ఆకాశదేశాల్లో మన పాట
నాసా వారి అంతరిక్ష నౌక పేరు వాయేజర్ 1.నాలుగు దశాబ్దాల క్రితం భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు గోల్డెన్ రికార్డు ద్వారా మన దేశం 10 భారతీయ భాషలలో శుభాకాంక్షలు పాడిన కేశర్ బాయి కేర్కర్ పాట కూడా అంతరిక్షంలోకి వెళ్ళింది. రాగ్ భైరవి రాగంలో స్వరపరిచిన “జాత్ కహాన్ హో” అన్న పాటను ఆమె ఆలపించారు. మూడు నిమిషాల 30 సెకండ్ల ని డివి ఉండే ఈ పాట భూమిపై ఉన్న సాంస్కృతిక సంగీత వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది .ప్రస్తుతం ఈ వాయేజర్ నక్షత్ర మండలాల మధ్య ప్రయాణిస్తోంది.గోవాలోని కేరి గ్రామంలో జన్మించిన కేసర్ బాయ్ హిందుస్తానీ శాస్త్రీయ రంగంలో చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నారు . జీవిత కాలంలో ఆమె అనేక పురస్కారాలు అందుకున్నారు.భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ఆమెకు అందింది.
