February 2020
తల్లి సాహసం
తన చిన్నారి కూతురి కోసం ఫర్వీన్ చేసిన సాహసాన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది . మహిళల పట్ల కఠినమైన ఆంక్షలున్న పాకిస్థాన్ లో ఒక మహిళ అడుగు బయట పెట్టటం . అదీ పురుషుని వేషంలో ఒక షాప్ నడపటం ,క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తటం మామలు విషయం కాదు . లహొర్ కు చెందిన ఫర్వీన్,ఇంట్లో ఇష్టంలేని పెళ్ళి చేసుకొంది . గర్భవతి అయ్యాక ఆ భర్త కూడా వదిలి పెట్టాడు . ఆ చదువు […]
“జాపాలి ఆంజనేయ ప్రసాదం”
రామ రామ రామ సీత!! తిరుమల తిరుపతికి సమీపంలో ఉన్న జపాలి ఆంజనేయ స్వామివారి సన్నిధిలో సేవకు వెళుతున్నాం, మీరు రండి సఖులూ!! పూర్వం మహాఋషులు తపస్సు చేస్తున్న ఈ కొండలలో జాబాలి మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి ప్రత్యక్ష మైనాడని,ఈ ప్రదేశంలో సీతా సమేతుడై రాములవారు కూడా సంచరించాడని చెబుతారు. జాబాలి అనే పదం నానుడిలో జాపాలిగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ ఒక కోనేరు వుంది. స్నానం చేసిన సర్వ పాపాలు,రోగాలు పోతాయి.ఇక్కడి వాతావరణం […]
ఆ సైజు మార్చండి
ఇంట్లో టీ కప్పులు,భోజనాల ప్లేట్లు చాలా పెద్దవిగా ఉన్నాయా ? వాటిని వెంటనే మార్చేయండి,ఆ భారీ సైజు వల్లే ఊబకాయం వస్తుంది అంటున్నారు పరిశోధికులు. 7000 మంది పై ఒక ఆన్ లైన్ సర్వే చేశారు. ఆ సర్వే లో పెద్ద వాళ్ళల్లో తినేవాళ్ళు ఎంత తింటున్నామన్నాది అంచనా వేసుకోలేదని ఎంత భారీ బోజనమాయనా పెద్ద పళ్ళెంలో చాలా కొద్దిగా అనిపిస్తుందనీ వీటిని ఉపయోగిస్తూ ఎంత వ్యాయామం చేసిన ఫలితం ఉండదని తేల్చారు. ఈ సారి ఉపయోగించే […]
ముఖం కాంతి వంతం
ముఖం కాంతితో మెరిసి పోవాలంటే చర్మ ఆరోగ్యం చాలా ముఖ్యం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే మామిడి,పుచ్చ,కమలా,బొప్పాయి,కర్బుజా,దానిమ్మ,నేరేడు మొదలైన పళ్ళు కాప్సికం,టమేటా ఆకు కూరలు చర్మాన్ని యవ్వన వంతంగా ఉంచుతాయి. వీటిలో రెండు మూడు రకాలను రోజు తీసుకోవాలి. బాగా నీళ్ళు తాగాలి ముడి ధాన్యాలతో చేసిన ఆహారం తినాలి కడుపు నిండేంత వరకు కాకుండా ఆకలి తీరేంత వరకు తినాలి. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తే బరువు నియంత్రణలోకి రావటమే కాకుండా మొహం కాంతివంతమవుతోంది. […]
శాంతి నిచ్చే పరిమళం
హాల్లో చక్కని తాజా పువ్వులను ఉంచండి,అవి కళ్ళకు ఎదురుగా కనబడుతూ ఉంటే,మాట్లాడే మాటల్లో కూడా సున్నితత్వం వస్తుంది అంటున్నారు మనస్థత్వ శాస్త్రవేత్తలు. గది గోడలు ఫర్నిచర్ ఏ రంగులో ఉన్నప్పటికీ,పువ్వులు తెల్లనివి అయితే మరింత లాభం అంటున్నారు. చక్కని గాజు పాత్రలో కొన్ని సముద్రపు రాళ్ళు ఉంచి పువ్వులు,ఆకులు కలగలిపిన ఫ్లోరల్ మిక్స్ డెకొరేషన్ చేస్తే ఆరంగులో వాటి తాజాదనం కళ్ళను కట్టిపడేస్తు సంభాషణలో కఠిన పదాలనురానివ్వదట.క్రుత్రిమమైన అలంకరణల కంటే ఈపువ్వుల డెకరేషన్ వల్ల ఒక ఆహ్లదకరమైన […]
