితురాలు. 1990లో అమెరికా వచ్చారామె. మొదట్లో రక్షణ శాఖ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. తొలిసారిగా వర్జీనియా రాష్ట్రం 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి నామినేషన్ వేశారు.ఆమె పోటీపడుతున్న నియోజవర్గం లో,గెర్రీ కనోలీతో ఆమె పోటీపడుతున్నామె. నేను గెలిస్తే వలసల హక్కుల కోసం […]
అందాన్నిచ్చే ఆయిల్
లెమన్ గ్రాస్ ఆయిల్ అందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.కొబ్బరి నూనెలో రెండు చుక్కలు లెమన్ గ్రాస్ ఆయిల్ ను కలిపి కండరాలు కీళ్ళకు మసాజ్ చేయాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను దూరం చేసి శరీరానికి ఉపశమనం ఇస్తాయి.అలాగే బాడీ లోషన్ లో రెండు చుక్కల లెమన్ గ్రాస్ ఆయిల్ ని కలిపి రాసుకుంటే ఆందోళన చిరాకులను నుంచి స్వాంతన లభిస్తుంది.దురద, చుండ్రు సమస్యలకు కొబ్బరి నూనెలో రెండు చుక్కల లెమన్ గ్రాస్ […]
తడి తక్కువైతే సమస్య
నోట్లో తడి తక్కువ అయితే దుర్వాసన సమస్య వస్తోంది.డ్రై మౌత్ లో సలైవ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రోజూ ఎనిమిది గ్లాసులు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి. పాల ఉత్పత్తులు మాంసం చేపలు కాస్త తగ్గించాలి. కాఫీ సిట్రస్ జ్యూస్ లు షుగర్ డ్రింక్స్ తక్కువగా తీసుకోవాలి. దంత సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతి ఆరు నెలలకు డెంటల్ క్లీనింగ్ చేయించుకోవాలి.ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.తప్పనిసరిగా రోజుకు రెండు […]
విద్యార్థి కుల్లో ఆరోగ్య శ్రద్ధ
మనిషికి దీర్ఘాయుష్షును ఇచ్చేది చదువా ? సంపదా ?అంటే చదివే అంటున్నారు అధ్యయనకారులు. బాగా సంపాదగలవారు సకల సౌకర్యాలతో జీవించే వారి కన్నా చదువుకున్న వాళ్ళే ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారని అధ్యయనాలు తేల్చాయి.ఒక వెయ్యి మంది పైన జరిపిన ఈ అధ్యయనంలో చదువుకున్న వ్యక్తులు నిరంతరం అప్ డేట్ గా ఉండటం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోగలరు.శరీరంలో అనారోగ్యాన్ని గుర్తించి దాని గురించి తెలుసుకోని శ్రద్ధగా ఉండగలరు.అందుకే వారు దీర్ఘకాలం […]
ఎన్నో ప్రయోజనాలు
వడ్లు దంచి జల్లెడ పట్టి రుచిగా ఉండే దంపుడు బియ్యం తినే రోజుల్లో ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు. ఇప్పుడు పాలిష్ బియ్యం వచ్చాయి.తెల్లని బియ్యం తప్పించి ఇంకొకటి ఊహ కూడా రావు. పోషకాలు కోల్పోయిన బియ్యం అధిక కేలరీలు పీల్చుకునేలా చేస్తుంది.గతంలో మాదిరి దంపుడు బియ్యం, ఇప్పటి మాదిరిగా కూరగాయలు పండ్లు వ్యాయామం గనుక ఉంటే క్యాలరీలు ఎంతో తగ్గిపోతాయి. ఒక అరగంట సేపు వేగంగా నడిస్తే ఎన్నో కేలరీలు ఖర్చవుతాయో, ఈ దంపుడు బియ్యం […]
Dark ( వెబ్ సిరీస్ )
