ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉన్నతాధికారి ఆషిమా మంచి పెయింటర్ కూడా. తాజాగా ఆమె వేసిన లాపతాలేడీస్ పెయింటింగ్ 64వ నేషనల్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు.రైల్వే శాఖలో పురాతన సంస్కృతి పరిరక్షణ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆమె పని చేసే రైల్వే రంగంలో వారంలో ఏడు రోజులు అప్రమత్తంగానే ఉంటూ మిగిలిన సమయాన్ని కళ కోసం వినియోగిస్తారు. కళను సమాజ హితంగా ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నాను అంటున్నారు ఆషిమా. ఆమె పెయింటింగ్స్ రైల్వే మ్యూజియంలో రైల్వే జోన్ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంటాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల దగ్గర నుంచి పురాతన వారసత్వ సంస్కృతి సంప్రదాయాలు దాకా అనేక అంశాల మీద ఆమె మంచి పెయింటింగ్స్ వేశారు.













