Thursday, 30 Jul, 2026

లక్షల మందికి విద్యాదానం

ఢిల్లీలో ఎంటెక్ చదివిన ప్రియాంక భర్త ప్రశాంత్ చౌదరితో కలిసి స్తోమత లేని పేద విద్యార్థుల కోసం స్క్రాచ్ పైథాన్ వంటి ప్రోగ్రాములు నేర్చుకునేందుకు గాను స్మార్ట్ ఫోన్ తో భారీ అప్లికేషన్ లేకుండా వెబ్ బెస్ట్ కోడింగ్ ఎడిటర్ ను అభివృద్ధి చేశారు.ఇందులో లాగిన్ అయ్యే వాళ్ళ ఫోన్ కి వాట్సప్ ద్వారా చిన్నచిన్న వీడియోలుగా పాఠాల లింక్స్ వస్తాయి .అవి విన్నాక  క్విజ్ లు కండక్ట్ చేస్తారు ఈ దంపతులు. వాటిలో ఉత్తీర్ణత సాధించాక ప్రాక్టికల్స్ మొదలుపెడతారు.2025 లో సంస్థ పేరును కోడ్ యోగి ఫౌండేషన్ గా మార్చి లాభాపేక్ష లేని సేవలు అందిస్తున్నారు. ఈ సంస్థ కు  కో ఫౌండర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు ప్రియాంక. ఈ సంస్థ ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో మూడు లక్షల మందికి పైగా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ల ద్వారా కోడింగ్ నేర్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ సేవలను మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని అనుకుంటున్నారు ఈ దంపతులు.

Leave a Reply