చీరెకి పూలందం
ఏ కాలం అయినా పువ్వుల ప్రింట్ ఉన్నా దుస్తులు అందంగానే ఉంటాయి . అవి సంప్రదాయం ప్రతిబింబించే చీరెలైన . వెస్ట్రన్ గౌన్లయినా సరే ప్రత్యేకంగానే అనిపిస్తాయి . సాయంకాలం పరులకు ప్లెయిన్ స్కర్ట్ పూల ప్రింటులున్నా స్లీవ్ లెస్ కుర్తీని వేసుకొంటే బావుంటుంది . పల్చని షిఫాన్ సిల్క్ పైన అందమైన పూలప్రింట్స్ ఉంటే ఎంతో ఫ్యాషన్ . సిల్వర్ కలర్ అంచులతో పువ్వుల ప్రింట్స్ ఎంతైనా అందమే . వేడుకల్లో కూడా ఫారల్ ప్రింట్స్ […]
చక్కని చర్మకాంతి
రసాయనాలు ఏ మాత్రం కలవని కొన్ని రకాల ఫ్యాక్ లు చర్మకాంతిని ఇనుమడించేలా చేస్తాయి . ఒక టేబుల్ స్పూన్ ముడి తేనే ను కొద్దిగా వేడిచేసి తట్టుకోగలిగిన వేడిలో ఉన్నా ఆ తేనెను ముఖంపైన రాసి ఆరిపోనివ్వాలి . గోరువెచ్చని నీళ్ళతో అరగంట తర్వాత ఈ ఫ్యాక్ ని కడిగేసుకోవాలి ఈ ఫ్యాక్ ముఖాన్ని మెరిపిస్తుంది. కీరారసం,గ్లిజరిన్ రోజ్ వాటర్ ఫ్రిజ్ లో ఉంచి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి . ఇది చల్లగా మొహానికి […]
అలా ఉడికితేనే ఆరోగ్యం
ఆహార పదార్ధాలు పెద్ద మంటపై ఉడికించే కన్నా,చిన్న మంటపైన నెమ్మదిగా వండితే పోషకాలు నశించకుండా ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. పెద్ద మంటపై ఉడికితే ఆహారంలో కొన్ని హానికరమైన పదార్ధాలు తయారవుతాయి గిన్నెపై మూతపెట్టటం,ఆవిరిపైనా ఆహారాన్ని వండటం మంచిది. కూరలు ఉడకనిచ్చే నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని సూప్ లో పోయటం,లేదా సాంబారు రసం మొదలైన వాటిలో ఉపయోగించటం చేయాలి రకరకాల దినుసులు చేర్చి వండే వంటల్లో అవి నెమ్మదిగా సన్నని మంటపైన ఉడికితే ఆ సుగంధద్రవ్యాలలో ఉండే […]
అందాన్నిచ్చే వర్ణ మిశ్రమం
రాజస్థానీ సాంప్రదాయ కళ మీనాకారి ఎనామిల్ పెయింట్ ఆభరణాలు . దేవతామూర్తులున్న ఆభరణాలకు ఒకటి రెండు రంగులతో ఆ మూర్తులను చక్కగా కనిపించేలా తీర్చిదిద్దుతారు . మీనాకారి ఆభరణాలు ,ముత్యాలు ,కుందన్ లు ఎక్కువగా కలపి తయారు చేస్తారు . సాంప్రదాయ దుస్తుల పైన మీనాకారి ఆభరణాలు ఎప్పుడు ప్రత్యేకంగానే అనిపిస్తాయి . ఎంతో చరిత్ర కలగిన లాహర్ కళాకారులు తయారుచేసే బరువుగా కనిపించే కర్ణాభరణాలు చాలా ప్రత్యేకం వివాహ వేడుకల్లో ఇతర శుభదినాలలో ధరించే ఈ […]
“జలకంఠేశ్వరుని ప్రసాదం”
తమిళనాడు వెల్లూర్ లో జలకంఠేశ్వర దేవాలయంలోని “నేల మాళిగ” లోని అయిదు అడుగుల ఎత్తులో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్యం. ఈ దేవాలయం పల్లవ రాజులనాటి సంకేతంగా మనకు సింహాలు మొదలగునవి స్పష్టంగా కనిపిస్తాయి.ఇక్కడికి భక్తులు తప్పకుండా వచ్చి ఆ స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.ఈ ప్రదేశంలో సైనిక పోరాటాలు జరిగాయి అని పురాణ గాథలు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాల అభిషేకం. -తోలేటి వెంకట శిరీష
