రాణి ముఖర్జీ కి డాక్టరేట్
సినిమా రంగంలో తనదైన ప్రత్యేక నటనతో జాతీయ ఉత్తమ నటి తో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్న రాణి ముఖర్జీ ప్రతిష్టాత్మక లా ట్రోబ్ యూనివర్సిటీ నుంచి ఆనరరీ డాక్టరేట్ కు ఎంపికయ్యారు.మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడే సినిమాలో నటించినందుకు గాను ఆమె ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.భారతీయ సినీ చరిత్రలో తన నటనతో కమర్షియల్ గ్లామరస్ పాత్రలతో ప్రయాణం ప్రారంభించిన,తరువాత నటనా ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకున్నారు రాణీ ముఖర్జీ.మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓటేస్తున్నారు.మహిళలు పిల్లలు,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారు.మహిళలపై హింస కు వ్యతిరేకంగా పోరాటాలు, క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలకు సాయం వంటివి ఎన్నో చేస్తున్నారు. ఈ సేవకు గుర్తింపుగా ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ ఆమెకు ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ ను ప్రకటించింది. ఈ డాక్టరేట్ పట్టా ను మెల్బోర్న్ లో జరగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కార్యక్రమంలో రాణి ముఖర్జీ అందుకుంటారు.
