100 కోట్ల సినిమా తీసిన అనుప్రియ
నెల రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఘన విజయం అందుకున్న Hanuman Ansh సినిమా నిర్మాతల్లో 21 ఏళ్ల అనుప్రియ నాగర్ ఒకరు.ముంబైలో పుట్టిన అనుప్రియ యూకే లో యూనివర్సిటీ ఆఫ్ బాత్ లో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా గురించి తెలుసుకుంది ఈ గురువు యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఒక సాధువు. హనుమంతుడి భక్తుడు.ఆపిల్ సంస్థ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ వంటి ప్రముఖుల గురువు. ఈ బాబా గురించి పరిశోధిస్తూ ఆయన గురించి సినిమా తీయాలనుకున్న ఫిలిం డైరెక్టర్ విశాల్ చతుర్వేదిని కలిసింది అనుప్రియ.స్విజర్లాండ్ లో ఉద్యోగం చేయాలనుకున్న అనుప్రియ ఈ సినిమాకి సహ నిర్మాతగా మారింది. అనుప్రియ ది కళారాధకుల కుటుంబం. ఎన్నో కళారూపాలను సేకరిస్తూ ఉంటారు కథలు చెప్పటం నా జీవితంలో భాగం అంటుంది అనుప్రియ. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది. కరోలి బాబా గురించి పుస్తకం రాద్దాము అనుకుంది అనుప్రియ. అది కాస్త సినిమా తీయడం 100 కోట్లు సినిమా అవడం అనుకోకుండా జరిగింది.
