Tuesday, 04 Aug, 2026

నల్ల ఉప్పు తో లాభాలు

నల్ల ఉప్పు తో చర్మసౌందర్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయి. నల్ల ఉప్పు చర్మాన్ని సూక్ష్మక్రిములు ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. శిరోజాలకు నల్ల ఉప్పు కలిపిన నీళ్లు పట్టించి ఆరిపోయాక కడిగేస్తే నల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది సహజమైన స్క్రబ్బర్.శీతాకాలంలో నల్ల ఉప్పు తో చర్మంపై రుద్ది నీటితో శుభ్రం చేస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి. చర్మం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవు అలాగే  చుండ్రు సమస్యకు నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది. జుట్టుకు నల్ల ఉప్పు […]

డైనింగ్ రూల్స్

ఇంట్లో అయినా బయట అయినా భోజనం చేసే సమయంలో సరైన పద్ధతిలో పాటించాలి. ఈ పద్ధతులు వ్యక్తిత్వానికి విశిష్టత ఇస్తాయి.  భోజన సమయంలో శబ్దలు చేయటం అసభ్యంగా ఉంటుంది. అలాంటి అలవాటును ప్రయత్నించి మార్చుకోవాలి. నోటి నిండా ఆహారం ఉంచుకుని మాట్లాడటం తినేవారికి ఎదురుగా ఉన్న వారికీ ఇబ్బందే. గబగబా తినేయడం పక్కన ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోకపోవటం సభ్యత కాదు. భోజనం టేబుల్ వద్ద సంభాషణలు తేలిగ్గా మృదువుగా ఉండాలితప్ప చర్చలు అనాలోచిత వ్యాఖ్యానాలు వద్దు. […]

సీతా ఫలాలతో స్కిన్ టోన్

సీతా ఫలాలతో చక్కని స్కిన్ టోన్ వస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరం లోని కొలాజెన్ స్థాయిల్ని మెరుగుపరిచే గుణం సీతా ఫలాల్లో ఉంటుంది.చర్మంపై ముడతలను ఫైన్ లెన్స్ ను తగ్గించే శక్తి ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో గల ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి దీనివల్ల చర్మం టోన్ మెరుగవుతుంది.చర్మకణాల పునరుత్పత్తి పెరుగుతుంది. వార్ధక్య ప్రక్రియను జాప్యం చేసే యవ్వన రూపాన్ని ఇస్తాయి సీతా ఫలాల్లోని సోడియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరించి గుండె ఆరోగ్యానికి ఎంతగానో […]

మంచి ఫలితం 

మొహం జిడ్డుగా అయిపోతూ ఉంటే ఇంట్లోనే కొన్ని ప్యాక్స్ వేసుకోవచ్చు. రసాయనాలు లేని ఈ ప్యాక్స్ మంచి ఫలితం ఇస్తాయి.కోడిగుడ్డు తెల్లసొన లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.మార్కెట్ లో దొరికే పాక్స్ వేసే బ్రష్ తో సమానం గా వచ్చే లా వేసుకోవచ్చు. ఇది ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే చాలు ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడి లో అంతే తేనె అర టీ స్పూన్ నిమ్మరసం […]

పెళ్లి దుస్తుల బామ్మ కు పద్మశ్రీ 

పెళ్లి బట్టల బామ్మగా పాట్లోయ్ సెట్రీ గా    మణిపూర్ వాసులు పిలుచుకునే 90 ఏళ్ల రాదా దేవిని పద్మశ్రీ వరించింది యాభై ఎనిమిది సంవత్సరాలుగా  పాట్లోయ్ అని  పిలుచుకునే మణిపురి పెళ్లి దుస్తులు కొడుతూనే ఉన్నారామె బుట్టబొమ్మ తరహాలో గౌను దానికి కలిపి కుట్టే రవిక మెత్తగా జారే మస్లన్ వస్త్రం ఇవన్నీ కుట్టటం అంత తేలిక కాదు ఈ సాంప్రదాయక కుట్టు పని చేసే రాధాబాయిని అందుకే పద్మశ్రీ వరించింది. కేవలం పెళ్లి దుస్తులే […]

