ముక్కు నత్తుల వ్యాపారంతో సక్సెస్

ముక్కు నత్తుల వ్యాపారంతో సక్సెస్

ముక్కు నత్తుల వ్యాపారంతో సక్సెస్

మహారాష్ట్రలోని పూణే నగర శివారులలో ఒక చిన్న గ్రామంలో ఉంటుంది కోమల్ లోండే .ఆర్థిక స్థిరత్వం కోసం ఒక కుట్టు మిషన్ తో బ్లౌజులు కుట్టడం ద్వారా స్వయం ఉపాధి చేపట్టింది కోమల్ .ఇందులో తగినంత ఆదాయం లేకపోవడంతో కొత్తరకంగా ఆలోచించి సాంప్రదాయ మహారాష్ట్రీయ ముక్కుపుడకల తయారీ వైపు దృష్టి పెట్టింది .స్వశక్తి అన్న ఎన్జీవో ద్వారా ఈ నత్తులు చేయడం నేర్చుకుంది.తను చేస్తున్న ఈ ముక్కుపుడకలను అంటే నత్తులను సామాజిక మాధ్యమాల్లో వీడియోల ద్వారా ప్రమోట్ చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నది.ఈమె డిజైన్ చేసిన మహారాష్ట్రీయ నత్తులకు ఆన్‌లైన్‌ వేదిక మీద విపరీతమైన ఆదరణ ఉంది .సరికొత్త మోడల్ వ్యాపారం తో కోమల్ ఊహించని విజయాన్ని అందుకుంది.