Thursday, 06 Aug, 2026
ఉత్సాహం కొద్దీ అప్పుడున్న మూడ్ కొద్దీ టాటూలు వేయించుకొంటారు గానీ తర్వాత అదేదో ఫ్యాషన్ ట్రెండ్ కాదని సరదా పోతుంది. దాన్ని తొలగించుకోవటం అదో సమస్య. సరైన పరికరాలు వాడితే చర్మం పైన ఆ జ్ఞాపకం తొలగించుకోవచ్చు. డెర్మటాలజిస్టులైతే క్యూ స్విచ్ ఇండియా లేజర్లను టాటూ మరకల్ని తొలగించేందుకు వాడతారు. అయితే టాటూల రిమూవల్ టెక్నిక్స్ ని నిర్ణయించేది టాటూలో వాడిన రంగులు. నలుపు నీలం రంగుల పచ్చ బోట్లను క్యూ స్విచ్ ఇండియా లేజర్లతో తొలగించవచ్చు. ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ టాటూల పల్స్ డై లేజర్లతో తొలగించాలి. ఐదంగుళాల స్క్వేర్ లేదా అంతకంటే పెద్దవాటిని తొలగించటం కష్టం. పాదాలు కాళ్లపై గల పచ్చబొట్లు మూడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలవ్యవధిలోవైతే వాటికి లేజర్లు పనిచేయవు. మంచి డెర్మటాలజిస్టులను సంప్రదించాల్సిందే. కొన్ని నెలల పాటి ఈ ప్రక్రియ సమయం తీఉస్కోవచ్చు. సూర్య కిరణాల్ని తగలనివ్వకూడదు. లేజర్ చికిత్స చర్మం సహజ పిగ్మెంట్ ను తొలగిస్తుంది. సూర్య కిరణాల తాకిడికి రంగుమారి కనపడుతుంది. దాంతో చికిత్స ఎక్కువ కాలం పడుతుంది.

ఎంతో నొప్పి.

ఒక సారి పచ్చబొట్టు వేయించుకున్నాక దీన్ని తొలగించు కోవడం ఎంతో నొప్పి తో కూడుకున్న ప్రక్రియ. డెర్మభిరేషన్ , సర్జికల్ , లేజర్ అనే మూడు పద్దతులలో పచ్చబొట్టు తొలగిస్తాను. చర్మం పొర తీసేస్తేనే కానీ పచ్చబొట్టు పోదు. అస్సలు టాటూ వేయించుకోవడంమే ఒక్క సర్జరీ లాంటిది. కొనదరికి పిగ్మెంటేషన్ ఇంజక్షన్స్ పడవు . టాటూ వేసిన చోటు అంతా పుండు లాగా మారి జ్వరం వస్తుంది. టెంపరరీ టాటూల్లో వాడే పారా ఫినాల్ ఎమిడమైన్ అనే రసాయినం వల్ల డెర్మటైటిస్ సమస్యలు వస్తున్నాయి. వీటిలో ఉండే ఇనుము గుణం వల్ల భావిష్యత్తు లో ఎప్పుడైనా ఎమ్మారై స్కానింగ్ తీయవలసి వస్తే ఇబ్బంది అంటున్నారు డాక్టర్స్. టాటూస్ వేసే ఖరీదు తక్కువ అవ్వొచ్చు ఇందుకోసం వాడే సూదులు రంగుల గన్ల నాణ్యత తగ్గింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రక్తం ద్వారా వ్యాపించే ఆనారొగ్యాలు వస్తాయి.

Leave a Reply