Monday, 03 Aug, 2026

మంచి గాలి ముఖ్యం

గర్భిణీ గా ఉండగా శిశువు ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు.కానీ ఆహారంతోపాటు తాజా గాలి అవసరం అంటున్నాయి అధ్యయనాలు. కాలుష్యం నిండిన గాలి వల్ల ఒక్క ఆసియాలోనే ఏటా నాలుగు లక్షలమంది గర్భస్థ శిశువులు అమ్మ కడుపులోనే తుదిశ్వాస విడుస్తూన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశం సహా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లలోని మహిళలు కాలుష్యం కారణంగా అత్యధిక స్థాయిలో గర్భస్రావాలకు గురవుతున్నారని లాన్సెట్ కథనాలు చెబుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల […]

ఆలోచన మారింది

కరోనా సమయం ఎన్నో కొత్త ఆలోచనకు తెరదీసింది. ముఖ్యంగా విశాలంగా ఉండే గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లలో నివశించటం ఆరోగ్యం అన్న భావనకు అందరూ వచ్చారు కిచెన్ విషయంలో కూడా చాలా మార్పులు ఆలోచనల్లోకి వస్తున్నాయి ముఖ్యంగా మాడ్యులర్ కిచెన్ అయితే ప్రతి వస్తువు సొరుగుల్లో, అరల్లో సర్దుకోవచ్చు వంటగది విశాలంగా గాలి వెలుతురు వచ్చేలా ఉంటుంది. వంట చేసే అరుగులు సింక్ లు తడి నిలువకుండా పొడిగా అయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నారు సింక్ స్టెయిన్ […]

నిర్లక్ష్యం చేయకండి

నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ నీళ్లు సరిగ తాగకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి అంటున్నారు డాక్టర్స్ .మొటిమల కంటే కాస్త పెద్దదిగా మొహం పైన గడ్డలు వస్తే శరీరంలో నీళ్లు తగ్గాయని అర్థం. ముఖం కమిలిపోయి కాంతి తగ్గిపోయి కళ్ల కింద ముడతలు వాపు ఉన్నాయంటే ఒంట్లో నీటి శాతం తగ్గిందనే. రోజంతా మత్తుగా అలసటగా ఉన్న నీటి లోపమే. జుట్టుకు చుండ్రు వచ్చిన కళ్ళు బరువుగా అనిపించినా శరీరానికి తగినంత పొటాషియం […]

నలుపు పోగొట్టే ద్రాక్ష

చర్మం పైన టాన్ పోగొట్టాలంటే బార్లీ పౌడర్ ఉపయోగ పడుతోంది.రెండు స్పూన్ల బార్లీ పౌడర్ ని కప్పు నీళ్లలో ఉడకబెట్టి, ఆ మిశ్రమానికి రెండు ఎండు ద్రాక్ష పండ్ల గుజ్జు స్పూన్ నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ ప్యాక్ ని తరుచూ మొహానికి  వేసుకుంటే చర్మం తిరిగి వన్నెలీనుతోంది. నాలుగు ఎండుద్రాక్షలు ఒక ఎండు ఖర్జూరం నానబెట్టి పేస్ట్ లాగా చేసి ఆ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి […]

తీసి పారేయకండి

ఫ్రిజ్లో ఘాటు వాసనలు వస్తూ ఉంటే ఒక చిన్న టిప్ ఉపయోగపడుతుంది. ఎండబెట్టిన నారింజ బత్తాయి కమలా నిమ్మ పండ్ల తొక్కుల పొడి ఒక స్పూన్ తీసుకుని అందులో ఉప్పు కలిపి ఓ చిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్ లో ఉంచితే ఈ మిశ్రమం  ఆ వాసనలు  అన్నింటినీ పీల్చుకుంటుంది. అలాగే చెత్త బుట్ట లో కూడా నాలుగైదు ఎండిన నిమ్మ నారింజ తొక్కలు వేస్తే చెత్త తొలిగించేప్పుడు వాసన రాదు లెమూనెన్ అనే రసాయనానికి ఈ […]