ఇల్లు సర్దేస్తారు 

2016 లో ఆర్గనైజడ్ విత్ ఈజీ పేరుతో ఆర్గనైజర్ వృత్తిని మొదలుపెట్టింది రోహిణి గోపాలన్ స్పేస్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్ గా  ఆమె ఎంచుకున్న వినూత్న మైన వృత్తి ఇప్పుడు ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ పుణేల్లో ఎన్నో ఇళ్లను ఆఫీస్ ల్ని  చక్కగా సర్ది పెట్టేస్తున్నారు. ఇల్లు అందంగా సర్దేయటం, అవసరానికి అందుబాటులో వస్తువులు ఎక్కడ ఉండాలో చూడటం అనవసరమైన వస్తువులు తీసేయటం అభివృద్ధిలో భాగం. ముంబైకు చెందిన రోహిణి ఎంబీఏ చేశారు మేనేజ్మెంట్ ఆర్గనైజర్ గా రాణిస్తోంది […]

జాగ్రత్తగా వాడాలి 

ఓవెన్ ను జాగ్రత్తగా వాడుకుంటే ఎంతోకాలం నచ్చిన వంటకాలు తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఓవెన్ ఆన్ చేసిన వెంటనే వాడకూడదు. ఆన్ చేసిన ఐదు నిమిషాల తర్వాత వాడాలి .ఓవెన్ లో ఉడుకుతున్న పదార్థాలను పైభాగంలో ఉండే ట్రాన్స్పరెంట్ పొర ద్వారా చూడాలి ఓవెన్ ను నీళ్లతో కడగకూడదు పొడి బట్టతో తుడవాలి. వాడకానికి త్రీఫేస్ ప్లస్ వాడితే మంచిది సాధారణమైన ఓవెన్ ల కంటే ఆటోమెటిక్ ఓవెన్ లు మంచివి. ఓవెన్ వేడిగా ఉన్నప్పుడు లేదా […]

తెల్ల జుట్టు కు మందు 

చిన్న వయస్సులో జుట్టు తెల్లబడతూ  వుంటే వెల్లుల్లి పొట్టు తో సమస్య దూరం చెయచ్చు .వెల్లుల్లి పొట్టు ఒక పాత్రలోకి తీసుకుని అవి బాగా నల్లగా అయ్యేవరకు గరిటతో కలుపుతూ స్టవ్ పైన వేయించాలి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి కొబ్బరి నూనె వేసి అందులో ఈ పొడి వేసి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని రెండు గంటలపాటు నాననివ్వాలి తర్వాత ఈ పేస్ట్ తలకు రాసుకుని గంట పాటు ఉంచుకుని తలస్నానం చేయాలి.తెల్ల వెంట్రుకలు […]

ఇలా తింటే ఆరోగ్యం 

ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.బియ్యంతో చేసిన ఇడ్లీ దోసెల కు బదులు జొన్నలు మినుములతో చేసిన ఇడ్లీ దోసె వారానికి ఒకసారి తినాలి దోసెలు అట్లు కు నూనె బధలు  నెయ్యి  వాడాలి. మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు తింటే కూడా మంచిదే. పూరీలు, బోండాలు, వడలు నెలకోసారి తినటం ఉత్తమం ఒకటి రెండు సార్లు చపాతీలు నేతితో కలిపి తినాలి. ఏడెనిమిది గంటల మధ్యలో డిన్నర్ […]

ఇదే తొలిసారి

ఐరోపా లోని ఎస్టోనియా కు ఇద్దరు మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు 43 సంవత్సరాల కాజా కల్లాస్ ఎస్టోనియా దేశ ప్రధాని అయితే అధ్యక్షురాలిగా 51 సంవత్సరాలు కెర్ స్తి కాల్ జులైడ్ ఉన్నారు. ఇద్దరు రాజకీయ నాయకులే గాని ప్రజలు ఎంపిక చేసుకున్న వాళ్ళు కల్లాస్. 2010లో రాజకీయాల్లోకి వచ్చారు ఇక అధ్యక్షురాలు 2001 లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సోషల్ డెమోక్రాటిక్ పార్టీ మద్దతుతో ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. 1991లో ఎస్టోనియా కు స్వాతంత్రం వచ్చాక […]