ఈ ఆభరణం ప్రేమ స్వరూపం
అపురూపమైన ప్రేమబంధానికి ఉదాహరణలుగా రాధా కృష్ణులను గురించి చెపుతారు . శ్రీకృష్ణుడు ,యమునా విహారి ,గోపాలకుడు మురళీగాన వినోదుడు . ఈ అపురూపమైన అంశాలన్నీ పేర్చి,కూర్చి కళాకారులు రాధాకృష్టుల హోదాలు ,లాకెట్టు తయారు చేశారు . చెవిపోగుల్లో గొలుసులు అందంగా ఊగాడే రాధా కృష్ణుల రూపాన్ని అమర్చి ఆప్రేమను ఆభరణాల్లోకి తేల్చారు కళాకారులు . వీటిని నల్లపూసల్లో ,లాకెట్లుగా ముత్యాల గొలుసుల్లో పథకాలుగా అమర్చారు . అందమైన ఈ హారాలు అపురూపమైన ప్రేమకు సాక్ష్యంగా అమ్మాయిల మెడల్లోకి […]
నల్ల మచ్చలు మాస్క్
ఎండ ,కాలుష్యం వంటి ఎన్నో కారణాలతో మొహాం పైన మచ్చలు పడుతూ ఉంటాయి . ఈ నల్లమచ్చలు పోగొట్టాలంటే సహజమైన ఎన్నో వస్తువులు ప్రకృతిసిద్ధంగానే ఉన్నాయి . పచ్చికొబ్బరి గుజ్జుని మొహానికి పట్టించి ఓ అరగంట పాటు అలా వదిలేసి ముఖం శుభ్రం చేసుకొంటే ఈ మచ్చలు క్రమంగా పోతాయి . ఇది ప్రతిరోజూ చేయాలి . బంగాళాదుంప గుజ్జులో గులాబీ నీరు కలపి కాస్త తేనె కలపి ఈ మిశ్రమంతో పేస్ మాస్క్ వేసుకొని ఆరిపోయాక […]
ప్రకృతితోనే సహవాసం
బోటనీ ప్రొఫెసర్ హేమ సానే పుణేలో నివశిస్తారు . ఎనభై ఏళ్ళుగా ఎప్పుడూ విద్యుత్ ఉపకరణాలను ముట్టుకొనే లేదు . పాతదిగా అయిపోయిన ఇల్లు చుట్టూ మొక్కలు ,చెట్లు తీగలు,వాటిపై తిరిగే పక్షులతో తుమ్మెదలతో ఆమె సహవాసం చేస్తారు . ఎలక్ట్రిక్ ఉపకారణాలతో ప్రకృతికి అపకారం కలిగించటం నాకు ఇష్టం ఉండదు . భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులు మిగల్చాలని నాకోరిక అంటుంది హేమసానే . ఈమె నిరాడంబర జీవితం పైన ప్రకృతి దగ్గరగా జీవించే జీవనశైలి […]
ఎన్నో నెలల ఫలితం
ఇదంతా నేను ఒక్క రోజులో సాధించింది కానేకాదు . ఏడాదిన్నర పాటు జిమ్ లో కష్టపడ్డాను . 96 కిలోల బరువును నెమ్మదిగానే తగ్గించుకొంటేనే ఆరోగ్యమని చెప్పిన ఎక్స్ పర్డ్స్ సలహా అక్షరాలా పాటించాను అంటోంది సారా అలీఖాన్ .మొదటి రోజు నేను చాల బొద్దుగా ఉన్నా సమయంలో జిమ్ లో వెయిట్ బాల్ పట్టుకొని క్రంటిస్ మొదలు పెట్టాను . అయితే మూడు కూడా చేయిలేకపోయాను . అంతకు మించి చేయటం అసాధ్యం అనిపించింది . […]
ఇంకెన్నో కథలు కావాలి
ఎన్ని పాత్రల్లో నటించినా ఇంకా కొత్తగా ఎదో మిగిలి పోయింది అనిపిస్తుంది. నేను ఎదురుచూస్తాను వాటికోసం . దర్శకులు ,రచయితలు ఇంకెన్నో పాత్రలు సృష్టించాలి కూడా . అయిపోయింది ఇంకేం లేవు అనుకొంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు . కొత్త కథలు వస్తూనే ఉంటాయి . సరైన సమయంలో వాటిని నేను అందిపుచ్చుకొంటూనే ఉన్నాను అంటోంది కాజల్ . ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది . ప్రపంచంలోనే స్ఫూర్తి వంతులైన మహిళలు చాలామంది […]
కాస్త ప్లేస్ చాలు