శ్రద్ధగా చూడవలసిన సీరీస్ డార్క్. జర్మనీలోని విండెన్ అన్న చిన్న టీన్ లో ఒక పదిహేను సంవత్సరాల పిల్లవాడు ఎరిక్ తప్పి పోతాడు. ఎరిక్ స్కూల్లో డ్రగ్స్ అమ్ముతాడని వాటిని ఊరి బయట ఉన్న గృహలో దాచి పెడతాడని తెలిసినా కొందరు ఒక రాత్రి ఆ గృహ లో చూద్దామని బయలుదేరారు వాళ్లలో మైకేల్ అన్న పిల్లవాడిని తనతో తీసుకు వస్తాడు అన్న మాగ్నస్. గుహ లో జరిగిన విచిత్ర పరిస్థితుల నుంచ తప్పించుకునేందుకు తలోదారినా పారిపోతారు […]
ప్యాకెట్ పాలే బెస్ట్
ప్యాకెట్ పాలు మంచిదా, లేదా విడిగా దొరికే పాలు మంచివా అని ఎప్పుడూ డైలమా ఉంటుంది.ప్యాకెట్ పాలు పాశ్చరైజ్డ్ చేయబడి ఉంటాయి.ఈ పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలు వేడి చేసి చల్లారిన తరువాత ప్యాకెట్ల లో నింపుతారు.ఈ ప్రక్రియ ద్వారా పాలలోని వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయి.అలాగే ప్యాకెట్ పాలు వివిధ పాళ్ళలో వెన్నను కలిగి ఉంటాయి. ఈ పెద్ద కంపెనీ బ్రాండ్ల పాలలో పాలు కల్తీ అయ్యే అవకాశం తక్కువ.పితికే పాలు శుభ్రమైన చేతులతో, శుభ్రమైన పాత్రలలో ఉంచి […]
ఇంటికే లవ్ ఫర్ ఫుడ్
హైదరాబాదులో లవ్ ఫర్ ఫుడ్ పేరుతో స్మార్ట్ కిచెన్ నడుపుతున్నారు స్నేహితులు శైలజ చెరువు శశికళ టెకాల్ సాంప్రదాయ కాయగూరలు ఆకుకూరలు పప్పు దినుసులతో రోజు 300 మందికి భోజనం పంపేస్తారు వంటరి వృద్ధులు, డైటింగ్ చేసేవారు ప్రస్తుతం కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారికి ప్రత్యేకమైన ఆహారం పంపిస్తున్నారు. ప్రోటీన్ డైట్ రెడీ టు కుక్ పదార్ధాలు సప్లై చేస్తారు ఆహారాన్ని బట్టి 50 నుంచి వంద రూపాయలు ధర ఉంటుంది డోర్ డెలివరీ ఉచితం.
ఆనందం మన హృదయంలోనే
ఆనందం మన గుప్పట్లోనే ఉంటుంది. అది లోపల నుంచి ఉదయించేది. చేసే పనిలో ఏకాగ్రత నిలిపి దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే దొరికేది ఆనందమే ఎంతోమంది విజ్ఞాలు దీన్ని అనేక రకాలుగా నిర్వహించారు కోరికలను త్యాగం చేస్తే అక్షయమైన ఆనందం కలుగుతోంది అంటాడు సిద్ధార్థుడు.నిజాయితీగా సదాశయంతో ప్రేమించటమే కర్తవ్యం ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మ నిర్వహిస్తే దొరికే సంతృప్తి పరమేశ్వరుడు ఇచ్చిన సంపద అంటారు జ్ఞానులు. ఒక పనిలో మనిషి చూపించే అభిరుచి అది ఎంత చిన్న […]
ఇదో కొత్త సమస్య
చలికాలంలో మొదలైంది కోవిడ్ ఇన్ ఫెక్షన్ కు ఇన్ ఫ్లూయెంజా తోడయ్యే ప్రమాదం ఉంది కనుక ఈ రెండూ కలిసిన ఒకే దాడి చేస్తే దాన్ని ట్విన్ డెమిక్ అంటారు. దీని బారినుంచి తప్పించుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గం.కరోనా ఉత్పత్తి తగ్గిందని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా మొహానికి ఆసాంతం మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించటం చేతులు శుభ్రం చేసుకోవడం వంటి రక్షణ చర్యలు కొనసాగించాలి. చలికాలంలో కి అడుగు పెట్టాం కనుక ఈ […]
మహిళల చేతుల్లో నిఘా విమానాలు
