నేనే నాకు స్పూర్తి
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమలోకి వచ్చింది అనుపర్ణ రాయ్ .పశ్చిమ బెంగాల్ లోని పురులియా జిల్లా నారాయణపూర్ లో పెరిగిన ఆమె వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో వరుస విజయాలు సాధించారు. బర్ధమాన్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా తీసుకున్నారు .ఢిల్లీ ముంబై లో కార్పొరేట్ రంగంలో పని చేసిన తర్వాత నటన దర్శకత్వం వైపు వచ్చారు. ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్ సాంగ్స్ ఆఫ్ ఫర్ గార్డెన్ ట్రీస్ . రెండవ ఫీచర్ ఫిల్మ్ లవర్స్ ఇన్ ద బ్లూ నైట్ .ముంబైలోని నలుగురు వలసదారుల కథలతో రూపొందించిన ఈ చిత్రం 83వ వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ ఆసియా చిత్రంగా బహుమతి పొందింది. ఆమె ఎంచుకునే ఇతివృత్తాల్లో లింగ సమానత్వ నుండి అణగారిన వర్గాల వరకు ఎన్నో అంశాలు ఉంటాయి .నా జీవితం నుంచి మాత్రమే నేను స్ఫూర్తి పొందుతాను ఇందులో 20 శాతం మాత్రమే నిజం మిగతాది కల్పితం అంటుంది అనుపర్ణ..టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టైం 100 నెక్స్ట్ ఇండియా 2026 జాబితాలో ఆమె పేరు చోటు చేసుకుంది.
