జానపద గేయాలు-కలలోకి

జానపద గేయాలు-కలలోకి

జానపద గేయాలు-కలలోకి

-డి. సుజాతాదేవి

అద్దరాతిరి కలలోకి

అందగాడా రారా
సద్దు సేయకుండా
ఊరు నిద్దరోయాక!!

ఊరు సెరవు కాడ మొన్న
ఊసు కలిపి నవ్వావు
సిన్నొది నొచ్చింది కూడ
నన్ను నిలేసింది మావ!!

తోట మలుపులోన ఆపి
మాబుంది రమ్మన్నావు
సేబుకాలమేమొ నా
తోటిది సాటింపేసింది!!

అదిలించే అయ్య
బెదింరించే అమ్మ
కాలు కదపనీరు నీ
కాడకే రానీరు!!

ఇంట కట్టుబాటు నా
మనసు తిరుగుబాబు
వయసేమో యిరగబాటు
ఒళ్ళంతా తడబాటు!!