డోర్నయార్ ఆపరేషన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొన్నారు నేవీ పైలెట్ లు దివ్య శర్మ, శుభాంగీ స్వరూప్, శివాంగి వీరు ముగ్గురు నేవీ ఫస్ట్ జాబ్ మహిళ పైలట్లు. ఈ మహిళలు ఇప్పుడు డోర్నయార్ నిఘా విమానాలను నడపబోతున్నారు నావీ పైలెట్లు గా దివ్య,శుభాంగీ, శివాంగి మొదటి ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఈ ముగ్గురిని డి. ఓ.ఎఫ్.టి శిక్షణకు పంపింది. ఈ ముగ్గురు హైలెట్ లు బాధ్యతలు స్వీకరించనుండటంతో నేవీ సందడి […]
పరిమళ చికిత్సలు
మనసు ఉల్లాసంగా కలిగించటం, దగ్గర నుంచి ఒత్తిడిని తగ్గించడం వరకూ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది.కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిమళ ద్రవ్యాలను సౌందర్య సాధనాలుగా చికిత్సలు గా ఉపయోగించడం మొదలుపెట్టారు.జలుబు చేస్తే వేడి నీటిలో పసుపు వేపాకు వేసి ఆవిరి పట్టడం,వాముని వేడి చేసి గుడ్డలో వేసి పీల్చటం కూడా పరిమళ చికిత్సలే. జలుబు చేస్తే వేడినీటిలో యూకలిప్టస్ నూనె కలిపి ఆవిరి పట్టచ్చు.తులసి పరిమళం తో ఆవిరి పడితే జలుబు, జ్వరం తగ్గుతాయి తల నొప్పికి […]
రసాయనాలు లేని వాక్స్
అవాంచిత రోమాలు తొలగించేందుకు ఉపయోగపడే వాక్స్ ను ఇంట్లోనే సహజంగా, ఎలాంటి రసాయనాలు కలవకుండా తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూను చక్కెర, ఒక టీ స్పూన్ నిమ్మరసం తేనె కలిపి బాగా పాకం లా వచ్చేలా వేడిచేయాలి. దాన్ని కాస్త చల్లారేలా చేయాలి ఇప్పుడు చర్మంపైన టాల్కం పౌడర్ వేసి బాగా రుద్ది తర్వాత దాని పైన ఈ మిశ్రమాన్ని రాయాలి.రాసిన దానిపై వాక్స్ స్ట్రిప్ పెట్టి దానిపై రుద్దాలి. ఇప్పుడా స్ట్రిప్ ని వ్యతిరేకదిశ […]
ఇది అదనపు అందం
లెహంగాలకు చోళీలకు ఇప్పుడు భారీగా ఉండే టాసిల్స్ జతచేయడం ఫ్యాషన్ (Tassel) పాం పాం డిజైన్స్ హ్యాండ్ మేడ్ టాసిల్స్ ఎంతో ట్రెండీగా కనపడే ఆన్ లైన్ స్టోర్స్ లో కనిపిస్తున్నాయి సిల్వర్ టాసిల్స్, పూసలతో అల్లినవి బంగారు ఎంబ్రాయిడరీ చేసినవి స్టోన్ వర్క్ టాసిల్స్ పాతకాలంనాటి బంగారు గోటు కుట్టిన ఎంబ్రాయిడరీ టాసిల్స్ సిల్క్ దారాలతో అల్లినవి లెహంగా కు బ్లౌజు లకు అదనపు ఆకర్షణ తెచ్చిపెడుతున్నాయి. బ్లౌజ్ లకు జతచేసిన కుచ్చుల టాసిల్స్ తో, […]
పెద్దవాళ్ళే ఆదర్శం
పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలకు అంత తేలికగా కోవిడ్ సోకె అవకాశాలు లేవు. అయినా పిల్లల సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు వైద్య నిపుణులు .తప్పని సరిగా చేతులు శుభ్రం చేసుకోవటం అలవాటు చేయాలి. తద్వారా వైరస్ సోకాదని అర్ధం అయ్యేలా చెప్పాలి. పిల్లలకు చేతులు శుభ్రం చేసుకొనే విషయంలో తల్లిదండ్రులే ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో ఎక్కువ సమయం ఇంట్లో ఉంటున్నారు కనుక చిన్న వ్యాయామాలు డాన్స్ లు వంటి యాక్టివిటీ చేయించాలి దీనివల్ల పిల్లలు […]