తిరిగొచ్చిన తిరగలి

తిరగలి లో విసిరి తేనే పిండి పప్పు, రవ్వ సమంగా వస్తాయి అంటారు పాతకాలపు బామ్మలు. అలనాటి రకాలు ఈ రోజుల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి వేదకాలం నుంచి వాడుకలో ఉన్నా విసుర్రాయి తో విసిరిన పిండిలో గింజల్లో ఉండే పోషకాలు అన్ని పదిలంగా ఉంటాయి మిషన్లలో పిండి వేస్తే ధాన్యపు పొట్టు లోనివీ లోపలిపొర లోని పోషకాలు దెబ్బతింటాయి. పైగా ఈ విసుర్రాయి తో విసిరితే తిప్పే వాళ్లకు భుజాలు, మెడ నొప్పులు రావు కాళ్లు చేతుల […]

చర్మానికి  కళ

కోవిడ్ మూలంగా తీవ్రమైన రుగ్మతులు వాటి ఫలితంగా చర్మం పైన మార్పులు వస్తున్నాయి. చర్మం సున్నితంగా మారి పోవడం లాంటి సమస్యలు తప్పవు. చర్మానికి పూర్వపు మెరుపును అందించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి హెర్బల్ టీ సూప్ లేదా రోజ్ మేరీ తో తయారైన షేక్ స్మూతీ లతో రోజును మొదలుపెట్టాలి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి యూకలిప్టస్ నూనె కలిపిన నీటితో ఆవిరి పట్టాలి. పసుపు కలిపిన పాలు త్రాగటం చేయాలి. వేప ముద్ద పసుపు కలిపి […]

పర్ ఫెక్ట్ మ్యాట్

ఇంట్లో వర్క్ వుట్స్ యోగ చేసేందుకుగాను ఎంచుకునే మ్యాట్లు శరీరానికి సౌకర్యంగా ఉండాలి సాధారణంగా యోగ మ్యాట్ సైజ్ ఆరు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ భుజాలు కాస్త వెడల్పుగా వుంటే ఈ మ్యాట్ సరిపోదు.పలుచగా ఉన్న మ్యాట్ కంటే దళసరిగా ఉన్న మ్యాట్ ఎంచుకోవాలి. సాధారణంగా పది మిల్లీమీటర్లు అంతకంటే దళసరిగా ఉండే మ్యాట్లు అన్ని రకాల వ్యాయామాలకు అనువుగా ఉండాలి. నాణ్యత ఎక్కువగా ఉండే మ్యాట్ మరీ గ్రిప్ ఎక్కువ […]

పాలతో మెరుపు

పాలు చక్కని మాయిశ్చరైజర్ అంటారు ఎక్సపర్ట్స్ .ఎండకు కమిలిన చర్మం సాధారణ స్థితికి వచ్చేందుకు మొటిమలు తగ్గించేందుకు పాలు దోహదపడతాయి.ఒక స్పూన్ గంధం పొడి లో పాలు కలిపి పేస్టులాగా చేసి దాన్ని మొహానికి రాసి 15 నిమిషాలు ఆరిపోయే దాకా ఉంచి కడిగేస్తే పాలలో ఉండే విటమిన్ల్ ద్వారా పోషకాలు అంది చర్మం హైడ్రేడ్ అవుతుంది. తేనె, నిమ్మరసం, పాలు కలిపిన పేస్ట్ మొహానికి రాసుకుంటే ఇది ప్రకృతి సిద్ధమైన బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది. ముల్తానా […]

అచ్చం కుర్తీ లాంటి కఫ్తాన్  

ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఆర్గానిక్ లెనిన్ కఫ్తాన్ పేరుతో ప్రముఖ గూచి లగ్జరీ బ్రాండ్ విడుదల చేసిన వస్తాం ఖరీదు రెండున్నర లక్షలు.సేంద్రియ లెనిన్ తో తయారైన ఈ కఫ్తాన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లో అదనపు హంగులు తెచ్చారు. ఊహించని లేయర్స్ తో ట్రాక్ సూట్ పీస్ లతో ఈ దుస్తులు భారతీయ కుర్తీ లాగా కనిపిస్తోంది. నెక్ , స్లీవ్స్ దగ్గర పువ్వులు డిజైన్లతో తయారు చేసిన ఈ పొడవాటి భారతీయ మహిళలు ధరించే సాదాసీదా కుర్తీల […]

