Tuesday, 21 Jul, 2026

ఆకాశంలో మన అందాల వజ్రం

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తో సంజన త్రిపురమల్లు 2020 నుంచి కాస్మోస్ డైమండ్స్ అనే అంకురాన్ని ప్రారంభించారు. బీటెక్ చదివిన సంజన గుజరాత్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ లో చేరి స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. వ్యాపార విస్తరణ కోసం బిజినెస్ క్లబ్ లో చేరిన సంజనకు స్కైరూట్ ఏరోస్పేస్ ఫౌండర్ పరిచయమయ్యారు అట్లా ఆ పరిచయంతో అంతరిక్షానికి డైమండ్స్ పంపమని ఆమెకు ఒక ప్రాజెక్టు వచ్చింది. ఆమెది ల్యాబ్ గ్రోన్ డైమండ్ సంస్థ..ఈ ప్రాజెక్టు కోసం ఆమె ఎన్నో దేవాలయాలు శిల్పాలు వెతికి చూసి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తామర పువ్వు డిజైన్తో వజ్రం రూపొందించింది.ఆ వజ్రం జూలై 18 వ తేదీన విక్రమ్ వన్ ఆర్బిటాల్ రాకెట్ ద్వారా
అంతరిక్షంలోకి వెళ్ళింది. ఇప్పటివరకు  మైక్రో ఆల్గేని వంటివి ఎన్నో అంతరిక్షంలోకి వెళ్లాయి. ఇప్పుడు స్పేస్ ఫర్ ఆల్ అన్న భావనతో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ ని అంతరిక్షంలోకి పంపారు. ఈ వజ్రం రూపొందించిన సంజన త్రిపురమల్లు తెనాలికి చెందిన అమ్మాయి.

Leave a Reply