Thursday, 15 Oct, 2026
ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం వాళ్ళ ఇన్ఫలమేషన్ మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్ ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లు గుర్తించ దగిన మోతాదులో పెరుగుతాయి. ఇవి మనిషి శరీరానికి ఎంతో ఉపయోగపడే పోషకాలు. పీచు ప్రోటీన్ పొటాషియం లకు వాల్ నట్స్ పవర్ హౌజ్ లాంటివి.

పోషక విలువలు పుష్కలం

పోషక పదార్దాలలో భాగంగా అక్రూట్ పండుని ఆహారంలో భాగం చేసుకోమని చెపుతున్నారు అధ్యయన కారులు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న రొమ్ము కాన్సర్ విరుగుడు ఈ వాల్ నాట్ ,అక్రూట్ ఫలం లో ఉందని చెపుతున్నారు . ప్రతి రోజు కప్పు వాల్ నాట్స్ ఇచ్చి చేసిన పరిశోధనలు రొమ్ము కాన్సర్ని బహిర్గతం చేసే జన్యువుల్లో మార్పు వచ్చిందని అమెరికా మార్షల్ విశ్వ విద్యాలయపరిశోధకులు చెపుతున్నారు . ప్రయోగాత్మకంగా కొన్ని వేలమంది ప్రతిరోజు వాల్ నాట్స్ ఇచ్చారు . రొమ్ము కాన్సర్ పెరుగుదల శాతం తగ్గినట్లు పరిశోధకులు గమనించారు ప్రత్తి గింజలోనూ పుష్కలంగా ఉండే పోషక విలువలతో ఈ వాల్ నాట్స్ ప్రతి రోజు తినేందుకు సిఫారసు చేయబడ్డాయి .

Leave a Reply