నవ్వించటమే నాకు ఇష్టం
బెంగళూరుకి చెందిన సోను వేణుగోపాల్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేక్షకులను నవ్విస్తుంది ఆమె డిజిటల్ క్రియేటర్ నటి ఇంప్రవైజర్,రేడియో ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ కూడా. బెంగళూరులోని బాలీవుడ్ కేఫ్,సిటీ మార్ ట్వంటీ వంటి అత్యధిక రేటింగ్ పొందిన షోలకు హోస్ట్ గా ఉన్నది సోను.రూపొందించిన ‘జాజు మణి కాకు’ అనే కన్నడ కామెడీ సిరీస్ కి మూడు మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి.మనదేశంలోనూ,యూకే లోను ఆమె చేసిన లైవ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి నెదర్లాండ్స్ ఫ్రాన్స్ జర్మనీ లో కూడా ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.మహిళల దృక్కోణం నుంచి ఆమె షో చేసేందుకు ఇష్ట పడుతుంది. సన్నివేశాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ నేర్చుకుంటూ చేయడం సోనీ వేణుగోపాల్ ప్రత్యేకత.
