Saturday, 03 Oct, 2026

సమంజసమైన కోరిక 

‘లోకసమస్తా సుఖినోభవంతు’ అంటూ ఉంటారు సాయంత్రం వేళ సంధ్య దీపం వెలిగించి ఇరుగు చల్లన, పొరుగు చల్లన అంటూ భగవంతుడిని కోరుకొని నమస్కారం చేస్తారు.ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం మానవ ధర్మం..వట్టి కోరిక వ్యక్తం చేస్తే సరిపోదు మన చుట్టూ ఉన్న వారితో మనకున్నది పంచుకోవటం కష్టంలో తోడుగా నిలబడటం పసి బిడ్డల పట్ల వాత్సల్యం, చిన్నవాళ్లని ప్రేమించటం, పెద్దవాళ్ళను గౌరవించడం ఇవన్నీ మనిషి ఆచరించగలిగితేనే ప్రపంచంలో జనులంతా సుఖంతో ఉంటారు.ఎప్పుడు ఏది తిరిగి కోరకుండా సమస్తం ఉచితంగా ఇచ్చే ప్రకృతి మనిషికి ఆదర్శంగా ఉంటే నిజంగానే ఇరుగు చల్లగా పొరుగు చల్లగా ఉండదా!
చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a Reply