కొన్ని వస్తువులు పెద్ద ఖరీదు కూడా ఉండవు గానీ అపార్ట్ మెంట్ వాతావరణంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి . చీరెలు ఆరేసుకోవాలంటే బోలెడంత చోటు ,గట్టితాడు ,ఎగిరిపోకుండా క్లిప్స్ చాలా హంగామాలు అవసరం . పైగా వాటిని చుట్టుకు పోకుండా కంట కనిపెట్టి ఉండాలి . అలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ స్థలంలో బరువైన దుప్పట్లు ,బొంతలు,చీరెలు ఆరేసుకొనేలా స్పైరల్ షెప్డ్ హ్యాంగర్ షీట్ రొటేటింగ్ క్విల్ట్ లు అమెజాన్ లో వచ్చాయి . చాలా ఈజీగా […]
మూడ్ మార్చేస్తుంది
పెరుగు తింటే చలువ చేస్తుందని ప్రోబయాటిక్ ఆహారం అనీ ,జీర్ణ శక్తికి ఎంతో మేలుచేస్తుందనీ అందరికీ తెలిసిన విషయాలే . ఈ పెరుగులో మరో ముఖ్యమైన ప్రయోజనం ఉందని తాజా పరిశోధనల్లో గుర్తించారు . ఒత్తిడి,ఆందోళన డిప్రెషన్ వంటి వాటికీ పెరుగుతో చెక్ పెట్టవచ్చునని తాజా పరిశోధనలు చెపుతున్నాయి . పెరుగులో ఉండే లాక్టోబాసిల్లీస్ అనే బాక్టీరియాకు ఒత్తిడిని డిప్రెషన్ ను తగ్గించే గుణం ఉంది . మూడ్ బాగా లేకపోయినా డిప్రెషన్ విసిగిస్తూ ఉన్నా ఓకప్పు […]
ఒంటరి జీవితం ఇష్టం
భారతదేశంలో వివాహం పట్ల విముఖత ప్రదర్శించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది అంటున్నాయి అధ్యయనాలు . గడిచిన ఒకటి రెండు దశాబ్దాలలో ఒంటరిగా జీవించే వారి సంఖ్య 40 శాతం పెరిగింది అంటున్నారు . ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన ఐరోపా అమెరికాలో ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడే జనాభా అధికం . ఒక పదేళ్ళ క్రితం సమాచారం ప్రకారం ఒంటరి కుటుంబాల శాతం ఆ దేశాల్లో 30 నుంచి 35పై చిలుకు చేరింది . చైనా,జపాన్ వంటి […]
ఎలాంటి గంటలివి?
ఈ ప్రపంచంలో అంతుపట్టని రహస్యాలు అనేకం ఉన్నాయి . అలాంటి విచిత్రాలను చూసేందుకు టూరిస్టులు క్యూలు కడతారు . మెక్సికో లోని యుకటనాలో కెనోట్ జాపొట్ అనే ఒక కొలనులో ఎన్నో గంటలు కనబడతాయి . అవి మోగే గంటలు కావు . గుహపై కప్పు నుంచి రకరకాల పరిమాణాల్లో కిందకు వేలాడుతూ ఉంటాయి . అవి ఎలా ఏర్పడ్డాయో ఎవ్వరికీ అంతుబట్టలేదు . నీళ్ళలో ,గుహలు ఒక రకమైన పదార్ధ పొరలు పొరలుగా ఏర్పడి ఈ […]
“శ్రీ ఛాయాసోమేశ్వరస్వామి ప్రసాదం”
నల్గొండ జిల్లాకి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న పాన్గల్లోని శ్రీ ఛాయా సోమేశ్వరుని దర్శనం చేసుకుని వద్దాం పదండి. చోళుల రాజ్యంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి.ఇక్కడ శివలింగం పైన ఛాయ కనిపిస్తుంది,కానీ ఈ నీడ ఎటునుంచి పడుతోందో ఇంతవరకు శాస్త్రవేత్తలకు కూడా ఆచూకి లేదు.దగ్గరలో ఉదయ సముద్రం అనే చెరువులో 365 రోజులు నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది.గర్భ గుడిలో వున్న శివయ్యని ఎల్లప్పుడూ గంగా జలంతో పూజిస్తూ వుంటుంది.ఈ దేవాలయానికి సమీపంలో అగ్రపూజ్యుడైన […]
