పశువుల అమ్మకాలకో ప్రాజెక్టు!
ఇంజనీరింగ్ చదువుకున్న కీర్తి జంగ్రా ,నీతు యాదవ్ కలిసి ఒక చిన్న గదిలో బెంగళూరులో యానిమల్ అనే ప్రాజెక్టుని ప్రారంభించారు.పశువుల అమ్మకాలు కొనుగోళ్ల గురించిన ప్రాజెక్ట్ ఇది. గ్రామీణుల అవసరాలు అర్థమయ్యేలా స్థానిక భాషలో లావాదేవీలు సాగించే వీలుగా ఉంటుంది.ఈ ప్రాజెక్టు.మొబైల్ యాప్ ను ఉపయోగించి పశువులను అమ్మడం కొనటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. రైతులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యకు ఈ ఐఐటి ఢిల్లీ విద్యార్థినులు ఈ పరిష్కారం కనిపెట్టారు. లక్షల మంది పాడి రైతులకు దళారుల నుంచి విముక్తి కలిగించి వారి పశువుల అమ్మకాలు, కొనుగోళ్ళలో మెరుగైన ధర పొందేలా ఈ యాప్ సాయం చేస్తుంది .ఒక చిన్న గదిలో వారాంతపు ప్రాజెక్టుగా మొదలైన ఈ స్టార్టప్ ఇప్పుడు వందల కోట్ల టర్నోవర్ తో దూసుకుపోతోంది.రైతులు తాము ఒక ఆవునో గేదెనో కొనాలనుకున్నప్పుడు, అమ్మాలనుకున్నప్పుడు కూడా ఈ అనిమల్ లో ప్రయత్నం చేస్తే చాలు. వెంటనే పశువుల అమ్మకం పూర్తయిపోతుంది. రాజస్థాన్ లోని ఎంతో మంది రైతులు ఈ స్టార్టప్ ని ఉపయోగించుకొని తమ పశువుల అమ్మకాల్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.
