Saturday, 03 Oct, 2026

కష్టానికి దక్కిన ఫలితం

భారతీయ కాంపౌండ్ ఆర్చరీ క్రీడాకారిణి  తానిపర్తి చికిత. ఎలాంటి సౌకర్యాలు, ప్రత్యేక శిక్షణా కేంద్రం, ఖరీదైన పరికరాలు లేని చోట తండ్రి అండగా చికిత బాణం వేయడం నేర్చుకుంది సుల్తాన్పూర్ పొలాల్లో ఇంటి వెనక పొలంలో గడ్డివామి ని లక్ష్యంగా చేసుకుని బాణాలు సంధించింది చికిత .ఇప్పుడు అంతర్జాతీయ వేదిక పైన రాణిస్తోంది కెనడాలో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఒక స్వర్ణాన్ని గెలుచుకొని ఇప్పుడు ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణ శిఖరాన్ని చేరింది ఒకే రోజు రెండు బంగారు పతకాలు సాధించింది తానిపర్తి చికిత. ప్రారంభ దశలో గ్రామంలో సరైన అవకాశాలు లేక తండ్రి ఆమెను సుల్తాన్పూర్ నుంచి శిక్షణ కేంద్రం వరకు రోజు సుమారు 23 మీటర్ల ప్రయాణం చేయించేవారు. అంత కఠినమైన శిక్షణ తర్వాత 2021 లో రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణం సాధించి జాతీయ స్థాయి పోటీల్లోకి అడుగు పెట్టింది చికిత. ఆమె లక్ష్యం ఎప్పుడు గురితప్పని బాణం. ఒలింపిక్స్ లో భారత్ కి బంగారు పతకం అందించడమే లక్ష్యం అంటుంది చికిత.

Leave a Reply