ఇదే పరిష్కారం

కోవిడ్ వాక్సిన్ గర్బిణీలకి, పాలిచ్చే తల్లులకు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన తర్వాత, మహిళలు గర్భం దాల్చే ఆలోచనను వాయిదా వేసుకుంటే మంచిదని అంటున్నారు గైనకాలజిస్టులు. గర్భం దాల్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకునే వీలు లేదు గర్భధారణ కనీసం రెండు నెలల పాటు వాయిదా వేసుకోమంటున్నారు. గతంలో రుబెల్లా వాక్సిన్ రూపొందిన ప్రారంభంలో ఎదుర్కొన్న పరిమాణాలను పరిగణలోకి తీసుకోమని చెపుతున్నారు డాక్టర్లు. గతంలో ఈ వ్యాక్సిన్ తీసుకొన్న గర్భవతుల్లో గర్భస్థ పిండానికి వైరస్ సోకిన […]

మెత్తని టవల్ వాడితే సరి

జుట్టు త్వరగా ఆరేందుకు హెయిర్ డ్రయ్యర్ ఉపయోగిస్తారు కానీ ఆ వేడికి జుట్టు పాడైపోతుంది. అందుకే సహజంగా జుట్టు ఆరేందుకు మెత్తని పోగులు ఉండే తువ్వాలు తో తుడుచుకోవాలి ఎక్కువ సమయం జుట్టుకు టవల్ చుట్టి వదిలేస్తే దాన్ని తీసేప్పుడు జుట్టు రాలిపోతుంది వేడి నీళ్లతో స్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు తెరుచుకుంటాయి అందుకే చివర్లో చల్ల నీళ్లు జుట్టు పైన పోసుకోవాలి కుదుళ్ళు మూతపడి కురులు ఆరోగ్యంగా ఉంటాయి. తలస్నానం చేశాక మైక్రో ఫైబర్ టవల్ […]

గ్రో యువర్ సెల్ఫ్ కిట్

దీంతో మన చిన్న బాల్కనీలో చిన్నపాటి స్థలంలో కూరగాయలు ఆకుకూరలు పెంచాలనుకొంటే, గ్రో యువర్ సెల్ఫ్ కిట్ కోసం అమెజాన్ లో ఆర్డర్ ఇస్తే చాలు ఒక కిట్ ఇంటి వాకిట్లో ఉంటుంది. విత్తనాలు కుండీలు సేంద్రియ ఎరువు మట్టి ఎలా పెంచాలో ఒక బుక్ లెట్ మొక్క ఎదుగుదల గురించి నోట్ చేసుకునే చిన్న నోట్ బుక్ సమస్తం కిట్ లో ఉంటాయి. కిట్ లో పచ్చని సేంద్రీయ ఎరువులే కనుక రసాయనాల భయం లేకుండా […]

ఈ స్కై వాక్ ఒక సాహసం

ఈ వంతెనపై నిలబడి చుట్టూ కొండలూ లోయల్ని చూడటం సాహసమే అంటారు పర్యాటకులు చైనాలోని టెంగ్జీయా తియన్మన్ స్కై వాక్, గాజు వంతెన 350 కోట్ల వ్యయం కట్టారు. కొండ అంచు చివర నుంచి 368 మీటర్ల పొడవుతో భూమికి 500 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ వంతెన మీద నడుస్తుంటే ఇటు నుంచి లోయ, చుట్టూ కనిపించే ప్రకృతి కళ్ళు చెదిరేలా ఉంటాయి. ఈ వంతెన చివరి అంతెత్తు నుంచి నీళ్లు చినుకుల్లా పడుతూ ఉంటే […]

మంచి స్నాక్ ఫుడ్

పల్లీలను వేయించి వేయించినప్పుడు వాటిల్లోని పి-కౌమారిక్ ఆమ్లం 22 శాతం పెరుగుతుంది అందుకే వేయించిన పల్లీలు యాంటీఆక్సిడెంట్లు బెర్రీ ల్లో కంటే ఎక్కువ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని పచ్చిగా వేయించి నానబెట్టి మొలకలు తెప్పించి ఉడికించి ఎలా తిన్న పోషకాల్లో పెద్ద వ్యత్యాసం ఉండదు అంటున్నారు. కణ విభజన కు అవసరమయ్యే ఫోలెట్ పల్లీల్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.వేరుసెనగ గింజల్లో ఉండే విటమిన్-ఇ మంచి యాంటీ ఆక్సిడెంట్ […]