నాటి కళాఖండాలకు కొత్త రూపం

హ్యాపీ హాండ్స్ ఫౌండేషన్ స్థాపించి 12 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళాకారుల ఉత్పత్తులను ఆన్ లైన్ లో ప్రపంచ వ్యాప్తి ప్రేక్షకులకు చేరువ చేస్తోంది మేధావి గాంధీ. కల కోసం పాటుపడిన మరుగున పడిపోయిన అలనాటి మహిళా మణుల కథలను తన వెబ్ సైట్ హెరిటేజ్ ల్యాబ్ ద్వారా వెలుగులోకి తెస్తోంది.మ్యూజియంలో, గ్యాలరీలోని కళాఖండాలు చూడాలంటే  ఆన్ లైన్ లో కనిపించవు అందుకు వర్చువల్ గ్యాలరీ ఒక్కటే మార్గం కళా ప్రేమికులకు కనువిందు చేయాలనే ఉద్దేశంతో నేను […]

అవాంఛిత రోమాలు మాయం 

మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఎర్ర కందిపప్పు తో ముఖం పైన ఉండే అవాంఛిత రోమాలు తేలికగా తొలగించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఈ కందిపప్పు తో తయారుచేసిన ప్యాక్ తో నల్ల మచ్చలు కూడా పోతాయి వందగ్రాముల ఎర్ర  కందిపప్పు,గంధం పొడి 10 గ్రాములు బత్తాయి తొక్కు పాలు ఒక కప్పు తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు, గంధంపొడి, బత్తాయి తొక్కలను పాలలో    నానపెట్టాలి వీటన్నింటిని మిక్సీ లో వేసి మెత్తని ముద్దగా చేయాలి. ఈ పేస్ట్ […]

హ్యాండ్ పెయింటెడ్ బ్యాంగిల్స్ 

ఇప్పుడు హ్యాండ్ పెయింటెడ్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ మొదలైంది .గాజుల పైన అందమైన చిత్రాలు వేసిన ఈ గాజులు చుడగానే కళ్ళని ఆకట్టుకుంటున్నాయి. చేత్తో వేసే ఈ పెయింటింగ్స్ ఉన్న గాజులు ఎక్కువగా తయారయ్యేవి రాజస్థాన్ లోనే .ఈ హ్యాండ్ పెయింటెడ్ గాజుల్లో కొన్ని ఆఫీసులకు కాలేజీలకు ధరించేవి,మరికొన్ని పెళ్లిళ్లు శుభకార్యాలకు వేసుకునేవి ఉన్నాయి .సెట్ లో అయితే పెయింటింగ్ వేసిన గాజులు రెండు మధ్యలో ఉండి అటు ఇటు రాళ్లు పొదిగిన గాజులు ఉన్నాయి.దేవి దేవతల రూపాలున్న […]

అనారోగ్య కారణం ఇదే

చక్కెర కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునే వాళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ ఫెక్షన్లు  ఇన్ఫ్లమేటరీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పంచదార కొవ్వుల కారణంగా పొట్టలోని రోగనిరోధక శక్తికి సంబంధించి కొన్ని కణాలు సరిగ్గా పనిచేయటం లేదని వారు చెబుతున్నారు. దీర్ఘకాలం ఆ రకమైన ఆహారం తీసుకుంటే అనారోగ్యాల పాలు అవ్వక తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

వట్టి కషాయాలతో నష్టం

కోవిడ్ భయంతో చాలామంది దృష్టి కషాయాల వైపు మళ్ళింది .కానీ అలాటి కషాయాల కే పరిమితం అయితే సమస్యలు వస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినమంటున్నారు చిక్కి, ప్రోటీన్ బార్ లతోపాటు అరటి, మామిడి వంటి పండ్లు స్నాక్స్ గా తీసుకోమంటున్నారు వేడిగా ఉన్న ఆహారం తినాలి పండ్లు ఉప్పునీటితో శుభ్రం చేసుకుని తినాలి. పన్నీర్ పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు పప్పు, గుడ్లు, చికెన్ తింటేనే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు లభిస్తాయి. సిట్రస్ […]

