కేవలం 55 కుటుంబాలే కాపురం ఉండే కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న వాల్ముట్టి గ్రామాన్ని ‘పాట్టు గ్రామం’ అంటే పాటల గ్రామం అని పిలుస్తారు. ఈ గ్రామస్తులు ఊరూరు తిరుగుతూ పాటల రూపంలో కథలు చెప్పే వాళ్ళు అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది పురుషులు సంగీత వాద్యాలు తయారు చేస్తే స్త్రీలు పాటలు పాడుతారు. ఈ గ్రామానికి చెందిన 72 ఏళ్ల జానపద గాయని తాతమ్మ పాటలకు కేరళ జానపద అకాడమీ అవార్డు ఇచ్చారు,ఈ తరం అమ్మాయిలు సంగీతంలో డిగ్రీ పీజీ లు చేస్తున్నారు.