ఒత్తిడి మాయం చేసే ఈజ్

ఒత్తిడి మాయం చేసే ఈజ్

ఒత్తిడి మాయం చేసే ఈజ్

ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లో స్థానం సంపాదించారు రమ్య ఎల్లాప్రగడ .ఆమె పూర్వీకులు రాజమహేంద్రవరానికి చెందినవారు ఐఐటీ ఢిల్లీలో రమ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశారు. మార్బుల్ హెల్త్ అనే పేరుతో రమ్య మానసిక చికిత్స కేంద్రం ప్రారంభించారు.  దానికోసం ఈజ్ అనే సాధనాన్ని రూపొందించారు. భారతదేశంలో మొట్టమొదటి గా వైద్య పరంగా లైసెన్స్ పొందిన  పోర్టబుల్ యూరో న్యూరోమాడ్యులేషన్ సిస్టం ఇది. ఒత్తిడి ఇతర వ్యసనాల నుంచి బయటపడేందుకు చేసే మానసిక చికిత్సకు సాయపడే పరికరం ఇది. ఈ ఏడాది ప్రారంభంలో ఈజ్ సృష్టించినందుకు గాను ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్నది రమ్య ఎల్లాప్రగడ