మన మూలాల్లోనే అద్భుతాలు
కొత్తదనం అద్భుతాల కోసం మనం ఎక్కడో వెతకాల్సిన పని లేదు అవి మన చుట్టూ మన మూలాల్లోనే ఉన్నాయి అంటుంది పద్మ యాంగ్చాన్. ఈమె లడఖ్ కు చెందిన ఎంటర్ప్రెన్యూర్. ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ పొందిన పద్మ ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా విజయం సాధించింది. చేతివృత్తులను పునరుద్ధరించడం లో కీలక పాత్ర పోషించింది 2016లో నమ్జా కౌచర్ పేరుతో వస్త్ర పరిశ్రమ స్థాపించింది. సంప్రదాయ, స్థానిక వస్త్రాలు తయారు చేయడమే ఈ సంస్థ ఉద్దేశం.ఉల్లిపాయలు, పొద్దు తిరుగుడు పువ్వులు, గులాబీలని ఉపయోగించి కొత్త రంగుల కలయికతో అద్భుతమైన వస్త్రాలు తయారు చేయిస్తుంది పద్మ యంగ్చాన్. టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టైమ్ 100 నెక్స్ట్ ఇండియా 2026 జాబితాలో ఈమె పేరు చోటు చేసుకుంది.
