Friday, 25 Sep, 2026
వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి పగుళ్లు వచ్చినట్లు అయితే బనానా ఫేస్ మాస్క్ ట్రై చేయచ్చు. అరటిపండు పేస్ట్ గా చేసి కొత్త వెన్న కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వెన్న లేకపోయినా మీగడ అయినా సరే. ఇవే ముఖానికి కావలిసినంత తేమను ఇస్తాయి. అరటిపండు గుజ్జు ఆ తేమను ఇంకొంత సేపు నిలబెడుతుంది. అలాగే అరటిపండు గుజ్జుకు తేనె ఒక టీస్పూన్ రోజ్ వాటర్ జతచేసి ఆ మిశ్రమాన్ని అప్లయ్ చేసినా ఇది ఫలితం ఉంటుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్ గా రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తాయి. చలికాలంలో చర్మకాంతి కోసం ఈ కాంబినేషన్ ట్రై చేయండి.

హోమ్ మేడ్ మాస్క్ లు 

వేసవి ఎండలకు చెమట వల్ల మాడు కూడా తేమగా ఉంటుంది. దీని వల్ల తల దురద జిడ్డు వస్తాయి. దీని వల్ల చుండ్రు సమస్య కూడా రావచ్చు వంటింట్లో లభించే వస్తువులతో వేసుకునే హెయిర్ మాస్క్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటారు ఎక్స్పర్ట్స్.నిమ్మరసం, కర్పూరం, కొబ్బరి నూనె కలిపిన ప్యాక్ ను వేసుకొని ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగుంటుంది.  దురద, చుండ్రు పోతాయి అలాగే అరటి పండు గుజ్జులో స్పూన్ తేనె, టీ ట్రీ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి బాగా కలిపి ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలుకు  పోషకాలు అంది పట్టులా మెరుస్తాయి.అలాగే బేకింగ్ సోడా లో టీ ట్రీ ఆయిల్ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాలు అలాగే ఉంచి తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం పెరుగుతుంది.బేకింగ్ పౌడర్ లో ఉండే ఆమ్లం అధికంగా ఉన్నా నూనె ను పెట్టుకొని వెంట్రుకలు పెరుగుదలకు తోడ్పడుతుంది .

Leave a Reply