Thursday, 15 Oct, 2026
జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. అంతే కాదు సడన్ ఇన్ ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్, ఉదార కోశ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు తల్లి పాలు నివారిస్తాయని తెలిసిందే. ఇక చాలా కాలం పాటు తల్లి పాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టిప్-2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా తక్కువని ఈ పరిశోధన తేల్చింది. పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రానివ్వని ఈ తల్లి పాల విలువ తల్లులు తెలుసుకోవాలని పిల్లలు తాగినంత కాలం వాళ్ళని పాలు తగనివ్వడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల రిస్క్ తగ్గించినట్లు ఉంటుందని ఈ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు చెప్పుతున్నారు.

సూటిగా చూడండి చాలు

బిడ్డకు తల్లి పాలకు మించిన ఆహారం ఇంకోటి లేదు . తల్లైన కొత్తలో బిడ్డకు పాలు ఇవ్వటం ఇబ్బంది అనే ఉద్దేశ్యం తో బయటికి వెళ్ళడం మానేస్తారు . నిజానికి తల్లిపాలు తాగే పిల్లలతో ఇబ్బంది ఉండదు . గంటలకొద్దీ ట్రైన్ లో వెళ్లినా విమానంలో వెళ్లినా పాపాయి కి ఇతర ఆహారంతో పని ఉండదు . బిడ్డకు పాలిచ్చే తల్లి తన మొచేయి పై పల్చని మెత్తని వస్త్రాన్ని వేసుకొంటే బిడ్డ జాకెట్ ని గుంజుతుందనే భయం ఉండదు . పాపాయి కి పాలిస్తూ ఉంటే ఎవరైనా కళ్ళప్పగించి చూస్తూ ఉంటే ఇబ్బందే . అప్పుడు తల్లికి ఒక సలహా ఇస్తున్నారు ఎక్స్ పర్డ్స్ . అలా చూస్తున్న వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ స్నేహంగా నమ్రతగా నవ్వండి వాళ్ళే సిగ్గుపడి ,కళ్ళు తిప్పుకోటారు అంటున్నారు అయితే బిడ్డకు పాలిచ్చేందుకు తల్లికి మొహమాటం ఎందుకు .

Leave a Reply