పాలతో మెరుపు

పొడిచర్మం గలవారు మొహానికి తేనే పాలు కలిపి రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ రెండు చర్మంలోని మురికిని తొలగిస్తాయి. పొడి చర్మానికి కావలసిన పోషణ ఇస్తాయి చెంచా చొప్పున పాలు తేనె లను ఒ గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పూతలా వేసుకొని చేతి వేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి ముఖంపై ఏర్పడే మరకలు పోవాలంటే పాలు, పసుపు మిశ్రమం రసాయనాలున్నా  క్రీముల కంటే బాగా పనిచేస్తుంది. పసుపులోని సమ్మేళనాలు బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది.

అందమైన చర్మపు రహస్యం

మనం తీసుకొనే ఆహారం మన చర్మ సౌందర్యం పైన ప్రతిఫలిస్తుంది అని చెపుతున్నారు పరిశోధికులు. విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం తీసుకొంటే చర్మం కూడా ఎ క్లాస్ గానే  ఉంటుందంటున్నారు. క్యారెట్లు, పాలకూర, మెంతికూర, బచ్చలి వంటి ఆకుకూరలు గుమ్మడి, కోడిగుడ్డు లోని పచ్చసొన, చేపలు తీసుకొంటే శరీరానికి తగినంత విటమిన్-ఎ లభిస్తుంది. తద్వారా చక్కని చర్మం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు పరిశోధికులు.

సింపుల్ టిప్స్

కిచెన్ లో పనులు సులువుగా పూర్తవ్వాలి అంటే కొన్ని టిప్స్ నేర్చుకుంటూ ఉండాలి .కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పొంగి స్టౌ పైన కుక్కర్ మూత పైన పడి ఇబ్బంది పెడుతూ ఉంటే విజిల్ చుట్టూ ఒక కాటన్ క్లాత్ పెట్టాలి.కుక్కర్ పొంగితే కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది. తర్వాత దాన్ని శుభ్రం చేయటం సులువు.సమ్మర్ లో నిమ్మ షర్బత్ చేసుకుంటూ ఉంటాం నిమ్మరసం లో పంచదార త్వరగా కరగదు.పంచదార లో ముందే కాసిన్ని వేడి నీళ్లలో వేసి పెట్టుకుంటే […]

మాస్క్ తో సమస్యలా ? 

నిరంతరం మాస్క్ ధరించడం తప్పనిసరి ఈ మాస్క్ రెండు పొరలుగా ఉండి లోపలి పొర కాటన్ తో తయారై ఉండాలి.రోజంతా మాస్క్ ధరించటం వల్ల చర్మం కందిపోవడం మొటిమలు తలెత్తటం వంటి సమస్యలు రాకుండా ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి.సాధారణ మాయిశ్చరైజర్ కాకుండా సెరమైడ్స్‌, హైల్యురోనిక్‌ యాసిడ్‌, డైమిథికోన్‌ మొదలైనవి ఉన్న క్రీమ్స్ బెస్ట్ మాయిశ్చరైజర్ నార్మల్, లేదా కాంబినేషన్ చర్మం గలవాళ్ళు లోషన్ రూపంలోని మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. ఒక్కసారి సౌందర్య […]

వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా ?

వర్క్ ఫ్రమ్ హోం వల్ల ప్రయోజనాలుతో పాటు ఇబ్బందులు ఉంటాయి. సరైన భంగిమలో కూర్చోలేక పోవటం కంప్యూటర్ టేబుల్ కుర్చీ ఎత్తుల్లో తేడాలు ఎముకలు,కండరాలకు సమస్య తెచ్చిపెడతాయి పని కోసం ఏ ప్రదేశాన్ని ఎంచుకున్న మధ్యలో బ్రేక్ తీసుకొని లేచి నిలబడుతూ కొద్దిదూరం నడుస్తూ ఉండాలి. ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుండటం వల్ల కళ్లు అలసటకు లోనవుతాయి. ఈ ఇబ్బంది లేకుండా కంప్యూటర్ వెలుగు కళ్ళ లోకి నేరుగా ప్రవేశించకుండా స్క్రీన్ ను కళ్ళకు సమాంతరంగా […]