ఇది నిత్యావసరం

వ్యాయామం చేసే సమయంలో మోట్స్-సి అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ జన్యు సమాచారం శరీరంలో లోని ఇతర జన్యువుల కంటే భిన్నంగా ఉందనీ వయసు రీత్యా పనితీరు తగ్గిన మైటోకాండ్రియా కణాలు పనితీరు ఇది మెరుగుపరుస్తుందనీ తాజాగా గుర్తించారు. వ్యాయామం చేసే వాళ్ళు వృద్యాప్యం లోను ఫిట్ గా ఉండటానికి కారణం ఈ హార్మోన్ విడుదల కావడమే నని భావిస్తున్నారు. వ్యాయామాన్ని ప్రతిరోజు, జీవన విధానంలో ముఖ్యమైనదిగా భావించమని ఎక్సపర్ట్స్ సలహా ఇస్తున్నారు.

ఇప్పుడు తోరమణుల ట్రెండ్

టూరమెలిన్ లేదా తోరమణులు ఎన్నో రంగుల్లో దొరికే రత్నం వాటిల్లో వాటర్ మిలన్ టూరమెలిన్ ఆకుపచ్చ గులాబీ వర్ణం కలిసి అచ్చం పుచ్చకాయ ముక్కలు లాగే ఉంటుంది. ఈ రాళ్లని గుచ్చి వేసుకునే ట్రెండ్ మొదలైంది. బ్రెజిల్ లోని పరైబా ప్రాంతంలో దొరికే నీలిరంగు టూరమెలిన్ క్యారెట్ లక్షా యాభై వేల పైనే ఖరీదు చేస్తుంది. సహజమైనవి వజ్రాల్లాగా దృఢంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వీటిని నగల్లో కూడా అమర్చుతున్నారు. వీటి మెరుపును బట్టి ఇవి […]

వీటితో రక్తహీనతకు చెక్ 

పిల్లలు మహిళల్లో విటమిన్లు, పోషకాలు తగ్గటం వల్ల రక్తహీనత వస్తూ ఉంటుంది. మందుల కంటే ఆహారంలో మార్పులు ఎక్కువ ఉపయోగకరం అంటున్నారు ఎక్స్పర్ట్స్. జున్ను నుంచి బి -12  లభిస్తుంది. పాల ఉత్పత్తులు ముడిబియ్యం వాడుకోవాలి పాలకూర జ్యూస్ తాగాలి. బీట్ రూట్, క్యారెట్, ఉసిరి జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తాగితే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజు దానిమ్మరసం తీసుకోవచ్చు. కరివేపాకు దంచి మజ్జిగలో వేసుకొని తాగాలి వారంలో ఆరు రోజులు ఏదో ఒక ఆకుకూర  తినాలనే […]

కోవిడ్ ఉమెన్ వారియర్ 

కోవిడ్ ఉమన్ వారియర్ గా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు విజయనగరం ఎస్పీ రాజకుమారి. కోవిడ్ సమయంలో ఆమె చొరవ వల్లనే విజయనగరం జిల్లాలో కరోనా విస్తృతికి అడ్డుకట్ట పడి గ్రీన్ జోన్ జిల్లాగా మారింది. రాజకుమారి గత సంవత్సరం 4 స్కాచ్ అవార్డులను అందుకున్నారు అందులో రెండు కోవిడ్ సమయంలో అందించిన సేవలకు మరో రెండు మహిళల భద్రత కు చేసిన సేవకు అందాయి.

ధైర్యం కాస్త ఎక్కువే 

నాకు కాస్త ధైర్యం ఎక్కువే.ధైర్యమే కనుక లేకపోతే నా కెరీర్ ఎప్పుడో ముగిసి పోయేది అంటుంది తాప్సీ పన్ను .నాకు ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి.అయినా నేను భయపడలేదు సక్సెస్ కోసం ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను మంచి కథా చిత్రాలు ఎంచుకునేందుకు కూడా ఆ ధైర్యమే దోహదపడుతోంది అని భావిస్తున్నాను.ధైర్యం తోనే ఇన్నేళ్లుగా ఈ పరిశ్రమలో నిలబడా గలుగుతున్నాను అంటోంది తాప్సీ. ఒక చిన్న అపజయం ఒక విమర్శ, ఒక సినిమా సక్సెస్ కాకపోవటం ఇవన్నీ బాధపెడతాయి […]