లండన్ ఫ్యాషన్ వీక్ లో తన బ్రాండ్ ప్రదర్శించిన ఆష్కా సునీల్ గోయల్ ప్రయాణం పట్టుదలకే రూపం. 11 ఏళ్ళకే క్యాన్సర్ ఆమె చూపు లాగేసుకుంది. ప్రాణం నిలిచింది కానీ ఆమెకు తన కెరీర్ ఏమిటో అర్థం కాలేదు. చివరకు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకుంది. ఫ్యాషన్ అంటే కళ్ళతో చూసే రంగులు కాదు. అది స్పర్శ అనుభూతి అని నమ్మింది ఆష్కా. బట్టల పై గుర్తులు పెట్టడానికి ప్రత్యేక మార్కర్లు సేఫ్టీ పిన్ లు ఉపయోగించి అందమైన డిజైన్లు రూపొందించింది ఆష్కా.లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లో సీట్ సంపాదించింది. సొంత ఫ్యాషన్ బ్రాండ్ ను ప్రారంభించింది.చివరకు ఫ్యాషన్ వీక్ పై రాంప్ వాక్ చేసింది. క్రికెటర్ కపిల్ దేవ్ చేతుల మీదుగా ఇన్విన్సిబుల్ స్పిరిట్ అవార్డు బ్రిటన్ పార్లమెంట్ లో ఇన్స్పైరింగ్ యంగ్ టాలెంట్ అవార్డు అందుకుంది.













